ఐక్యతారాగం శిక్షణకు అటెండ్ అవుతున్నప్పుడు, 1వ ఫేజ్‌లో 5 రోజులు అని చెప్పినపుడు, అన్ని రోజులు ఏమి చెప్తారా అని ఆలోచిస్తూ అటెండ్ అయ్యాను. భూమికతో పాటు వేదిక, గ్రామ్య నుండి కూడా ఈ శిక్షణకు వచ్చారని, వారు చేసే పని గురించి
తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమనిపించింది. శిక్షణలో భాగంగా ఎన్నో అంశాలు… ఉదా:` జెండర్, పితృస్వామ్యం, కులవ్యవస్థ, ట్రాన్స్‌జెండర్ వంటి విషయాల్లో మాకు అర్థమయ్యే విధంగా చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఈ శిక్షణ తర్వాత హెల్ప్‌లైన్ ద్వారా ట్రాన్స్ జెండర్స్ బాధలను అర్థం చేసుకుని, వారికి పూర్తిగా సహాయం చేయగలుగుతున్నాను. ఈ శిక్షణ తర్వాత ఏదైనా అంశాన్ని తీసుకుని స్కూళ్ళు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి వచ్చానని చెప్పగలను.