ముఖ్యంగా మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి ద్వారా ఒకరు చాలా విషయాలు తెలుసుకోవడం, ముఖ్యంగా ఐక్యతారాగం తర్వాత నాలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పు.
జెండర్ సంబంధిత అంశాలు… అంటే ఇంట్లో స్త్రీలు చేసే పనులు స్త్రీలే చేయాలిÑ పురుషుల పనులు పురుషులే చేయాలి అని గ్రామాల్లో, ఫీల్డు ఏరియాలో బలంగా ఉండేది. నేను కూడా ఇంట్లో అన్ని పనులు చేసినా, బయటకు వస్తే కొద్దిగా ఇబ్బందిగా ఫీలయ్యేవాడిని. కానీ ఈ ఐక్యతారాగం శిక్షణ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ముందు కూడా నాకు ఇంట్లో చేసినవి బయట, స్నేహితుల ముందు చేయడానికి ఇబ్బంది అనిపించేదిÑ కానీ ప్రస్తుతం నాలో అటువంటి ఫీలింగ్ లేదు. నా తోటివారిని కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. ముందు నా దగ్గర జవాబు లేదు, కానీ శిక్షణలో నేర్చుకున్న సమాచారంలో ఎదుటి వారిలో కూడా మార్పు వచ్చే విధంగా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చుట్టుపక్కల, బయట ప్రతి పనిలోనూ వివక్ష లేకుండా చేయడానికి, ముఖ్యంగా పురుషులలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో మాట్లాడే విధానంలో చాలా అంశాలు నేర్చుకోవడం, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను.
సమాజంలో జరుగుతున్న వివక్షలకు కారణం పితృస్వామ్య వ్యవస్థ అని తెలుసుకోవడం జరిగింది. ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. స్త్రీవాద దృష్టికోణంలో పనిచేయడంలో జెండర్‌పరమైన అంశాల గురించి చాలా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణలో ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాలు ట్రాన్స్‌జెండర్స్ యొక్క జీవన విధానం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ముందు నాకు తెలియని అనేక విఫయాలను ఈ శిక్షణలో తెలుసుకున్నాను. సాంస్కృతిక స్వభావం, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క కట్టుబాటు, మూఢనమ్మకాలు ఉంటాయి.
ముఖ్యంగా జెండర్ అనే పదం వ్యాకరణపరంగా తెలుసు, కానీ దాన్ని వేరే అర్థంలో వాడుతున్నారు. ఐక్యతారాగం మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత దాని గురించి చాలా తెలుసుకున్నాను. స్త్రీలు, పురుషులను సమాజాలు భిన్నంగా చూసి వారికి విభిన్న సామాజిక పాత్రలను నిర్దేశించే విధానం.
ఒకరకంగా సమాజంలో మహిళల తక్కువ హోదా?! మహిళలను, వారి శరీరాలను బాధ్యులుగా చేశారు. కానీ ఇది ప్రకృతి సహజమైనది అనుకున్న తర్వాత సమాజంలో ఉన్న జెండర్ అసమానతలు, అన్యాయాలను ఎదుర్కోవలసిన అవసరం లేదు. ప్రతి ఇంటా, బయట, సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. జెండర్ గురించి ముందు అంత పెద్దగా అవగాహన లేదు. కానీ ఐక్యతారాగం మీటింగ్ తర్వాత జెండర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.
ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సహజమైన తేడాలను మనం వక్రీకరించి చూపుతున్నాము. ఇది చాలా తప్పని పనిచేసే ప్రాంతంలో కూడా మార్పు తీసుకురావడానికి ఐక్యతారాగంలో నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తాను. ఇంకా స్త్రీలు, పురుషులు, సమాజం, కులం, వర్గం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.