ఐక్యతారాగం ముందు మూఢనమ్మకాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. జెండర్‌పరంగా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. మగవారు ఉంటేనే కుటుంబం అనుకునేదాన్ని. కులపరంగా, డబ్బున్న వాళ్ళను, ఎక్కువ చదువుకున్న
వాళ్ళను చూసి కొంతవరకు భయపడేదాన్ని. నేను మాట్లాడేవి కరక్టో, తప్పో అని ఆలోచించేదాన్ని.
శిక్షణ తర్వాత పైవన్నీ కూడా మనం కట్టుకథలుగా అల్లుకున్నామని తెలిసింది. ఫెమినిజం గురించి తెలుసుకున్నాను. అలాగే మహిళా దృష్టికోణంతో ఆలోచించాలని, ట్రాన్స్ జెండర్ మనలో ఒక భాగమని, సమాజంలో మహిళలపైన పిల్లలపైన ఎలాంటి హింస లేకుండా ఉండాలనే చాలా మహిళా ఉద్యమాల గురించి తెలుసుకున్నాను. మూడు సంస్థలు కలిసి పనిచేయడం వలన ఏ సంస్థ ఎవరితో పనిచేస్తుంది, ఎలా చేస్తుందనేది చాలా తెలుసుకున్నాను. అలాగే స్త్రీల హక్కులు, పిల్లల హక్కుల గురించి తెలుసుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేది కూడా ఈ శిక్షణలో భాగంగా నేర్చుకోవడం జరిగింది.