ఓ స్త్రీ నీకు జోహార్లు
అన్ని విషయాల్లో ముందుండే పడతి
వెలుగులు పంచేది నీవే ఓ ఇంతి
అన్ని పనుల్లో ముందుండే కొమ్మ
మనల్ని మంచి బాటలో నడిపించే అమ్మ
కథలతో కాలక్షేపం చేస్తాము
నీతులు ఎన్నో నేర్చుకుంటాము
అన్ని విషయాలు తెలుసుకుంటాము
పాటలు ఎన్నో పాడిరచేది నీవే ఓ బామ్మ
కష్టసుఖాలను ఎదుర్కొనే ఆడది
అన్ని విషయాల్లో ముందుండే యువతి
` ఎస్.కె.అప్ష, 8వ తరగతి
అమ్మ
అమృతమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అలుపెరగని ఓర్పు అమ్మ
అద్భుతమైన స్నేహం అమ్మ
అపురూపమైన కావ్యం అమ్మ
గుడిలేని దైవం అమ్మ
కల్మషం లేని ప్రేమ అమ్మ
వర్ణించలేని భావం అమ్మ
తీయనైన పలుకు అమ్మ
మన తొలి గురువు అమ్మ
సరిలేని మేటి స్త్రీ అమ్మ
నా గుండె పలికే ప్రతి మాట అమ్మ
` టి.లావణ్య, 9వ తరగతి
స్నేహం
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. వాళ్ళిద్దరికీ ఒకరోజు చిన్న గొడవ జరుగుతుంది. అయితే అమ్మాయికి కోపం వచ్చి అబ్బాయిని తిడుతుంది, మాట్లాడటం మానేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి మొన్న తిట్టినందుకు బాధపడితే క్షమించు అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. అలాగే కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళకి పరీక్షలు మొదలయ్యాయి.
ఒకరోజు ఆ అమ్మాయిని అందరూ నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. నాకు తనమీద అలాంటి అభిప్రాయం లేదు, తనకు కూడా నామీద అలాంటి అభిప్రాయం లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ఆ అమ్మాయి చెబుతుంది. తర్వాత ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది.
ఈ లోకంలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే చాలు వాళ్ళు ప్రేమించుకుంటున్నారని ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, లేకపోతే మంచి స్నేహితులు అయి ఉండవచ్చు కదా! ఈ లోకం చాలా తప్పుగా ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలియకుండానే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎలా చెబుతారు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు కానీ అలా ఆలోచించడం తప్పు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం రేపు ప్రేమగా మారవచ్చు. అయితే, స్నేహం పేరు మీద మోసపోకుండా చూసుకోవాలి.
` జి.శ్రీదుర్గ, 9వ తరగతి, జడ్.పి.హెచ్.స్కూల్, బకల్‌వాడి, హైదరాబాద్.