సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

జహా జహా చలేగా
మేరా సాయా సాథ్‌ హోగా!
మన నీడ కూడా మనల్ని వదలి పోవచ్చునేమో కానీ లతా మంగేష్కర్‌ పాట మాత్రం మనల్ని వదలి పోదు. భౌతికంగా లతా మంగేష్కర్‌ అనే శరీరం వడలిపోయి ఉండవచ్చు గానీ, సరస్వతి వీణాస్వరం లాంటి లతా మంగేష్కర్‌ సరసస్వరసురరaరీ తరంగాలు, తరతరాలుగా

అత్యుత్తమ గాన సంవిధానికి తార్కాణంగా నిలిచి ఉంటాయి. సంగీతానికి స్పందించే లక్షణం మానవ సమాజంలో, మనిషి హృదయంలో సజీవంగా ఉన్నంతకాలం తరాలను స్పందింపచేస్తూనే ఉంటాయి.
ఇటీవలి కాలంలో ఎవరైనా మరణించిన మరుక్షణం ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించటం, వారి వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించటం, అంతా తాము చూసినట్లు, తమకు తెలిసినట్లు చెప్పటం చూస్తుంటే ఒక వ్యక్తి సచ్ఛీలతను, సత్ప్రవర్తనను, ఔన్నత్యాన్ని,
ఉత్తమత్వాన్ని అంగీకరించలేని మానసిక స్థితిలో మన సమాజం ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా, ఆ వ్యక్తి మహిళ అయి, జీవితాంతం వివాహం లేకుండా, ఒంటరిగా జీవిస్తూ, పురుషాధిక్య వ్యవస్థను తన కనుసన్నలతో నిర్దేశిస్తూ, తనకు నచ్చినట్లు జీవితం కొనసాగించే మహిళ అయితే, అస్సలు ఆ ఔన్నత్యం, ఉత్తమత్వం, భరించలేని మానసిక వ్యవస్థ మన సమాజానిది అని లత మరణం తరువాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న దుర్వ్యాఖ్యలు నిరూపిస్తాయి. ముఖ్యంగా పేరున్న ఓ జర్నలిస్టు రచయిత పదే పదే గేయ రచయిత సాహిర్‌ లుధియాన్వీ లతను ప్రేమించాడనీ, ఆమె కోసం ‘కిసీ పత్థర్‌ కీ మూరత్‌ సే’ (హమ్‌రాజ్‌) అనే పాట కూడా రాశాడనీ గాల్లో ఊహించి, కుళ్ళిన మెదడు వికృత సరస్సులో కలం ముంచి మరీ రాయటం, తెలిసీ తెలియకుండా కుళ్ళిన మెదడులోని ప్రతి ఊహనూ నిజమనుకొని రాసేసి ప్రచారం చేసి, సమర్ధించుకునే జర్నలిస్టు రచయితల పట్ల, వారి వికృతపుటూహల వక్ర రాతలకు జైజైకారాలు చేసే వందిమాగధ జనాల బాకాల కేకల పట్ల తీవ్రమైన జాలిని కలుగజేస్తుంది. అయితే ఈ దుర్వ్యాఖ్యలు, అసంబద్ధ ప్రేలాపనలను వదలి ‘లతా మంగేష్కర్‌’ వైపు దృష్టి కేంద్రీకరిస్తే సరస్వతీ వీణా నిక్వణ స్వరూపమైన స్వరం దైవదత్తగా పొందిన ‘లత’ అనే మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకునే వీలు లభిస్తుంది.
లతా మంగేష్కర్‌ స్వతహాగా అల్లరి పిల్ల. కానీ బాల్యం సవ్యంగా అనుభవించే కన్నా ముందే ఇంటి బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తనతో పాటు ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాల్సిన చెల్లి తన జీవితాన్ని తాను చూసుకుంటూ ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అయినా లత బెదరలేదు. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగింది. ‘నేను’ ‘నా జీవితం’ ‘నా ఆనందాలు’ అని ఆధునిక అభివృద్ధి చెందిన మహిళల్లా ఆలోచించి, కుటుంబాన్ని తన దారిన తాను వదలి తన జీవితాన్ని చూసుకోలేదు. పోరాడిరది. అదీ ఎలా? తన ప్రతిభనే ఆయుధంలా. తన సత్ప్రవర్తనే కవచంలా. తన నిజాయితీ, వినయాలతో ప్రపంచాన్ని గెలిచింది. ఎంత ఎదిగితే అంత ఒదిగింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చింది. జీవితాన్ని ‘పాట’కే అంకితం చేసి, ఒంటరిగా నిలిచింది. ‘మహిళ’ అంటే విలువలేని, చులకన అభిప్రాయం గల సినీ పరిశ్రమలో ఎవరూ తాకలేని ‘హిమాలయ శిఖరం’లా ఉన్నతంగా నిలిచింది. కన్నెత్తి చూడలేని స్వచ్ఛమయిన సూర్యకిరణంలా తళతళలాడిరది. దేశ ప్రజల దృష్టిలో స్వచ్ఛమయిన అంకిత భావానికి, భక్తికి, నిస్వార్ధానికి, నిజాయితీకి ప్రతీకలా నిలిచి భారతరత్నగా ఎదిగింది. అలాంటి అత్యుత్తమ వ్యక్తి అంతరంగాన్ని ఆమె జీవితం ద్వారా, ఆమె పాటల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం ఇది.
లతా మంగేష్కర్‌ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు. వాద వివాదాలకు దూరంగా ఉండేది. ఎవరైనా ఆమెపై ఆరోపణలు చేసినా, దూషించినా ఆమె స్పందించేది కాదు. ఎవరేమన్నా సమాధానం తన పాటతోనే ఇచ్చేది. అయితే మీడియా విస్తృతి పెరిగిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది లతా. కొందరు రచయితలు ఆమెతో జరిపిన సంభాషణల ద్వారా ఆమె అంతరంగాన్ని గ్రహించే ప్రయత్నాలు చేశారు. కానీ కొన్నాళ్ళకి అందరూ అవే ప్రశ్నలు అడుగుతుంటే విసుగు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసింది. అందరూ ఎప్పుడూ అడిగే ప్రశ్నలు కాకుండా విభిన్నమైన ప్రశ్నలు అడిగితేనే ఇంటర్వ్యూలో పాల్గొనేది. ఈ ఇంటర్వ్యూలలో ఆమె ఇచ్చిన సమాధానాల ద్వారా కూడా ‘లత’ను ‘కళాకారిణిగా’ ‘వ్యక్తిగా’ అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాస పరంపర చేస్తుంది. అంటే ఈ వ్యాస పరంపర లత కళను విశ్లేషిస్తూ, ప్రతిభను వివరిస్తూ, ఒక వ్యక్తిగా లతా మంగేష్కర్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందన్న మాట. పలువురు ప్రముఖులు, నటీనటులు, గేయ రచయితలు, నిర్మాతలు, సంగీత దర్శకులు లతతో పనిచేసిన తమ అనుభవాలను పంచుకున్నారు, తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. లతా మంగేష్కర్‌ గురించి ఆమె తోటి కళాకారుల అభిప్రాయాలను కూడా ఈ వ్యాస పరంపర పరగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే, లతను సన్నిహితంగా చూసిన వారు ఈ కళాకారులు. నాయికల ఆత్మను తన స్వరంలో సజీవంగా పలికించడం ద్వారా లతా మంగేష్కర్‌ నాయికల నటజీవితానికి గుర్తింపునిచ్చింది. ఇలా పలు కోణాలలో లతా మంగేష్కర్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందీ వ్యాస పరంపర.
“Lata didi was an exemplary woman. At a tender age, she was the only bread-earner for her family and kept them bonded till the end. Dignified and selfles, she is also known to have sung free for producers, who were short of money. Truly, they don’t make them like Didi anymore… I can only describe Lata didi as a pure diamond, flawless. Today, we are bereft of a priceless diamond of the film industry.”
ఆశాపరేఖ్‌ మాటలకన్నా గొప్పగా లత గురించి చెప్పటం కుదరదు. ఈ వ్యాస పరంపర ఆ price less diamond జిలుగు వెలుగులు, వెలుగులలో ఒదిగిన నీడలను ప్రదర్శిస్తుంది.
ఆయేగా, ఆయేగా, ఆయేగా ఆనేవాలా… ఆయేగా… (మహల్‌, 1949)
‘Cometh the hour, cometh the man’ అనే పదబందాన్ని ఆంగ్లంలో వాడతారు. దాని అర్థం ఏమిటంటే సందర్భం వచ్చినపుడు, అవసరం పడ్డప్పుడు అవసరం తీర్చే వ్యక్తి వస్తాడని. ఏదైనా కష్టం వచ్చినపుడు, ఆ కష్టాన్ని తొలగించే వ్యక్తి వస్తాడని. లతా మంగేష్కర్‌ జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. స్వతంత్రంతో పాటు దేశ విభజన సంభవించింది. దేశ విభజన వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటమే కాదు, సంస్కృతి కూడా అనూహ్యమైన రీతిలో దెబ్బతింది. ముఖ్యంగా సినీరంగంపై విభజన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అంతవరకు ఒకటిగా ఉన్న భారతీయ సినిమా రెండుగా చీలిపోయింది. భారతీయ సినిమా చీలి ‘పాకిస్తాన్‌ సినిమా’ ఏర్పడిరది. సినీ నిర్మాణం దెబ్బతింది. పేరుపొందిన కళాకారులు దేశం వదిలి వెళ్ళారు. ఆ కాలంలో బొంబాయికి పోటీగా లాహోర్‌లో సినీ నిర్మాణం కేంద్రంగా ఉండేది. కానీ విభజన వల్ల ఇటునుంచి కళాకారులు అటూ, అటు నుంచి కళాకారులు ఇటు రావడం ఆరంభమయింది. నూర్జహాన్‌, జియాసర్హది, గులామ్‌ మహమ్మద్‌, సాదత్‌ హాసన్‌ మంటో వంటి వారు పాకిస్తాన్‌ వెళ్ళిపోయారు. గుల్జార్‌, గోవింద్‌ నిహలాని, బి.ఆర్‌.చోప్రా, యష్‌ చోప్రా వంటి వారు భారత్‌ వచ్చారు. నాసిర్‌ ఖాన్‌, సాహిద్‌ లూధియాన్వి వంటివారు పాకిస్తాన్‌ వెళ్ళినా అక్కడ ఇమడలేక భారత్‌కు తిరిగి వచ్చారు. ఇంకా సయ్యద్‌ షౌకత్‌ హుస్సేన్‌ రిజ్వి, రోషన్‌ ఆరా బేగమ్‌, ముంతాజ్‌ శాంతి, మీనా షోరే, గులామ్‌ అహ్మద్‌ చిప్తి, గులామ్‌ హైదర్‌, నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌, గోహార్‌ మామాజీ వాలా, ఖ్వాజా ఖుర్షీద్‌ అన్వర్‌, ఖుర్షీద్‌ బానో, మాలికా ఏక్‌రాజ్‌, షౌకత్‌ హుస్సేన్‌ రిజ్వి, నిస్సార్‌ బాజ్మి, నాషాద్‌ వంటి కళాకారులు పాకిస్తాన్‌ వెళ్ళిపోయారు. వీరంతా భారతీయ సినిమాలో పేరుమోసిన కళాకారులు. తమ ప్రతిభతో సినీ రంగాన్ని సుసంపన్నం చేసినవారు. వీరిలో గులామ్‌ హైదర్‌, లతా మంగేష్కర్‌కు సినిమాల్లో పాడేందుకు తొలి అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు. అందరూ ‘లత స్వరం పీలగా ఉంది, పనికి రాదు’ అంటున్న సమయంలో లత ప్రతిభపై నమ్మకం ఉంచినవాడు గులామ్‌ హైదర్‌.
‘‘గులామ్‌ హైదర్‌ నిజంగా నాకు గాడ్‌ఫాదర్‌ లాంటివాడు. నా ప్రతిభపై ఆయనకు ఉన్న విశ్వాసం వల్లనే నేను సినీ పరిశ్రమలో నిలబడగలిగాను. పరిశ్రమ నన్ను తిరస్కరించినప్పుడు ఆయన నాకు అవకాశమిచ్చారు. నా గాన ప్రతిభపై నమ్మకం ప్రదర్శించిన తొలి సంగీత దర్శకుడు గులామ్‌ హైదర్‌. ఆయన నన్ను పలువురు నిర్మాతలకు పరిచయం చేశారు. వారిలో ఎస్‌.ముఖర్జీ కూడా ఒకరు. ఆయన కూడా నా స్వరం పనికిరానిదిగా భావించడంతో ఆగ్రహించిన గులామ్‌ హైదర్‌, ఎస్‌.ముఖర్జీ కన్నా పెద్ద నిర్మాణ సంస్థ అయిన ‘బాంబే టాకీస్‌’ వారిని ఒప్పించి ‘మజ్బూర్‌’ సినిమాలో పాటలు పాడే అవకాశం నాకు ఇచ్చారు’’ అన్నారు లతా మంగేష్కర్‌ బొంబాయిలో అడుగుపెట్టిన తర్వాత తన సంఘర్షణను తలచుకుంటూ.
లతా మంగేష్కర్‌నే కాదు షంషాద్‌ బేగమ్‌, సుధా మల్హోత్ర, సురిందర్‌ కౌర్‌ వంటి వారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా గులామ్‌ హైదర్‌. ఆయన ప్రభావంతో హన్స్‌రాజ్‌ బహల్‌, హుస్న్‌లాల్‌ భగత్‌రామ్‌, ఫిరోజ్‌ నిజామి వంటి సంగీత దర్శకులు తమ సంగీతాన్ని తీర్చిదిద్దుకున్నారు. మదన్‌ మోహన్‌, నాషాద్‌ వంటివారు అతనికి సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు. వీరిలో మదన్‌ మోహన్‌ తర్వాత ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాషాద్‌ పాకిస్తాన్‌ వెళ్ళిపోయాడు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.