ప్రగతి అంటే ప్రకృతి విధ్వంసం కానే కాదు – పి. ప్రశాంతి

పని ఒత్తిడిలో అలిసిపోయి, పడుకోగానే నిద్రపోయిన రాణికి అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. కారణం ఏంటా అని ఆలోచించేలోపే ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతున్నట్లుంటే లేచి కిటికీ తలుపులు మూసేసి వచ్చి మళ్ళీ పడుకుంది. కానీ ఆ వాసనలు ఆగితేనా. మెల్లిగా కళ్ళు

మండటం కూడా మొదలయింది.
పారిశ్రామిక వ్యర్థాలను విచక్షణారహితంగా వదిలేస్తుంటే వాటి ప్రభావం మనుషులతో పాటు ఎన్నో జీవజాలాలపైన పడడం స్పష్టంగా కనిపి స్తోంది. ఒక పక్క మూసీ నది… పారిశ్రామిక వ్యర్థాలతో నది రూపాన్ని పోగొట్టుకుని మురికి కాలువకన్నా రోతగా తయారయిపోయింది. నీరు ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాదు, దాదాపు 20 కి.మీ.ల పొడవునా నది ఒడ్డున పెంచుతున్న ఆకు కూరలు, కూరగాయల తోటలు, పండ్ల మొక్కలు కూడా ఆ కలుషిత నీటిని పీల్చుకుని కలుషితమైపోయాయని, వాటిని తిన్నవారికి క్రమేపీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అందరికీ తెలుసు. ప్రజలు, ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ బోర్డు… ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యం, అయినా ఏమీ చేయలేక పోవడం ఎంత బాధాకరం! ప్రమాదకరం!
హిమాలయాల్లోని మంచు కరిగి స్వచ్ఛమైన నీటితో పారే గంగానది కాశీ చేరేలోపే కలుషిత మైపోయి అనేక వ్యర్ధాలని మోసుకుపోవడం… అంతేనా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర… అన్నిటిదీ అదే పరిస్థితి. హైదరాబాద్‌ మహానగర దాహార్తిని తీర్చే మంజీర కుచించుకుపోయింది. ఆదిలాబాద్‌ అడవుల్లో పారే పెన్‌గంగ వాగుకన్నా తరిగిపోయింది. నదులని ఆధారం చేసుకుని పనిచేసే మందుల కంపెనీలకి, కూల్‌డ్రిరక్‌ ఫ్యాక్టరీలకి, కర్మాగారాలకి విచ్చలవిడిగా లైసెన్సులిచ్చేసి, నిబంధనలన్నీ గాలికొదిలేసి, తాగే నీటిని విషమయం చేసేసి, అనారోగ్యం పాలైతే మళ్ళీ ఆ మందుల్నే వాడుకునేలా, దాహం తీర్చుకోడానికి ఆ కూల్‌డ్రిరక్‌లే తాగేలా చేస్తున్న ఈ వ్యవస్థ తీరేంటి? జలజీవాలు, పశుపక్ష్యాదుల పరిస్థితేంటి?
మరోపక్క విపరీతంగా పెరిగిపోయిన వాహనాలు, అవి వదిలే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే పొగతో పాటు అవి వదిలే విషవాయువుల వల్ల గాలంతా కలిషితమైపోతే పీల్చుకోడానికి ఊపిరితిత్తులకీ చేవలేకుండా పోయాక ఆస్పత్రుల పాలవ్వడం, సిలెండర్లలో నింపిన ఆక్సిజన్‌ పీల్చుకుంటే తప్పించి, బతికి బట్టకట్టలేని రోజులు ఎలా వచ్చాయసలు! ప్రాణవాయువునిచ్చే చెట్లని, మహా వృక్షాలని పెకిలించేసి పిట్టలకి కూడా చోటివ్వలేని మొక్కల్ని పాతి పచ్చదనంతో ప్రతి వీథిని, ప్రతి ఊరిని నింపేస్తున్నామంటే ప్రాణం నిలుస్తుందా? మనిషికైనా, పిట్టా, పిల్లీ, చీమా, చిలకా… ఏ జీవానికైనా! రోడ్లకి ఆ పక్కా, ఈ పక్కా చక్కగా నాటిన మొక్కలు చెట్లయ్యేసరికి పైన కరెంటు వైర్లున్నాయి, నిఠారుగా పెరిగే అవకాశం నీకు లేదని తలలు నరికేస్తే… నన్ను వైర్లకిందే నాటమన్నానా అని అడిగే నోరు లేదుగా ఆ చెట్లకి.
ఇక పట్నాలన్నీ పచ్చగా కనబడాలని రోడ్ల మధ్యనే గట్టు కట్టి కూసింత మట్టి నింపి నాటిన మొక్కలకి రోజూ పోయే ప్రాణం, వచ్చే ప్రాణం. నీరు పెడితే నిలదొక్కుకోవడం, లేదంటే ఒరిగిపోవడం. నాలుగు చినుకులు పడగానే ఒళ్ళు విరుచుకుని నాట్యం చేసే మొక్కలు, చెట్లు ఒళ్ళు తడుపుకోడమే గాని నీళ్ళు తాగి నిలదొక్కుకోడానికి ఆ వర్షం నీరు వేర్లకి చేరితే కదా! చుట్టూ బెత్తెడు జాగా కూడా లేకుండా సిమెంట్‌ చేసేస్తే ఆకుల్ని తడిపిన నీరైనా చెట్టు మొదలుకి చేరకముందే రోడ్డు పాలయ్యి, వేగంగా పారి కాలువలుగా డ్రైనేజీ పాలయితే ఆ చెట్టు ఉసూరుమనడం తప్ప ఇంకేముంది?
పల్లెలదీ ఇదే బాట. పచ్చగా ఉండాల్సిన పల్లెలు అక్కడో చెట్టు, ఇక్కడో చెట్టుగా ఉండటమే కనిపిస్తుంది. రోడ్లైతే వేశారు వాహనాలు పెరిగి, రవాణాకి వీలుగా ఉండడానికి, కానీ మరి నీడని తొలిచేశారుగా. దాన్ని అనుకరిస్తూ రైతులూ అదే బాట పట్టారు. చెట్ల వల్ల పంట పండే స్థలం తగ్గిపోయిందని, నీడ పడినంత మేరా పంట రావట్లేదని ఏనాడో వేసిన చెట్లని తొలగిస్తే పిట్ట లెటు పోతాయి? క్రిమికీటకాలెటు పోతాయి? పంటలెలా పండుతాయి? జలచక్రం గతి తప్పదా? అది అనర్ధానికి దారి తీయదా మరి! ఇంట్లో, పొలంలో చెట్టు లేదు కనుక, అడవి కొట్టి కట్టె తెచ్చుకోవచ్చట కానీ, ఆ చెట్లని ఆశ్రయించుకుని ఉన్న కోతులు మాత్రం ఇంటికి రాకూడదట.
ఆస్తిపాస్తుల్లేని కుటుంబాలు కూడా నాలుగు గుంజలు పాతి, పదాకులు కప్పుకుని ఒక నీడని ఏర్పరచుకునేవారు. ఇప్పుడది అసాధ్యమే. అంతా పండిరచుకుని బస్తాలకెత్తుకుని పోడమే కానీ పిడికెడు గింజలు కావాలన్నా దొరకని రోజులయ్యాయి. మట్టి కళ్ళాల మీద పట్టాలేసి ధాన్యం నూర్చినప్పుడు అటిన్నీ, ఇటిన్నీ పోతే చీమలు, పిచ్చుకలు, ఉడతలు, ఎలుకలు… ఎన్నెన్నో ప్రాణులు బతకడానికి దొరికేవి. ఇప్పుడేమో సిమెంటు కళ్ళాలు… అసలు వాటి అవసరమే లేకుండా కోత మిషన్లు కోయడం, బస్తాలు నింపడం అయినప్పుడు మరి అసమ తుల్యం కాక ఏమవుతుంది? అభివృద్ధంటే మనిషి ప్రకృతికి దూరమవ్వడమేనా? ప్రకృతిని దెబ్బకొట్టి కట్టుకట్టడమేనా? తిరిగి ప్రకృతి కొట్టే దెబ్బకి నిలబడి తట్టుకోగలగడం మనిషికి సాధ్యమేనా??? ఆలోచనల్తో నిద్ర ఎగిరి పోయింది రాణికి.
ప్రకృతి ఎప్పుడూ సహజంగా సమతుల్యం చేసుకోగలదు. కానీ మానవ మేథ కొత్త కొత్తగా ఆలోచిస్తూ అసహజ విధానాలు పాటిస్తుంటే సమతుల్యం దెబ్బతినడమే కాదు విపరీత పరిణామాలు ఎదురవ్వక మానవు, విపత్తులు ఎక్కువవ్వకా ఆగవు. వీటన్నిటి ప్రభావం మనుషులందరి మీదా పడటం నిజమే కానీ అది అంతటా అందరినీ ఒకేలా ప్రభావితం చేయదు. వీటి ప్రభావం అట్టడుగు వర్గాల మీద అధికంగా ఉంటోంది, అందులోనూ స్త్రీలు, పిల్లల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. పల్లెల్లో వ్యవసాయ మహిళల దగ్గర్నుండి, పట్టణాల్లో చెత్త సేకరించే మహిళల దాకా… పల్లెల్నుంచి పట్టణాల్లో ఫుట్‌పాత్‌లు చేరే కుటుంబాల దాకా… పట్నవాసపు మధ్యతరగతి కుటుంబమైనా నీటి ఎద్దడి, కలుషిత ఆహారం, విషవాయువులు, వాహన కాలుష్యం తన మీద ఎంత ప్రభావం చూపించిందో క్యాన్సర్‌ సర్యైవర్‌ రాణికి బాగా తెలుసు. కానీ ఏటికి ఎదురీ దగలగడం అసాధ్యమే అవుతోంది. అందుకే గట్టిగా నిర్ణయించుకుంది రాణి పర్యావరణ
ఉద్యమంలో తానూ భాగమవ్వాలని.
భూమి మీద అత్యంత వివేకజీవి మనిషైతే మరి దాన్ని నిలుపుకోడానికి, నిజం చేసుకో డానికి నడుం బిగించాల్సిందే. వినాశకర
శక్తుల్ని ఎదిరిస్తూ, మనుగడ సాగించాల్సిందే. పర్యావరణానికి ప్రాణం పోస్తేనే మనిషి ప్రాణం నిలిచేది. ఈ పర్యావరణ దినోత్సవ సాక్షిగా ఉద్యమిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.