భూమిక సంపాదకులకు,
భూమిక లో వచ్చిన రచయిత్రుల సమావేశం గురించి చదివి ఎంత సంతోషించాలో అంతా బాధ కూడా వేసింది. పిల్లలు రాస్తున్న కవితల వెనుక వారిని తీర్చి దిద్దుతున్న వాళ్ళ తెలుగు టీచర్లను తప్పక అభినందించాల్సిందే. పిల్లలను చూసి నేనే ఎంతో హ్యాపీగా
ఫీలవుతున్నాను. ఆ పిల్లల్లో భాగంగా నన్ను కూడా తీర్చి దిద్దుతున్న భూమిక ఆ భూతల్లి కున్నంత ఓర్పుతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. కాలేజీ అమ్మాయిలకి కూడా శారీరక ధర్మాల పట్ల అవగాహనా రాహిత్యం కొట్టిచ్చినట్లు అగుపిస్తుంది. కడుపులో పేగులు చిట్లితే మెన్ స్ట్రువల్ వస్తుంది అనుకుంటున్నారు. భూమిక లో చదివిన తరువాత నేను ఎంతో తెల్సుకున్నాను. నేటి యువతను అక్కున చేర్చుకోవడమే ఇది. నంబూరి పరిపూర్ణ గారి వ్యాసం రాజ్యాంగంపై నన్ను కొంతలోకొంత ప్రశ్నించుకునే విధంగా ఉంది. ‘జాతీయత’ అన్న దానికి కొత్త అర్థం చేసే విధంగా ఉంది. నంబూరి గారు ఇంకా ఎన్నో విషయాలు మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఎండ్లూరి సుధాకర్ గారు చనిపోయాడన్న విషయం 10 రోజుల తర్వాత తెలిసి చాల బాధ పడ్డాను. భూమిక వివరించిన విధానం చాల బాగుంది.
` సహకలన, హైదరాబాద్
భూమిక సంపాదకులకు,
భూమికలో ప్రతి నెల వచ్చే ‘‘పచ్చి పసుపు కొమ్ము’’ కాలమ్స్ చదువుతున్నప్పుడు చాలా ఆలోచించేలా ఉన్నాయి. అందరికి అర్థమయ్యే భాషలో మంచిగా ఉన్నాయి. ప్రశాంతి గారి రచనా సరళి కళ్ళకు కట్టినట్లుగా ఒక సినిమాలో కదిలే బొమ్మలలా తన రచనా శైలి ఎంతో అద్భుతంగా ఉంది.
` కళ్యాణి, హైదరాబాద