యాపచెట్టు – కొండవీటి సత్యవతి

ఉగాది వెళ్ళిపోయిన పది రోజులకి తీరిగ్గా ఇంటి ముందున్న వేపచెట్టు గుబురుల్లో కూర్చుని గొంతు విప్పిన కోయిలను చూసి హమ్మయ్య! కోయిల పాట వినబడిరది. ఈ సంవత్సరానికి మొదటి కోయిల పాట. కోయిల వాలిన వేపచెట్టు కొత్త చిగుళ్ళు, మెరుస్తున్న కొత్త ఆకులు, గుత్తులు గుత్తులుగా తెల్లటి పూతతో కళకళలాడుతోంది.

వేపపూత మత్తువాసన గాలిలో కలిసివచ్చి నా చుట్టూ ఆవరిస్తోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి వేపచెట్టులో వచ్చే మార్పుల్ని గమనించడం నాకిష్టమైన అలవాటు. ఆకు మొత్తం పండిపోయి, తెల్లపూలు పూసే వేపచెట్టు పసుపు పూలను పూసిందా అనే భ్రమ కలుగుతుంది. అంత పసుపురంగులోకి మారతాయి ఆకులు. మెల్లగా ఆకులన్నీ రాలడం మొదలౌతుంది. ఒక్కోసారి బలంగా వీచే గాలులకు పసుపు రంగుకి తిరిగిన ఆకులు గింగిరాలు కొట్టుకుంటూ నేలమీద రాలుతుంటాయి. కొన్ని రోజులు కాగానే రాలిన ఆకుల దగ్గరే ఎర్రని చిగుళ్ళు, తర్వాత ఆకుపచ్చ ఆకులు, తెల్లటి పూత. కొంతకాలానికి ఆకుపచ్చని వేపకాయలు, ఆ తర్వాత పండిన పసుపు పచ్చని వేపపండ్లు. ఈ సైకిల్‌ ప్రతి సంవత్సరం తిరుగుతుంటుంది. ఇంటిముందు వేపచెట్టుంటే వసంతాగమన కాలంలో ఈ సంబరాన్నంతా హాయిగా ఆస్వాదించొచ్చు.
నిజానికి నేను రాయడానికి కూర్చున్నది కందుకూరి రమేష్‌ బాబు ‘యాప చెట్టు’ ఫోటో ఆర్ట్‌ గ్యాలరీ గురించి. ‘యాపచెట్టు’… ‘నవతీ ూతీవంవఅషవ’ ఇది ఏక చెట్టు ప్రదర్శన. అవును ఒకే చెట్టును తీసిన ఫోటో ప్రదర్శన ఇది అని రమేష్‌ సామాన్య శాస్త్రం నూతన ప్రదర్శన నోట్‌లో రాశాడు. ఫోటో ప్రదర్శన మూడు గదుల్లో ఏర్పాటైంది. రమేష్‌ ఈ ఫోటోలను 2009`2016 సంవత్సరాల మధ్య కాలంలో తీశారు.
ఈ యాపచెట్టు పార్సీగుట్టలో ఒక వీథిలో ఉండేది. ఏడేళ్ళపాటు తీసిన ఫోటోలతో ఆ చెట్టు చుట్టూ అల్లుకొన్న జీవితాలు, జీవన శైలులు ఎలా మార్పులకు గురయ్యాయో ఎన్నో కోణాల్లో చిత్రీకరించారు. ఒకే ఒక చెట్టు, దాని చుట్టూ అల్లుకున్న విస్తారమైన జీవితం ఆ ఫోటోల్లో కనిపిస్తుంది.
యాపచెట్టు ఫోటో ప్రదర్శన ఒక క్రమంలో మూడు గదుల్లో ఏర్పాటు చేశారు. మూడో గదిలోకి ఇప్పుడే వెళ్ళొద్దు అని రమేష్‌ చెప్పాడు. ఎందుకలా హెచ్చరించాడో తర్వాత అర్థమైంది. మొదటి గదిలో ఫోటోలన్నీ వివిధ భంగిమల్లో వేపచెట్టు, దాని చుట్టూ పరచుకున్న ఆనంద జీవితం. పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టిన వేపచెట్టు మొదట్లో ఉన్న బండ మీద కూర్చుని సేదతీరుతున్న వాళ్ళు, తల దువ్వుకుంటూ నీడన నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్న మహిళలు, చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలు, చెట్టు నీడలో సేదతీరుతున్న పండ్ల వ్యాపారి, చెట్టుపక్కనున్న షాప్‌లో ఏదో కొనుక్కుంటున్న మహిళ… ఇలా ఎన్నో ఫోటోల్లో, ఎంతోమంది మనుష్యులు ఆ చెట్టును పెనవేసుకుని కనిపించారు. అందరి ముఖాల్లోను చెట్టు ఇచ్చిన నీడ తాలూకు ఆనందం కనబడుతోంది.
ప్రదిక్షణ మాదిరి ప్రదర్శన: ‘‘వేపచెట్టును మనిషి పసుపు కుంకుమలతో అలంకరిస్తాడు. ఒకరోజు గులాబీలతో, మరో రోజు చేమంతులతో అలంకరిస్తాడు. ఇంకో రోజు బంతి పూవుతో… ఇలా రోజూ పూలు పెడతాడు. మరో రోజు అగరబత్తీలు కూడా ముట్టిస్తాడు. ఇలా రకరకాలుగా కొలుస్తాడు. వాటినన్నింటినీ చిత్రించాను. ఒకే చెట్టు, దాని వెలుగు నీడల్లో, ఎండా వానల్లో… దాని చుట్టూ ఉన్న జీవితాన్ని దాదాపు ఏడేళ్ళు (2009`2016) తీసాను. ఎండకు ఎండిన మాను, వానకు తడిసిన చెట్టును, ఆ చెట్టు దాని చుట్టూ ఉన్న పరిసరాలను, స్త్రీలు, పురుషులు, పిల్లలతో తీశాను’’`కందుకూరి రమేష్‌ బాబు.
రమేష్‌ తన నోట్‌లో వ్యక్తం చేసిన విధంగా సందర్శకులు చెట్టు చుట్టూ అలుముకున్న జీవితాలను చూస్తూ రెండు గదుల్లోని ఫోటోలని తదేకంగా, తాదాత్మ్యంతో చూస్తారు. నా వరకు నేను రెండుసార్లు ఆ ప్రదర్శనను చూశాను. చెట్లతో నాకున్న అనుబంధంతో, గాఢమైన అనుభూతితో నేను ఒక్కో ఫోటోను చూశాను. క్రమంగా రెక్కలు తెగిన పక్షిలా కొమ్మలు కొట్టేసిన స్థితి, నిలువెత్తుగా ఆకాశంలోకి పాకిన కొమ్మలు మాయమైన స్థితి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. క్రమంగా చెట్టుకింద నిలబడిన మనుష్యులు మాయమవడం, పిల్లల ఆటలు ఆగిపోవడం వేపచెట్టు చుట్టూ ఆగిపోయిన జీవితం ఫోటోల్లో వ్యక్తమవుతుంది.
యాపచెట్టును నాటి పూజలు చేసిన మహిళ, చెట్టును కొట్టేయించిన మనిషి… తల్లీ కూతుళ్ళే. రెండో గదిలో కమ్ముకున్న దుఃఖం మూడో గదిలోకి వెళ్ళగానే యాపచెట్టు ఆనవాళ్ళు కూడా చెరిగిపోయిన విధ్వంశం భోరున ఏడిపిస్తుంది. నా కళ్ళల్లో నీళ్ళొచ్చి ఫోటోలు స్పష్టంగా కనబడడం మానేశాయి. అయ్యో! అనే ఆర్తనాదం నా లోపలి నుంచి చీల్చుకొచ్చింది.
ఇది ఒక యాపచెట్టును సమూలంగా నిర్మూలించిన విధ్వంసం కాదు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వైనం. అడవులను నరికేస్తున్న విద్వంశం. చెట్టును చంపేసి బతికేద్దామనుకుంటున్న మనిషి స్వార్ధం. తరిగిపోతున్న అటవీ సంపద, అల్లకల్లోలమౌతోన్న వాతావరణ సమతుల్యత. భవిష్యత్‌ తరాలకు ఈ విధ్వంశాన్ని వారసత్వంగా ఇస్తున్న దుర్మార్గం.
అభినందనలు రమేష్‌, అద్భుతమైన ఫోటో ప్రదర్శన ద్వారా అవసరమైన హెచ్చరిక చేసినందుకు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.