తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా

(గత సంచిక తరువాయి…)
వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి.

విమల ఒక గణిత కూతురు. వేశ్యాగృహంలోనే పుట్టి పెరిగింది. ఒకనాడు ఈమె బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లన అనే భిక్షకుడిని చూసి అతన్ని ఆకర్షించి వశపరచుకోవాలని ప్రయత్నించింది. అతను ఈమెను తృణీకరిస్తూ ‘‘నీవు చర్మం కప్పుకొన్న పెంటకుప్పవుÑ గడ్డల వక్షోజాలు ఉన్న దయ్యానివిÑ నీ నవరంధ్రాలలో దుర్వాసనా స్రావాలు ప్రవహిస్తుంటాయిÑ శుచిని కోరుకునేవారు పెంటను ఎలాగైతే తప్పించుకొంటారో నీ శరీరాన్ని అలాగే తప్పించుకొంటారు’’ అంటూ అవమానిస్తాడు. అతని మాటలు విమలలోని అహంకారాన్ని చంపివేసి, ఆమెను బౌద్ధ సన్యాసినిగా మారేలా చేశాయి. విమల థెరీగా మారాక వ్రాసుకొన్న గాథ ఇలా ఉంది.
యవ్వనం నేడు
కాంతులీనే చర్మం శిరోముండనం
వంకలేని దేహాకృతి కాషాయ వస్త్రాలు
అతిలోక సౌందర్యం భిక్షుకజీవనం
అపరిమితమైన పేరు ప్రఖ్యాతలతో అన్ని బంధాలను తెంచుకొని
కనులు మూసుకొనిపోయి చెట్టు నీడలో ఉన్నాను నేను
ఎవరూ నా కంటికి కనపడేవారు కారు లోలోపల బడబాగ్ని చల్లారింది
అందంగా అలంకరించుకొని
వేశ్యాగృహం బయట వేటకత్తెలా నిలుచుని నా జీవితంలోంచి
వలలో చిక్కుకొన్న మగవాళ్ళని చూసి నవ్వుకొనేదాన్ని దేవుళ్ళను, మగవాళ్ళను తరిమేశాను (72`76)
పై గాథలో చివరి వాక్యం కీలకమైంది. అంతటి విప్లవాత్మక భావాలను నేడు వ్యక్తీకరించే పరిస్థితులు ఉన్నాయా అనేది సందేహాస్పదమే!
బుద్ధుడు సన్యసించక పూర్వం సిద్ధార్ధునిగా ఉన్నప్పుడు అంతఃపురంలో అతనితో సన్నిహితంగా మెసిలిన వారిలో పన్నెండు మంది బౌద్ధభిక్షుణిలుగా మారి ధమ్మమార్గంలో ప్రయాణించారు. సిద్ధార్ధుని అంతఃపుర స్త్రీలు ఎంతమంది అనేదానికి ఎక్కడా వివరాలు దొరకవు. ఒక కథనం ప్రకారం సిద్ధార్ధుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినపుడు శాక్యులు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువతి చొప్పున మొత్తం నలభై వేల మందిని సిద్ధార్ధుని అంతఃపురానికి పంపించారట. ఈ ఉదంతం సిద్ధార్ధుని మగటిమిని చెప్పటానికే అని సులువుగానే అర్థమౌతుంది. సిద్ధార్ధుని సమకాలీనుడైన బింబిసారునికి 500 మంది అంతఃపుర స్త్రీలు ఉండటాన్ని బట్టి సిద్ధార్ధుని స్త్రీ జనం కూడా అంతే సంఖ్యలో ఉండేవారని ఊహించవచ్చు.
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందినవారు కీర్తి ప్రతిష్టల కొరకు అంతఃపురంలో అనేకమంది స్త్రీలను ఉంచుకొనేవారు. వీరిలో వివాహం చేసుకొన్న వారిని భార్యలు/రాణులు అని, విలాసం కొరకు ఉంచుకొన్న వారిని ఉంపుడుగత్తెలని (గణికలు) పిలిచేవారు. ఈ గణికలు రాజుగారికి ఛత్రం, వింజామర ధారిణులుగా, పానపాత్ర అందించటానికి, సింహాసనం, రథాధుల వద్ద సహాయకారులుగా ఉండాలి అని చాణుక్యుని అర్థశాస్త్రంలో చెప్పబడిరది. ఈ ఉంపుడుగత్తెలకు వెయ్యి నుంచి మూడువేల పణాల వరకూ ఖజానా నుంచి జీతభత్రాలు ఇచ్చేవారు. ఈ గణికా వృత్తి నుండి విముక్తమవ్వాలంటే ఇరవై ఐదు వేల పణాలు చెల్లించి స్వేచ్ఛనొందవచ్చు. గణికాపుత్రునికైతే పన్నెండువేల పణాలు చెల్లించాలి. వయసు దాటిపోయిన గణికలు కోశాగారంలో కానీ, వంటశాలలో కానీ పనికి కుదరవచ్చు. రాజుగారు చెప్పిన పురుషుని వద్దకు వెళ్ళని గణికకు వెయ్యి కొరడా దెబ్బలు లేదా ఐదువేల పణాల జరిమానా వరకూ విధించేవారు. ఇదీ ఆనాటి రాజ స్త్రీ జనుల జీవన స్థితిగతులు.
గౌతమ బుద్ధుని పూర్వజీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన కొద్దిమంది అంతఃపుర వాసినుల గాథలు ఇవి. (తధాగతుడు ఒకనాటి తన గణిక అయిన తిస్సాతో ఇలా అంటున్నాడు)
తిస్సా! కొద్దిగా ఓరిమితో ఉండు
సాధనను సాధన చేయి ఇదే నీ చివరి జన్మ (10)
నిన్ను అనుబంధాలు కబళించనీయకు సంఘ…
సంకెళ్ళ నుంచి విముక్తమవ్వు నేను నా ఇంటిని
ఈ లోకంలో నిష్కల్మషంగా జీవించు (5) నా కొడుకుని, నా పశుసంపదను
(తధాగతుడు ఉపాసమ అనే మరో గణికతో ఇలా అంటున్నాడు) నేను ఇష్టపడే వాటన్నిటినీ
ఉపాసమా త్యజించాను
ఈ ప్రవాహాన్ని నీవు దాటాలి నా అజ్ఞానం పటాపంచలైంది
ఇది మృత్యు మార్గం, అత్యం కష్టమైనది నేను కోర్కెలను జయించాను
ఉపాసమా! నీవు ఇప్పటికే నా దాహం తీరింది
అన్ని ప్రలోభాలను జయించావు ఇప్పుడు ఎంతో శాంతిగా ఉంది నాకు
సంఘ, సిద్ధార్థుని అంతఃపుర స్త్రీ అని చెప్పినప్పటికీ, ఆమె పశువుల కాపరిగా స్వతంత్ర జీవనం సాగించినట్లు, కుటుంబాన్ని కలిగి ఉన్నట్లు పై గాథ ద్వారా అర్థమౌతుంది.
థేరీలు రాజమాత నుండి వేశ్యల వరకూ వివిధ సామాజిక స్థాయిల నుండి వచ్చారు.
… … …
1500 బిసిఇ నాటికి మనుగడలో ఉన్న మాతృస్వామ్య సమాజం క్రమేపీ పితృస్వామ్య సమాజంగా చేరడానికి వేద పాత్ర పోషించి, వేదకాండలను నిర్వహించిÑ విదుషీమణులుగా, కవయిత్రులుగా, గణనీయమైన పాత్ర వహించిన స్త్రీలను ఈ సనాతన ధర్మం కట్టడి చేసి పురుషాధిక్య చట్రంలో బిగించసాగింది.
ఆర్య సంస్కృతి స్త్రీలనే కాక శూద్రులను కూడా జ్ఞానానికి (సంస్కృతానికి) దూరంగా ఉంచింది. వీరికి వేదవిద్యలు నేర్పాలా వద్దా అంటూ అతి ప్రాచీన ఆపస్తంబధర్మసూత్ర మొదలు ఆ తదుపరి ఆదిశంకరాచార్యుల బ్రహ్మసూత్ర, పదహారో శతాబ్దపు అప్పయ్య దీక్షితుల వరకూ చర్చోపచర్చలు జరుగుతూనే ఉండటం గమనార్హం.
ఆర్య సంస్కృతి ద్వారా వెలికి గురైన స్త్రీలను, శూద్రులను మొదటగా చేరదీసింది జైనమతం. బుద్ధునికన్నా 50 ఏండ్లు పెద్దవాడైన జైన మహావీరుడు ముప్పై ఆరువేల మంది స్త్రీలతో సంఘాన్ని నెలకొల్పాడు. పార్శ్వనాథుడు (బిసిఇ 872`772) స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించే స్వేచ్ఛ ఉందని, వారు కూడా జ్ఞాన సముపార్జన చేసి గురుస్థానం పొంది బోధనలు చేయవచ్చని ప్రవచించాడు. అంతేకాక స్త్రీలు అధికారిక, రాజకీయ స్థానాలకు కూడా అర్హులని చెప్పాడు. బౌద్ధ, జైనాలు స్థానిక భాషలలో జ్ఞానాన్ని అందిస్తూ, శూద్రులను, స్త్రీలను అక్కున చేర్చుకొన్నాయి. ఈ చర్యలు ఆర్య సంస్కృతి భావజాలానికి ప్రతికూలంగా పనిచేసి ఉండొచ్చు, అదొక చారిత్రక భావజాల వైరుధ్యం.
… … …
బిసిఇ మూడో శతాబ్దంలో మెగస్థనిస్‌ భారతదేశం గురించి చెబుతూ అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, విద్యలను అధ్యయనం చేసే సంచార స్త్రీలు ఉన్నారని, వీరిని పబ్బజితా (pabbajita the Female Wanderer) అంటారని చెప్పాడు. ప్రతి దశలో స్త్రీ ఎవరో ఒకరి సంరక్షణలో ఉండాలి తప్ప ఆమెకు స్వాతంత్య్రం లేదు అంటూ మనుస్మృతిలో (400 బిసిఇ`700 సిఇ) చెప్పిన పురుషాధిక్య కట్టుబాటును ధిక్యరించి భార్యగానో, తల్లిగానో మరొకరికి లొంగిపోయి, స్వేచ్ఛను కోల్పోవడానికి ఇష్టపడని స్త్రీలు బౌద్ధ, జైనాల వైపు ఆకర్షితులై సంచార జీవనాన్ని సాగించేవారని ఊహించవచ్చు.
బుద్ధిజం క్షీణించాక ఈ female wanderers ను అప్పటి సమాజం ‘Loose women’’ గా చూడటం మొదలుపెట్టి ఉంటుంది. (ఆంధ్ర దేశంలో శిథిల రూపంలో ఉన్న ఒకనాటి బౌద్ధారామాలను లంజల దిబ్బలు అనే పేరుతో వ్యవహరింపబడటం నేటికీ గమనించవచ్చు) ‘Loose women’’ను, ఆత్మస్వేచ్ఛ కొరకు సంప్రదాయాన్ని ధిక్కరించిన పరిత్యాగులను కలిపి చూడలేం. ఎందుకంటే బుద్ధిజంలోని అష్టాంగమార్గ అనుసరణ కఠినమైనది. చెడువర్తనకు తావు లేనిది.
స్త్రీలు బౌద్ధ భిక్షుణిలుగా మారాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి. తల్లిదండ్రులు జీవించి ఉంటే వారి అనుమతి లేదా భర్త ఉంటే అతని అనుమతి తప్పనిసరి. అప్పటికే సంఘంలో ఉండే ఇతర భిక్షుణి, భిక్షకుల అంగీకారం ఉండాలి. ఈ దశలో కుటుంబ సంబంధాలను తెంచుకోనక్కర్లేదు.
ఇలా రెండేళ్ళపాటు బౌద్ధ సన్యాసిని వద్ద విద్యనభ్యసించాక సంఘంలోకి సభ్యురాలిగా తీసుకుంటారు. అలాంటి వారిని ‘‘సిఖమన’’ అంటారు (sikkhamana female buddhist probationar). ఈ దశలో 12 ఏండ్లపాటు సంఘంలో ఉంటే భిక్షుణిగా గుర్తిస్తారు. ఈమె కొత్తగా సంఘంలోకి వచ్చినవారికి శిక్షణనివ్వవచ్చు. వృద్ధ భిక్షుణిని థేరి అంటారు. బౌద్ధ ఆరామంలో మఠవాసినులుగా ఉండాలంటే, వనాలలో సంచరించకూడదుÑ ఒంటరిగా జనావాసాలలోకి వెళ్ళకూడదుÑ ఒంటరిగా నదులు దాటకూడదుÑ ఒంటరిగా రాత్రివేళల సంచరించకూడదుÑ ఒంటరిగా ప్రయాణించకూడదుÑ పురుషులు, స్వైరిణులు స్నానమాడిన చోట స్నానం చేయరాదు… లాంటి నియమాలను బుద్ధుడే స్వయంగా స్త్రీల కొరకు చెప్పాడు.
… … …
థేరీ గాథల ద్వారా ఆనాటి స్త్రీలు ఎంతటి ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో, ఎన్నికష్టాలొచ్చినా నిరాశకు కృంగిపోని దృఢచిత్తంతో, అచంచలమైన స్వేచ్ఛాకాంక్షతో కూడిన జీవనేచ్ఛతో జీవనం సాగించారో ఆశ్చర్యం కలిగించక మానదు.
పురుషుని అండ లేకుండా స్త్రీలు స్వతంత్రంగా నివసించడం వల్ల కలిగే సామాజిక సమస్యలు బౌద్ధమతానికి తెలుసు. దైహికవాంఛల పట్ల వైముఖ్యం పెంపొందించుకోవటమే దీనికి పరిష్కారంగా సూచించినట్లు సుభ చెప్పిన గాథ ద్వారా అర్థం చేసుకోవాలి.
… … …
సుభ ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. గొప్ప అందగత్తె. యుక్తవయస్సులో బౌద్ధ దీక్ష తీసుకుని తక్కువ కాలంలోనే ఆత్మజ్ఞానం పొంది వివేచన కలిగిన భిక్షుణిగా పేరుతెచ్చుకొంది. ఒకనాడు ఆమె ఒంటరిగా అడవిలో సంచరిస్తున్నప్పుడు కామాతరుడైన ఒక అందమైన యువకుడు ఎదురై ఆమెను నిలువరించాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణకు సంక్షిప్త రూపమిది.
సుభ:
ఎవరవోయి నీవు? నేను నీకేమి చేశాను?
ఎందుకు నా దారికి అడ్డు పడుతున్నావు?
ఒంటరిగా ఉన్న అమ్మాయిని తాకటం సరికాదు
నేను పవిత్రంగా ఉన్నాను, ఏ కళంకమూ లేదు
మా రక్షకుడు, బోధకురాలు నన్ను తీర్చిదిద్దిన విధానమిది.
నీ బుద్ధి మంచిగా లేదు, కోర్కెతో రగిలిపోతోంది
నేను నిర్మలంగా ఉన్నాను
నాకు ఏ వాంఛలూ లేవు
తేటగా ఉన్నాను
నా మార్గానికి ఎందుకు అడ్డుపడుతున్నావు?
యువకుడు:
నువ్వు అందగత్తెవు, అమాయకంగా ఉన్నావు
నీ కాషాయ వస్త్రాలు విడిచిపెట్టు
మనిద్దరం ఈ అడవిలో విహరిద్దాం
గాలి తియ్యగా ఉంది
అడవంతా పుష్పించింది
తరువులు పుప్పొడి వెదచల్లుతున్నాయి
వసంత రుతువు ఆనందాలకు నెలవు
ఏ తోడూ లేక ఈ వన సంచారం ఏం సుఖం నీకు?
చుట్టూ మృగాలు,
మగ ఏనుగులచే ఉద్రేకించబడిన
ఆడ ఏనుగుల ఫీుంకారాలు
భయం వేయటం లేదా?
నీవు నాతో వచ్చేయి
నీ కొరకు పెద్ద భవంతి నిర్మిస్తాను
బంగారం, రత్నాలు, ముత్యాలతో
సేవకులు నిన్ను అలంకరిస్తారు
గంధపు చెక్కతో చేసిన తల్పంపై పవళించగ
రా… నన్ను అంగీకరించు…
సుభ:
ఈ దుర్భల దేహంలో మృత్యువు ఉంది
ఈ దేహాన్ని ఎందుకు తదేకంగా
చూస్తున్నావు?
దీనిలో నిన్ను ఆకర్షించినదేమిటి?
యువకుడు:
నీ నేత్రాలు… మృగనయనీ… నీ నేత్రాలు!
అవి ప్రకాశించే నీలి కలువలు
వాటిని చూస్తే నీపై నా ప్రేమ అతిశయిస్తుంది
నీవు నిష్క్రమించినా
నీ కనులను, నీ కనుబొమలను, నీ చూపులను
స్మరించుకొంటూనే ఉంటాను
నీ నేత్రాలను మించినవేవీ లేవీ లోకంలో
సుభ:
బుద్ధభగవానుడి పుత్రికను నీవు వాంఛిస్తున్నావు
ఇది తప్పు మార్గము
నాకు ఏ కోర్కెలు లేవు
కోర్కెలు అంటే ఏమిటో కూడా నాకు తెలియదు
కోరుకోవటానికి అర్హత కలిగినది ఏదీ కనిపించదు నాకు
నేను అష్టాంగ మార్గంలో సాగుతున్నాను
అంధుడా!
నీవు లేని వస్తువుల వెంటపడుతున్నావు
నేత్రాలు అనేవి
గుంటల్లో ఉండే చిన్న చిన్న గోళాలు
కన్నీళ్ళు, శ్లేష్మం నిండిన బంతులు
(అని చెప్పి ఆమె తన కంటిని బలవంతంగా పెకిలించి అతని చేతిలో పెట్టి ఇలా అంది)
నీవు ఎంతో ప్రేమించిన
నా నేత్రం ఇదిగో!
తీసుకో… ఇక ఇది నీదే!

(ఊహించని ఈ సంఘటనకు చలించిపోయిన ఆ యువకుడు పశ్చాత్తాపం పొంది క్షమించమని ఆమెను కోరాడు)
యువకుడు:
పవిత్రమైన భిక్షుణీ!
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు.
ఇకపై ఇలా ఎన్నడూ జరగదు
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు (369`402)
(పిదప సుభ తధాగతుని వద్దకు వెళ్ళగా ఆయన చూపులు ఆమెపై ప్రసరించగానే ఆమెకు నేత్రము తిరిగి పూర్వస్థితికి వచ్చింది)
పై గాథలో సుభకు ఆ యువకునిపై ఏ రకమైన మోహమూ లేదు. శారీరక వాంఛల పట్ల ఆసక్తి లేదు. బుద్ధుని బోధనల వల్ల అంతర్నేత్రం పొందిన ఆమెకు బాహ్య నేత్రాలు అవసరం లేవని చెప్పటమే ఈ గాథ పరమార్ధం. సుభకు నేత్రం తిరిగి తెప్పించటం అనే ఉదంతం విశేషమైనది ఎందుకంటే బుద్ధభగవానుడు మహిమలు చూపించిన దాఖలాలు పెద్దగా కనిపించవు.
… … …
రెండున్నర వేల ఏండ్ల క్రితం కొద్దిమంది స్త్రీలు స్వేచ్ఛగా, స్వైరిణిలుగా, సన్యాసినులుగా సంచార జీవనం సాగించినప్పటికీ అధికశాతం మంది వైవాహిక జీవితంలో ఉన్నారు. తధాగతుడు ఒక సందర్భంలో ఆదర్శవంతమైన భార్య తన భర్తకు తల్లిలా, సోదరిలా, స్నేహితురాలిగా, పరిచారికలా ఉండాలని చెప్పాడు.
పై లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో విఫలమై సన్యాసించిన ఇసిదాసి అనే భిక్షుణి చెప్పిన గాథ ఆసక్తికరంగా ఉంటుంది.
ఇసిదాసి ఉజ్జయినిలో ఒక సంపన్న వర్తకుని ఇంట జన్మించింది. ఇసిదాసికి యుక్త వయసు వచ్చాక ఆమె తండ్రి సాకేతపురికి చెందిన మరో సంపన్న వర్తకుని కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక అక్కడినుంచి ఇసిదాసి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఒక గాథలో ఇలా చెప్పుకొంది.
నేను ప్రతిరోజూ నా అత్తమామల పాదాలను
కళ్ళకద్దుకొని దినచర్య ప్రారంభించేదాన్ని
నా భర్త తరపువాళ్ళను చూడగానే
ఒణికిపోతూ లేచి నా స్థానాన్ని వారికి ఇచ్చేదాన్ని
వారికి నచ్చిన రుచికరమైన వంటకాలు వండిపెట్టేదాన్ని
ఉదయాన్నే నిద్రలేచి,
నా భర్తకు తలదువ్వి అలంకరించేదాన్ని
స్వయంగా ఒండిన అన్నాన్ని తినిపించేదాన్ని
తల్లి బిడ్డను సాకినట్లు నా భర్తను సాకేదాన్ని
ఇన్ని చేసినా నేను నా భర్తకు నచ్చలేదు
ఇసిదాసితో కలిసి ఉండలేను అని నన్ను
మా పుట్టింటికి పంపించివేశాడు
కొడుకుని పొందాను కానీ సౌభాగ్యాన్ని కోల్పోయాను
నా తండ్రి భారీ కట్నకానుకలిచ్చి
మరో ధనికుడైన వ్యాపారితో నాకు రెండో పెళ్ళి చేశాడు
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
నన్ను మా పుట్టింటికి పంపించివేశాడు
మా ఇంటికి భిక్షకు వచ్చిన ఒక సన్యాసికిచ్చి
నాకు మూడో పెళ్ళి చేశాడు మా తండ్రి
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
ఇసిదాసితో కలిసి ఉండలేను అని నన్ను విడిచి వెళ్ళిపోయాడు.
ఇంత జరిగాక నేను చనిపోదామని నిశ్చయించుకొన్నాను
ఒకరోజు మా ఇంటికి జ్ఞానవంతురాలైన ఒక భిక్షుణి వచ్చింది
ఆమె బోధనలతో నేను ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకొని
బౌద్ధ దీక్ష తీసుకొని ధమ్మమార్గంలో ప్రయాణిస్తున్నాను (430`450 సంక్షిప్తరూపం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.