పారా లీగల్‌ వాలంటీర్స్‌ శిక్షణ రిపోర్ట్‌ -యం. పద్మ

మహిళలు, అమ్మాయిల అంశాలపైన అవగాహన కల్పించడం ద్వారా జెండర్‌ ఆధారిత వివక్ష, హింసను అర్థం చేసుకోడానికి ఈ శిక్షణ ప్లాన్‌ చేయడం జరిగింది. భూమిక ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌. రంగారెడ్డి జిల్లాల్లోని 10 బస్తీలలో పనిచేస్తుంది. అక్కడ ఏర్పడిన పారా లీగల్‌ వాలంటీర్‌ మహిళలు ఈ శిక్షణకు వచ్చారు. మొత్తం 29 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని

కిన్నెర గ్రాండ్‌ హోటల్‌ (హబ్సిగూడలో) నిర్వహించారు. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యవతి మేడమ్‌ మరియు ప్రాజెక్ట్‌ కో`ఆర్డినేటర్‌ సుజాత, క్లస్టర్‌ కో`ఆర్డినేటర్‌ సరిత, ట్రైనింగ్‌ కో`ఆర్డినేటర్‌ నీలిమ ఆర్గనైజ్‌ చేశారు. అలాగే కమ్యూనిటీ మొబిలైజర్స్‌ ధనలక్ష్మి, మంజుల గారు హాజరైనారు. నేను, నీలిమ, సుజాత, సరిత, రాజు కలిసి హాల్‌ని అరేంజ్‌మెంట్స్‌ చేశాము. తర్వాత 10 బస్తీల నుండి వాలంటీర్స్‌ బస్సులలో హోటల్‌కి చేరుకున్నారు. అందరూ వచ్చాక ఒకరిని ఒకరు పలుకరించుకోని అందరూ రౌండుగా కుర్చీలలో కూర్చున్నాము. ‘ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళో’ అనే ఒక పాట పాడుకున్నాము. నీలిమా అందరికీ స్వాగతిస్తూ బాల్‌ గేమ్‌ ఆడిరచారు. దానిద్వారా వారి గురించి పరిచయం చేసుకోవడం, ఇంతకుముందు జరిగిన శిక్షణలు, సమావేశాల ద్వారా నేర్చుకున్నవి వారికి నచ్చినవి ఏదైనా ఒక అంశం చెప్పాలని చెప్పారు. పాటిస్పేటర్స్‌ అందరూ చాలా చురుగ్గా పాల్గొన్నారు.
వారినుంచి వచ్చిన కొన్ని అంశాలు: మహిళల కోసం ఉన్న చట్టాల గురించి తెలుసుకోవడం (పోక్సో, గృహ హింస, లైంగిక వేధింపుల చట్టం) లైంగిక వేధింపుల చట్టం గురించి తెలుసుకున్నాక తోటి మహిళ పనిచేసే దగ్గర లైంగిక హింసకు గురవుతుంటే తనకు అండగా నిలబడి యజమాని దగ్గరకు వెళ్ళి మాట్లాడాంÑ సమస్య తీరిందని చెప్పారు. కుటుంబంలో మహిళలపై, అమ్మాయిలపై జరిగే హింస గురించి తెలుసుకున్నాం. మహిళలకు ఉన్న సపోర్ట్స్‌, హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ కూడా తెలుసుకున్నామని చెప్పారు. తరువాత డైరెక్టర్‌ సత్యవతి మేడమ్‌ గారు వచ్చారు. సభ్యులతో కార్యక్రమాల గురించి అందులో వారు నేర్చుకున్నవి మిగతా సభ్యులకు అందిస్తున్న సమాచారం గురించి అడిగి తెలుసుకుంటూ మళ్ళీ ఒకసారి వారి పాత్ర బాధ్యతలు గుర్తు చేశారు. మహిళల కోసం మంచి కార్యక్రమాలను చేయడానికి వచ్చిన వాలంటీర్స్‌ని అభినందిస్తూ వారికి భూమిక నుండి పారా లీగల్‌ వాలంటీర్స్‌గా గుర్తింపు కార్డుని ఇచ్చారు.
ఈ కార్డుని మంచిపని కోసం, మహిళలు, అమ్మాయిల కోసం పనిచేసే దిశగా ఉండాలి దుర్వినియోగం చేయమని హామీ తీసుకున్నారు. ‘ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నీవు చేయలేనిది‘ అనే పాట పాడుకున్నాం. సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాడారు. తరువాత ఈ రోజు కొత్తగా ఎలాంటి అంశాలను నేర్చుకోవాలనుకుంటున్నారనేది పెద్ద గ్రూప్‌తోనే చర్చిస్తూ వారినుండి వచ్చిన అంశాలను బోర్డుపై రాయడం జరిగింది. తర్వాత వచ్చిన సభ్యులను నాలుగు గ్రూప్స్‌గా చేశాం. మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న వివక్షత పైన ఎక్సర్‌సైజ్‌ చేయాలని చెప్పాం. చర్చించి చార్ట్స్‌పై రాసి ప్రజంటేషన్స్‌ చేశారు.
నాలుగు గ్రూప్స్‌ నుంచి వచ్చిన ముఖ్యమైన అంశాలు: అమ్మాయిలు చీకటి పడితే బయటకు వెళ్ళొద్దుÑ అమ్మాయిలు పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేయాలిÑ భర్త చనిపోతే స్త్రీ బొట్టు, పూలు పెట్టుకోకూడదుÑ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటారుÑ పెళ్ళి విషయంలో ఆడపిల్ల నిర్ణయం తీసుకోకూడదుÑ ఆస్తి పంపకాల్లో తేడా చూపించటం, ఆడపిల్లవే కదా నీకు ఆస్తి హక్కు ఎందుకు అనిÑ భర్త చనిపోయిన స్త్రీ వేరే పెళ్ళి చేసుకోకూడదుÑ ఆడపిల్ల చదువు విషయంలో తేడా చూపిస్తారుÑ ఆడపిల్లకి ఆహారం విషయంలో వివక్షతÑ భార్యకంటే భర్త మాటకే ఎక్కువ ప్రాధాన్యతÑ ఆడపిల్లకు తనకు నచ్చినట్లు ఉండకూడదుÑ ఆడ`మగ, భార్యాభర్తలు పనిచేసే విషయంలో తేడా చూపించడంÑ అమ్మాయి అయినా, మహిళ అయినా వేరేవాళ్ళతో మాట్లాడకూడదుÑ అమ్మాయిలు వేసుకునే బట్టల మీద ఆంక్షలు పెట్టడంÑ కులాంతర వివాహాలపై అంక్షలుÑ స్త్రీల పట్ల మత వివక్ష ఉందిÑ ఆడపిల్ల కచ్చితంగా కట్నం ఇవ్వాలిÑ ఆడపిల్లల్ని చదువు కోసం బయటికి పోనీయరుÑ ఉద్యోగానికి కూడా పోనీయరు. ప్రజంటేషన్‌తో వచ్చిన అంశాలను ఫెసిలిటేట్‌ చేస్తూ వివక్షత ఎదుర్కొంటున్న మనకి కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేవి పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి బోర్డుపై పితృస్వామ్యం చెట్టుని డ్రా చేసి ఫెసిలిటేట్‌ చేయడం జరిగింది. చెట్టు ఛార్ట్‌ రావాలి: గ్రూప్‌ సభ్యులు చర్చిస్తూ ఆలోచించడంÑ రెండవ తరం నుండి అయినా మనం మారుతూ, మార్చుతూ పితృస్వామ్య భావజాలాన్ని పోగొట్టే దిశగా ప్రతి ఒక్కరం పని చేయాల్సిన అవసరముందిÑ అప్పుడే హింస లేని జీవితాన్ని పొందగలుగుతాముÑ హింస లేని సమాజాన్ని చేయగలుగుతామనే సందేశాన్ని అందించగలిగాము. అలాగే మనకు మనం పోరాడుతూ మనకు ఉన్న హక్కులను పొందగలగాలి, అలాగే కాపాడుకోగలగాలి అనే ఒక బెలూన్‌ గేమ్‌ ఆడిరచాము. (ఒక్కొక్కరికి బెలూన్‌ ఇచ్చాము. వారి బెలూన్‌ని కాపాడుకుంటూ ఇతరుల బెలూన్లను పగులగొట్టడం) ఈ ఆటను చాలా ఎంజాయ్‌ చేస్తూ ఆడారు. ఇలాగే మనకు మనం పోరాడుతూ మనకు ఉన్న హక్కులను పొందగలగాలి అలాగే కాపాడుకోగలగాలి అనే ఉద్దేశంతో ఈ ఆటను అడిరచాము. మన హక్కులను మనం అందుకుంటూ ఇతరుల హక్కులను మనకు తెలియకుండానే భంగం కలిగిస్తూన్నామనే విషయాన్ని గ్రహించి ఈ ఆట ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకున్నారు. మన హక్కులను మనమందుకోవాలి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని వారు అభిప్రాయాలను తెలిపారు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకున్నారు.
తరువాత మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల హింసలు, అందులో నుండి ఎలా బయటపడాలని ఆలోచించడానికి (1.మానసిక హింస, 2. ఆర్థిక, 3. శారీరక, 4. లైంగిక) కేస్‌ స్టడీలను చదివి వినిపించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం జరిగింది. వాటికి సమాదానంగా పార్టిసిపెంట్స్‌ మానసిక హింస, శారీరక హింస, ఆర్థిక హింస, లైంగిక హింస గురించి బాగా అర్థం చేసుకున్నామని తెలిపారు.
‘ఇదిగిదిగో మేమున్నాం మేమున్నాం మేమున్నాం’ అనే పాటను పాడుకుని సెషన్‌ మీద గ్రూప్‌ సభ్యుల అభిప్రాయాలను తీసుకుని గ్రూప్‌ ఫోటో తీసుకుని సెషన్‌ను ముగించడం జరిగింది. నాకు ఈ అవకాశమిచ్చిన సత్యవతి మేడమ్‌ గారికి మరియు టీంకి ధన్యవాదాలు

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.