అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు…
ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు…
ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను
ఎదుర్కొంటున్న సమస్యలు సవాలక్ష…
ఆలోచనలకు స్వేచ్ఛ లేదు,
ప్రయత్నాలకు ప్రోత్సాహం లేదు…
ఓ ఆడపిల్లలా పుట్టి మేము చాలా వేదనను అనుభవిస్తున్నాం
మా కలలను సాకారం చేసుకోవడానికి…
మీ మద్దతు పొందడానికి…
సమయం సమాధాన పరచడం లేదు అందుకే సమస్యలను
లేవనెత్తవలసిన దుస్థితి…
మౌనం పరిష్కారాలను చూపడం లేదు అందుకే
ప్రశ్నలను సంధించే పరిస్థితి…
స్వాతంత్య్రం కోసమే కాదు,
సమానత్వం కోసం కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి…
కేవలం న్యాయం కోసమే కాదు
అవకాశాల కోసం,
గుర్తింపు కోసం,
హక్కుల కోసం,
బాధ్యతల కోసం
పోరాటాలు ప్రారంభమవుతుంటాయి…
చరిత్రలో విజయాలది మాత్రమే కాదు
ప్రయత్నాలది కూడా సమాన స్థానమే…
అందుకే మా కోసం మేము యుద్ధాన్ని ప్రారంభించాము…
అయితే ప్రతిపాదనల్లో ‘‘కోరుకుంటూ’’ అంటూ సరిపెట్టుకోలేదు…
ప్రేమకు అర్హులం మేము,
లాలనకు అర్హులం మేము
స్వతంత్రమైన జీవితానికి అర్హులం మేము…
మరీ ముఖ్యంగా గౌరవానికి అర్హులం మేము
ఏది కలగనినా దానికి అర్హులం మేమంటూ
నిలదీసి నేడు ఈ స్థాయిన నిలుచున్నాము…
ఎందరికో ఆదర్శంగా, మరెందరికో స్ఫూర్తిగా
ప్రతి రంగంలో మాదైన ముద్రను వేస్తూ చరిత్రలో మాకు కొన్ని పుటలను సృష్టించుకున్నాము…
మరెన్నో కొత్త ప్రయత్నాలకు నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నాం…
మా దారికి అడ్డు పడొద్దు… మేము మార్గదర్శకులుగా ఉండాలని
కోరుకుంటున్నాం… మా భవిష్యత్తు తరాల వారికి…
వారి జీవనాలను సులువుగా గడపడానికి… వారి జీవితాలను ఆనందంగా
కొనసాగించడానికి… బాధ్యతలతో కూడిన హక్కులను సాధించడానికి…