ఉద్యమాలకు దిక్సూచి ఆమె ఆత్మకథ – ఉణుదుర్తి సుధాకర్‌

నవయాన ప్రచురణ సంస్థ వారు ఇటీవల ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన గీతా రామస్వామి జ్ఞాపకాలను ‘ూaఅస, Gబఅం, జaర్‌వ, ఔశీఎaఅ’ అనే పేరుతో వెలువరించారు. 1970లలో నాటి యువతరంపై విశేషమైన ప్రభావం చూపిన నక్సల్బరీ, శ్రీకాకుళ

ఉద్యమాలు, ఆ తరువాత కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన వివిధ మార్క్సిస్టు`లెనినిస్టు గ్రూపులు, ముఖ్యంగా పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ చేసిన పోరాటాలు, అవి రేకెత్తించిన చర్చలూ, భిన్నాభిప్రాయాలూ ఆధునిక తెలుగు రాష్ట్రాల చరిత్రతో పెనవేసుకుపోయాయి.
ఈ పరిణామాలన్నీ ఈ రచనకు నేపథ్యంగా నిలుస్తాయి. ఆ ఉద్యమాలకు కేంద్ర బిందువైన భూపోరాటాల ప్రాముఖ్యత ఈ రచనలో తెలిసి వస్తుంది. అలాగే 1980ల నాటి స్త్రీవాద ఉద్యమపు తొలిదినాలు, భూస్వామ్య వ్యవస్థకే కాకుండా పితృస్వామ్యానికి కూడా ఎదురొడ్డి నిలబడిన అసామాన్య మాదిగ స్త్రీల అనుభవాలు, క్షేత్రస్థాయిలో గీతా స్వయంగా ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తాయి.
సాంప్రదాయబద్ధమైన తమిళ బ్రాహ్మణ యువతిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, మాదిగలతో సహవాసం చేసి, తెలుగు నేర్చుకొని, వారిలో ఒకరిగా నిలిచిన గీతా సాహసోపేతమైన ప్రయత్నం ఈ రచనకు గల ప్రత్యేకత. కులవ్యవస్థని నిలదీయకపోతే భారతదేశంలో ఏ విధమైన సామాజిక చైతన్యం, పోరాటం నిలదొక్కుకోలేవని మరోసారి ఈ జ్ఞాపకాలు మనకు గుర్తుచేస్తాయి.
ఒక జీవితకాలపు సంఘర్షణను వెనుతిరిగి పరిశీలించినపుడు వ్యక్తిగత అనుభవాలు, సామాజికాంశాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోతాయి. 1972లో జార్జిరెడ్డిని గూండాలు హత్య చేసినప్పుడు గీతా రామస్వామి ఉస్మానియా క్యాంపస్‌లో ఉండటం తటస్థించింది. అప్పటికామెకు ఏ విధమైన రాజకీయాలతోను పరిచయం లేదు. ఉద్వేగభరితమైన 1970లలో ఆమె వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షింపబడడం సహజసిద్ధంగానే జరిగిపోయింది.
రాజకీయ చైతన్యం అనేది అన్ని దేశాలలోనూ విద్యావంతులూ, సంస్కరణవాదులూ అయిన మధ్య, ఉన్నత తరగతుల సమూహాలతోనే మొదలవుతూ వచ్చింది. ఎందుకంటే చదువు మూలంగా వారికే మొట్టమొదట కొత్త ఆలోచనలూ, తాజా సమాచారం, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పడుతుంది. ఈ అనివార్య పరిణామం ఏకకాలంలో సంస్కరణోద్యమానికి దోహదకరంÑ సమూల మార్పును కోరుకునే విప్లవ రాజకీయాలకు అడ్డుకట్ట. భారతదేశపు కమ్యూనిస్టు పార్టీలు నేటికీ అగ్రవర్ణ ఆధిపత్యం నుండి, పితృస్వామ్యం నుండి బయటపడలేకపోతున్నాయన్న విమర్శలో వాస్తవం ఉంది. అయితే ఇప్పుడు ‘క్రింది’ కులాల, వర్గాల వారికి కూడా విద్య, ఉద్యోగావకాశాలు ఏదో ఒక మేరకు అందుతున్నందున ఈ ధోరణి మారబోతున్నది. గీతా ఈ అంశాలను, పరిణామాలను ప్రస్తావిస్తుంది పుస్తకంలో.
దక్షిణాది బ్రాహ్మణులు చాలామంది ఉద్యోగాలవైపు ముందుగానే మళ్ళి భూమితో సంబంధాన్ని తెంచుకున్నారు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీతాకి ఉదారవాద వామపక్ష రాజకీయాల వైపు ఆమె చెయ్యాలనుకున్న ప్రయాణం సులభంగానే సాధ్యపడి ఉండాలి. కానీ ఆమె కుటుంబీకులామెను కట్టడి చేశారు, నిర్బంధించారు, చివరికి మానసిక రోగిగా గుర్తించి (కమ్యూనిస్టులు చేసిన బ్రెయిన్‌వాష్‌ని వదలగొట్టాలనే ఆలోచనతో) బలవంతంగా షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. వ్యక్తిగత జీవితంలో గీతా ఎదుర్కొన్న నిర్బంధాలన్నింటిలోనూ ఇది ఆమెకు ఎంతోకాలం మాయని గాయంగా ఉండిపోయిందని అనిపిస్తుంది. అలాగే ప్రాణ స్నేహితులనుకున్నవాళ్ళు ఆకస్మికంగా దూరం కావడం, ఆమెను హత్య చేయడానికి భూస్వాములు చేసిన ప్రయత్నం… ఇవన్నీ ఈ పుస్తకంలో ఎదురవుతాయి.
మంచి అనుభవాలు లేవా? అంటే చాలా ఉన్నాయి. (జార్జిరెడ్డి సోదరుడు) సిరిల్‌ రెడ్డితో వివాహం, ఒడిదుడుకుల మధ్యనే అయినా సజీవబంధంగా మారిన వారి అనుబంధం, వాళ్ళు కలిసి చేసిన సామాజిక కార్యక్రమాలు, ఘజియాపూర్‌లో దంపతులిద్దరూ చదువు చెప్పిన పేదపిల్లలు వృద్ధిలోకి రావడమూ, ఎన్నో ఏళ్ళ తర్వాత వారిని కలుసుకోవడమూ పాఠకులకు కన్నీళ్ళు తెప్పిస్తాయి.
అలాగే హైదరాబాద్‌ సమీపంలోని ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో గీతా, ఆమె అనుచరులూ మాదిగలను సమీకరించిన తీరు విస్మయపరుస్తుంది. చదువులేని, వెనుకపడ్డ సమూహాలుగా చెప్పబడే ఈ జనుల చైతన్యం, జీవితానుభవాల నుంచి ఉద్భవించిన విజ్ఞత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా స్త్రీల నిబద్ధత, సృజనాత్మకత మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. వారి డప్పుల చప్పుడు మన గుండెల్ని తాకుతుంది. గత ముప్ఫై ఏళ్ళుగా నిర్విరామంగా కృషి చేస్తూ, ఉత్తమస్థాయి పుస్తకాలనూ, అనువాదాలనూ తెలుగు పాఠకులకు అందజేస్తున్న హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కి అధిపతిగా, చోదకశక్తిగా నిలిచిన గీతా రామస్వామి తెలుగు పాఠకులందరికీ పరిచయమే.
స్థానికుల సహకారంతో గీతా, ఆమె సహచరులూ కలిసి ఏ రాజకీయ పార్టీకీ అనుబంధ సంస్థగా కాకుండా ఒక స్వతంత్ర ట్రేడ్‌ యూనియన్‌గా స్థాపించిన ‘ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీ సంఘం’, పార్టీల కార్యాచరణలో భాగంగా ముందుకి సాగే పోరాటాలకు పూర్తిగా భిన్నంగా
ఉద్యమించింది. ఈ అనుభవాలను గీతా ఈ పుస్తకంలో వివరంగా చర్చిస్తుంది.
సంఘం, తొలుత వెట్టిచాకిరీ నుండి విముక్తిపై దృష్టి పెట్టింది. వందలాది ఎకరాలకు అధిపతులైన రెడ్డి భూస్వాములకు పక్కలో బల్లెంగా మారింది. అసలు భూస్వాముల దోపిడీ, దాష్టీకాలు 1930`40లలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేవి అనే ఒక తప్పుడు అభిప్రాయం అనేకులలో పేరుకుపోయి
ఉంది. హైదరాబాద్‌ శివార్లలో, 1980ల వరకూ అంత తీవ్రమైన భూస్వామ్య దోపిడీ కొనసాగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
తరువాతి దశలో సంఘం తన దృష్టిని భూమి పంపిణీపైకి సాగించింది. అసలు సమస్య ఇదే అని త్వరలోనే వెల్లడైంది. లీగల్‌ పోరాటాల పరిధిలోనే అనేక విజయాలను సాధించింది. లా చదివిన ఇంజనీర్‌ సిరిల్‌ రెడ్డి ‘సలహా’ అనే సంస్థను నెలకొల్పి లీగల్‌ సేవలను అందించాడు.
ఇటువంటి మౌలిక పోరాటాలను చేపట్టినపుడు అనేకానేక సంబంధిత సమస్యలు
ఉత్పన్నమవుతాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వెట్టిచాకిరీ రద్దును సాధించుకున్నపుడు పశువుల కాపర్లుగా ఉన్న పిల్లలకు చదువుకునే అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఏర్పడిరది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పరిమితంగా ఉన్నాయి. అప్పుడేం చేయాలి? సిరిల్‌ రెడ్డి, తదితరులు చొరవ తీసుకుని గ్రామస్థాయి విద్యాసంస్థలను స్థాపించారు, నిర్వహించారు, ఆ పిల్లలకు విద్యావకాశాలను కల్పించారు.
మన దేశంలో ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉద్యమాలు అనతికాలంలోనే ఇతిహాసాలుగా, కథలుగా, ఉద్వేగభరితమైన పాటలుగా, నినాదాలుగా మారిపోతాయి. వీరగాథలు ప్రచారంలోకి వస్తాయి. వాస్తవాలు మరుగున పడతాయి. ఉద్యమాల్లో పాల్గొన్నవారు, పార్టీ పట్ల విధేయత కలిగినవాళ్ళు అన్నీ చెప్పరు, కొన్నే చెబుతారు. మొత్తానికి వాస్తవం ఏమిటనేది తెలియకుండా పోతుంది. అటువంటి సందర్భాలలో ఆయా ఉద్యమాల విజయాలు, లేదా వైఫల్యాల నుండి నేర్చుకోగల అవకాశాలు కుదించుకుపోతాయి. ఇందుకు భిన్నంగా గీతా, ఆమె సన్నిహితులు చేపట్టిన ఉద్యమం స్థల, కాలాలపరంగా పరిమితమైనది, స్థానికమైనది. ఆద్యంతాలు, పరిణామాలు, ఫలితాలు పారదర్శకమైనవి. అందుచేత అటువంటి స్థానిక
ఉద్యమాలు అందచేసిన క్షేత్రస్థాయి అనుభవాలకు అన్ని కోణాల నుండి అధ్యయనం చేయడం సుసాధ్యం.
అందుచేత ఈ పుస్తకంలో సింహభాగంగా నిలిచిన ఇబ్రహీంపట్నం పోరాటానుభవం అటు సామాజిక కార్యకర్తలకూ, రాజకీయ పార్టీలకూ, మార్పుని కోరుకునే వామపక్షాలకూ, ఇటు పాలనా వ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ ఉపయోగపడుతూ అనేక గుణపాఠాలను అందించగల ఒక బృహత్తర పాఠ్యాంశమవుతుంది, సమగ్రమైన కేస్‌ స్టడీగా నిలిచిపోతుంది.
రాబోయే కాలాల్లో స్థానిక ఉద్యమాలు, పోరాటాల ప్రాముఖ్యత పెరుగుతుందని దేశంలో నెలకొంటున్న వివిధ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ కారణాల వల్ల గీతా రామస్వామి ఈ పుస్తకంలో నిజాయితీగా నమోదు చేసిన జ్జాపకాలు, చర్చకు పెట్టిన అంశాలు నేటి తరానికీ, రాబోయే కాలపు
ఉద్యమాలకు ఉపయుక్తంగా ఉండగలవు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.