పండుగ కథ
అది పండుగ నెల. మా అమ్మ ఇంటి పనులు చేయడానికి సిద్ధపడుతోంది. అప్పుడు నేను వెళ్లి, ‘‘అమ్మా ఎందుకు ఇంటి పనులు చేస్తున్నావు’’ అని అడిగాను.
‘‘ఇప్పుడు పండుగ నెల కదా అందుకే ఈ పనులు చేస్తున్నాను’’ అని అమ్మ చెప్పింది.
‘‘అవును కదా. అమ్మ నేను కూడా నీకు ఈ పనుల్లో సహాయం చేయనా,’’ అని అడిగాను.
కానీ అమ్మ, ‘‘వద్దు. ఈ రోజు నువ్వు బడికి వెళ్లు,’’ అని చెప్పింది.
‘‘సరే అమ్మ,’’ అని చెప్పాను.
‘‘బడి నుండి త్వరగా వచ్చేయ్,’’ అంది అమ్మ.
నేను బడికి వచ్చేశాను. చీకటి పడిరది. మా నాన్నగారు వచ్చారు. భోజనాలు చేసి పడుకున్నాం. తెల్లవారింది. అప్పుడు అమ్మ, ‘‘ఒరేయ్, లేవండి… లేవండి. తెల్లవారింది. భోగి స్నానం చెయ్యాలి. లేవండిరా,’’ అంది.
‘‘ఓ భోగి పండుగ కదా. సరే అమ్మ లేస్తాం,’’ అని చెప్పాము.
అప్పుడు నాన్న, ‘‘ఒరే, మీకు కొత్త బట్టల తెచ్చాను. వేసుకోండి,’’ అని చెప్పాడు.
మేము, ‘‘కృతజ్ఞతలు నాన్న,’’ అని చెప్పాము.
మేము కొత్త బట్టలు వేసుకుని మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాం. అక్కడికి మా అత్త వాళ్ళు వచ్చారు.
మా అత్త, ‘‘ఎలా ఉన్నారు,’’’ అని అడిగింది.
‘‘మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు’’ అని అడిగాం.
తరువాత మా అత్త వాళ్ల పిల్లలతో కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరుని చూడటానికి వెళ్లాం. మా అత్త వాళ్ల అమ్మాయి గీత.
‘‘ఊరు చూడడానికి వెళదాం పద,’’ అంది గీత.
‘‘సరే, పద,’’ అన్నాను.
మేము ఊరు చూశాము. గీత, ‘‘ఊరు ఎంత బాగుంది,’’ అంది.
‘‘అవును చాలా బాగుంది,’’ అన్నాను. తరువాత మధ్యాహ్నం అయింది.
మేము కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్లాం. మేము భోజనానికి కూర్చున్నాం. ‘‘అమ్మ వడ్డించు, ఆకలిగా ఉంది,’’ అన్నాం. అమ్మ ‘‘ఆగండిరా వస్తున్నా,’’ అంది.
మేము భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. అలా మా పండుగ ఆనందంగా జరిగింది. మేము ఎంత ఆనందంగా గడిపామంటే ఆకాశంలో ఎండా, వాన వచ్చినప్పుడు వచ్చే ఇంద్రధనస్సు అంత ఆనందంగా గడిపాం.
` కొల్లు సాయిదుర్గ, 9వ తరగతి.