స్వాగతం
స్వాగతం నూతన సంవత్సరానికి,
వీడ్కోలు పాత సంవత్సరానికి
నూతనం సంవత్సరం వచ్చింది
ఆనందాలు తెచ్చింది
దీపాలను వెలిగించింది
హోరు అందరిలో తెచ్చింది
కొత్త ఆలోచన తెచ్చింది
గతాన్ని మరవమంది,
మంచిని నేర్చుకోమంది,
తప్పు ఒప్పులు సరిదిద్దుకోమంది,
మంచి పనులు చేస్తూ బతకమంది
` వి. గోకుల్ శ్రీ హర్ష, 8వ తరగతి
కొత్త సంవత్సరం
స్వాగతం నూతన సంవత్సరానికి
పలుకుదాం, పలుకుదాం.
నూతన సంవత్సరానికి స్వాగతం,
మరుద్దాం, మరుద్దాం, చెడు జ్ఞాపకాల గతం,
నూతన సంవత్సర శుభాకాంక్షలంటు బంధువుల పలకరింపులు,
దీపాలతో ఇంటినిండా కాంతులు,
గుర్తు చేసుకుందాం మరవలేని మధుర జ్ఞాపకాలు.
నూతన సంవత్సరంతో మంచి పనులకు చుడదాం శ్రీకారం, ప్రేమ, అభిమానాలతో వెలిగిపోవాలి మమకారం.
నూతన సంవత్సరంగా నడిపిద్దాం మన దేశాన్ని అభివృద్ధి మార్గాన
మనము నడుద్దాం సర్వవృద్ధి మార్గాన
` జి. తేజ్ ప్రమోద్, 8వ తరగతి
వచ్చింది నూతన సంవత్సరం
నూతన సంవత్సరం వచ్చింది,
కొత్త ఆనందాన్ని తెచ్చింది,
ఇంటి ముందు రంగవల్లులు,
ఇదే నూతన సంవత్సర శుభాకాంక్షలు,
ఇంటి నిండా వెలుగులు,
గతం మర్చిపోయే సంఘటనలు,
కొత్త ఆలోచనలు యొక్క అనుభవాలు,
మరిచపోని జ్ఞాపకాలు,
కొత్తగా చూసే మార్పులు,
మంచి విషయాలు తెలిపే రోజులు,
విముక్తి చెందుదాం చెడు పనుల నుండి
`సిహెచ్ త్రిశాంతి, 8వ తరగతి
ఆహ్వానిద్దాం నూతన సంవత్సరం
వచ్చింది, వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది, తెచ్చింది అందరికి ఆనందం
గతంలోని అనుభవాలు తెచ్చింది ఎన్నో జ్ఞాపకాలు,
స్నేహితులకి బహుమానాలు
సమస్యలకి ఎన్నో కొత్త పరిష్కారాలు,
ఆహ్వానిద్ధాం గత సంవత్సరాన్ని
విడ్కోలు పలుకుద్దాం గత సంవత్సరాన్ని,
కళ్ళలో కాంతులు, హృదయంలో హరివిల్లులు,
బంధువులతో పలకరింపులు, తెచ్చింది ఎన్నో అనందాలు
ఎన్నో అనుభూతులుతో మెదిలే జ్ఞాపకాలు,
ఎన్నో కలలో విరిసే ఆలోచనలు,
కోటి కాంతులతో ఆహ్వానిద్దాం కొత్త సంవత్సరాన్ని
`కె గీతిక, 8వ తరగతి