‘‘వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో
తెల్పుడీ, పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు…’’`కవిరాజు… త్రిపురనేని
రామస్వామి (15 జనవరిన జయంతి`16న వర్ధంతి)
ఆ పసిడి పలుకులకి…
దేశం… ఒక్క ఉదుటున ఉలిక్కిపడిరది…
(కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు)/
విశ్వానికే మకుటాయమానం… మీదు మిక్కిలి
ఆచంద్రార్కం…
సాహితీవనంలో సౌగంథికం…/
అవును… వర్తమాన భారతావనిలో
దొరకనిదీ…పుష్పం.
కాదు… కానేకాదు… ఆ… నికార్సయిన శూరత్వం…/
ఆనాటి అల్లూరి, ఉయ్యాలవాడ, కొమరం
భీమ్, భగత్‌సింగ్, నేతాజీ, ఆంధ్రకేసరి,
గాంధీ, పటేల్, అంబేద్కర్… ఒక్కరంటే ఒక్కరు…
ఏరీ… ఎక్కడ..???//
ఉన్నా… ఉన్నా… అవును… మన మధ్యనే ఉన్నా…
మనసా… వాచా… కర్మణా…
దేశం కోసమే… జీవితం… అర్పణ చేస్తున్న/
మన ప్రధాని మోడీకి చేయూత
నిచ్చేవారెంతమంది…?/
ప్రతిదానికీ… పార్టీలు… పాలిటిక్సేనా…
ఈ రాజకీయ కీచక… ఎత్తుల జిత్తుల… మంత్రతంత్ర
కుతంత్ర విన్యాసాలకు…/
ఈ దేశం… మన…
భారతదేశం… ఈ నాకం
రాణీ రుద్రమ్మ నాటి… వీరాధివీరులున్న ఈ
విశ్వంభర…/
రాయలు నాటి సువర్ణ యుగం…
ఛత్రపతి శౌర్యం… లక్ష్మీబాయి
వీరత్వం… ఎక్కడ… ఎక్కడ??/
ఎందెందు వెతికి… చూసిన… విజయ మాల్యాలు…
నయీంలు కిసాన్‌ల కడుపులు కొట్టి ఖేత్
(పంట పొలాలు)`
అపహరించే దొంగబాబాలు కోకొల్లలు/…
నీచ నికృష్ట ప్రిమిటివ్…
అసూయాజీవులే…/ ‘‘వీరులు లేని భూమి
దుఃఖంలో ఉంటుంది…/
వీరుల కోసం’’ పడిగాపులు
‘‘గాస్తున్న భూమి మరింత దుఃఖంలో ఉంటుంది…’’
` బెర్టోల్ట్ బ్రెచ్డ్ (………………………..)
ఎవరెవరు… ఎన్నెని విజ్ఞాన
జ్యోతులు… వెలిగించినా…/
చెవైనా కోసుకుంటాం… గాని ఛార్లెస్ డార్విన్
సూత్రం… ‘‘గట్టివాడే గెలుస్తాడు’’
మాత్రం చెవిలో… వేసుకోం…’’ అనే మౌడ్యులకు…/
తరతరాలుగా… జన్యు వైవిధ్యం కోల్పోయి…
అవశేషాలుగా మిగిలిపోయిన…
జనం… జనం… జనం…
ఈ… నాసిరకం జనాని…కి…/
కదలక మెదలక… కరెన్సీ నోట్ల… మార్పిడితో…/
కోడిపుంజు పందాల మైకంలో… తేలుతూ…
ఊగుతూ ఉన్న… తరుణంలో…/
కోడి రామ్మూర్తిని… మరిపించే కుస్తీ పోటీలు,
కర్రసాములు… కబడ్డీ… కబడ్డీలు…
శూరత్వాన్ని వెలికితీసే… నాథులేరి…?!…
ఓ…ఓ…ఓ… కవిరాజా…
నికార్సయిన సాహితీ యోధుడా… త్రిపురనేని…/
నీ మండే గుండెల ఆర్ద్రతను…
అర్థం చేసుకునే సత్తా…/
కులచట్రంలో కూరుకుపోయిన మా ఈ జనులకు లేదయ్యా…
రామస్వామి చౌదరీ…
క్షమించు… క్షమించు…
నీ పేరు తరువాత… ‘‘చౌదరి’’ని త్యజించి….న
అనవర్తిత సాహిత్య దీపధారీ…
ఇంకా… ఇంకా… అన్వేషణ… చేస్తూనే ఉన్నాం…
వీరగంధం… పూలదండలు… పట్టుకుని… వీరుడి
కోసం…/…
అందుకొనుము… ఈ గుప్పెడు
అక్షరకుసుమాలు… వినమ్రంగా.