కలల ప్రపంచం
కలల ప్రపంచం ఓ నా కలల ప్రపంచం
రంగు రంగులది నా ప్రపంచం
పచ్చని చెట్లన్నది నా ప్రపంచం
పెద్ద పెద్ద కొండలన్నది నా ప్రపంచం
అందమైన జలపాతాలు నా ప్రపంచం
అందమైన దృశ్యాలు కలిగిన నా ప్రపంచం
పచ్చపచ్చ పాడిపంటలు ఉన్న నా ప్రపంచం
రంగురంగుల పక్షులున్న నా ప్రపంచం
అందమైన సీతాకోకచిలుకలున్న నా ప్రపంచం
స్వచ్ఛమైనది నా ప్రపంచం
అందమైనది నా కలల ప్రపంచం
అద్భుతమైనది కలల ప్రపంచం
` సిహెచ్. గోపి గణేష్, 8వ తరగతి
నా కలలు` నా కోరికలు
అద్భుతమైన నా కలల ప్రపంచంలో పక్షిలా విహరించాలని ఉంది
పచ్చని చెట్లతో ప్రకృతిని ఆస్వాదించాలని ఉంది
సీతాకోకచిలుకల ఎన్నో రంగులను నాలో నింపాలని ఉంది
పువ్వులా ప్రపంచమంతా పరిమళాన్ని వెదజల్లాలని ఉంది
పచ్చని చెట్టునై ప్రపంచానికి ఊపిరిని అవ్వాలని ఉంది
నదినై ప్రపంచం అంతా ప్రవహించాలని ఉంది
సాహసం చేయాలని ఉంది
జాబిల్లినై ప్రపంచమంతా వెన్నెలతో నింపాలని ఉంది
సూర్యుడినై ప్రపంచమంతా వెలుగుని ఇవ్వాలని ఉంది
నెమలినై వానలో పింఛాలను విప్పి నాట్యం చేయాలని ఉంది
నక్షత్రాన్నై ఆకాశానికి అందం ఇవ్వాలని ఉంది
నా కలల ప్రపంచానికి నేనే అందం అవ్వాలి.
` సిహెచ్. కావ్యశ్రీ, 10వ తరగతి
నా కలల ప్రపంచం
నా కలల ప్రపంచం ఒక అద్భుత ఊహాగానం
ఒక రంగుల ఆనందాల రాట్నం
కొత్త ఆశలు చిగురించే అంతులేని వలయం
నా ఆలోచనలకు ప్రతిరూపం
నా జీవితానికి మూల కారణం
నా కోమలమైన మనసుకు ఆదర్శనం
నా కలల ప్రపంచంలో నాదే రాజ్యం
ఇది నా విశ్వం
ఇది నా భవిష్యత్తుకు బలమైన పునాది
ఇది కొత్త ఆశలకు వారధి
ఇది కొత్త కోరికల హరివిల్లు
ఇది మా మామలకు పుట్టినిల్లు
ఇది మానవ ప్రపంచానికి భిన్నమైనది
ఇది ఎవరూ అందుకోలేనిది
ఇది మానవుడికి ముఖ్యమైన పాత్ర
ఇది లేదంటే వారికి లేదు జీవితం
ఇక్కడ ఉంటుంది ఎంతో సౌకర్యం
ఇక్కడ మార్పులు చేర్పులు సర్వసాధారణం
ఇది మార్పు లేనిది ఎన్నటికీ విడవనిది
ఎప్పటికీ అదృశ్యం కానిది
ఓ కలల ప్రపంచం నువ్వు నాకు ఇచ్చావు
నువ్వు లేకుండా నీ జీవితం శూన్యం
ఎందుకంటే నాలో ఉన్న ఆశలకు ఆధారం నువ్వే
`పి.యుక్తిక, 9వ తరగతి