ఒక జర్నలిస్ట్ గా, మహిళలకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, భూమిక పత్రిక నాకు మొదటి వరుసలో కనిపించేది. భూమికలో ప్రచురితమయ్యే అనేక ఆర్టికల్స్ అనేక సందర్భాల్లో, నా వృత్తి జీవితంలో నాకు ఉపయోగపడుతూ ఉండేవి. అలా నాకు భూమికతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
ఒక మహిళా ప్రతికను 30 సంవత్సరాల పాటు, అప్రహితంగా కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చెప్పాలంటే, తెలుగులో ఇలా ఒక పత్రికను ఇంత సుధీర్ఘకాలం పాటు నిర్వహించడం, చరిత్రలో నిలిచి పోయే చారిత్రక ఘట్టమే. మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలను, మహిళలకున్న అన్ని హక్కులను, మహిళలు చేస్తున్న అన్ని రకాల పోరాటాలను పత్రికలో పతాక శీర్షికలో ప్రచురించడానికి, పత్రిక సంపాదక వర్గానికున్న నిబద్ధతే కారణం.
మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న మతోన్మాదం, రాబోయే రోజుల్లో మహిళలను మరింత సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ స్థితిలో భూమిక లాంటి పత్రికలు మరింత గట్టిగా నిలబడాల్సిన అవసరముంది. మహిళల గొంతుకగా నినదించాల్సిన అవసరం పెరిగింది.
ఈ ప్రయాణం ఇలాగే సాగాలని, మరిన్ని దశాబ్దాల పాటు పత్రిక ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
ఈ సందర్భంగా పత్రిక నిర్వహణలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు. తెలియచేస్తూ..
– పద్మ వంగపలి