భూమిక తో నా ప్రయాణం 1990 ల మధ్యలో ప్రారంభమయింది. విద్యార్ధినిగా అన్వేషి లైబ్రరీకి వస్తున్న క్రమంలో భూమిక ని చదవటం ప్రారంభించాను. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే పరిచయమయిన స్త్రీవాద ఆలోచనా రీతులను తెలుగులో చదవటం కొత్తగా, ఉద్వేగ భరితంగా ఉండేది. భార్గవి ధావర్ స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి, కె. లలిత ఇంటి పని గురించి, మాధవి అసంఘటిత స్త్రీల సమస్యల గురించి రాసినవి నాకు ఇప్పటికీ లీలగా గుర్తున్నాయి. నా డాక్టరల్ పరిశోధన నుండి నేను రాసిన వ్యాసం భూమికలో రావటం నాకు సంతోషం కలిగించిన విషయం.
భూమిక నాకు అర్ధమయినంత వరకూ తెలుగులో స్త్రీవాద ఆలోచనకు ఒక మంచి వేదికగా ఉంటూ వచ్చింది. అవి పరిశోధన నుండి వచ్చినవి కావచ్చు, రచనా వ్యాసంగం నుండి వచ్చినవి కావచ్చు, సామాజిక ఉద్యమ నేపధ్యం నుండి వచ్చినవి కావచ్చు. ఈ రకమైన వైవిధ్యం ఇతర పత్రికల్లో, స్త్రీవాద పత్రికలూ అయినా, కాకపోయినా, తక్కువగా కన్పిస్తుంది. ఈ రకమైన విషయ వైవిధ్యాన్ని నిలుపుకుంటూ పత్రికని నడిపించటం చాలా కష్టమైన విషయం. రచనల్లోని కాక, రచనలు చేసే వారిలో వైవిధ్యాన్ని కూడా ఆహ్వానించటం కూడా భూమికలో కనిపిస్తుంది. జూపాక సుభద్ర కాలం, కొంత కాలం క్రితం నుండి మొహమ్మద్ భాషా గారు వలస పాలనా కాలంలో స్త్రీల పత్రికల గురించి రాస్తున్న కాలం దీనికి మంచి ఉదాహరణలు. రచనా వ్యాసంగంలో వున్న వారికి బలమైన ఊతమిచ్చిన భూమిక స్త్రీవాద రాజకీయాల చర్చలని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పటికీ వుంది. దేశ రాజకీయాల లాగే, స్త్రీవాద రాజకీయాలు కూడా మరింత సంక్లిష్టం గా మారిన ఈ చారిత్రిక సందర్భంలో భూమిక మరిన్ని రకాల స్త్రీవాద రచనల్ని, సమకాలీన స్త్రీల సమస్యల గురించిన విశ్లేషణని, అలాగే పరిశోధనని అందించాలని నా కోరిక.
మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భూమిక టీవ్‌ు అందరికీ శుభాకాంక్షలతో…
` సునీత ఏ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags