భూమికతో పరిచయం చాలా ఆలస్యంగా అయింది. కానీ చాలా గట్టి బంధం ఏర్పడిరది. వంటా వార్పు, పంచాంగాలు, బట్టలు, నగలు, హాస్యం పేరుతో వెకిలితనం వంటి వాటికి పరిమితమైన
పత్రికలకన్నా చాలా భిన్నమైనది. ఈ మధ్య పత్రికల్లో వివిధ అంశాలు వస్తున్నప్పటికీ అవేవీ సాధారణ మహిళలు రిలేట్ చేసుకునేవి కావు. పెద్దగా ఉపయోగపడేవి కావు. భూమిక అందుకు భిన్నంగా అన్ని వర్గాల మహిళలకు అర్థమయ్యే అంశాలు ఎంచుకుని వారి జీవితాల్లో ఉండే వివిధ కోణాలను వెలికి తీస్తుంది. కొత్త దృక్కోణాలు ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా క్వీర్ సమూహాల కోసం ఒక పేజీ కేటాయించడం ద్వారా నిజమైన స్త్రీవాద పత్రికగా నిలబడిరది. అలాగే క్వీర్ వాదం కూడా స్త్రీవాదంలో భాగమేనని తెలియజేస్తుంది.
మొదట్లో ఫెమినిజం అంటే హక్కుల పోరాటం మాత్రమే అనే ఆలోచనల నుండి మొదలై హక్కులతో పాటు ఇంకా ఎన్నో విషయాల కలయిక అని తెలుసుకునే వరకు వచ్చింది భూమికతో నా ప్రయాణం.
పాత సంచికలు అన్నీ చదవలేదు గానీ ముందు చదివిన వాటిలో షశీఅ్‌వఎజూశీతీaతీవ ్‌తీవఅసం లేకపోవడం తెలుస్తుంది. ఇప్పటి తరం వాళ్ళ రాతలని చేర్చడంతో ఆ మార్పు కూడా మొదలైంది. భూమికతో నా ప్రయాణం ఇలానే కొనసాగుతుందని, దాంతోపాటే వ్యక్తిగా నా ప్రయాణం కూడా ముందుకి వెళ్తుందని ఆశ.
` దీప్తి