భూమిక మొదటి సంచిక నుంచీ పాఠకురాలిని. అలంకారాలు లేని అచ్చమైన పత్రిక. ఒకప్పుడు దినపత్రికలలో స్త్రీల పేజీలుండేవి. సీరియస్ విషయాలు చర్చించేవి. ఇష్టంగా ఉండేవి. తరువాత అవి ముగ్గులకి, వంటలకి, ఫ్యాషన్లకి మారిపోయాయి. ఆ అగాధాన్ని భూమిక పూడ్చింది.
అలాంటి పత్రికలు పూడ్చాయి. భూమిక రచయిత్రులను కలిపింది. ముఖ్యంగా భూమిక ఆధ్వర్యంలో జరిగిన ప్రయాణాలు, స్నేహగంధాలు, వాకప్రయాణం ఒక తెలివిడి. ఇన్నాళ్ళూ నడిచిన భూమిక స్త్రీలమధ్య సహోదరిత్వం బలపడడానికి దారిదీపంగా నిలిచి వెలగాలని కోరుకుంటున్నాను. భూమిక నాకు చాలా స్నేహితురాళ్ళని ఇచ్చింది. నా పేరు గల ఒక మంచి స్నేహితురాలిని సహితం.
` పి. సత్యవతి