నేనూ`భూమిక… ఒక మంకెనపువ్వు కథ
పుస్తక పరిచయాల నుంచి 25వ గంట వరకూ…
భూమిక పత్రిక 1993 నుంచీ వస్తున్నా, నేను మొదట చదివింది 2008లో. మహిళలకు సంబంధించి ఒక అంశం మీద నోట్ తయారు చేయడానికి వెతుకుతున్నప్పుడు,
మొదటిసారిగా ‘‘భూమిక స్త్రీవాద పత్రిక’’ని చూశాను. అప్పటికే నేను ఎల్‌ఐసిలో విమెన్ కన్వీనర్‌గా పనిచేస్తున్నా. కానీ పనిచేయడానికి, చేస్తున్న పనిని ఒక దృక్పథంతో చేయడానికి ఉండే తేడా అప్పుడే తెలిసింది నాకు. అందుకే ఫోకస్ పరంగా నన్ను భూమికకి ముందూ`తర్వాతగా, వ్యక్తిగతంగా కొండవీటి సత్యవతిగారితో పరిచయానికి ముందూ`తర్వాతగా చెప్పుకుంటాను. భూమిక ముప్ఫై యేళ్ళ ప్రస్థానం వెనక సత్యవతి అమ్మ బలీయమైన ఆశ, విశ్వాసం ఉన్నాయి. అదొక్కటే కాదు. భూమిక ఆచరించే ంఱర్‌వతీష్ట్రశీశీస పత్రికలో కొత్త గొంతుకలకి అవకాశం ఇవ్వడం, అందరినీ కలుపుకుని పోవడం.
2014లో పుస్తక పరిచయాలతో భూమికలో స్థానం సంపాదించి, ఆ తర్వాత మంకెనపువ్వు పేరుతో ఒక శీర్షిక రాయగలిగాను. ఆ తర్వాత కథలు రాయడం మొదలుపెట్టి, ఒక సంకలనం తీసుకు రాగలిగాను. ఇవన్నీ నిజానికి నేను చేయగలిగి చేసినవి కాదు. ‘‘నువ్వు చేయగలవు’’ అని బలంగా అమ్మ ఇచ్చిన థెరపీ. వ్యక్తిగతంగా, ఆఫీసులోనూ అనేక ఒత్తిడిలు ఎదురయినప్పుడు, రాయడమే రిలీఫ్ అని నన్ను అటువైపు నడిపింది తనే. అందుకే నా వరకూ సత్యవతి అమ్మనీ, భూమికనీ, నన్నూ నా అక్షరాలనీ విడివిడిగా చూడలేదు. ఈ కారణంతోనే ‘‘ముప్ఫై యేళ్ళ భూమిక’’ గురించి ఏమన్నా రాయాలి అనుకున్నప్పుడు దీన్నొక వ్యాసంగా రాయడానికి చాలా కష్టంగా ఉంది.
భూమిక చదవడం మొదలుపెట్టాక, అందులో పి.సత్యవతి గారి స్త్రీవాద రచయిత్రుల పరిచయాలు చదివాక, నాలో ఎంతో బలమైన మార్పు వచ్చింది. అప్పట్లో సత్యవతిగారు రాసిన వ్యాసాలన్నీ ఒకచోట పెట్టుకుని ఆ పుస్తకాలు వెతికి కొనుక్కునేదాన్ని.
అన్ని రంగాల్లో నిరాఘాటంగా చెలామణి అవుతున్న పురుషుల అధికార స్వభావాన్ని ప్రశ్నిస్తూ, దాన్ని మార్చే దిశగా స్త్రీలని, పురుషులనీ కూడా చైతన్యవంతులని చేసి ఒక మంచి సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే అంతిమంగా భూమిక ఆశయం.
ఈ ముప్ఫై యేళ్ళ ప్రస్థానంలో భూమిక ఖచ్చితంగా స్త్రీల సమస్యలకి సంబంధించి ఒక aషaతీవఅవంం ని పాఠకుల్లోనూ, సాహిత్య వర్గాల్లోనూ, అంతిమంగా సమాజ ధోరణుల్లోనూ బలంగానే కలుగచేసింది. ఇలా స్త్రీలను అణిచివేసే అన్ని అంశాల పట్లా చర్చలూ, ప్రతిఘటనలూ, పోరాటాలూ జరగడం వల్ల స్త్రీల సమస్యలన్నీ చాలా త్వరలో, లేక అదాట్టుగా మాయమైపోతాయన్న భ్రమలేవీ మనలో లేవు. హింస అనేక రూపాల్లో, రూపాలకి అతీతంగా అమీబాలా వ్యాపిస్తోంది. కాబట్టి… భూమిక అవసరం రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పరమ కల్లోలంగా ఉన్న కుటుంబ వ్యవస్థ, ఉద్యోగం చేస్తున్న మహిళల పరిస్థితి, వీటి రూపురేఖలు మారనిదే ఆడవాళ్ళకి హింస నుంచి, నిజంగా విముక్తి సాధ్యం కాదన్న ముందుచూపు భూమికకి ఎప్పుడూ ఉంది. అందుకే ఒక aశ్ర్‌ీవతీఅa్‌ఱఙవ షబశ్ర్‌ీబతీవ కోసం, ఒక aశ్ర్‌ీవతీఅa్‌ఱఙవ ంవర్‌వఎ కోసం ఇంకా పెద్దఎత్తున ఉద్యమం రావాల్సిన అవసరం కొండవీటి సత్యవతి ఎప్పుడో గుర్తించారు. అందుకే భూమిక సాహిత్యంలో ఈ సంఘర్షణ ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. భూమిక అక్షరాల్లో ఇదే పదును ఎప్పటికీ కొనసాగాలనీ, స్త్రీల అనుభవాలకీ, ఆలోచనలకీ స్పష్టమైన అద్దంలా భూమిక ఉండాలనీ కోరిక. ఇంకో బలమైన కోరిక ఏంటంటే మనమందరం అప్పుడప్పుడూ కలిసే వేదిక ఏదైనా ఉండాలని, స్నేహం ఎలాంటి గాయాలనైనా తట్టుకునే శక్తి ఇస్తుంది. మనకోసం ఒకరు ఉన్నారనే భావన ఇచ్చే బలం మాటల్లో చెప్పలేం. అందరికీ శుభాకాంక్షలతో
షషష ` ఉమా నూతక్కి