మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో
సంతోషంగా అనిపిస్తుంది. మా ఊరిలో అనేక వృత్తులవారు నివసిస్తూ ఉంటారు. మా చుట్టుపక్కల వారు అందరూ కలిసిమెలిసి ప్రేమానురాగాలతో నివసిస్తూ ఉంటారు. మా ఊరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వాటికి చాలా ప్రసిద్ధి ఉంది.
మా ఊర్లో కోడి కూయగానే మగవాళ్ళందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఆడవాళ్ళు లేవగానే తలంటు స్నానం చేసి, పూజలు చేస్తారు. వంట చేసి క్యారేజీ తయారుచేసి పిల్లల్ని బడికి పంపిస్తారు. పనులు పూర్తయ్యాక ఆడవాళ్ళందరూ ఒక చోటుకు చేరి ముచ్చట్లు చెబుతూ సమయాన్ని గడిపేస్తారు. సాయంత్రం టీ తాగిన తర్వాత మళ్ళీ కబుర్లు చెప్పుకుంటారు. రాత్రి అవ్వగానే ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మగవాళ్ళు చెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చి కుటుంబంతో అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగినవన్నీ చెప్పుకుని ఆనందంగా నవ్వుతూ నిద్రిస్తారు. ఆ నవ్వులకు నక్షత్రాలు మెరుపులు కురిపిస్తాయి.
`