సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ ఒక్కర్తే వారింట్లో సంపాదించేది. ఆమె సంపాదనపై ఇంట్లోని ఎనిమిది మంది ఆధారపడి ఉన్నారు. లతా మంగేష్కర్‌కు ‘పాట’ ఒక్కటే జీవనాధారం. పాటలు పాడగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడవాలి. అందుకని డబ్బులను ఎంతో పొదుపుగా వాడాల్సి వచ్చేది.

సినిమా వాళ్ళు పాట పాడినందుకు డబ్బులివ్వగానే ఇంటికి వెళ్తూ దారిలో కూరగాయలు, ఇతర వస్తువులు కొనేది లత. ఆ కాలంలో చీరలు రేషన్‌ షాపుల్లో ఇచ్చేవారు. ఒక్కో చీర రూ.12. అలా అవసరం కొద్దీ కట్టిన తెల్ల చీరలు లతా మంగేష్కర్‌కు గుర్తింపు దుస్తులుగా మారాయి. రికార్డింగ్‌ అయ్యాక రాత్రి ఇంటికి వచ్చి వాటిని ఉతుక్కుని, ఎండబెట్టి, ఎండిన తర్వాత తల క్రింద మడిచి పెట్టుకుని పడుకునేది లత. ఇస్త్రీ చేసిన భావన కలిగించేందుకు అలా చేసేది. అలాంటి దుస్తులు వేసుకుని రికార్డింగ్‌కి వచ్చే వ్యక్తి ఎంత గొప్ప స్వరం కలిగినదైనా గుర్తింపు రానంత వరకూ అవమానాలు, హేళనలు భరించటం తప్పనిసరి. అయితే, అలాంటి స్థితిలో కూడా లత ఎలాంటి అవమానాన్ని, అవహేళనను సహించేది కాదు. కెరీర్‌ ఆరంభంలోనే తన ప్రవర్తన ద్వారా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. అందరితో స్నేహంగా ఉంటుంది తప్ప సాన్నిహిత్యాన్ని సహించదు, తన చుట్టూ పరిధి గీసుకుని ఎవరినీ దాన్ని దాటి రానివ్వదు అనే విషయం సినీ ప్రపంచంలో స్పష్టమయ్యేట్టు చేసింది. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సాధించింది. అయితే, ఆరంభంలో లత పాడిన పాటలు వింటే భవిష్యత్తులో లత ఇంత గొప్ప గాయనిగా ఎదుగుతుందన్న ఆలోచన రావటం కష్టం.
1945లో ‘బడీ మా’ సినిమాలోని పాటల్లో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. 1945లోని ‘చిడియా బోలే చున్‌ చున్‌’ పాట బాణీ ఆకర్షణీయంగా ఉంటుంది కానీ స్వరం లతా మంగేష్కర్‌ది అని గుర్తుపట్టటం కష్టం. ఆ కాలంలో వినిపిస్తున్న అనేక సాధారణ స్వరాలలో ఒక స్వరంలో ఎలాంటి ప్రత్యేకత లేనిదిలా అనిపిస్తుంది. 1947లో వచ్చిన ‘షహనాయి’ సినిమాలోని ‘జవానీ కీ రేల్‌ చలీ జాయెరే’ పాట సి.రామచంద్ర, గీతారాయ్‌, రాజ్‌ కుమారి, లతలు కలిసి పాడారు. ఈ సినిమాలో నాయికకు గీతారాయ్‌ పాడుతుంది. మరో పాత్రకు రాజ్‌ కుమారి పాడుతుంది. ఎవరో కూడా తెలియని నటికి లత పాడుతుంది. అనేకులు లత స్వరాన్ని గుర్తించలేక ఈ పాటలో లత పాడలేదని అనుకుంటారు. అలా అస్సలు గుర్తించే వీలు లేకుండా ఉంటుంది లత స్వరం ఈ పాటలో. అందుకు ప్రధాన కారణం లత తనలాగా స్వాభావికంగా పాడకుండా, అప్పటి పేరు పొందిన ఇతర గాయనిలను అనుసరిస్తూ గాంభీర్యంగా, గట్టిగా పాడాలని ప్రయత్నించటం. అప్పటి గాయనిల్లా పదాలను బలంగా పలకాలని ప్రయత్నించటంతో మనకు అలవాటయిన లత ఈ పాటల్లో కనబడదు.
లతా మంగేష్కర్‌కు చక్కటి గుర్తింపు తెచ్చిన ‘అనోఖా ప్యార్‌’లోని పాటల్లో కూడా ఆమె నూర్జహాన్‌, శంషాద్‌ బేగంలా పాడాలని ప్రయత్నించటం తెలుస్తుంది. ముఖ్యంగా ‘జీవన్‌ సప్నా టూట్‌ గయా’ పాట వింటే నూర్జహాన్‌ను అనుకరిస్తూ తాను పదాలను పలికే విధానాన్ని, రాగాలు తీసే విధానాన్ని లత ఎంతగా మార్చుకుందో అర్థమవుతుంది. అలాగే ‘యాద్‌ రఖ్నా చాంద్‌ తారో’ పాటలో కూడా అప్పటి గాయనిల్లా గొంతు వీలైనంత బలంగా అనిపించేట్టు పాడాలని ప్రయత్నించటం తెలుస్తుంది. స్వభావ సిద్ధమైన స్వరాన్ని ఇతరుల స్వరాల్లాగా పలికేట్టు చేయాలన్న లత ప్రయత్నాలు కొద్దిగా సఫలమైనా, ఆమె స్వరంలోని మాధుర్యాన్ని కప్పిపుచ్చాయి. ఆమె స్వరం బలహీనంగా ఉందని తిరస్కరించటం, విమర్శించటం ప్రభావం వల్ల అందరూ కోరుతున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి స్వరాలను అనుకరించి ఆమోదం పొందాలన్న ప్రయత్నాలు లత, ‘లత’లా ఎదగటాన్ని ఆలస్యం చేశాయి. ‘మోరి నావ్‌ చలే ధీరే’ పాటది చక్కటి బాణి. ఓ… అంటూ ఆలాపన తీయటం నుంచి లత తన గొంతు మార్చాలని ప్రయత్నించటం తెలుస్తుంది. ‘జాయే’ అని దీర్ఘం తీసినప్పుడు, ‘బతాయె’ అంటున్నప్పుడు లతలా అనిపించదు. ఇదే పాటను లతా మంగేష్కర్‌ ఆత్మవిశ్వాసం సాధించిన తర్వాత పాడి ఉంటే ఇలా ఉండేది కాదు. ఒక మరపురాని పాటలా ఎదిగి ఉండేది.
దేశవిభజన పరిస్థితిని మార్చింది. నూతన నాయికలు రంగప్రవేశం చేయటంతో బలహీనంగా అనిపించే లత స్వరం మెరుపు తీగలాంటి స్వరంలా అనిపించసాగింది. సంగీత దర్శకులకు లత పాటలను త్వరగా నేర్చుకోగలగటం, వారు కోరినట్టు భావాలను పలికించగలగటం నచ్చింది. అంతేకాక, లత సమయాన్ని పాటించటం, ఎలాంటి గొప్పలకు పోకపోవటం, ఎన్నిసార్లంటే అన్నిసార్లు రిహార్సల్స్‌ చేయటం కూడా వారికి నచ్చింది. సంగీత దర్శకులకు లత నిజాయితీ, చిత్తశుద్ది మరింతగా నచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుల సూచనలను అనుసరిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించాలని ప్రయత్నించటం వారిని మెప్పించింది. లతకు శాస్త్రీయ సంగీతం తెలియటంతో ఎలాంటి బాణీలయినా సులువుగా గ్రహించి పాడటమే కాదు, శాస్త్రీయ సంగీతపుటలంకారాలు లలిత సంగీతంలో వేసి పాట ప్రభావాన్ని ఇనుమడిరపచేయటం మరీ నచ్చింది. ఇది సంగీత దర్శకులకు సృజనాత్మక స్వేచ్ఛనిచ్చింది. బాణీలలో ప్రయోగాలు చేసే ధైర్యాన్నిచ్చింది. అందుకే ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌, అనిల్‌ బిశ్వాస్‌, హన్స్‌రాజ్‌ బహల్‌, బులో సి రాణి, హుస్న్‌లాల్‌ భగత్‌ రామ్‌ వంటి వారు లతకు ప్రత్యేక శ్రద్ధతో పాటలు నేర్పేవారు. తల కూడా శ్రద్ధగా వారు నేర్పింది నేర్చుకుంటూ సాధన చేస్తూ, సంగీతం తప్ప మరో విషయాన్ని పట్టించుకోకుండా ఉండటంతో ఆమె వారి అభిమానాన్ని చూరగొంది. పైగా మధుబాల, నర్గీస్‌, గీతాబాలి వంటి యువతులు సినిమాల్లో అడుగు పెట్టటంతో వారి రూపానికి తగ్గట్టు సన్నగా, నాజూకుగా, ఒక రకమైన ఙబశ్రీఅవతీaపఱశ్రీఱ్‌వ ని ప్రదర్శిస్తున్న సన్నటి తీగలాంటి స్వరం అవసరమయింది. దాంతో అంతవరకూ బలహీనంగా ఉందని కొట్టివేసిన లత స్వరం మెరుపుతీగ అయి కొత్త వెలుగులతో దర్శనమిచ్చింది. అందుకే 1948 నుండి లత పాటలు పాడే విధానం మారిపోయింది. ఇతరుల అనుకరణ మాని తన ప్రత్యేక పద్ధతిలో పాటలు పాడటం ఆరంభమయింది.
లత సినీ జీవితంలో 1949వ సంవత్సరం అత్యంత ప్రత్యేకమైనది. ఈ సంవత్సరంలో అడుగుపెట్టే ముందు, 1949 కన్నా ముందు లత యొక్క కొన్ని అనుభవాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1946 నుండి 1949 వరకూ లత ఎదుర్కొన్న అనుభవాలు, తర్వాత ఆమె ఆలోచనా రీతిపై, ప్రవర్తనపై ప్రభావం చూపించాయి. ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. లత అగ్రశ్రేణి గాయనిగా ఎదిగిన తర్వాత ఆమె ప్రవర్తన అర్థం కావాలంటే ఆమెపై ఉన్న అపోహలు తొలగాలంటే ఈ ఎదుగుతున్న కాలంలో లత అనుభవాలను తెలసుకొని విశ్లేషించాల్సి ఉంటుంది.
‘అనిల్‌ బిశ్వాస్‌’ ఆ సమయంలో మీనా కపూర్‌తో సన్నిహితంగా ఉండేవాడు. ఒక సినిమాలో ఆమెతో పాటలు పాడిరచాలనుకున్నాడు. కానీ పాటల రికార్డింగ్‌ సమయంలో ఏవో కారణాల వల్ల మీనా కపూర్‌ రాలేకపోయింది. అందుకని లతా మంగేష్కర్‌కు శిక్షణనిచ్చి, ఆమెతో పాడిరచి, రికార్డు చేశాడు. ఆ తర్వాత ఆ పాటలను మీనాకపూర్‌కు వీలు కుదిరినప్పుడు మళ్ళీ ఆమె స్వరంలో రికార్డు చేశాడు. ఆ సమయంలో ఒక పాటను రెండుసార్లు రికార్డు చేసేవారు. ఒకసారి సినిమా కోసం, రెండోసారి రికార్డు కంపెనీల కోసం. లత పాటలను రికార్డు కంపెనీలకిచ్చి, మీనాకపూర్‌ పాటలను సినిమాలో వాడాడు అనిల్‌ బిశ్వాస్‌.
తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత రెండుసార్లు రికార్డు చేసే పద్ధతి ఆగిపోయింది. కానీ తాము అనుకున్న ప్రధాన గాయని అందుబాటులో లేకపోతే, షూటింగ్‌ ఆగకూడదని, ఆ పాటను మరొకరి స్వరంలో రికార్డు చేసి, గాయని అందుబాటులోకి రాగానే ఆమెతో ఆ పాటలను మళ్ళీ పాడిరచే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక్కోసారి కొందరు గాయనీ గాయకులు, అలా వేరేవాళ్ళతో రికార్డయిన పాటలను విని మెచ్చి ఆ పాటలను అలానే ఉండనీయమనటంతో, కొత్త గాయనీ గాయకుల పాటలు సినిమాల్లో వాడేవారు. అలా కొత్తవారికి అవకాశం లభించేది.
1985లో ‘ప్యార్‌ రaుక్తా నహీ’ అన్న సినిమాలో ఒక పాటను సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌`ప్యారేలాల్‌లు లత స్వరంలో రికార్డు చేయాలనుకున్నారు. 1977 నుంచి లత అందుబాటులో లేనప్పుడు ఆమె పాటలను లక్ష్మీకాంత్‌`ప్యారేలాల్‌లు యువ గాయని కవితా కృష్ణమూర్తి స్వరంలో రికార్డు చేసేవారు. తర్వాత లత ఆ పాటను తన స్వరంలో రికార్డు చేసేది. ఇలా తాను పాట పాడిన విధానానికి, అదే పాటను లత పాడిన విధానానికి తేడాను గమనించి, పాటను ఎలా పాడాలో కవిత నేర్చుకునేది. యువ గాయనీ గాయకులు ఇలా పాట పాడే విధానాన్ని తెలుసుకుంటూ తమకు పాడే అవకాశం దొరకటం కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పటిలాగే లక్ష్మీకాంత్‌`ప్యారేలాల్‌లు లత పాట కోసం కవితను పిలిచారు, ఆ పాటను తర్వాత లత పాడుతుందని చెప్పారు. కవిత ఆ పాటను పాడిరది. లత అందుబాటుకు రాగానే కవిత పాడిన రికార్డును లతకు పంపారు. ఆ రికార్డును విని లత వెంటనే వెనక్కు పంపేసింది. దాంతో లక్ష్మీకాంత్‌`ప్యారేలాల్‌లు కంగారుగా లతను కలిశారు. ‘ఈ పాటను నేను మళ్ళీ పాడనవసరం లేదు. ఈ అమ్మాయి బాగా పాడిరది. అదే ఉంచండి’ అంది లత. అలా ‘ప్యార్‌ రaుక్తా నహీ’ సినిమాలో సూపర్‌ హిట్‌ సోలో పాట ‘తుమ్‌సే మిల్‌ కర్‌ నా జానే క్యూం’ కవితా కృష్ణమూర్తి స్వరంలో విడుదలయింది. ఆమె కెరీర్‌ ఎదుగుదలకు దోహదపడిరది. ఇలా ఒకరి స్వరంలో రికార్డు చేసి మరొకరితో డబ్‌ చేయించటం సర్వసాధారణం. కానీ ఆ సినిమా విషయంలో లతకు తన పాటలు మీనాకపూర్‌ స్వరంలో డబ్‌ చేస్తారన్న విషయం తెలియదు. సినిమా విడుదలయ్యేంతవరకు ఆమె తన పాటలే సినిమాలో ఉంటాయనుకుంది. ఈ అవమానం లత మర్చిపోలేదు.
ఫిల్మిస్తాన్‌ స్టూడియోలో ‘షహీద్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న రోజులవి. ఓ పాట పాడేందుకు గులామ్‌ హైదర్‌ లతను పిలిచాడు. స్టూడియో చేరిన తర్వాత తాను యుగళగీతం పాడుతున్నానని లతకు తెలిసింది. తనతో పాడేది ఆ స్టూడియో యజమాని రాయబహదూర్‌ చున్నీలాల్‌ కొడుకని తెలిసింది. ‘స్టూడియో యజమాని కొడుక్కి సంగీతంతో పనేంటి? తండ్రి యజమాని కాబట్టి కొడుక్కి అవకాశం లభించటంలో ఆశ్చర్యమేముంది. దొరక్క దొరక్క ఒక యుగళగీతం పాడే అవకాశం లభించింది. అదీ సంగీత బ్యాక్‌గ్రౌండ్‌ లేని కొత్త గాయకుడితో. ఇక నా పాట పనయినట్టే’ అని లత బాధపడిరది. విషాదచిత్త అయింది. ఇంతలో యువకుడు వచ్చాడు. బాగున్నాడు, మర్యాదగా మాట్లాడాడు. అది అన్నాచెల్లెళ్ళ పాట. ‘పింజ్‌రే మె బుల్‌బుల్‌ బోలే’ అన్న పాట. అతని స్వరం బాగానే ఉంది. బాగానే పాడాడు అనుకుంది లత. అతడితో అదే విషయం చెప్పింది. అతను సంతోషంతో మందహాసం చేసి ‘మీరు కూడా చాలా బాగా పాడారు, నేను త్వరలో సంగీత దర్శకుడినవుతాను, మీరు నా సినిమాలో పాటలు పాడాలి’ అన్నాడు. లత నవ్వి ఊరుకుంది. అంతేకాదు, ‘మనం అన్నా చెల్లెళ్ళ పాట పాడాము కాబట్టి ఈ రోజు నుంచి మీరు నా సోదరి’ అన్నాడు. ఆ యువకుడు లతతో అత్యద్భుతమైన పాటలు పాడిరచిన సంగీత దర్శకుడు మదన్‌ మోహన్‌! అయితే ఆయన తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన సినిమా ‘ఆంఖే’లో లత పాడలేదు. తర్వాత లత పాట లేని సినిమాకు ఆయన సంగీత దర్శకత్వం వహించలేదు! తన సినీ జీవితంలో ఎందరో సంగీత దర్శకులు ఆమెతో అత్యద్భుతమయిన పాటలెన్నో పాడిరచారు కానీ, ఏదో ఒక సందర్భంలో అందరూ తనని కాదన్నారు, వదిలేశారు. కానీ, ఒక మదన్‌ మోహన్‌ మాత్రమే ఆరంభం నుంచి చివరి వరకూ తనతో స్నేహంగా ఉంటూనే వచ్చాడనీ, ఎట్టి పరిస్థితులలోనూ తనను వదలలేదనీ లత పలు ఇంటర్వ్యూలలో మదన్‌ మోహన్‌తో తన ప్రత్యేక అనుబంధాన్ని గురించి వివరించింది.
అనిల్‌ బిశ్వాస్‌ పాటలు మార్చిన ఆ సినిమా చేదు అనుభవం, లతకు గుణపాఠం నేర్పింది. అప్పటి నుంచి ఎవరైనా పాటకు పిలిస్తే, ముందుగానే పాట తన స్వరంలోనే ఉండాలన్న నిబంధన విధించేది. నిబంధనను ఉల్లంఘిస్తే మళ్ళీ ఆ సంగీత దర్శకుడితో కలిసి పనిచేసేది కాదు.
అనిల్‌ బిశ్వాస్‌కు లత బాధపడినట్టు కూడా తెలియదు. ఆయన తన ధోరణిలో లతతో పాటలు పాడిస్తూ, ఆమెకు పాటలు ఎలా పాడాలో నేర్పిస్తూ పోయాడు. మైకు ముందు సరిగ్గా నిలబడటం, మైకు పరిధిలోకి రాకుండా పాట మధ్యలో ఊపిరి తీయటం, ముఖ్యంగా హై పిచ్‌లో రాగం తీయాల్సి వచ్చినపుడు శ్రోత పసిగట్టకుండా ఊపిరి పీల్చడం, పెద్ద వాక్యం పలకాల్సి వచ్చినపుడు పదాల నడుమ ఎలాంటి బ్రేక్‌ ఇవ్వకుండా ఊపిరి పీల్చగలగడం వంటి టెక్నిక్కులన్నీ అనిల్‌ బిశ్వాస్‌ లతకు నేర్పించాడు. అనిల్‌ బిశ్వాస్‌కు పాడిన ప్రతి పాట తనకు ఒక పాఠం లాంటిదని చెప్పింది లతా మంగేష్కర్‌ ఒక ఇంటర్వ్యూలో. కానీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్ళయిన సందర్భంగా ఉత్తమ పది పాటలను ఎన్నుకోవాల్సి వచ్చినపుడు అనిల్‌ బిశ్వాస్‌ పాటను ఎన్నుకోలేదు లత. ఇది అనిల్‌ బిశ్వాస్‌ పాటలు మార్చిన ఆ సినిమా ప్రభావం.
ఇక్కడ లత స్వభావంలో అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఆమె ఎవరైనా తనకు చేసిన మేలు మర్చిపోలేదు, అలాగే చేసిన అవమానాన్ని క్షమించదు. సి.రామచంద్ర అయినా, అనిల్‌ బిశ్వాస్‌ అయినా, శంకర్‌ జైకిషన్‌ అయినా, రాజ్‌కపూర్‌ అయినా, మహమ్మద్‌ రఫీ అయినా… లత అందరికీ విధేయురాలిగానే ఉంటుంది. కానీ ఎవరికీ కృతజ్ఞురాలు కాదు!
1948లో అనోఖా ప్యార్‌, ఆశా, గజ్రే, మజ్బూర్‌, జిద్ది సినిమాలలో లత పాడిన పాటలు సూపర్‌ హిట్‌లయ్యాయి. ముఖ్యంగా ‘బేదర్ద్‌ తేరే దర్ద్‌ కో (పద్మిని, 1948)’, ‘చందారే జారె జా (జిద్ది, 1948)’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. లత పాటలు హిట్‌ అవుతాయన్న నమ్మకం కలిగింది. అందుకే 1949లో లత పాడిన 157 పాటలు విడుదలయ్యాయి. అంటే, దేశ విభజన జరగటం, నేపథ్యగానం స్థిరపడటం, యువ నటీమణులు రావటం, గులామ్‌ హైదర్‌, అనిల్‌ బిశ్వాస్‌లకు పాడిన పాటలు హిట్‌ కావటం లతకు లాభించాయన్న మాట.
లత సినీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం 1949.
1949 సంవత్సరం హిందీ సినీ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగానికి నాందీ సంవత్సరం. సినీ సంగీత ప్రపంచంలో అత్యద్భుతమయిన పాటల తుఫానుకు ఆరంభ సంవత్సరం. లత పాటల మాధురీ కుంభవృష్టి ఆరంభమయిన సంవత్సరం. శంకర్‌`జైకిషన్‌ ప్రథమంగా సంగీత దర్శకత్వం వహించిన ‘బర్సాత్‌’ సినిమా పాటలు ప్రజలపై ఆనందపు వర్షాన్ని కురిపించిన సంవత్సరం 1949.
జియా బేకరార్‌ హై, ఆయీ బహార్‌ హై
ఆజా మోరే బాల్‌ మా తేరా ఇంతజార్‌ హై
హస్రత్‌ జైపురి రచించగా శంకర్‌`జైకిషన్‌ బర్సాత్‌ సినిమా కోసం రూపొందించిన ఈ పాట భారతీయ సినీ సంగీత చరిత్ర దిశను మార్చింది. హిందీ సినిమా పాట స్వరూప స్వభావాలను సంపూర్ణంగా రూపాంతరమొందించింది. ఈ పాట పాడుతూ లత మంగేష్కర్‌ హిందీ సినీ సంగీత శిఖరాలను అతి సునాయాసంగా అధిరోహించింది.
1949 వరకూ లతా మంగేష్కర్‌ దాదాపుగా 60 పాటలు పాడిరది. ఎవరైనా లతా మంగేష్కర్‌ కెరీర్‌ను ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో పాడిన పాటల ఆధారంగా పరిశీలిస్తే, విశ్లేషిస్తే 1947 అంతానికి ఆమె పాటలు విని, లతా మంగేష్కర్‌ సినీ నేపధ్య గాయనిగా నిలవలేదన్న అభిప్రాయానికి వస్తారు. గీతారాయ్‌ అగ్రశ్రేణి గాయనిగా ఎదుగుతుందని బల్లగుద్ది మరీ వాదిస్తారు. లతా మంగేష్కర్‌కు అవకాశాలు అంతగా రావటం లేదు. ఆమె పేదరికం ఆమె దుస్తుల్లో తెలుస్తోంది. ఆమె ఎవరితోనూ అంతగా కలవదు. తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటుంది. పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా తనకు నచ్చని వారితో పనిచేసేందుకు నిరాకరిస్తుంది. ఉదయం రిహార్సల్స్‌కు వచ్చిందంటే, రాత్రి రికార్డింగ్‌ అయ్యేవరకు స్టూడియోలోనే ఉంటుంది. ఒక్క చాయ్‌ తాగటం తప్ప మరేమీ తీసుకోదు. ఆమెను వెంట పిలిచే ధైర్యం ఏ సాటి కళాకారుడికి లేదు. ఇవి సరిపోనట్టు, ముందుగా పాటలోని పదాలను తెలుసుకుని వాటిల్లో ఏ మాత్రం ద్వంద్వార్థం ధ్వనించే పదాలున్నా పాట పాడేందుకు నిరాకరిస్తుంది.
సినీ ప్రపంచమే కాదు, మానవ ప్రపంచం సర్వం భిన్నంగా ఉన్నవారిని ఆదరించదు. వారిని హింసిస్తుంది. విరవాలని చూస్తుంది. విరగకపోతే వంచాలని చూస్తుంది. వీటన్నింటినీ తట్టుకొని నిలబడిన వాడిని గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. అభిమానిస్తుంది. అనుసరిస్తుంది. కానీ ఆ దశకు చేరుకోవాలంటే వ్యక్తి ప్రతిభతో పాటు బలమైన వ్యక్తిత్వం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. అన్ని అడ్డంకులనూ తట్టుకొని తన ప్రత్యేకతను నిలుపుకునే శక్తి ఉండాలి. అన్నిటినీ మించి కాలం అనుకూలించాలి.
లతకు ఇవన్నీ ఉన్నాయి. తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలను తలకెత్తుకోవటంలోనే ఆమె స్థైర్యం, విశ్వాసం తెలుస్తాయి. అదీ పదమూడేళ్ళ వయసులో. స్వరం తప్ప మరే ఆస్తి లేని స్థితిలో బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలంటే ఉండాల్సిన మనోస్థైర్యం మామూలుది కాదు. పైగా మహిళ. పురుషాధిక్య సినీ ప్రపంచంలో, ఎవరి నుంచీ ఎలాంటి సహాయం ఆశించకుండా, ఎవరినీ దగ్గరకు రానీయకుండా, తన మాట నెగ్గించుకుంటూ మనగలగటం అసంభవం. అందుకే 1947 చివరిలో లత కెరీర్‌ మహా అయితే ఒకటో, రెండేళ్ళు అంతే… అన్న భావన బలంగా కలుగుతుంది.
ఈ సమయానికి గీతారాయ్‌ కెరీర్‌ తారాపథానికి దూసుకుపోతోంది. గీతారాయ్‌ తొలి సోలో పాట 1946లో (ఆ సంవత్సరం లత కేవలం ఆరు పాటలు పాడిరది) ‘సర్కస్‌ కింగ్‌’ అనే సినిమాలో ‘ప్రీతి కిసికో నా ఛోడే’ అన్న పాట పాడిరది. సంగీత దర్శకులు అభ్యంకర్‌ జోషి, నాగేశ్వరరావులు. అదే సంవత్సరం, గులామ్‌ హైదర్‌ దర్శకత్వంలో ‘బైరమ్‌ ఖాన్‌’ సినిమాలో శంషాద్‌ బేగమ్‌, మునావర్‌ సుల్తానా, నసీమ్‌ బేగమ్‌లతో కలిసి ‘జబ్‌ చాంద్‌ జవాన్‌ హోగా’ అన్న పాట పాడిరది. ‘మిలన్‌’ సినిమాలో రెండు పాటలు, ‘నయామీ’, ‘రసీలీ’ అన్న సినిమాల్లో ఇంకొన్ని పాటలు పాడిరది. ఎస్‌.ఎస్‌.త్రిపాఠి సంగీత దర్శకత్వంలో అద్భుతమైన జోల పాట ‘ఆజీరే నిందియా ఆజా’ పాడిరది. అదే సంవత్సరం బీనాపాణి ముఖర్జీ, రఫీలతో పాటు పాడిరది. రఫీతో ఆ సమయంలో ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగింది. సినీ పరిశ్రమ గీతారాయ్‌ని విస్మరించిన సమయంలో కూడా రఫీ ఆమెకు అండగా నిలబడ్డాడు.
1947లో అనిల్‌ బిశ్వాస్‌ ‘భూక్‌’ సినిమాలో పాటలు గీతాకు చక్కటి గుర్తింపునిస్తే ‘దో భాయ్‌’ సినిమా పాటలు తారాపథంలోకి నడిపించాయి. రాజ్‌కపూర్‌, మధుబాలల సినిమా ‘దిల్‌ కీ రాణి’లో అయిదు పాటలు పాడిరది గీతారాయ్‌. మధుబాలకు గీతారాయ్‌ స్వరం ఎంత చక్కగా కుదిరిందంటే మధుబాల పాట పాడితే అది ‘గీతారాయ్‌’ స్వరంలోనే అన్న భావన బలపడిరది. ‘చిత్తోడ్‌ విజయ్‌’ అనే మధుబాల సినిమాలోనూ గీతారాయ్‌ పాడిరది. ఆ సంవత్సరమే గీతారాయ్‌, సి.రామచంద్ర సంగీత దర్శకత్వంలో ‘లీలా’, ‘సాజన్‌’, ‘షహనాయీ’ సినిమాల్లో పాడిరది. సజ్జాద్‌ హుస్సేన్‌ సంగీత దర్శకత్వంలో ‘కసమ్‌’, ‘మేరీ భగవాన్‌’ సినిమాల్లో పాడిరది. ఇంకా గ్యాన్‌ దత్‌, బులో సి రాణి, అజీజ్‌ ఖాన్‌, హన్స్‌రాజ్‌ బహెల్‌, జాఫర్‌ ఖుర్షీద్‌, ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ వంటి సీనియర్‌ సంగీత దర్శకులు, చిత్రగుప్త, ప్రేమ్‌ నాథ్‌, స్నేహల్‌ భాట్కర్‌ (అప్పుడు వాసుదేవ్‌) వంటి యువ సంగీత దర్శకుల పాటలూ పాడిరది. కేదార్‌ శర్మ సినిమా ‘నీల్‌ కమల్‌’లో అయిదు పాటలు పాడిరది గీత. ఆ సంవత్సరం లత, గీతలు తొలిసారిగా కలిసి ‘జవానీ కీ రేల్‌’ పాటను సి.రామచంద్ర సంగీత దర్శకత్వంలో పాడారు.
1947 చివరికి ఇదీ పరిస్థితి! 1947 చివరికి ప్రతి ఒక్క సంగీత దర్శకుడు, సీనియర్‌ అయినా, యువకులైనా గీతారాయ్‌తో పాటలు పాడిరచేందుకు ఉత్సాహం చూపించేవారు. గీతారాయ్‌కు ఆ సమయంలో బెంగాలీ తప్ప మరో భాష వచ్చేది కాదు. అయినా పాటను బెంగాలీలో రాసుకుని, గేయ రచయితలతో కూర్చుని పదాలు పలకటాన్ని తెలుసుకునేది. అభ్యసించేది. పెద్దగా శ్రమ పడకుండా భావాలను పలికించేది. 1948లో లతా మంగేష్కర్‌ 48 పాటలు పాడితే, గీతారాయ్‌ వందకు పైగా పాటలు పాడిరది. మజ్బూర్‌, ఖిడ్కీ, షహీద్‌, సుహాగ్‌ రాత్‌, హీర్‌ రాంరaా, సావరియా, మేరీ కహానీ, పద్మిని, ఏక్ట్రిస్‌, అంజనా, గుణసుందరి, జీనేదో, చందా కే చాంద్‌నీ వంటి సినిమాలలో గీత పాడిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి. గుజరాతీ భాషలో కూడా ఆ సంవత్సరం పాటలు పాడిరది గీతా. ఎస్‌.ఎస్‌.వాసన్‌ మాగ్నమ్‌ ఓపస్‌ ‘చిత్రలేఖ’లో పాటలన్నీ ఉమాదేవితో పాడిరచాడు. కానీ గీత పాటలు విన్న వాసన్‌, ఆమె పాట తన సినిమాలో తప్పనిసరిగా ఉండాలని ‘నాచే ఘోడా, నాచే ఘోడా’ అనే పాటలను గీతాతో పాడిరచాడు.
గీతారాయ్‌ గీతాల జైత్రయాత్ర 1949లో కూడా కొనసాగింది. నర్గీస్‌ తల్లి జడ్డన్‌ బాయ్‌ నిర్మించిన ‘దారోగా జీ’లో పన్నెండు పాటలను పాడిరది గీతారాయ్‌. నౌషాద్‌ సంగీత దర్శకత్వంలో తొలిసారి ‘దిల్లగీ’ సినిమాలో పాటలు పాడిరది. ‘హుస్న్‌లాల్‌`భగత్‌రామ్‌’ సంగీత దర్శకత్వంలో ‘హమారీ మంజిల్‌’ సినిమాలో ఆరు పాటలు పాడిరది. అయితే ఆ సంవత్సరం ‘ఏక్‌ థీ లడ్‌కీ’ అన్న సినిమాలో తొలిసారిగా లత, గీతల నడుమ అగ్రశ్రేణి గాయనిగా పోటీ జరుగుతుందన్న ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో గీత ‘ఉన్‌సే కెహనా’ అన్న పాట పాడిరది. ఇది కుల్దీప్‌ కౌర్‌పై చిత్రితమయింది. కానీ ప్రజలను పెద్దగా ఆకర్షించలేదు. కానీ ఇదే సినిమాలో నాయిక మీనాసోరిపై చిత్రితమైన ‘లారలప్ప’ పాట సూపర్‌ డూపర్‌ హిట్టయింది. మీనాషోరిని అందరూ ‘లారలప్ప గర్ల్‌’ అనటం ప్రారంభించారు. ఈ పాటను లత, దుర్రానీ, రఫీలతో కలిసి పాడిరది. తొలిసారిగా లత స్వరం వీథివీథినా మారుమ్రోగింది. ఆ సంవత్సరం సురేంద్రతో కలిసి గీతా ‘మేరీ కహానీ’, ‘కమల్‌’ వంటి సినిమాలలో హిట్‌ గీతాలు పాడిరది. ‘రామ వివాప్‌ా’ సినిమాలో మన్నాడేతో తొలి యుగళ గీతం పాడిరది గీతా.
1949లో ‘బర్సాత్‌’, ‘అందాజ్‌’, ‘మహల్‌’ సినిమాలలోని పాటలతో లత ఒక్కసారిగా గీతారాయ్‌ను అందుకుంది. ఈ విషయం గురించి లోతుగా చర్చించే కన్నా ముందు 1946 నుండి 1949 వరకూ లత, గీతలు పాడిన పాటల సంఖ్యను పోల్చి చూడాల్సి ఉంటుంది.
సంవత్సరం లత గీత
1946 6 20
1947 5 52
1948 48 105
1949 151 106
1946లో గానం ఆరంభించినప్పటి నుంచి గీతా దూసుకుపోతూనే ఉంది. తొలిసారిగా 1949లో లతా మంగేష్కర్‌ అటు వేగంగా ఎదుగుతున్న గీతారాయ్‌పై, ఇటు అప్పటికే స్థిరపడి ఉన్న శంషాద్‌ బేగంపై ఆధిక్యాన్ని సాధించింది. పాపులారిటీలో లతను, భారతదేశ ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం చేసింది ‘మహల్‌’ సినిమాలోని ‘ఆయేగా ఆనేవాలా’ పాట. ఎవరు లత? అని ప్రజలంతా ప్రశ్నిస్తున్న తరుణంలో లత ఎవరు? అని మరెవ్వరూ ఇంకోసారి, ఎప్పటికీ అడిగే అవసరం లేకుండా లత పాటల కుంభవృష్టి కురిపించింది ‘బర్సాత్‌’ సినిమా. బర్సాత్‌’ సినిమా రాజ్‌ కపూర్‌ నిర్మించిన రెండవ చిత్రం. మొదటి సినిమా ‘ఆగ్‌’. ‘ఆగ్‌’ సినిమా నిర్మాణ సమయంలో పృథ్వీరాజ్‌ కపూర్‌, రాజ్‌ కపూర్‌కు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు కానీ, సంగీత దర్శకుడిగా రామ్‌ గంగూలీని తీసుకోమని అన్నాడు. అందరూ కొత్తవారయినప్పుడు అనుభవజ్ఞుడయిన సంగీత దర్శకుడితో పాటలు ‘హిట్‌’ అవుతాయని, సినిమా విలువ పెరుగుతుందని ఆయన ఆలోచన. తండ్రి మాటను అనుసరించి రాజ్‌ కపూర్‌ ‘ఆగ్‌’ సినిమాకు రామ్‌ గంగూలీని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ‘ఆగ్‌’లోని కొన్ని పాటలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా రాజ్‌ కపూర్‌కు ముకేష్‌ పాడిన ‘జిందాహు ఇస్‌ తర్హా’ అనే పాట ఈనాటికీ వినపడుతుంది. నర్గీస్‌పై చిత్రితమైన శంషాద్‌ బేగమ్‌ పాడిన పాట ‘కాహే, కోయల్‌ షోర్‌ మచాయేరే’ కూడా హిట్‌ పాటగా నిలిచింది. ఈ సినిమాలో రామ్‌ గంగూలీకి అసిస్టెంట్లుగా పనిచేశారు శంకర్‌`జైకిషన్‌ అనే యువకులిద్దరూ.
శంకర్‌ సింఫ్‌ు రఘువంశీ హైదరాబాద్‌లో పెరిగాడు. కుస్తీపై అమితమైన ఆసక్తి గల శంకర్‌ తబలాలో నిష్ణాతుడు. కథక్‌ నృత్యం నేర్చుకున్నాడు. డ్రామా ట్రూపుతో తిరుగుతూ బొంబాయి చేరాడు. పృథ్వీరాజ్‌ కపూర్‌ నాటక సంస్థ పృథ్వీ థియేటర్‌లో తబలా వాయిద్యానికి కుదురుకున్నాడు. పృథ్వీ థియేటర్‌లో సంగీతం సృజిస్తూ సినిమాలలో అవకాశం కోసం ప్రయత్నాలు చేశాడు. హుస్న్‌లాల్‌ భగత్‌ రామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేశాడు. అవకాశాల కోసం తిరుగుతున్న కాలంలోనే ఓ ప్రొడ్యూసర్‌ దగ్గర అతనికి బహు సిగ్గరి అయిన యువకుడు జై కిషన్‌ దయాభాయ్‌ పంచాలీతో పరిచయమయింది. వృత్తిరీత్యా కార్పెంటర్‌ అయిన జై కిషన్‌కు సంగీతమంటే ప్రాణం. వారిద్దరి నడుమ దోస్తీ కుదిరింది. జై కిషన్‌కు కూడా పృథ్వీ థియేటర్‌లో ఉద్యోగం ఇప్పించాడు శంకర్‌. వీరిద్దరి నడుమ దాదాపుగా పదేళ్ళ తేడా ఉన్నా, వయసుతో పని లేకుండా, సంగీతం ఆధారంగా దోస్తీ కుదిరింది. జై కిషన్‌ సంగీత ప్రతిభను శంకర్‌ గుర్తించాడు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.