సృష్టికే మూలమై చెలగేను స్త్రీమూర్తి
చిరునగవు మోముపై నిలిపేను స్త్రీమూర్తి
బాధ్యతలు నెరవేర్చు దీక్షతో పడతియే
హక్కులను పొందుటే మరిచేను స్త్రీమూర్తి
వెరుపేమి లేకుండ ముందడుగు వేసేను
ధైర్యముగ బ్రతుకునే గడిపేను స్త్రీమూర్తి
సంసారమె లోకమని భావించు జనయిత్రి
సేవయే ధర్మమని తలచేను స్త్రీమూర్తి
సత్యమిది త్యాగముకు రూపమౌ జననియే
జగమంత తానెjైు నిండేను స్త్రీమూర్తి
నీవులే
శక్తికే రూపైన శుభదంతి నీవులే!
జగతినే ఏలేటి ఇందువదన నీవులే!
చేతిలో చరవాణి, ఒడిలోన పసిపాప,
విధులన్ని నెరవేర్చు ఇంతివే నీవులే!
విజ్ఞాన ఖనివీవు, నీ శక్తి అనన్యము,
అసమాన ప్రతిభగల సుభాషిణి నీవులే!
అసాధ్యమె సాధ్యముగ చేయగల ధీశాలి,
సృష్టినే మార్చగల శుభాంగివి నీవులే!
సత్యముగ నినుగనీ ధరణియే మురిసేను,
విశ్వమే మెచ్చినా వనజాక్షి నీవులే!
`