ఈ బుల్డోజింగ్‌ ధోరణి తగ్గాలి! – డా॥ నాగసూరి వేణుగోపాల్‌

‘‘వామపక్ష సిద్ధాంతాన్ని నార్ల వెంకటేశ్వరరావు విబేధించి ఉండవచ్చుÑ కానీ, మౌఢ్యాన్ని వ్యతిరేకించడానికి, ఖండిరచడానికి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారనే విషయం పట్టించుకోకపోతే ఎలా?’’ అని ఓ పదేళ్ళ క్రితం ఒక మిత్రుడైన రచయిత ముఖాముఖి మాట్లాడుతూ అన్నారు! మూడేళ్ళ క్రితం కాకినాడ వెళ్ళినపుడు ఒక ప్రముఖ

రచయిత్రి మాటల మధ్యన ‘‘విశాఖపట్నం ఆకాశవాణి కోసం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నవలల మీద ప్రసంగించమని మీరు కోరేదాకాÑ వారి నవలలు చదవలేదు. ఎంతసేపూ ఆయన కథల గురించే చెప్పుకుంటాం. నాతో మంచిపని చేయించారు’’ అని, అంతకుముందు దశాబ్దంన్నర క్రితం జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని అభినందించారు! ఇందులో తొలి అంశం ఉద్దేశ్యపూర్వకంగానూ, సంఘటితంగానూ విస్మరించిన అంశాన్ని వివరిస్తేÑ రెండవది వ్యక్తిగతంగానూ, అలవోకగా మరుగున పడిన అంశాన్ని చెబుతోంది. ఈ ఇద్దరి వ్యక్తులు నాకు బాగా తెలుసు, అయితే బాహాటంగా వారి పేర్లు చెప్పడం వారికి ఇష్టమో కాదో తెలియదు కనుక, ఆ పేర్లు పేర్కోవడం లేదు! నిజానికి విషయం సార్వత్రికమైనది, కనుక దాని గురించి పట్టించుకుంటే చాలు!
నేను పూర్తిగా, చదువుపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఉపాధిపరంగా కానీ సాహిత్యానికి అంకితమైన వ్యక్తిని గాను. అయితే నేను కొన్ని దశాబ్దాల కాలంలో అనుకోకుండా గమనించి, తర్వాత తరచి చూసిన విషయాలు కొన్ని చర్చించుకుందాం!
పోతన చక్కని కవి, రాజాశ్రయాన్ని ధిక్కరించిన కవి. అదే సమయంలో అటువంటి కవిసత్తముడు కూడా చదువుల తల్లిని స్తన వర్ణనలో ముంచడం ఏమిటని సున్నిత హృదయులు కొందరు ఇబ్బంది పడతారు, మరికొందరు ముందుకు వచ్చి ఖండిస్తారు. ఆనాటి రాజుల చెంత చేరిన కవులే కాదు ఈనాటి అవధానులూÑ సరసమైన కథలు రానే రచయితలూÑ మంచి సాహిత్యం సృజించే పెద్దవారు వ్యక్తిగత సంభాషణలలోనూ ఇదే పనిచేస్తారు. కనుకనే కార్లైల్‌ మహాశయుడు ‘‘సాహిత్యాన్ని కామోద్దీపనకూ, గణితాన్ని మోసం చేయడానికి వాడుకోవద్దంటారు!’’ అయితే తరిగొండ వెంగమాంబ తన రచనలలో ఇలాంటి ధోరణి మచ్చుకు కూడా లేదని, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ద్రావిడ విశ్వవిద్యాలయం తొలి వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన గణితాచార్యులైన డా. పి.వి.అరుణాచలం చాలాసార్లు నాతో ముఖాముఖిగా అన్నారు. నేను తిరుపతిలో పనిచేశాను కనుక ఈ విషయం తెలిసింది. తరిగొండ వెంగమాంబ రచనల్లోని భక్తి మీకు నచ్చకపోవచ్చు కానీ ఆమె రచనా ధోరణిలోని ఈ ప్రత్యేకత ఖచ్చితంగా ఆనాటి కవుల విధానానికి తిరుగుబాటే! ఆమె తన బాటగా చెప్పకపోవచ్చు కానీ అది ఖచ్చితంగా చెప్పడానికి స్వాతంత్య్రం లేని సమాజంలో ఇలా సాధ్యమైన దారిని వెతుక్కోవడమే! రెండు ధోరణులకూ దేవుడు అనే భావన ప్రత్యక్ష సాక్షి. కనుక ఈ ధోరణులను పట్టించుకోకుండా దేవుడినే ఖండిస్తూ సాగితే ఏమిటి ప్రయోజనం?
కవయిత్రి కుమ్మర మొల్ల ఏడెనిమిది వందల పద్యాలలో రామాయణం రాశారు. చాలామంది కవులు రామాయణం రాశారు. కానీ ఇంత సంక్షిప్తంగా ఉన్నది వేరొకటి లేదంటారు. ‘‘బ్రీవిటీ ఈజ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది డే’’ అంటారు. మరి ఆమె పద్య రచనలల్లోని క్లుప్తతలోని వ్యూహమేమిటో పరిశీలించవద్దా? భక్తి కొందరికి అవసరం కావచ్చు, మరి కొందరికి అక్కర్లేకపోవచ్చు. కానీ ఆమె రచనా సంవిధానం ద్వారా మొల్ల కాంట్రిబ్యూట్‌ చేసిందేమిటో తెలుసుకోవాల్సిన అవసరం మన సాహిత్యానికి
ఉంది కదా! ఇక్కడ ఇంకో అంశం కూడా గమనార్హం. వెంగమాంబ ఉన్నత వర్గాల బ్రాహ్మణ స్త్రీ కాగా, మొల్ల శ్రామిక కులాల కుమ్మర స్త్రీ. మొల్ల కడప జిల్లా బద్వేలు ప్రాంతం వారు కాగా, వెంగమాంబ చిత్తూరు జిల్లా కలికిరి దగ్గరున్న తరిగొండ అని నమ్ముతున్నాం. ఇద్దరూ రాయలసీమ వారే కానీ వేర్వేరు సామాజిక నేపథ్యం గలవారే! అయితే వివక్ష మాత్రం ఇద్దరికీ కామన్‌!
సమానత్వ దిశగా 1975 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ మహిళా సంవత్సరం’గా గుర్తించి, తర్వాతి దశాబ్దాన్ని ‘మహిళా దశాబ్దం’గా ప్రకటించింది. అయితే దానికి సరిగ్గా పదేళ్ళ క్రితమే తెలుగు సాహిత్యంలో పెద్ద సంచలనం జరిగింది. దాన్ని గుర్తించాం కానీ, దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకోలేకపోయాం! ప్రముఖ నవలా రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి సాహిత్య వివేచన మీద ఒక పెద్ద ప్రాజెక్టు ఇటీవలే పూర్తి చేశాను. త్వరలో 480 పేజీల సంకలనంగా వెలుగు చూస్తోంది. దీనికోసం అన్వేషిస్తున్న 2019`20 కాలంలో కడియాల రామమోహనరాయ్‌ చెప్పిన ఒక విషయం నన్ను ఆశ్చర్యానికి లోను చేసింది. తెన్నేటి హేమలత, కోడూరి కౌసల్యాదేవి, యద్ధనపూడి సులోచనారాణి వంటి రచయిత్రులు తెలుగు నవలా రచనకు ఉపక్రమించాక భారతదేశంలో ఏ ఇతర భాషలలోనూ లేనంతమంది రచయిత్రులు తెలుగులో వచ్చారని ఆ పరిశీలన. ఈ విషయం గురించి ‘అమరేంద్ర’గా ప్రఖ్యాతులైన గుంటూరు ప్రాంతపు ఇంగ్లీషు లెక్చరర్‌ సి.ఎన్‌.శాస్త్రి తరచూ చెప్పేవారని సాహిత్య విమర్శకులు రాయ్‌ నాకు వివరించారు. మొత్తం మహిళల సాహిత్యాన్ని ఎడమచేత్తో పాసింగ్‌ రిమార్క్‌గా కొట్టిపడేసిన సమాజంలో ‘సోషియలాజికల్‌ నేపథ్యం, ప్రభావంలో’ అని ఏమి పరిశోధన చేస్తాం? తెలుగులో మహిళలు సృజించిన సాహిత్యాన్ని సమగ్ర దృష్టితో ఇంతవరకు పూర్తిగా పరిశీలించలేదు, పరిశోధించలేదు. ఇది ప్రాచీన సాహిత్య విషయంలోనూ కాదు, స్వాతంత్య్రానంతరం కూడా తెలుగులో సంభవించింది!
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇటీవలి కాలంలో గాంధీజీ సిద్ధాంతాలు, ప్రభావాలు, పరిష్కారాలు అనే రీతిలో నేను కొంత దృష్టి పెట్టాను కదా! ఈ దశలోనే కృషి ముమ్మరం కావడానికి కారణం కస్తూరిబాకు సంబంధించిన ఒక విషయం. గాంధీజీ గురించి శోధిస్తుంటే కస్తూరిబా ఇంకా పెద్ద ఎత్తున విస్మరించబడ్డారని 2019 సంవత్సరం చివర్లో నాకు అనిపించింది. అటువైపుగా చదివి, శోధించేసరికి 2020 ఫిబ్రవరి 22 మాత్రమే కాదు, ఏప్రిల్‌ 11 కూడా అయిపోయింది. ఒక వ్యాసం కాదు, మూడు వ్యాసాలు తయారయ్యాయి. ఏదో సందర్భం ఉంటే కానీ మీడియాలో అటెన్షన్‌ ఉండదు. కనుక కస్తూరిబాకు సంబంధించి కీలకమైన సందర్భాల తేదీలు మరేమైనా ఉన్నాయేమోనని తరచి చూశాను. గాంధీజీ వెలుగులో కస్తూర్బా వివేకాన్ని, విజ్ఞతను, చాకచక్యాన్ని, సాహసాన్ని, తెగువను, త్యాగాన్ని గుర్తించలేకపోయామని ఈ సందర్భంగా బోధపడిరది. నేటికీ ఆమె జననం (ఏప్రిల్‌ 11, 1869), మరణం (ఫిబ్రవరి 22, 1944) తేదీలు తప్ప ఆమెకు సంబంధించి మరో తేదీ అందుబాటులో లేదు.
2018లో వెలువడిన అపర్ణా బసు రచన ‘ఉమెన్‌ ఇన్‌ సత్యాగ్రహ’ అనే గ్రంథం చదువుతుంటే భారతదేశంలో ఇరువర్గాల స్త్రీలనే కొద్దిగా గుర్తుంచుకున్నామనే ధోరణి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్సత్‌ మిష్‌ మరణం తర్వాత ఢల్లీి గద్దెనెక్కిన రజియా సుల్తానా, భర్త రాజ్యం కోసం పోరాడిన రaాన్సీ లక్ష్మీబాయి వంటి (పురుషుల పని చేసిన) స్త్రీలను గుర్తుంచుకుంటాం లేదా షాజహాన్‌ ప్రభువు భార్య ముంతాజ్‌ మహల్‌ను గానీÑ జహంగీరు నవాబు ప్రియురాలు నూర్జహాన్‌ వంటి వారిని గానీ చరిత్రపుటలనెక్కిస్తాం. ఇదే ధోరణి నేటికీ మీడియాలో కూడా కనబడుతుంది. సేద్యం చేసినా, సౌందర్యరాశిగా నిల్చినా వారు ఫిమేల్‌ సెలబ్రిటీలో, సెలబ్రిటీ భార్యలో, ప్రియురాళ్ళో, చెల్లెళ్ళో, తల్లులో చేయాలి, అంతేకానీ మరొకరు కానేకాదు!
అందువల్లనే మన సమాజాన్ని బుల్డోజ్‌ చేసిన వాదాల చట్రాల కింద నలిగిపోయిన స్త్రీలోకం, శ్రామిక వర్గం, దళితులు ఇటీవల దశాబ్దాలలో ఎలుగెత్తక తప్పలేదు! కరెక్షన్‌ జరగాల్సిందే. ఆర్భాటపు ప్రకటనలకన్నా ఆత్మగౌరవ ధోరణిలో ప్రవర్తన పెరగాలి! ఈ మధ్య శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో మా అమ్మా, నాన్న పేరున ఎమ్మెస్సీ విద్యార్థినికి ప్రతి ఏటా బంగారు పతకం ఇవ్వడాన్ని ప్రారంభించాలని పైకం పంపుతూ, అభ్యర్థించాను. అయితే ఆ ప్రింటెడ్‌ ఫార్మ్‌లో తండ్రి పేరు తర్వాత తల్లి పేరు రాయమని ఉంది. అదికాదు క్రమం అని చెబుతూ తల్లి పేరు ముందు రాసి, తండ్రి పేరు రాశాను. యూనివర్శిటీ ఇప్పుడు అలాగే నిర్ణయించి నాకు ఉత్తరం పంపింది. ఇలా మనకు ప్రతిస్థాయిలో జాగరూకత అవసరమవుతోంది.
‘‘గడచిన నూరేళ్ళలో పాశ్చాత్యాంగన సాధించలేకపోయిన పురోగతిని గతించిన ముప్ఫై సంవత్సరాలలో భారతనారి సాధించగలిగింది. శీఘ్రగతినే కాకుండా నిరాటంకంగా కూడా ఈ పురోగమనం కొనసాగింది’’.
‘‘ఓటింగ్‌ హక్కు కోసం పాశ్చాత్యాంగన సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. భారతనారికి అటువంటి అగత్యం కలగలేదు. అన్ని పదవులకు అన్ని పాశ్చాత్య దేశాల స్త్రీలకు ఈనాటికీ అర్హత లేదు. కానీ, భారత మహిళ పొందజాలని పదవి ఏదీ లేదు’’ అంటూ నార్ల వెంకటేశ్వరరావు 1949 ఫిబ్రవరి 13 ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదకీయాన్ని ‘‘భారతనారితో పాటు పతనమైన భారతదేశం తిరిగి ఆమెతో పాటు తలయెత్తుతుంది. ఇది తథ్యం’’ అని ముగిస్తారు.
కనుక మనకు స్వదేశీ చరిత్ర, స్వదేశీ దృష్టి కూడా ఆత్మవిశ్వాసంతో పాటు కావాలి. వాటికి ఆధారాలేమిటో సాక్ష్యంగా ప్రకటించడానికి అన్వేషించాలి! మరి ఆ ప్రయత్నాలు ఏమిటి? ఎలా?
‘‘అహింసే జీవనసూత్రమైతే, భవిష్యత్తంతా స్త్రీ మూర్తిదే (Iట అశీఅ ఙఱశీశ్రీవఅషవ ఱం ్‌ష్ట్రవ శ్రీaష శీట శీబతీ పవఱఅస్త్ర, ్‌ష్ట్రవ టబ్‌బతీవ ఱం షఱ్‌ష్ట్ర షశీఎaఅ)’’ అనే గాంధీజీ మాట వినబడగానే గురజాడ చెప్పిన ‘‘ఆధునిక స్త్రీ…’’ అనే మాట గుర్తుకు రావచ్చు. గాంధీజీ చెప్పినా, మార్క్స్‌ చెప్పినా, మరొకరు చెప్పినా… చెప్పిన విషయాన్ని చూడాలిÑ అందులో బాగోగులు, దానివల్ల కలిగే బాగోగులు గమనించాలి! అదే కీలకం.
అందువల్ల సమాజంలో పర్యావరణ దృష్టి ఎంత ముఖ్యమో మహిళా దృక్పథం అంతే ముఖ్యం! ఎందుకంటే ప్రకృతికి, ప్రమదకు విశ్వమంత వ్యాప్తి, ప్రాముఖ్యత ఉన్నాయి కనుక! అన్నట్లు 1917లో వెలువడిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచన ‘భారత రమణీమణులు’లో విషయాన్ని వివరించిన ధోరణి ఎలాంటిది? ఎవరైనా కాస్త చదివి చెబుతారా?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.