అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ

శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది.

స్వతంత్రమందుకొని డెబ్భయి ఐదేళ్ళు పూర్తయిన శుభదినాన్ని 75 సంవత్సరాల అమృత ఘడియను మన కేంద్ర ప్రభుత్వ నేతలు, మంత్రివర్యులు ఓ గొప్ప పండుగలా, ఓ అట్టహాస దినంగా భావించి, ఆనంద వెల్లువలతో అద్భుతంగా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ నగర సమీప పట్టణ, పల్లెల ప్రజలందరూ 75 వత్సరాలు పూర్తిచేసుకొన్న ఈ శుభదినాన్ని పండుగ చేసికొని తమ శక్తిమేరకు ఆనందపరవశులయ్యారు.
ఈ స్వాతంత్య్ర మహోత్సవ దిన సమయాన, మన స్వాతంత్య్రోద్యమ నేతలను, కార్యకర్తలను తలచుకొని నివాళులు అర్పించడం భారతీయుల కనీస ధర్మం! దశాబ్దాల పాటు జైళ్ళలో మగ్గి ఉరికంబాలెక్కిన ఉదంతాలను, ప్రాణాలర్పించిన యోధులను మననం చేసుకొని వీర విప్లవ వందనాలర్పించడం మన ధర్మం.
స్వతంత్ర సాధన క్రియ సందర్భంలో, మున్ముందుగా మన మనసులో మెదిలేవారు పాతికేళ్ళు కూడా దాటని యువ ఉద్యమ యోధులు భరత్‌ సింగ్‌, చంద్రశేఖర ఆజాద్‌, వారి మిత్రులు దేశం కోసం ఉరికంబాలెక్కి, ప్రాణాలర్పించిన ఘటనలు. మాతృదేశం నిరంతర దాస్యం నుండి విముక్తమై స్వేచ్ఛనొందేందుకు గాను, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యువ కిశోరాలను తరతరాలుగా కీర్తించి, అభివాదనలను అర్పించుకుంటోంది భారత ప్రజానీకం.
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో, మరువలేని మరో ఘోర సంఘటన జలియన్‌ వాలా బాగ్‌ సామూహిక హత్య. స్వాతంత్య్ర స్ఫూర్తితో ఒకచోట కలిసిన వేలాది స్త్రీ పురుషులను జనరల్‌ డయ్యర్‌ నాయకత్వంలో పోలీసు మూకలు తుపాకీ గుండ్లకు బలి చేసిన ఘోర సంఘటనను మరచిపోగలరా మన భారత ప్రజలు!
అండమాన్‌ దీవుల్లో బందీలైన స్వాతంత్య్ర కార్యకర్తల చరిత్ర, అది మరో ప్రత్యేక హింసా చరిత్ర. బ్రిటిషు పాలకులు అక్కడ నిర్మించిన సెల్యులర్‌ ఖైదీ గదుల్లో సమరయోధులను, ఒక్కొక్కరినీ ఒక్కో ఇరుకు గదిలో దశాబ్దాల పాటు బంధించి
ఉంచిన హింసోదంతాలు, మనకంతగా తెలిసినవి గావు. ప్రతి సాయంత్రం వీరందరి చేత సామూహికంగా అతి నీచపు చాకిరీలు చేయిస్తుండేవారట.
బ్రిటిష్‌ కంపెనీల వాళ్ళు ఆదిలో ఫక్తు వ్యాపారం కోసమే గదూ మన గడ్డమీద కాలుబెట్టింది. క్రమక్రమంగా ఈ ‘కంపెనీ’ తమ వ్యాపార చాకచక్యంతో బ్రిటిషు ప్రభుత్వానికి బాగా దగ్గరవసాగాయి. బ్రిటిష్‌ ప్రభుత్వ పాలకులు మనకూ పాలకులుగా మారిపోయారు. ఎన్నో కుయుక్తులతో మన దేశాన్ని తమ వలస దేశంగా మార్చేందుకు తమ సైనిక బలాలను ఇక్కడి కంపెనీతో తెలివిగా జోడిరచారు. ఈ కంపెనీ సైన్యాలు ఇక్కడి చిన్న చిన్న సంస్థానాధీశుల మధ్య కలతలు రేపి, పరస్పర దాడులు జరుపుకునేలా చేసి, ఒక రాజుకు తోడ్పడిన తమ సైన్యాన్ని మరు నిమిషాన అతడి ప్రత్యర్థికి సహాయపడే ఎత్తుల్ని అవలంబించారు. దీనికి ‘సైన్య సహకార పద్ధతి’ అన్న ముద్దు పేరును పెట్టుకున్నారు.
ఇలాంటి నీతిమాలిన కుయుక్తులతో వ్యాపార కంపెనీ కాస్తా, ఈ దేశపు ఏకాధిపతిగా రూపొందింది. భారతదేశం వీరి వలస రాజ్యంగా మారింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తరపు వైస్రాయి పాలనలోకి, ఆధిపత్యంలోకి చేర్చబడిరది.
వలస బానిసలు నిరంతర దోపిడీకి గురవుతూ కృంగి కునారిల్లుతున్న ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రాలను సాధించుకునేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సంస్థలు స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాన్ని ఆరు దశాబ్దాల పాటు కొనసాగించి నడిపారు. ముందు వివరించినట్లుగా దీర్ఘకాలపు జైళ్ళ బ్రతుకులు, ఉరికంబాలకు ఉసురులనర్పించటాలు మొదలైన ఉద్యమ పోరాటాల ఫలితంగా ఆగస్టు 15,1947న భారతదేశం స్వతంత్ర దేశమయ్యింది.
… … …
స్వాతంత్య్రానంతర స్వదేశ పాలన, అధిక కాలంపాటు కాంగ్రెస్‌ సంస్థ ఆధ్వర్యాన్నే కొనసాగుతూ వచ్చింది. మూడు రాష్ట్ర పాలనలు… త్రిపుర, బెంగాల్‌, కేరళలలో కమ్యూనిస్టు పార్టీల పాలనలు రెండేసి దశాబ్దాల పైగా కొనసాగాయి. కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు పాలన ఈనాటికీ జరుగుతూనే ఉంది.
స్వేచ్ఛానంతర పాలన ప్రారంభమైన మూడు నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయ జన సంఘంగా మొదలై బిజెపి పార్టీగా మారిన మితవాద పార్టీ తన పరిమిత కాల పాలనను సాగించింది, సాగిస్తోంది.
స్వదేశీయ పాలనా క్రమంలో అగుపడుతున్న ప్రధాన అంశాన్ని, ప్రజలు గ్రహిస్తూ, గమనిస్తూనే ఉంటున్నారు. పాలన పీఠమ్మీద కూర్యున్న ఏ రాజకీయ నేతలకైనా అవసరమైన ముఖ్య విషయం తాము మాత్రమే పాలనాధికారంలో ఉండిపోవాలి, మరొక పార్టీకి ఇందుకవకాశం ఇవ్వగూడదన్న ప్రాకులాట. ఇంతే తప్ప ప్రజల పరిస్థితులెలా ఉన్నాయి, వాటిని మెరుగుపరచి, వారికెదురవుతున్న తీవ్ర సమస్యల్ని ఏ విధాన పరిష్కరించుదాం అన్న ఆలోచన, దూరదృష్టి మాత్రం అసలుండడం లేదన్న విషయం ప్రజల సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పెంపుదలలే తమ ప్రధాన కర్తవ్యమన్న ఆలోచన ఏ మాత్రం కనిపించడం లేదు ఎవరిలోను.
స్వేచ్ఛ పొందిన 75 సంవత్సరాలలో, ప్రతి ఐదేళ్ళకూ జరుగుతున్న ఎన్నికల సంరంభాలప్పుడల్లా ప్రజలు తమనే గెలిపించాలని, తమను మాత్రమే మంత్రులుగా, పాలకులుగా ఎన్నుకోవాలన్న ఆకాంక్షలు ప్రతి రాజకీయ పార్టీలోనూ అధికమవుతున్న సంగతి ముమ్మాటికీ నిజం. గత మూడున్నర దశాబ్దాలుగా, రకరకాల పార్టీలు నడుపుతున్న రాజకీయం ఈ అధికార స్వాధీనం కోసమే. ఇందుకోసమే మరి, పార్టీల మధ్య పరస్పర నిందలు, కొట్లాటలు, తన్నులాటలు.
ఇటీవల కాలంలో ఆయా పార్టీల సభ్యులు తన వ్యక్తిగత అవసరాల కోసం కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఒక పార్టీ సభ్యులుగా ఉంటూ తనకు పోటీ చేయగల అభ్యర్థి టికెట్‌ దొరకనప్పుడు, టికెట్‌ ఇవ్వజూపిన వ్యతిరేక పార్టీ సభ్యుడయిపోయి ప్రత్యర్థిగా నిలబడిపోవడం!
ఇంక ఓట్ల సంపాదనÑ ఇది ఒక దుష్ట యజ్ఞం. ఈ సంపాదనా పద్ధతులు మొదలుబెట్టి, దగ్గర దగ్గరగా నలబై ఏళ్ళవుతోంది. మొదట్లో, ఓటుకింతని డబ్బులు పంచుతుండేవారు. కాలం గడుస్తున్నకొద్దీ రెట్టింపు డబ్బుతో ఖరీదయిన ఆధునిక గృహ పరికరాలు, టీవీలు, కంప్యూటర్లను ఇంటింటికీ పంచుతూ, ఓట్లు సంపాదించడం… ఇలా అనేకానేక దిగజారుడు పద్ధతుల ద్వారా ఓట్లు సంపాదించి గెలుపు గుర్రాలెక్కుతున్నారు, ప్రజా ప్రతినిథులమంటున్నారు.
ఈనాటి రాజకీయ ధోరణి ఓటర్లందర్నీ లంచగొండులుగా, అవినీతిపరులుగా మారుస్తోంది. వరుసగా జరిగే ఒక్కొక్క ఎన్నికల పోటీలను, రకరకాల లంచాలిచ్చి గెలవడం ఒక మామూలు విషయమైపోయింది!
… … …
గతంలోను, ప్రస్తుతంలోను ప్రజలు నిత్యమూ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ` ఆహార దినుసుల ధరలు అందుకోలేని పెరుగుదల. కూలి పనితోనే కూడు దొరికే స్థితి నిత్యమూ కలుగుతుంటుంది పల్లె శ్రమజీవుల్లో. రకరకాలుగా వృద్ధి చెందుతూ వస్తున్న వ్యవసాయం, సుమారు పాతిక, ముప్ఫై ఏళ్ళనుంచి మూలబడడం తెలిసిన విషయమే. అభివృద్ధి పంటలలో కాక, విత్తనాలు, ఎరువుల కల్తీ గొప్పగా ధర రాకపోవడం, వ్యవసాయ రుణాలు తీర్చజాలని రైతు ప్రాణాలు తీసుకోవడం మామూలు విషయమయ్యింది గదా!
ఇటీవల పాలకులు చేపట్టి ప్రారంభించిన ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేషన్ల ప్రైవేటైజేషన్‌ వలన, పట్టణ నగర నివాసులయిన నిరుపేదలకు నెలవారీ, చివరకు దినవారీ పనులు లభించక దిక్కులేని స్థితి ఏర్పడడం తెలియని సంగతా!
ప్రతి ఒక్క పౌరునికీ తప్పక అందవలసిన విద్య, వైద్యం ప్రైవేటుపరమై పోయాయి. బహుకాలం నుంచీ పేదల బిడ్డలూ, యువకులు… విద్యల భవనాల గేట్లను తాకలేకున్నారు, కన్నెత్తి చూడలేకపోతున్నారు. ఇదే రీతిన జబ్బులు, రోగాల పాలవుతున్న పేదలు, సామాన్యులు ఆస్పత్రుల లోపలకు అడుగుబెట్టలేని స్థితి.
ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళ సదుపాయాన కళాశాల చదువులు పూర్తిచేసిన పేద యువజనులకు
ఉద్యోగాలందడం లేదు, అందుతున్నది అంధకారం మాత్రమే.
ప్రస్తుతం దేశంలో ప్రారంభించబడుతున్న కొత్త పరిశ్రమలతో సహా, చిరకాలంగా నడుస్తూ జీవనోపాధినందిస్తున్న పూర్వ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరిస్తోంది మన ప్రభుత్వం. కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా అప్పగిస్తోంది… రిలయన్స్‌, అంబానీలకు. ఎంత కాదన్నా ఇది యదార్థం.
ఈ సందర్భంలో బొంబాయి నగరంలో 1982లో జరిగిన బట్టల మిల్లుల మూత ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం. ప్రభుత్వ కొత్త చట్టం ఒకటి… కొన్ని బట్టల మిల్లులను మూసివేయడం వల్ల వేలాది కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయారు. వారి తిరుగుబాట్లు, ఆందోళనలు తీవ్ర కల్లోలం రేపాయి. అయినప్పటికీ స్థానిక కార్మికులకు నెలసరి ఉద్యోగాలు తిరిగి దొరకలేదు. చుట్టుపక్కల కర్నాటక, ఉత్తర తెలంగాణ నుంచి వలస వచ్చిన పేద కుటుంబాల వారెందరో తమ జీవనోపాధుల్ని కోల్పోయి, బొంబాయి, షోలాపూర్‌లను వదిలివేసి తిరిగి వచ్చెయ్యక తప్పలేదు. హైదరాబాద్‌కు చేరుకున్న చాలామంది నిస్సహాయులు, దినసరి కూలీ పనుల్ని కష్టపడి వెతుక్కొని జీవనం సాగించారు.
బొంబాయి బట్టల మిల్లులు కొన్ని మూసివేత, సంబంధిత కార్మికుల హాహాకారాలు, తిరుగుబాట్లు… నేటి సీనియర్లకు జ్ఞప్తిలో
ఉంటాయి ఇప్పటికీ.
ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పరిశ్రమల కార్పొరేషన్ల ప్రైవేటీకరణ వల్ల కొందరు టెక్నీషియన్లకు మినహా, వేలాది వర్కర్లకు, కార్మికులకు జీవనోపాధులు మాయమవ్వక తప్పదు. నిరుద్యోగులై దిక్కుతోచని స్థితి తప్పదు.
రోజురోజుకూ పెరుగుతున్న ఆహార, అవసర వస్తువుల ధరలు, తరిగిపోతున్న ఉద్యోగ, పారిశ్రామిక క్రియలు మాయమౌతుండడంతో దేశ ప్రజలు అత్యధికులు అత్యంత దయనీయ స్థితికి చేరిపోతున్నారు.
ఈ బహుముఖ సంక్లిష్టతల సమయాన పాలకనేతల దృష్టి ఆకాశంవైపుగా, హైందవ మత రక్షణ పరివ్యాప్తం మీద కేంద్రీకరించబడుతుండడం ఆశ్చర్యకరం!
మన ప్రజల్లోనూ, దేశ విదేశాల్లోనూ అనుసరింపబడుతున్న మత ధర్మాలన్నింటికీ దేవుడు అన్న మహత్తరుడు ఒకే ఒక్కడు. మన హైందవ మత ధర్మంలో ముగ్గురు దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, వారి అనుయాయులు. త్రిమూర్తులనబడుతున్న ఈ ముగ్గురిలో ఎవరికిష్టమైన దేవుడ్ని వారు పూజించుకుంటుంటారు. కానీ వేర్వేరు దేవుళ్ళ భక్తులకు ఒకరంటే ఒకరికి పడదు. వైష్ణవ భక్తులు, శివభక్తుల్ని దూరముంచుతూ ద్వేషిస్తుంటారు. వీరివి వేర్వేరు దేవాలయాలు. ఒకరి గుడికి మరొకరు రారు.
క్రీ.శ. పది, పధ్నాలుగు శతాబ్దాల మధ్య వైష్ణవ, శైవ వర్గాలు తమ మత ధర్మ విశిష్టతల గురించిన ఎన్నెన్నో గర్షణలు, కలతలూ, కలహాలు తీవ్ర ఉద్యమాలుగా నడిచాయి.
హైందవ మత ప్రత్యేకత ఒకటి అమలవుతూ వస్తున్నది. ఈ మతం అమలు చేసే సాంఘిక వ్యవస్థ పేరు చాతుర్వర్ణ వ్యవస్థ. చిత్రమేంటంటే ప్రపంచ దేశాలలో మరెక్కడా ఇది కనిపించదు. అమలు ఆలోచనే లేదు. ఇందుకు మహత్తర సాక్ష్యంగా ‘‘చాతుర్‌ వర్ణం మయా స్రష్టం’’ అని శ్రీకృష్ణుడి చేత చెప్పించారు.
ఈ చాతుర్వర్ణాలకు జతగా మరొకటి పంచమ వర్ణమన్నది సృష్టించబడిరది. హైందవ ధర్మాచారాలు మరొకటిగా… ఈ నేపథ్యంలో హైందవ మత ప్రాముఖ్యత, ప్రచార ఆవశ్యతకు సంబంధించి ఇటీవలే పత్రికా ప్రకటన ఒకటి వెలువడడం అందరూ గమనించి ఉంటారు. పత్రికా ప్రకటనకు పూనుకొన్నవారు సామాన్యలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ నేతలు. వివరాలివి.
తిరుపతి పట్టణాన శ్రీ తిరుమల వేంకటేశ్వరునిగా ప్రసిద్ధి చెంది, ప్రతిదినం వేలాది భక్తుల పూజలు, మొక్కుబడుల ద్రవ్యాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అట్టి ఈ మహత్తర వేంకటపతి దేవాలయాలను వందకు పైగానే… కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకు నిర్మించవలెనన్న దృఢనిర్ణయాన్ని ఉన్నతస్థాయి పాలకనేతలు విడుదల చేసిన ఒక చారిత్రక ప్రకటన! శ్రీ తిరుమల వేంకటేశ్వరునిగా వేలాది భక్తుల పూజలను, మొక్కుబడుల ద్రవ్యం ప్రతిదినం అందుకుంటున్న వేంకటపతికి వందకు పైగా దేవాలయాలను, కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకు ఉన్నత రీతిన నిర్మించాలని దృఢంగా నిశ్చయించిందట కేంద్ర ప్రభుత్వం.
చిన్నతరహా వెంకన్న గుడులు మరికొన్నింటిని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల గ్రామవాసాలలో అధిక సంఖ్యలో నిర్మించదలచింది. పరమతీయులు ఈ వర్గాలను అత్యంత సులభంగా తమ మతాల్లోకి మార్చుకోగలరు కాబట్టి అట.
మత సంబంధమైన ఒక ముఖ్య సంగతిని ఈ సందర్భంగా ఒప్పుకోవలసి ఉంది. మన పాలక నేతల కథనం ప్రకారం దేశ ప్రజలు చాలామందిని క్రైస్తవం, ఇస్లాంలోనికి మార్చివేసే యత్నాలు ముమ్మరమవుతున్నాయట! పరమతాల్ని స్వీకరించే వారిని, అందుకు ప్రోత్సహిస్తున్న వారిని తీవ్ర శిక్షకు గురిచేయ సంకల్పిస్తున్నదట కేంద్ర ప్రభుత్వం.
మత మార్పిడి విషయాల్లో సామాన్య ప్రజలకు అర్థమవ్వనిదేమిటి?
ప్రజా రంగాలన్నింటిలో తనకెదురవుతున్న అనునిత్య సమస్యల్ని, వీలైనంత వేగంగా పరిష్కరించబూనటం పాలకుల ప్రధాన కర్తవ్యమన్న విషయం కేంద్ర ప్రభుత్వ నేతలకు, ప్రజలకు బాగా తెలిసినదే. పాలనా విధానం ప్రజానుకూలంగా, ప్రజాహితంగా నడిపించడం ప్రభుత్వానికి అతి ముఖ్య విషయం. కాదనగలరా ఎవరైనా?
ప్రజల్లో అత్యధికులు ప్రతిదినం అనేక ఇబ్బందులకు గురికాబడుతూ, నరకం చూస్తున్నారు. ఈనాడు దేశ దుస్థితి తెలియనిదెవరికి? ప్రజల ముఖ్యావకాశాలకు ప్రాధాన్యమిచ్చి, నిత్య బాధల నుంచి విముక్తుల్ని చేస్తూ, వారు నిశ్చింతగా నిద్రించగలిగే చర్యల్ని ప్రాథమిక ధర్మంగా చేపట్టడం ఎంత అవసరమో ప్రభుత్వ నేతలకు తెలియనిదా?
ఇందుకు భిన్నంగా, తమ దృష్టినీ, ధ్యాసనూ మత విషయం మీదకు త్రిప్పారు. హైందవ మత సంరక్షణ తమ కర్తవ్యమట! ఎంత సమర్థనీయమిది? భారతీయులు కొందరు తమ ప్రాచీన హైందవాన్ని విడిచి, పరాయి మతాన్ని స్వీకరించడం, మన దేశ సంస్కృతీ సదాచారాలకు విద్రోహమట!
ఈ విధంగా విద్రోహ తిరస్కరణల భావంతో స్వీయమతాన్నొదిలి, పరాయి మత స్వీకరణకు పూనుకోవడం… అవి క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం ఏదైనా కావచ్చు. అసలు మార్పిడి అనేది శిక్షార్హమైన నేరంగా నిర్ణయించి, చట్టాలు, తాఖీదులు వెలువరించడం ఏం ధర్మం? ఏం న్యాయం?
దేశమేదైనా గానీ, అక్కడ వేర్వేరు మతాలు, మతస్థులు ఉండడం అతి సహజం. పాలకులకు కావలసింది ప్రజల క్షేమం, వివిధ రంగాల అభివృద్ధి, దేశ సరిహద్దుల సంరక్షణ, విదేశ దురాక్రమణలను ఓడిరచగల శక్తి, సత్తువ.
ప్రజలు వివిధ మతస్థులుగా ఉంటారు. ప్రస్తుతపు తమ మత నమ్మకాల్ని వదలి, కొత్త మతాల్లోకి వెళ్తుంటారు. అది వారి ఇష్టాయిష్టాలకు చెందిన విషయం. కాదనే హక్కు ఎవరికీ ఉండదు.
ఒక విషయాన్ని గమనిద్దాంÑ వేల కాలం నుండీ హిందూ దేవ దేవతలను నమ్మి పూజిస్తూ, అతి విశ్వాసంతో మొక్కుబడులు చెల్లించుతోన్న పంచమ హైందవులు` పైకులాల వారు పూజిస్తుండే ఇదే దేవుళ్ళ గుడుల్లో కాలుపెట్టగలరా? అంటరాని హీనులట ఈ మనుషులు. వీరికి గాంధీజీ కాంగ్రెస్‌ సంస్థలు హరిజనులన్న కొత్త పేరు పెట్టిన కొత్తలో, కొన్నాళ్ళు మాత్రం హరిజన దేవాలయ ప్రవేశాలు నడిచాయి. తర్వాత అంతటా నిషేధాలే!
వేల కాలం నుండీ కులాలు వేరయినా అందరం హిందువులమే అని పూర్తిగా విశ్వసిస్తూ బ్రతికేస్తున్న కోట్లాది ఈ జీవులు ఊరికి దూరంగా నెట్టబడినారు. వీరివి మాలపల్లెలు, మాదిగగూడేలు!
ఐతే పైకులాలమనుకునేవారు ఈ అంటరానివారితో సంబంధముండనివారా… కానే కాదు. వీరిని తమ పాలేళ్ళుగా, జీతగాళ్ళుగా మలుచుకుని, రాత్రింబవళ్ళు నానా చాకిరీ చేయించుకునేందుకు మాత్రం పనికొస్తారు.
కులహీనులన్న పేరున వేల ఏళ్ళుగా సాగుతున్న శ్రమ దోపిడీ ఇది!!
పైకులాలన్న నాలుగింటిలోనూ, ఎన్ని హెచ్చుతగ్గులు, ఎంతటి ఆధిక్యతలు! ఎన్నెన్ని కుల యుద్ధాలు! ఈ విధమైన అతి కృర మత ధర్మాలు, వర్ణ (కుల) భేదాలు, ఇంకే మతంలోనూ చూడము.
మానవత, పరస్పర గౌరవ సహకారాలకు బదులు, హింస పీడనలకు గొప్ప నెలవై, శ్రమను దోచుకునేందుకు ఒక ప్రత్యేక అంటరాని కులాన్ని సృష్టించిన హైందవ ధర్మాన్ని ఇంకెంత కాలం మోస్తాం మనం? ఇంకొంత కాలంపాటు జడత్వంతో, బానిసత్వంలో మునిగి తేలుతూ ఉంటాం మనం? అద్భుత మేధాశక్తి, అత్యంత మానవత, సాటిలేని విచక్షణా శక్తుల సంపూర్ణ రూపమైన డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ సర్వవిధాలైన అణచివేతకు, అవమానాలకు, శ్రమ మానవత దోపిడీకి బలవుతున్న తన సాటి వర్గ సోదరులను మేల్కొల్పి, హైందవాన్ని త్యజించి, బౌద్ధ ధర్మ ప్రవేశ మహత్‌ క్రియకు సారధి అయ్యాడు.
మత జోక్యం గాక, మానవుల ప్రాథమిక అవసరాలు తీర్చడం, దేశం సమస్త కార్య రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడవడం జరిగి తీరాలని హెచ్చరించాడు.
… … …
ఈనాటి చరిత్రనూ, సమీప గతాన్నీ, నూరు, నూట యాభై ఏళ్ళ నాటి చారిత్రక పరిణామాలను నిశిత దృష్టితో చూసినట్లయితే ఒక విషయం స్పష్టమవుతుంది.
పాలకులు ఎవరైనా గానీ, కులాలు ఏవైనా గానీ వారి అభిమతం మాత్రం ఒకే ఒక్కటి… బలహీనుల్ని పీడిరచడం, విభజించి పాలించడం, సహజవనరుల్ని కొల్లగొట్టి అవి సంపన్న వర్గాలకు దోచిపెట్టి హక్కు భుక్తం గావించడం.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను వాళ్ళు అవలంబించే యుక్తులూ, కుతంత్రాలు సైతం ఎంతో సాధారణమనిపిస్తాయి మనకు. సైన్య సహకార పద్ధతి, బెంగాల్‌ విభజన, పరిశ్రమల పరాధీనత, వంద ఆలయాల బృహత్‌ నిర్మాణ పథకం.
గత వంద, నూట యాభై ఏ ళ్ళ వ్యవధిలోనే వీరేశలింగాలు, మహాత్మా ఫూలేలు, జవహర్‌లాల్‌లూ, బి.ఎన్‌.అంబేద్కర్‌లూ మనకంది వచ్చారు. సంఘ సంస్కరణ, బడుగు జీవుల సమున్నతి, సర్వ ప్రజాశ్రేయస్సు, సర్వతోముఖాభివృద్ధికి గాను తమ శాయశక్తులా కృషి చేశారు. గణనీయమైన అపూర్వ మార్పులను తీసుకురాగలిగారు.
ఎన్నెన్ని ప్రతికూల శక్తులు, ఎంతెంతటి ఎత్తులు ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ సమాజం మున్ముందుకు వెళ్తూనే
ఉంది. కానీ ఆ బాటలో ఎదురవుతుండే అనేకానేక ప్రతిబంధకాలను ప్రతి ఒక్కరూ గ్రహించి, వాటి నిర్మూలన యత్నంలో తమ తమ పాత్రను నిర్వహించినప్పుడు మాత్రమే సమాజ పురోగతి సజావుగా సాధింపబడుతుంది.
అమృతోత్సవాన్ని దాటుకుని, మరో అడుగు ముందుకు వేస్తోన్న సమయాన ఈ కనీస కర్తవ్యాన్ని మనమందరం గుర్తించి నిర్వహించవలసి ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.