‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్‌

బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప

గొప్ప కవులు, రచయితలు నవలలు రాశారు. అందులో చారిత్రక అంశాలను మాత్రమే వివరించడం జరిగింది. చారిత్రక నవల అనే నామకరణంలో శప్తభూమి అనే శీర్షికతో బండి నారాయణస్వామి నవలను రాసి, నోరి నరసింహశాస్త్రి రాసినటువంటి గోన గన్నారెడ్డి, రుద్రమదేవి, ప్రతాపరుద్ర మొదలైన రచనలకు భిన్నంగా ఈ తరం పాఠకులకు, పరిశోధకులకు పరిపూర్ణంగా అర్థమయ్యే స్థితిలో నవలను చిత్రీకరించారంటే నవలల మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బండి నారాయణస్వామి నవలలను దృష్టిలో ఉంచుకుంటూ గత రచయితల చారిత్రక నవలలను, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో వచ్చే నూతన నవలలను పోలుస్తూ అందులోని మార్పులను పరిశీలిద్దాం…
పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్థములో భారతదేశం సాంస్కృతికంగా, రాజకీయంగా చాలా మార్పులకు లోనయింది. పాశ్చాత్య సాహిత్య సంస్కృతుల ప్రభావం, ముద్రణా యంత్రాల వ్యాప్తి వలన విద్యా విధానంలోనూ, ప్రజల ఆలోచనా సరళిలోనూ అనేక మార్పులు వచ్చాయి. అప్పటివరకూ ప్రబంధ ఆఖ్యాది కావ్యాదులతో కేంద్రీకరింపబడిన రచయిత దృక్పథం వాస్తవికత వైపు మళ్ళింది. తత్ఫలితంగా తెలుగు రచయితల ఆలోచనలు పాశ్చాత్య సాహిత్యంలోని ప్రక్రియలవైపు పరుగెత్తాయి. ఆ ప్రక్రియల్లో ఒకటైన నవల క్రమంగా విస్తృతం చెంది ప్రాభవాలను పొందుతూ వస్తోంది.
స్వాతంత్య్రానికి ముందు 1896 నుండి 1947 వరకు తెలుగులో వచ్చిన చారిత్రక నవలలను ‘నాడు’గా భావించి , స్వాతంత్య్రం తర్వాత, 1947 నుండి నేటి వరకు వచ్చిన చారిత్రక నవలలను ‘నేడు’గా భావించి అవి సమాజంలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని ఇప్పుడు చర్చిస్తాను. కానీ, ఈ రెండు కాలాల్లో వచ్చిన చారిత్రక నవలల ప్రయోజనం ఒక్కటే. అందులో ఆద్యంతం ప్రవహించేది జాతీయ చైతన్యమే. మొదటిది స్వరాజ్య సాధన లక్ష్యంగా సాగితే, రెండవది సురాజ్య స్థాపనకు ప్రయత్నించిన విధానం. అంటే ఈ నూరేళ్ళ కాలాన్ని ప్రధానంగా పునరుజ్జీవన యుగంగా భావించవచ్చు. అంటే, ఈ కాలంలో రాయబడిన నవలల ఇతివృత్తాలను ఆధారం చేసుకొని సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, మనోవైజ్ఞానిక నవలలు, అపరాధ పరిశోధన నవలలుగా విభజించబడ్డాయి. అందులో స్వాతంత్య్రానికి ముందు తెలుగులో ఎన్నో నవలలు, చారిత్రక కావ్యాలు వెలువడ్డాయి. ఎందుకంటే, స్వాతంత్య్రం కోసం సాగించిన సమరంలో జాతి పునరుజ్జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వరుసలో చారిత్రక నవలలు రాసినవారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వేంకట పార్వతీశ కవులు, పిలకా గణపతి శాస్త్రి, మల్లాది వసుంధర, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి, బిరుదు రాజు రామరాజు, బి.ఎన్‌. శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్‌, కొర్లపాటి శ్రీరామ్మూర్తి, ఓగేటి ఇందిరాదేవి, శ్రీనివాసరాజు తదితరులెందరో చారిత్రక నవలలను వివిధ కోణాల్లో తీర్చిదిద్దారు.
స్వాతంత్య్రానికి ముందు తెలుగు చారిత్రక నవల పుట్టు పూర్వోత్తరాలు ` నాడు :
‘‘రచనా కాలంలోని వాస్తవికములైన జీవితాచార వ్యవహారములను చిత్రించేది’’ నవల అని నవలపై విస్తృత పరిశోధన చేసిన బొడ్డుపాటి కుటుంబరావు గారు అభిప్రాయపడితే, ‘‘సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాల్ని చిత్రిస్తూ, వ్యక్తుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల’’ అని మొదలి నాగభూషణ శర్మ అభిప్రాయపడ్డారు. సమాజంలోని మనుషుల జీవన విధానాన్ని, ఆ జీవన విధానంలో ఉన్న సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను రసవత్తరంగా, సహజంగా వర్ణించడానికి నవల చక్కని సాధనం అని చెప్పవచ్చును.
1. ఆంధ్ర నవలా పరిణామం 2. తెలుగు నవలా వికాసం ` 14.
నవలా యుగమునకు ప్రారంభ యుగమని చెప్పబడుతున్న 1872`1900 మధ్యకాలంలో నరహరి గోపాల కృష్ణమశెట్టి వ్రాసిన ‘‘శ్రీరంగరాజ చరిత్ర (1872)’’ను ‘‘నవీన ప్రబంధం’’ అని, వీరేశలింగం పంతులు గారు రాసిన ‘‘రాజశేఖర చరిత్ర (1878)’’ను ‘‘వచన ప్రబంధం’’ అని పేర్కొన్నారు. తరువాత ఇరవై సంవత్సరాలకు ‘రాజశేఖర చరిత్ర’ను విమర్శిస్తూ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి పీఠిక భాగములో నవల అనే పదాన్ని సూచించారు. ఆనాటి నుండి నేటి వరకు తెలుగు సాహిత్యంలో ప్రజల గౌరవాదరాలను పొందుతున్న ఏకైక సాహిత్య ప్రక్రియ నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
అయితే చారిత్రక నవలను ప్రత్యేకంగా పరిశీలించినపుడు ‘‘ఒక నిర్దిష్ట చారిత్రక దశలో రాజకీయాలను చిత్రించే సాహిత్య ప్రక్రియయే చారిత్రక నవల’’ అని తేలుతుంది. చారిత్రక నవల అంటే ఇతివృత్తం పూర్తిగా చరిత్రకు సంబంధించినదై
ఉండి కొన్ని ముఖ్య సన్నివేశాలు, విశిష్ట కల్పిత లక్షణాలతో చారిత్రక సన్నివేశాల పాత్ర పోషణకు భంగం కలుగకుండా పాత్ర పోషణ చేసేదే చారిత్రక నవల అని రుద్రమదేవిపై పరిశోధన చేసిన ప్రమీలారెడ్డి గారు వారి పరిశోధనా గ్రంథంలో అభిప్రాయ పడ్డారు.
నాటకంలో పాత్ర పోషణకు ప్రాముఖ్యం ఉన్నట్లే నవలలో మానవ జీవిత చరిత్రకు ప్రాచుర్యం ఉంటుంది. మానవ జీవితాన్ని దర్శించడానికి నవలా ప్రక్రియకు ఉన్నంత ఆదరణ దేనికీ లేదనడంలో ఆశ్చర్యం లేదు. నవలల్లో చారిత్రక నవల మరీ కన్నులకు కట్టినట్లుగా ఉంటుంది. చారిత్రక దృక్పథంతో గడచిన కాలాన్ని వర్తమాన కాలంలో ఉన్నట్లే సృష్టిస్తుంది ఈ చారిత్రక నవల. గత చరిత్రను ఇతివృత్తం రూపంలో రూపొందించగల శక్తి ఒక చారిత్రక నవలకు మాత్రమే ఉంటుంది.
తెలుగులో తొలి చారిత్రక నవలగా చెప్పబడుతున్న ‘‘హేమలత నుండి హిమబిందు వరకు’’ స్వాతంత్య్రానికి ముందు వచ్చిన చారిత్రక నవల. చిత్తూరు రాజు మేవారు రాజా లక్ష్మణ సింగ్‌ చరిత్రతో మొదటి చారిత్రక నవలైన ‘‘హేమలత’’ వెలువడిరది.
సహాయ నిరాకరణలో భాగంగా అడవి బాపిరాజు జైల్లో ఉండగా ‘‘హిమబిందు’’ (1942`45) నవలను రాశాడు. ప్రథమాంధ్ర చక్రవర్తులైన శాతవాహనుల చరిత్రను, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులను నాటి కాలంలోని పరిస్థితులకు (1922`45) అప్లై చేస్తూ రాయబడినది. అంటే మనల్ని పాలించిన మన రాజుల చరిత్రకు, నేడు పరిపాలించబడుతున్న పరదేశీయుల పాలనకు గల తేడాలను పాఠకులు గుర్తించి చైతన్యవంతులవ్వాలనేది నాటి రచయితల ఉద్దేశ్యం. ప్రతి రచనకూ స్వరాజ్య సిద్ధియే ప్రధాన లక్ష్యం.
ఉద్దేశ్యం :
చారిత్రక నవలలు ‘చరిత్ర’ మీద ఆధారపడి నిర్మింపబడతాయి. దేశపు చారిత్రక స్పృహలేని వారు చరిత్ర హీనులౌతారు. చరిత్ర అంటే కేవలం రాజులు, రాణులు, తారీఖులు, ఆర్ధిక స్పృహ మాత్రమే కాదు… అది ఒక సాంస్కృతిక ప్రవాహం, ఒక జీవన విధాన దర్పణం. ప్రపంచంలో అత్యంత ప్రాచీన చరిత్ర గల దేశం భారతదేశం. దేశ చరిత్ర పుస్తకాలలో కేవలం ఆయా కాలాల్లో పాలించిన రాజుల పరిపాలన గురించే చరిత్రకారుడు చెబుతాడు. కానీ, చారిత్రక నవలాకారుడు, ఆయా కాలాల్లోని చరిత్రను చెబుతూ చరిత్రతో బాటు రసవత్తరమైన కథను నడిపిస్తాడు. పాఠకునిలో కథతో బాటు చరిత్రను అర్థం చేసుకునే మహత్తరమైన శక్తిని చారిత్రక నవలాకారుడు కలిగిస్తాడు. సమాజంలో సాంస్కృతిక మానవుని నిర్మాణం చేసే ప్రయత్నమే చారిత్రక నవలల యొక్క ఉద్దేశ్యం.
స్వాతంత్య్రానికి ముందు వచ్చిన చారిత్రక నవలల్లో భారతీయ స్వాతంత్య్ర పిపాసను రెచ్చగొట్టే ప్రయత్నం కనిపిస్తుంది. చిలకమర్తి ‘హేమలత’, ‘అహల్యాబాయి’, బకించంద్ర చటర్జీ అనువాద నవలలు ‘దుర్గేశ్‌ నందిని’, ‘చంద్రశేఖర’, ‘ఆనంద మఠం’, ‘సీతారం’, విశ్వనాథ ‘సత్యబాయి’, ‘ఏకవీర’, బాపిరాజు ‘హిమబిందు’ తదితర నవలలన్నీ స్వాతంత్య్ర వీరులను తయారుచేసే విధంగా నిర్మింపబడినవే. అందుకే నవల ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పే నిర్దేశక సూత్రాలు అదృష్టవశాత్తూ నవలలకు లేవు. కాబట్టి నవలలను వర్ణణాత్మక సూత్రాలతో మాత్రమే విశ్లేషించవలసి ఉంటుంది అంటూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య (నవలా వికాసం) ‘కవిత్వం మీద వచన చేసిన తిరుగుబాటు నవల’ అని విశ్లేషించాడు.
సాధించిన ప్రయోజనం :
ప్రారంభ యుగంలో వచ్చిన నవలల్లో కథా కథనంలో, నిర్మాణ శిల్పంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంగ్ల సాహిత్య ప్రభావం కనిపిస్తుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో పాటు నాటి నవలల్లో రచయితలు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శించడం గమనించదగిన విశేషం. తొలి చారిత్రక నవల అయిన ‘‘హేమలత’’లోని కథ మేవారు రాణాలక్ష్మణ సింగ్‌ (1301) కాలం నాటిది. ఈయన చిత్తూరుకు చెందిన మహారాజు. చిన్నతనంలోనే తండ్రి పోవడంతో, అతని పినతండ్రి భీమ్‌సింగ్‌ రాజు అతనికి అండగా నిలబడి రాజ్యపాలన చేస్తాడు. హేమలత నవలకిది వృత్తాంతం. చిలకమర్తి వారు ఇందులో మొఘలాయి రాజ్యంలో జరిగిన అత్యాచారాలను వర్ణించారు. ఢల్లీి చక్రవర్తి అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తూరు సామ్రాజ్యంపై దండెత్తడం వంటి ఎన్నో చారిత్రక అంశాలు చిలకమర్తి వారి చారిత్రక నవలల్లో ఉన్నాయి. అంటే గత చరిత్రను తెలుసుకొని పరదేశీయుల పాలన నుండి విముక్తి పొందే చైతన్యం ప్రజల నుండి రావాలని ఆశిస్తారు చిలకమర్తి వారు.
అనువాద యుగంలో చారిత్రక నవలలు రచించబడటం, అనుకరించడం, అనువదించబడడం వలన ఈ యుగాన్ని అనువాద చారిత్రక యుగం అని కూడా చెప్పవచ్చు. ఈ యుగంలో భోగరాజు నారాయణమూర్తి వ్రాసిన ‘‘విమలాదేవి’’, ‘‘అల్లా హు అక్బర్‌’’, ‘‘చంద్రగుప్తుడు’’, ‘‘ఆంధ్ర రాష్ట్రం’’, వేలాల సుబ్బారావు గారి ‘‘రాణీ సంయుక్త’’, కేతవరపు వెంకట శాస్త్రి గారి ‘‘రాయచూరు యుద్ధం’’, దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి గారి ‘‘విజయనగర సామ్రాజ్యం’’, ఎ.వి.నరసింహం గారి ‘‘పాతాళ భైరవి’’… ఇలా చారిత్రక నవలలెన్నో ‘విదేశీయులు వెళ్ళిపోవాలి, స్వదేశీయులు బాగుపడాలి’ అనే నేపథ్యంతో వచ్చాయి. కర్షకులు, కార్మికులు, వ్యాపారస్తులు,
ఉద్యోగులు, స్త్రీలు, విద్యార్థులు అందరూ బాగుండాలని ఆశించి చారిత్రక నవలాకారులు చారిత్రక నవలలు రాశారు. సాధించిన ప్రయోజనం అంటే దేశ స్వాతంత్య్రమే.
నిర్మాణ పద్ధతి :
చారిత్రక కావ్యాల నిర్మాణానికి ఆధారమైన వస్తువే చారిత్రక నవలల నిర్మాణానికి దోహదం చేసింది. అయితే, కావ్యాలు కొన్నే వచ్చాయి, నవలలు వేలల్లో వెలువడ్డాయి. చిలకమర్తి, బాపిరాజు, నోరి, లల్లాదేవి, విశ్వనాథ, బి.ఎన్‌.శాస్త్రి, రామరాజు, శివప్రసాద్‌, ఐతా చంద్రయ్య, వసుంధర, వోగేటి ఇందిరాదేవి, తుమ్మలపల్లి తదితరులెందరో చారిత్రక నవలలు రచించారు. వాటి పరిశీలన వల్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని లక్షణాలు నిర్వచించుకునే అవకాశం కలుగుతుంది.
చారిత్రక వాస్తవికత :
గతంలో జరిగిన సంఘటన ఆధారంగా వ్రాయబడిన చరిత్ర శాసనాధారాన్ని బట్టి చారిత్రక నవల వెలువడుతుంది. శాతవాహనులు, గజపతులు, తానీషా, విష్ణువర్ధనుడు, చాంద్‌ బీబీ, చంద్రగుప్తుడు, రుద్రమదేవి, తారాబాయి…
వాస్తవికత వస్తువు :
ఇంగ్లీష్‌లో ప్లాట్‌, థీం అంటాం. ఈ వాస్తవికతనే రచయిత వస్తువుగా గ్రహిస్తాడు. ఆ వస్తువుల్లో నాయకుడు కనిపిస్తాడు. ఆ చారిత్రక నాయకుని లక్షణాలు రచయితల్లో కూడా ఉంటాయి. అవి నాయకుడు పరిష్కరిస్తాడు. ఉదాహరణకు ‘‘కృష్ణవేణి’’లో కథానాయకి అయిన కృష్ణవేణిని దొంగలు బంధించినప్పుడు కథానాయకుడైన రామరాజు ఆమెను దొంగల నుండి విడిపించాడు. ఇందులో తానీషా కాలం నాటి కథా వస్తువు ఉంది.
వస్తువు ` కల్పన :
పేరు, పని ఈ రెండూ వాస్తవం. తేదీలూ, ఫలితాలూ వాస్తవమే. కానీ నాయకుడు, ప్రతినాయకుడు, పరివారము, రసనిష్ట తదితరాలన్నీ కల్పనలు. కానీ ఇవన్నీ కల్పనల్లా కనిపించవు, నవలా నిర్మాణ పటిష్టతకు దోహదం చేస్తాయి. ‘హిమబిందు’లో శ్రీకృష్ణ శాతవాహనుడు, శ్రీముఖుడు తదితర పాత్రలు చరిత్రను అనుసరించి రాయబడ్డాయి. కానీ సువర్ణశ్రీ, హిమబిందు, నాగ బంధునిక, చారుగుప్తుడు తదితర పాత్రలు కల్పితాలు.
వర్ణనలు ` కల్పనలు :
ప్రబంధాలలో పద్దెనిమిది కానీ, ఇరవై రెండు కానీ వర్ణనలు ఉండవచ్చునని లాక్షణికులు అన్నారు.
‘‘వన, జల, కేళీ, రవి, శశి,
తన యోదయ, మాత్ర, గతి, క్షితిప, రణాం,
రునిథి, మధు, ఋతు, పురోద్వా,
హనగ, విరహ, దూత్య, వర్ణనాష్టా దశమున్‌.’’
నన్నె చోడుడు ఈ విధంగా కుమార సంభవంలో పద్దెనిమిది వర్ణనలు కావ్యాల్లో ఉంటాయన్నాడు. చారిత్రక నవలా రచయితలు కూడా సందర్భాన్ని బట్టి వనాలను, నదులను, సూర్యచంద్రాదులను వర్ణిస్తాడు. కానీ, చారిత్రక నవలల్లో సరళ వచన శైలి ఉంటుంది. కానీ, స్వాతంత్య్రానికి ముందు వచ్చిన చారిత్రక నవలల్లో సరళ గ్రాంథిక శైలి కనిపిస్తుంది.
‘హిమబిందు’ నవలలో కథానాయకుడైన సువర్ణ శ్రీ సోదరి నాగ బంధునిక గుణాలను అడవి బాపిరాజు గారు ఇలా చెప్పారు, ‘‘అన్నతో పాటు అస్త్ర శస్త్ర విద్యలను, అశ్వరోహనాధికమును అభ్యసించిన సాహసి. స్త్రీ ప్రకృతి కంటే పురుష ప్రకృతియే ఈమెకు ఎక్కువ’’. నాగ బంధునిక వీర లక్షణాలను వర్ణించడం, అలానే హిమబిందు, సువర్ణ శ్రీ తదితరులను, సందర్భోచితంగా వర్ణించడం ‘హిమబిందు’లో చూస్తాం.
వస్తు సంవిధానం :
చారిత్రక వస్తువును ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటాడు రచయిత. 1. ఎత్తుగడ, 2. పాత్రల పరిచయం, 3. పుట్టు పూర్వోత్తరాలు, 4. దేశం`కాలం`పరిస్థితులు, 5. పోరాటాలు, 6. అపజయం, 7. సహాయం, 8. విజయం, 9. రాజ్యప్రాప్తి లేదా నాయికతో వివాహంతో నవల ముగుస్తుంది. కానీ, ఒక్కో రచయిత ఒక్కో విధానాన్ని పాటిస్తాడు.
రస నిష్ట :
నవలల ద్వారా రస నిష్టలు కావచ్చునని తమ నవలానుశీలనములో సాధికారికంగా నిరూపించిన పరిశోధకురాలు శ్రీమతి ముదిగంటి సుజాతా రెడ్డి గారు. అంటే పాఠకుని స్థాయికి నవలని తీసుకెళ్ళి రసజ్ఞులని చెయ్యడం. చారిత్రక నవలల్లో శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకాదులు కనిపిస్తాయి. వీర భూపతి, రుద్రమదేవి, సువర్ణశ్రీ, శ్రీకృష్ణ దేవరాయ వంటి పాత్రలలో వీర రసము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
పాత్ర చిత్రణ :
చరిత్రలో పాత్రలు శుష్కంగా కనిపిస్తాయి. కానీ, నవలల్లో సర్వాలంకార భూషితమై పఠితల ముందు సాక్షాత్కరిస్తాయి. పాత్రల ఆలోచనలు పాఠకునిలో ప్రవేశిస్తాయి. పాఠకుడు రసానంద భరితుడై ఆనందాన్ని పొందుతాడు.
అంతరంగం ` మనస్తత్వం :
చారిత్రక నవలల్లో ప్రధానంగా కనిపించేది పాత్రల మనస్తత్వం. ఒక సమస్య వచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ప్రత్యర్థులు సవాలు విసిరినప్పుడు ఆ పాత్ర వ్యవహరించే తీరును బట్టి పాత్ర యోగ్యతని నిర్ధారిస్తాం. ఆధునిక కాలంలో వచ్చే నవలలన్నింటికీ మనస్తత్వ విషయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
చారిత్రక నవల`సంస్కృతి :
ఒక అవిచ్ఛిన్న అఖండ సాంస్కృతిక వాదం మూలం కాగా ఆ చారిత్రక నవల ఆవిర్భవిస్తుందని ప్రముఖ పరిశోధకులు, శతాధిక గ్రంథకర్త, విమర్శకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారంటారు. దేశ, జాతి, భాష, సంస్కారాలు, ఆచారాలు… ఇలా ఎన్నో సాంస్కృతికాంశాలు చారిత్రక నవలతో ముడిపడి ఉంటాయి. సాంస్కృతిక పరిరక్షణే ధ్యేయంగా తెలుగు చారిత్రక నవల పుట్టింది.
పూర్వ చరిత్రపై అభిమానం :
శేషాద్రి రమణ కవులు రాసిన ‘‘కొండపల్లి ముట్టడి’’ చారిత్రాత్మకమైన నవల (1928) నాటి సమాజంలోని ప్రజలు మర్చిపోయిన ఆంధ్రుల పరాక్రమాన్ని తెలియజేయడమే ఈ నవల ముఖ్యోద్దేశ్యం. ఆనాటి ప్రజల్లో కర్తవ్య జ్ఞానాన్ని పెంపొందింపజేయాలని నవలాకారులు ఆశించారు. కథాకాలం నాటి పరిస్థితులను గమనించి జాతీయ వాద నిర్మాణం చెయ్యాలని కోరుకున్నారు. విజయనగర రాజ్య నిర్మాణమునకు త్యాగధనులగు శ్రీకృష్ణ దేవరాయలు, మాధవ వర్మ తదితర చారిత్రక పురుషులే కారణమని పాఠకులకు చెప్పడం ఈ చారిత్రక నవల
ఉద్దేశ్యం. ఆంధ్ర జాతికంతటికీ స్వాతంత్య్రం తెచ్చుకోవడంలో సమరోన్ముఖులు కావాలని కోరుకుంటారు రచయితలు. వీరి వసుంధర కూడా స్వాతంత్య్ర సాధనకు రాయబడినదే. శేషాద్రి రమణ కవులు సహజంగా పరిశోధకులు. అందుకే ఈ నవలల్లోని వాతావరణం కథాకాలానికి, పాత్రలకు దగ్గరగా ఉంది. పాఠకులకు పూర్వ చరిత్రపై అభిమానం పెరిగేలా చేసిన వారిలో శేషాద్రి రమణ కవుల కృషి ఎంతగానో ఉంది.
వ్యక్తుల్లో, పౌరుల్లో కలిగించిన చైతన్యం :
పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో పడిపోయిన వ్యవస్థను పూర్వుల నైతిక జీవన విధానం వైపు తిప్పి కొత్త వ్యవస్థను సృష్టించాలని తలచిన బహుముఖ ప్రక్రియా కర్త విశ్వనాధ సత్యనారాయణ. అర్ష ధర్మానికి, వ్యక్తిగత హృదయ స్పందనలకు మధ్య సంఘర్షణలతో రాయబడిన నవల ఏకవీర. బద్ధన్న సేనాని నవల వేంగీ చాణుక్యలకు చెందినది. కులోత్తుంగ చోళుడు దక్షిణాపథము పాలించే సమయంలో పశ్చిమ చాణుక్యులు ఆ భూభాగాన్ని ఆక్రమించుకోగా అంత్యకులజులు, ప్రభుభక్తి పరాయణులు అయిన బద్ధన్న, బాదమ్మలు ప్రదర్శించిన దేశభక్తి, ధైర్యసాహసాల ద్వారా ఆంధ్ర జాతిలో దేశభక్తి పెరుగుతుంది.
కడిమి చెట్టులో మయూరిని పాత్ర ద్వారా ధర్మ చక్రములో ఇక్ష్వాకుల ద్వారా హైందవ నాగరికతా వైభవాన్ని, సంస్కృతీ సభ్యతలను పాఠకుని హృదయములో నాటుకునేలా చేశారు విశ్వనాధ వారు.
ధార్మికులైన వ్యక్తులు, సంస్థలపై గౌరవం :
నవరస భరితములై భారతీయ ధర్మ ప్రబోధాది గుణాలు గల చారిత్రక నవలలు కేతవరపు వేంకటరాయ శాస్త్రి గారివి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన చరిత్రలో చారిత్రక నవలలు మొదట రాసినది కేతవరపు వారే. వారి ‘‘రాయచూరు యుద్ధం’’, ‘‘బొబ్బిలి ముట్టడి’’, ‘‘ఆనందాలు’’ ప్రసిద్ధమైన చారిత్రక నవలలు. ఇవి ఊహాజనితమైనవే అయినప్పటికీ చరిత్ర మిళితమైన నవలలు.
1937లో వాశిష్ట గణపతి ముని ‘‘పూర్ణ’’ పేరుతో ఐతిహాసిక, సామాజిక, చారిత్రక, రాజకీయాత్మకమైన నవలను రెండు వందల ప్రకరణాలలో సంకల్పించి సుమారు నలభై ప్రకరణాలు రచించి ‘భారతి’లో ప్రకటించారు. వాశిష్ట గణపతి ముని మహా విద్వాంసుడు. మంత్ర ద్రష్ట. అరుణాచల రమణుడిగా ప్రసిద్ధి చెందినవాడు. రమణ మహర్షిచే సంభావితుడు. ఈయన తెలుగులో నవలా రచనకు పూనుకోవడం, వేదకాలం నాటి సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించడానికి తలపోయడమూ ఈ నవలా రచనలో విశేషం. ఈ నవలను గణపతి ముని చంద్రులు రచించడానికి ఆనాటి సామాజిక కారణాలు ఉన్నాయి, ప్రేరణలున్నాయి. అప్పటికీ జాతీయోద్యమ ప్రభావం బాగా ఉంది. పురాణాధోజ్వల దివ్య చరిత్ర ద్వారా సమాజంలో అవాంఛనీయమైన అజ్ఞానాన్ని నిర్మూలించి ఇందుకు ఒకనాటి స్థిరమైన విజ్ఞానం, సామాజిక నాగరికతలు ప్రేరకాలు కావాలని ఆయన ఆశించారు. అప్పటి, ముప్ఫై సంవత్సరాలుగా దివ్యజ్ఞాన సమాజం వారి పురావైభవ స్మరణం, పునరుద్ధరణాభిలాషలు, కూడా ఈ నవల రాయడానికి ప్రేరణ కావచ్చునని డా.అక్కిరాజు రమాపతి రావు గారు ‘‘తెలుగు నవల`ప్రమాణాలు`ప్రయోగాలు’’ అనే వ్యాసంలో వెల్లడిరచారు.
ఈ విధంగా చారిత్రక నవలలను ప్రస్తుత నవలలతో పోల్చితే ఈ రెండిరటి మధ్య భిన్న భిన్న రచన కోణాలు జరిగాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులు బండి నారాయణస్వామి నవలలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.