మనం ఎటువైపు? – వి.శాంతి ప్రబోధ

వాకిలి శుభ్రం చేసి వస్తున్న యాదమ్మ ఆగి రెండు క్షణాలు టీవీలో వచ్చే వార్తలు చూసింది. ఆ తర్వాత ‘అమ్మా… బొందవెట్టిన ఆచారాలు మళ్ళ మొలుత్తాయట కద’’ అడిగింది. యాదమ్మ ఏమన్నదో మొదట అర్థం కాలేదు.

‘‘అవునట అమ్మా… వెనుకటి జమానాల మా అమ్మమ్మ, అమ్మల జోగు ఇడిసె. గాచారం అనుకుంటిరి. ఇప్పుడు నేను లగ్గం జేసుకుంటి. బొందవెట్టిన ఆచారాలు మల్ల ఎల్తయి అంటున్నరు. మల్ల జోగు ఇడుసుడు, చిన్న పోరగాండ్ల లగ్గాలు జేత్తరేమో? ఆడోళ్ళను ఏపుకతినే ఆచారాలనెట్ల పాతిపెట్టాల్నో సూడరు. ఆళ్ళ నోట్ల మన్ను వడ… ఎవ్వడైన ముందుకు వోతడా? ఎన్కకు నడుత్తడా?’’ తిట్టుకుంటూ యాదమ్మ పనిలో పడిరది. ఇప్పుడు అర్థమైంది యాదమ్మ మాటల అంతరార్థం. ఆమె అవతలికి పోయింది, కానీ, ఆ మాటల సారం నన్ను కలవరపెడుతోంది. యాదమ్మలో ఉన్న విజ్ఞత సనాతనాన్ని బతికించాలని ఆరాటపడే వాళ్ళలో ఎందుకు లేదు?
మనిషి పుట్టుక నుంచి ముందుకు నడుస్తూనే ఉన్నాడు. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటిలోకి చేసే ప్రయాణంలో ఆధునికం అవుతున్నాడు మనిషి. నడిచి వచ్చిన దారుల్లోని మంచిని రేపటి వైపు నడిపించే ఇంధనంగా మలుచుకుంటూ సాగాలి. అదే కదా మానవ జీవన విధానం. లేకపోతే ఇన్ని ఆవిష్కరణలు వచ్చేవా? ఇన్ని తెలివితేటలు పెరిగేవా? భూమి నుంచి చంద్రుని దాకా ప్రయాణం జరిగేదా? అంతుచిక్కని అంతరిక్షం, లోతు తెలియని పాతాళం గురించి తెలిసేవా? ఇన్ని శాస్త్రాలు అభివృద్ధి చెందేవా?
కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లైంగికతను బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, నాగరికతను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న నియమాలు, ధర్మాలు మారిపోతుంటాయి. ఎప్పుడూ ఏవీ స్థిరంగా ఉండవు. ఎప్పటి కప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మార్గం రూపొందించుకోవలసిందే. లేదంటే సామాజిక మార్పు సాధ్యం కాదు.
వేల ఏళ్ళుగా మానవ సమాజం, సంస్కృతి, విలువలు, ధర్మాలు, నియమాలు పరిణామం చెందుతూ ఉన్నాయి. ఉన్నతీ కరణ జరుగుతూనే ఉంది. ఉండాలి కూడా.
లేకపోతే ఆడశిశువులు గంగపాలు అవు తూనే ఉండేవారు. శూద్రుల వధువు బ్రాహ్మణు నితో మూడు రాత్రులు గడిపే ఆచారం సజీవం గానే ఉండేది. శూద్రులను నరబలి ఇవ్వడం, శూద్రుల్లో అట్టడుగున ఉన్న ఆడపిల్లను దేవుడితో పెళ్ళిచేసి అగ్ర అని చెప్పుకునే కులాలవారు కామవాంఛ తీర్చు కోవడం వంటివెన్నో ఇప్పటికీ కొనసాగేవేమో!
మహిళలకు ఆస్తిహక్కు వచ్చేదే కాదు. ఇప్పుడు సతి నేరం, బాల్య వివాహం నేరం, నిషిద్ధం. అంటరానితనం నేరం, స్త్రీల పట్ల అగౌరవంగా వ్యవహరించడం నేరం. ఆ సామాజిక సాంఘిక దురాచారాలు నేరం. ఇవన్నీ ఎలా సాధ్యమయింది? మార్పు దిశగా నడిచిన మన ముందు తరాల వారి కృషి వల్లనే కదా! నేడు చంద్రయాన్‌ విజయ వంతంగా ప్రయోగించి, సూర్యయాన్‌ ఆలోచన చేస్తూ సాంకేతిక అద్భుతాలు సృష్టిస్తున్నామని ఓవైపు జబ్బ చరుచుకుంటూ, మరోవైపు సనాతన ధర్మం అని సన్నాయి నొక్కులు… అసలు సనాతన మంటే ఏమిటి? సనాతన అంటే ఎప్పటికీ మారనిది, నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. వేదాల్లోని సనాతన ధర్మాలు స్త్రీ విషయంలో ఏం చెప్పాయో చూద్దాం.
అన్ని దశల్లో స్త్రీ, పురుషుడికి లొంగి
ఉండాలని, అమ్మాయికి యుక్తవయసు రాకుండానే పెళ్ళి చేయాలని, సతి పతివ్రత ధర్మం అని చెప్పింది. భర్తను కోల్పోయిన స్త్రీని అగ్నిలోకి నెట్టింది. వితంతువుల జుట్టు తీసి తెల్ల చీరలు కట్టించింది. స్త్రీని దేవదాసీలుగా, జోగినిలుగా మార్చింది. ఆడపిల్లలకు చదువు అవసరం లేదంది. నవ్వకూడదంది. పిల్లల్ని కంటూ భర్త సేవలకు పరిమితం కావాలంది. సనాతనంలోని కుల, లింగ వివక్ష ఆధిపత్యం నేటికీ అనుభవిస్తున్నాం. ఆచారం పేరుతో జరిగే అనేక అరిష్టాలు, అనాచారాలకు కారణం సనాతనం. మణిపూర్‌లో స్త్రీలపై అత్యాచారాలకు కూడా సనాతన దృక్పథమే కారణం. ఇవన్నీ కొనసాగిద్దామా?
కుల అసమానతలు, హెచ్చుతగ్గులు సృష్టిం చిన ధర్మాన్ని, పితృస్వామ్య విధానాలు కూల్చి, ఆ కట్టుబాట్లను తెంచుకోవడానికి ఎన్నో ఏళ్ళు గా ఉద్యమిస్తూనే ఉన్నాం. ఇంకా ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. కుల, మత, వర్గ, జెండర్‌ పరంగా మనుషుల్ని విభజించి పాలించే సనాత నాన్ని నెత్తినేసుకోవడం అంటే తన చేత్తో తన కన్ను పొడుచుకోవడమే.
వేల ఏళ్ళ క్రితం టెక్నాలజీ లేని రోజుల్లో, ఆధునికం, నాగరికం కాని సమయంలో ఆనాటి సమాజ అవసరాలకు తగిన విధంగా ఆధిపత్య వర్గం రూపొందించిన ధర్మాలు, నియమాలు అవి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనం ఏర్పరచుకున్న నియమాలు, ధర్మాలు కూడా తరతరానికీ మారుతూనే ఉంటాయి. మారిన కాలంతో కలిసి రాలేని పాత కనుమరుగైపోక తప్పదు.
ఈ దేశంలో ఒకరు సనాతన ధర్మంపై తమ అభిప్రాయం చెప్తే ఎందుకంత తలకిందులై పోతున్నారు? రాజకీయం చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఆ స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్య దేశంలో అది నచ్చని వాళ్ళు అభ్యంతరం తెలుపవచ్చు లేదా ఖండిరచవచ్చు. కానీ, తల నరికి తెచ్చినవారికి పది కోట్ల రూపాయలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించడం సమంజసమేనా? బరితెగించి బహిరంగంగా ప్రకటించిన ఆ స్వామీజీ పట్ల చర్యలు ఏమిటి?
మనిషిని మనిషిలా చూడని వ్యవస్థలో, ఎవడి తిండి వాడిని తిననీయని వ్యవస్థలో, ఎవరి బతుకులు వారిని బతుకనీయని వ్యవస్థలో ఉన్నాం మనం. సనాతన ధర్మ బోధనలు, ఆచారాలు, నియమాలు ఈనాటి సమాజానికి, దేశ పురోగమనానికి పెద్ద అడ్డంకి. ఇది ప్రజాస్వామిక ఆలోచనలు పురోగమించాల్సిన సమయం. అడుగు ముందుకు వేయాలో, వెనక్కి వేయాలో తేల్చుకోవాల్సిన సందర్భం. స్త్రీలంతా సనాతన అసలు రూపాన్ని పసిగట్టి తేల్చు కోవడం నేటి అవసరం.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.