స్త్రీ గెలుపు ‘నాచి విజయం – అనిశెట్టి రజిత

క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన చరిత్ర ప్రసిద్ధుడైన శాస్త్ర నిష్ణాతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఏలేశ్వరోపాధ్యాయుడు. వీరిది ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం. ఆంద్ర విదుషీమణులు అనే గ్రంథంలో ఆంధ్ర శేషగిరిరావు గారు, వీరు పల్నాటి ప్రాంతం వారని రాశారు. కానీ, తెలంగాణ పరిశోధకులు ఏలేశ్వరోపాధ్యాయుడు నల్గొండ జిల్లా వాసి అని కొన్ని ఆధారాలు చెప్తున్నారు. అది నిర్ధారణకు రావాల్సి ఉంది.

ఏలేశ్వరోపాధ్యాయునికి ముగ్గురు కూతుళ్ళని, వారిలో నాచి ఒకరని చెప్తున్నారు. జ్యోతిష్య, ఆయుర్వేదాలలో నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, ఏలేశ్వర విజయం, స్మృతి దర్పణం, తెలుగు భూగోళశాస్త్రం గ్రంథాలు రచించాడు. నాగార్జున కొండ పరిసర ప్రాంతంలో ఉపాధ్యాయ పీఠాన్ని స్థాపించి గ్రంథ రచన చేశాడనీ అంటారు.
వీరి జీవితానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని కథలుÑ ఉపాధ్యాయుని కుమార్తెలతో ఒకరికి వివాహం జరిగిన అనంతరం వరుడు బ్రాహ్మణుడు కాదని తెలియవస్తుంది. వారికి సంతానం కూడా కలుగుతుంది. ఆ కుమార్తె తన తండ్రి గొప్ప పండితుడు, తలెత్తుకుని గౌరవం పొందే హక్కును కోల్పోతాడని తమ కుల ప్రయోజనాలకు భంగం అని భావించి భర్త పిల్లలతో సహా తన ఒంటికి నిప్పంటించుకొని చనిపోతుంది. దీనివల్ల క్షోభితుడయిన ఏలేశ్వరుడు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని నాడులుగా విభజించాడు. బ్రాహ్మణులలో ఏ శాఖల వారు ఆ శాఖల వారినే వివాహం చేసుకోవడానికి వీలుగా భౌగోళిక సరిహద్దులతో నాడులు ఏర్పాట చేశాడు. శాఖలవారీగా ఉండటం వల్ల, ఒకేచోట ఆయా శాఖల వారు ఉండటం వల్ల కులానికి సంబంధించిన ఎరుక కలిగి ఉంటారని నమ్మకంతో శాఖలను భాగాలుగా చేశారు. ఒకే కులంలోనూ శాఖల తేడాలు ఉండటం ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఉపాధ్యాయుని కుమార్తె కరడుగట్టిన కుల పట్టింపులున్న సమాజంలో పరువు గౌరవాల కోసం, కులసంకరం సహించలేక చేసుకున్న పరువు ఆత్మహత్య, భర్త పిల్లలను చేసిన పరువు హత్యగానే భావించాలి.
… … …
నాచి ఉపాధ్యాయుని రెండవ కూతురు. చిన్నతనంలోనే ఆమె భర్త చనిపోతాడు. పుట్టిల్లు చేరిన నాచి వైధవ్య బాధను అనుభవిస్తూ విషాదమయ జీవితాన్ని గడుపుతుంటుంది.
రోజూ ఇంట్లో సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. కానీ నాచికి చురుకుదనం లేకపోవడం వల్ల ఆమె బుద్ధిని వికసింపచేయడానికి ఆయుర్వేద సిద్ధహస్తుడైన తండ్రి ఆమెకూ, మరికొంతమంది శిష్యులకూ ‘జ్యోతిష్మతి’ అనే ఆకు రసాన్ని తగిన మోతాదులో ఇస్తుంటాడు. దాన్ని సేవించి తొందరగా చురుకైన బుద్ధిని పొందాలన్న ఆశతో నాచి మోతాదుకు మించి ఆ రసాన్ని సేవిస్తుంది. దాంతో ఒళ్ళంతా మంటలు పుట్టి బావిలో దూకుతుంది. బావిలో నీళ్ళు మునిగేంతగా లేకపోవడంతో మోకాలు లోతు ఉన్న నీళ్ళలో పడిన ఆమె మరణాన్ని తప్పించుకుంటుంది. ఒక పూటంతా నీళ్ళలో ఉండిపోయిన తరువాత శరీర మంటలు తగ్గినా ఆమెకు నిస్త్రాణంలో మాటా పలుకూ రాక బావిలోనే ఉండిపోతుంది.
కూతురు కోసం వెతికి వెతికి వచ్చి విచారంగా ఆమెను తలుచుకుంటూ బావి గట్టు మీద కూర్చుంటాడు ఏలేశ్వరోపాధ్యాయుడు. నాచి నాచి అని ఆమె పేరు తలుచుకుంటుండగా ఆమె బదులు పలుకుతుంది. తండ్రి బావిలో ఉన్న కూతురుని బయటికి తీసి తగిన ఉపచారాలు చేసి బతికించుకుంటాడు. కానీ మరో కథ ప్రకారం ఉపాధ్యాయుడే కూతురును రోజంతా నీళ్ళలో
ఉండనిచ్చి శరీర మంటలు తగ్గించాడని.
ఇది జరిగిన తరువాత నాచి బాగా జ్ఞానాన్ని పొందుతూ పాండిత్యాన్ని గడిరచింది. తన సంస్కృత ప్రతిభను అనేక ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ కావ్యాల రచనలు చేసింది. ‘నాచీ విజయం’ ఆమె స్వీయ కథ. ఆ కావ్యం కరుణ రసాత్మకం. ఇంకా ఆశ్చర్యకరంగా పండిత చర్చలు చేస్తూ మైసూరు, ఢల్లీి, ఆగ్రా, కాశి, ప్రయాగ, హరిద్వార్‌ లాంటి ప్రాంతాలు పర్యటిస్తూ సాటి పండితులను ఓడిరచి బహుమతులు గెలుచుకుంటుంది.
పండిత చర్చలూ, జ్ఞానం, చదువులూ ఆడవాళ్ళకు నిషిద్ధమైన సమాజంలో పండితుని కూతురిగా, బాల్య వితంతువుగా, అనారోగ్యంతో విషాద జీవితం గడిపే స్త్రీ అయినా నాచి అపారమైన జ్ఞానం సంపాదించి, పాండిత్య ప్రవీణురాలై తండ్రికి తగిన తనయగా నాటి సమాజంలో నిలదొక్కుకోవడం చాలా అరుదైన విషయం.
ఆ రోజుల్లో వైధవ్యం పొందిన బాలికకు ఆ స్వేచ్ఛ ఉండేదా! ఆ స్వేచ్ఛనూ, ధైర్యాన్నీ నాచి ఎలా సాధించగలిగింది అనుకుంటే వింతగా అనిపిస్తుంది. నాచి తండ్రి తనకు పుత్ర సంతానం లేని కారణాన నాచిని ఆ విధంగా తీర్చిదిద్దారు అనుకోవాలి. కూతురి చదువునూ, పర్యటనలనూ, పండిత చర్చలనూ, వాదనలనూ ప్రోత్సహించడం మామూలు విషయమేమీ కాదు. ‘నాచి’ పాండిత్యాన్నీ, స్వేచ్ఛనూ పొందినా ఆ కాలంలో స్త్రీ సమాజమంతా అదే విధంగా జ్ఞానం పొందే స్వేచ్ఛను కలిగి ఉంటారని అనుకోలేము.
… … …
‘నాచీ విజయం’ అనే దృశ్యకావ్యం ఒక నాటక రచన అని కూడా అంటారు. తాళ్ళపాక తిమ్మక్క తొలి కావ్య రచన చేస్తే, నాచి తొలి సంస్కృత కావ్య రచన చేసింది. వీరు అచ్చంగా తెలుగువారు. తొలి స్వీయచరిత్ర ‘నాచీ విజయం’ రాసింది కూడా నాచీయే. తన స్వీయ చరిత్రలో తన సొంత జీవితం గురించే నాచి రాసింది. నాచి జీవితంలో నాటకీయ మలుపులు ఎన్నో కనబడతాయి.
కరుణ రసాత్మకమైన కావ్యం రాసిన నాచి గురించి ‘దక్కను కవుల చరిత్ర’లో సమాచారం ఉంటుంది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ‘ఆంధ్ర కవయిత్రులు’, ఆండ్ర శేషగిరిరావు ‘ఆంధ్ర విదుషీమణులు’ సంకలనాలలో నాచి ప్రస్తావన ఉంటుంది.
కుల సంప్రదాయాల కట్టుబాట్లలో, చీకటి మూలాల్లో మగ్గుతూ బతకవలసిన వితంతు స్త్రీ తన తండ్రితో బాంధవ్యం వల్ల విద్యాజ్ఞానవంతురాలై, జీవితంలో ఏర్పడిన స్తబ్దతను, శారీరకంగా ఏర్పడిన అనారోగ్యాలను అధిగమించి కవయిత్రిగా, పండితురాలిగా ఎదిగి తన స్వీయ చరిత్రను రాసేంత సాహసాన్ని కూడా చేయగలిగింది. బ్రాహ్మణ వితంతువుగా ఉండీ, తన ప్రాంత సరిహద్దుల్ని దాటి పండిత చర్చలు చేస్తూ గెలుపుబాట పట్టింది.
అవకాశాలు అందివస్తే, ఇంటి వాతావరణం అనుకూలిస్తే ప్రతికూల పరిస్థితులను తన్నేస్తూ స్త్రీలు తమను తాము నిరూపించుకోగలరని నాచి కథ ద్వారా మనకు అర్థమవుతుంది. నాచి వ్యక్తిగత జీవితంలో ఆమె ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ఆవరించిన విషాదాన్ని అధిగమించే ప్రయత్నంలో సఫలీకృతమైంది. స్త్రీలు ఏనాడూ అబలలు కాదు, వారి సబలత్వం సత్యమేనని నాచి లాంటి స్త్రీల ద్వారా చరిత్రలో మనం చూడగలుగుతాము.
నాచి రచించిన ‘నాచీ విజయం’ కావ్య నాటకం దొరికితే ఆమె జీవన నైరాశ్యం నుండి బయటపడడానికి చేసిన పోరాటం, ఆమె అనుభవాలు, వైవాహిక, సంసారిక జీవితం లేకపోవడానికి కారణమైన వైవిధ్యం, నాటి సమాజం, ఆమె కులస్తులు, ఇతర స్త్రీలూ, పండితులూ ఆమె ఎదుగుదలనూ, వికాసాన్నీ ఏ విధంగా చూశారు అనే విషయాలెన్నో మనకు తెలియవస్తాయి. పురుష ప్రధానమైన, పురుషాధికార వ్యవస్థలో అన్నీ పురుషులకే చెందిన పురుషపక్షం ఏర్పరచిన నిబంధనలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయ నియమాలున్న కాలంలో నాచి వైధవ్యాన్నీ, ఒంటరితనాన్నీ జయించింది. స్త్రీ ఔన్నత్యాన్నీ, ప్రతిభనూ చాటింది, నిలబెట్టింది. అది క్రీస్తు శకం 7వ శతాబ్దం! అదే ఆశ్చర్యం! నిజంగా ఒక అద్భుతం!
చరిత్రలోని ‘నాచి’, ‘మొల్ల’ లాంటి స్త్రీలు తమ తమ సామాజిక కుల వర్గాల హోదాలు ఏమైనా వాటిని జ్ఞానం ద్వారా అధిగమించి తమ అస్తిత్వాలనూ, గౌరవ ప్రతిష్టలనూ పొందారు. ప్రాచీన కాలంలో మరుగున పడి ఉన్న స్త్రీల అస్తిత్వాలు ఎన్నో… వారు దాటి వచ్చిన అగ్ని సరస్సులూ, వైతరిణీ నదులూ ఎన్నో… ఎంతైనా స్త్రీత్వపు శక్తుల ఆవిష్కరణలో తొలి అడుగులు వాళ్ళవే, దారులేసిన అక్షరాలూ వాళ్ళవే. శతకోటి వందనాలు ఆ స్త్రీ మూర్తులకు.
(‘ప్రాచీన తెలుగు కవయిత్రులు`సృజన విమర్శ శక్తులు’ సంకలనంలో కె.ఎన్‌.మల్లీశ్వరి వ్యాసం ‘కరుణ రసాత్మక కవయిత్రి’ నాచి ఆధారంగా)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.