మణిపూర్‌ మంటల వెనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రలు – డా॥ కత్తి పద్మారావు

మణిపూర్‌ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటిమీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది.

మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు మణిపూర్‌ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌లను ఈ నెల 7వ తేదీన స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసులు ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన తర్వాత కూడా ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం చేశారనేది కూడా సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక విషయాల్లో రాజ్యాంగ ఇతర శక్తిగా ప్రభుత్వం నడుస్తుందని హెచ్చరిస్తూ వస్తుంది. ఈ ఘటన మీద హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన అనేక అనుమానాలకు దారితీస్తుంది. గుజరాత్‌లో ఒక వర్గానికి 2022లో బుద్ధి చెప్పిన తర్వాత అక్కడ మతఘర్షణలు ఆగిపోయాయని హోంమంత్రి అంటున్నారు. 2022 నుండి హిందువులకు భయపడి ముస్లిములు అక్కడ జీవిస్తున్నారని ఆయన అర్థం. అయితే ఇక్కడ గిరిజనులు, క్రైస్తవులు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ అల్లర్లలో జొరబడి క్రైస్తవ సమాజాన్ని విధ్వంసం చేసే పనిలో ఉందని అర్థం అవుతుంది.
క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం వరకు అంటే 10 శతాబ్దాలు వర్ధిల్లిన బౌద్ధాన్ని కర్కశంగా యుద్ధం చేసిన హిందూమతమే ఇప్పుడు క్రైస్తవుల్ని అన్య మతంగా పేర్కొంటూ వారి మీద దాడులు చేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక హిందూ మతోన్మాద సాయుధ ఉగ్రవాద చర్యలు చేయడంలో మహాత్మా గాంధీని హత్య చేసేదాకా వెళ్ళింది. క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, ముస్లింలను అణచివేయడం ద్వారా, హత్యలు చేయడం ద్వారా, భయభ్రాంతులను చేయడం ద్వారా మతవ్యాప్తిని చేసుకోవాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం. క్రైస్తవ మతం శాంతియుతంగా ప్రవహించటంలో హిందూ మాతోన్మాదులకు అంతర్గతంగా సవాలు విసురుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కుకీల అటవి భూముల్ని మొయితీలకు కట్టబెట్టి అడవిపై ఆదిపత్యం వహించాలనేది కూడా మరొక వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్‌, ప్లాటినం మెటల్స్‌, ఎలిమెంట్స్‌, నికిల్‌, కాపర్‌, బొగ్గు, పెట్రోలియం, సిమెంటు ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు. దానికి కారణం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్‌ను దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అవకాశం లేదు. అందుకే వాళ్ళు విధ్వంసానికి పూనుకున్నారు. ఈ విధ్వంసం వెనుక మత భావాలతో పాటు, మతోన్మాదుల, కార్పొరేట్‌ శక్తుల ఐక్య దోపిడీ విధానం ఉంది. గీతా ప్రెస్‌లో భగవద్గీతను కార్పొరేట్‌ శక్తుల ధన సహాయంతో కోర్టులు ప్రతులు ముద్రించి హత్యలు చేయడం, ఆదిమజాతులను తునుమాడటం హిందువుల ధర్మమని నమ్ముతున్నారు. ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలు ఉన్నాయి. ఈ భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురుష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేకపోయారు. తాకట్టులోకి భారతదేశం వెళుతున్నప్పుడు కూడా ఈశాన్యం తన్నుతాను కాపాడుకుంది గిరిజనుల పోరాటాల వల్ల సంపాదన కూడా కాపాడుతుంది.
మణిపూర్‌లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి క్రైస్తవులపై దాడి చేయడానికి వెనకాడడం లేదు. అది ప్రపంచం అతా అర్థం చేసుకుంటుంది నిజానికి హిందూ మతోన్మాదులు ముస్లింల మీద, క్రైస్తవుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద చేస్తున్న దాడులు వెనక మొత్తం భారతదేశాన్ని హిందువులు గుప్పెట్లో తీసుకోవాలని, భారతదేశ వనరులన్ని కార్పోరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసి తద్వారా డబ్బు సంపాదించి మిగిలిన జాతులన్నింటిని ధ్వంసం చేయాలనే భావన మనకు కనిపిస్తుంది. నిజానికి గిరిజనులు అక్కడ ఎందుకు క్రైస్తవులైన్నారు. వారు క్రైస్తవులు అవ్వడం వలన వారికి కలిగిన లాభం ఏమిటి? అక్కడ గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఈ రోజు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటిలో చదవగలుగుతున్నారు అంటే ఇంగ్లీషు విద్యను చదవడానికి క్రైస్తవులు మతాన్ని వారు ఆశ్రయించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదు అది తప్పకుండా క్రైస్తవులు, గిరిజనులకు శత్రువులు మణిపూర్‌ హింస గురించి బి.జె.పి పార్టీలోనే వ్యతిరేకత పెల్లుగుక్కింది. బి.జె.పి. ఎం.ఎల్‌.ఏ. పోలిన్‌ లాల్‌ హోకిప్‌ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్ర ఆక్షేపన జరిపారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెను భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార పార్టీ బి.జె.పి. ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పుకునేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడిగామని, ఇప్పటికీ కలిసేందుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మయితే మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు. మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో ప్రధానికి గానీ, కేంద్ర హోంమంత్రికి గానీ తెలియదని ఒక మీడియా సంస్థకు ఆయన తెలిపారు. కుకిలపై మయితే మిలిషియా గ్యాంగులతోపాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని హోకిప్‌ వెల్లడిరచారు.
‘‘మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గిరిజన రచయితలు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు ఈ లేఖపై సంతకాలు చేశారు ‘‘సువిశాలమైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు సహాయం చేయాలి’’ అని దేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరుపున ఆల్‌ ఇండియా ఫస్ట్‌ నేషన్స్‌ (స్వదేశీ, ఆదివాసీ) రచయితల సదస్సు సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, తాము దిగ్భ్రాంతి చెందామనీ, విచారం వ్యక్తం చేస్తున్నామని గిరిజన దుస్థితికి సంబంధించి మే 4 నాటి వీడియో ఒకటి గత వారం విడుదలైంది. ఇద్దరు కుకీ గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసించారు. ఇది భారతదేశంలోని 700కు పైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన, అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై క్రూరమైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మణిపూర్‌ విషయాన్ని కొందరు లౌకిక వాదులు ఇలా విశ్లేషిస్తున్నారు. మణిపూర్‌ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే. అవును, సందేహం లేదు జాతి ప్రక్షాళన ( ఎడ్నిక్‌ క్లీన్సింగ్‌) ఒక భయానక పదబంధం ఇప్పుడది భారత్‌ను వెన్నాడుతోంది, పీడిస్తుంది. జాతిపరంగా ఒక సజాతీయ భౌగోళిక ప్రాంతాన్ని నెలకొల్పేందుకై అవాంఛిత ఉపజాతి సభ్యులను (దేశ బహిష్క్రుతులను చేయడం, స్థాన చలనం కలిగించడం లేదా మూకుమ్మడిగా హతమార్చడం ద్వారా) సంపూర్ణంగా వదిళించుకోవడమే జాతి ప్రక్షాళన అని హిస్టరీ. కామ్‌ వెవ్‌సైట్‌ ఎడిటర్స్‌ నిర్వచించారు. ఎడ్నిక్‌ క్లీన్సింగ్‌కు ఉదాహరణలుగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీనియన్ల ఊచకోత, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అరవై లక్షల మంది యూరిపియన్‌ యూదుల మారణహోమంను చరిత్రకారులు పేర్కొంటారు. ఐరోపాలో సెర్బియా, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు కూడా జాతి ప్రక్షాళనను చవి చూశాయి. స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజ్యాంగం గుర్తించింది. మూడు ప్రధాన జాతుల వారికి మణిపూర్‌ నెలవు. మెయితీలు (నలభై శాసనసభ నియోజక వర్గాలు ఉన్న) ఇంఫాల్‌ లోయలో అత్యధికంగా ఉన్నారు. (ఈ జిల్లాల్లో మరో పది శాసనసభ నియోజక వర్గాలు వున్నాయి) ఏ రాజకీయ పక్షం తరపున ఎన్నికయినా ప్రతి శాసన సభ్యుడు తన సొంత తెగ వారి పక్షానే వుండటం కద్దు. మెయితీలే అధిక సంఖ్యాకులు కనుక వారే రాష్ట్ర పాలకులు. నిజానికి దీన్ని జాతుల పోరాటంగా మలచాలనే ఆర్‌యస్‌యస్‌ వ్యూహం నడుస్తుంది. హిందువుల కంటే కూడా గిరిజనులు శక్తిమంతులు. వీరిని దెబ్బతీయడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతుంది. నిజానికి అది దేశ భద్రతకే ముప్పు అని ఆర్‌.ఎస్‌.ఎస్‌.వారు గమనించడం లేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. చాలా ప్రమాదకరమైన సంస్థ అది దేశానికి ప్రమాదం తీసుకురాగలుగుతుంది. దేశ సమైక్యతను దెబ్బతీస్తుంది.
ఈ క్రమం నుండి మనం పరిశీలించినపుడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. దేశంలోని మూలవాసుల పునాదులు కూల్చే పెద్ద ప్రయత్నంలో వుంది. హిందు మతోన్మాదంతో వూగిపోతుంది. రాజ్యాంగాన్ని ప్రతి నిముషం ఉల్లంఘించి రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తుంది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆలోచనలు చూద్దాం..
తమ నాగరికత కొన్ని వేల సంవత్సరాల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు ఈనాటికీ ప్రాచీన కాలంనాటి దుర్భర అనాగరిక పరిస్థితిలోనే నివసిస్తున్నారంటే ఏమనాలి? కాని ఇది మాత్రం నగ్న సత్యం. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ దురదృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్టవృత్తుల నవలంభించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులు (క్రిమినల్స్‌)గా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బ్రతుకుతూ అనాగరిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశపరంపరగా నేరస్తులుగా బ్రతకడం! దీనికి హిందువులు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది. ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం? ఈ ఆదిమవాసుల్ని నాగరికులుగా మార్చడానికి, గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగలేదు. ఎందువల్ల?
బహుళ, వాళ్ళ అనాగరిక స్థితికి జన్మసిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి హిందువులు ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికి గాని, వైద్య సహాయం మొదలైన వాటిద్వారా వాళ్ళను సరిదిద్దడానికి గాని, వాళ్ళను సంస్కరించి మంచి పౌరులుగా తయారు చేయడానికి గాని తాము ఏ మాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని హిందువులు అంగీకరించకపోవచ్చు. ఈనాడు ఈ ఆదిమవాసుల కోసం ఒక క్రైస్తవ మిషనరీ ఏమి చేస్తున్నదో అదే ఒక హిందువుడు చెయ్యదలచాడనుకొందాం. అయితే అలా చెయ్యగల్గి ఉండేవాడా? చెయ్యగల్గి ఉండేవాడు కాదనే నా ఉద్దేశం. ఆదిమవాసుల్ని నాగరికుల్ని చెయ్యడం అంటే వాళ్ళను నీవాళ్ళుగానే భావించడం. వాళ్ళ మధ్య నివసించడం, వాళ్ళలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే, వాళ్ళను ప్రేమించడం, హిందువుడికి ఇది అంతా ఎలా సాధ్యమవుతుంది.
హిందువుడి జీవిత పరమార్థం అంతా, హిందువుడి తాపత్రయం అంతా, తన కులాన్ని భద్రంగా కాపాడుకోవడం. కులం హిందువుడికి అమూల్య సంపద. ఏది ఏమైనాసరే తన కులాన్ని కాపాడుకోవడమే హిందువుడి పరమలక్ష్యం. వేదకాలంనాటి అసహ్యకర అనార్యుల యొక్క అవశేషాలైన ఆదిమవాసులతో సంపర్కం పెట్టుకోవడమంటే హిందువుడు తన కులాధిక్యతను పోగొట్టుకోవడమే కదా! పతిత మానవజాతిపట్ల తన బాధ్యత ఎటువంటిదో హిందువుడికి బోధించడం సాధ్యం కాదని కాదు. కాని పతిత మానవజాతిపట్ల తనకెంత బాధ్యత ఉన్నదనుకొన్నా తన కులాన్ని నిలుపుకోవడంలో తనకున్న బాధ్యతను మాత్రం అధిగమించలేదు. ఎట్టి పశ్చాత్తాపము, సిగ్గూ, చింతా లేకుండా హిందువుడు తన నాగరికత మధ్యలో అనాగరికులను అనాగరికులుగానే ఉండిపోనిస్తున్నాడంటే అందుకు నిజమైన కారణం కులమే.
డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ మార్గంలోనే దళితుల ఆదివాసీల, స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో వున్నవారందరం కలసి ఏక కంఠంతో పోరాటం ఈ యుగం సంకేతం. (దళిత ఉద్యమనేత)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.