యుక్త వయస్కులతో యువ సమ్మేళనం – రమ్య

యుక్త వయస్కులైన ఆడపిల్లలు మరియు యువతీ యువకులను స్వశక్తి పరులుగా చేయడానికి పంచాయతీల పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై అహ్మదాబాద్‌లో 14 సెప్టెంబర్‌, 2023 నుంచి 16 సెప్టెంబర్‌, 2023 వరకు, మూడు రోజుల పాటు జరిగిన కన్సల్టేషన్‌కు దేశంలోని

పలు ప్రాంతాలలోని స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తోన్న యువతీ యువకులు, పిల్లలు, మహిళలు హాజరయ్యారు. భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, హైదరాబాద్‌, టిహెచ్‌పి, కర్ణాటక మరియు బీహార్‌, గుజరాత్‌లోని కచ్‌ నుండి సేతు అభియాన్‌, స్వాతి (గుజరాత్‌), విశాఖ (రాజస్థాన్‌), కచ్‌ మహిళా వికాస్‌ సంఘటన్‌ (గుజరాత్‌) యునిసెఫ్‌, మహారాష్ట్ర మరియు కర్ణాటక, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. మొదటిరోజు వారందరూ తాము చేస్తోన్న పని గురించి, వారు చేస్తున్న కార్యక్రమాలు, పనిలో వారి స్ట్రాటజీ, అనుభవాలు, వారికి ఎదురైన ఛాలెంజ్‌ల గురించి వివరించి, చర్చించటం జరిగింది.
రెండవరోజు బాలబాలికల కోసం పనిచేస్తోన్న సంస్థలు, యునిసెఫ్‌ సహకారంతో పనిచేస్తోన్న సంస్థలు మహారాష్ట్ర మరియు కర్ణాటకల నుంచి ప్రజెంట్‌ చేశారు. ప్రమోద్‌ పాలేకర్‌ మరియు కవిత గార్లు వారు చేస్తోన్న కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే అభాభయ్యా జాగోరీ గ్రామీణ సంస్థ వారు మహిళలు, యువతీ యువకులపై పనిచేస్తోన్న వారు ‘సిటిజన్‌షిప్‌’పై మాట్లాడారు.
రెండోరోజు మధ్యాహ్నం సేతు అభియాన్‌, కునారియా, లోహరియా సంస్థల ప్రతినిధులు వారు చేస్తున్న బాలికా పంచాయతీ గురించి మరియు వారు చేస్తున్న కార్యక్రమాల స్ట్రాటజీలు, కీలర్నింగ్స్‌, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. బాలికా పంచాయతీ అంటే ఏమిటి? వారు ఎలా ముందుకు వెళ్తున్నారు? అనేదానిపై నలుగురు సర్పంచ్‌లు, బాలికా పంచాయతీల నుండి నలుగురు బాలికలు వచ్చి వివరించారు.
మూడవ రోజు ` స్వాతి సంస్థ వారు మెయిన్‌ స్త్రీమింగ్‌ గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం గురించి, రూరల్‌ ఉమెన్‌ సేఫ్టీ ఆడిట్‌ గురించి వివరించారు.
ఈ`గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌ గ్రామ సర్పంచ్‌లు, ఇది వాడటానికి అర్హులయిన సర్పంచ్‌లు కూడా వచ్చారు. ఈ పోర్టల్‌ని
ఉపయోగించడానికి ప్రత్యేకమైన యూజర్‌ ఐడీ మరియు పాస్‌వర్డ్‌ ఉంటుంది.
యువతీ యువకుల ఎంపవర్‌మెంట్‌ కోసం పంచాయతీల పాత్ర ఎలా ఉంది అనేదానిపై అక్కడికి వచ్చిన ఇద్దరు సర్పంచ్‌లు సురేష్‌చంద్‌ మరియు ఇక్బాల్‌లు వారు చేస్తోన్న కార్యక్రమాల గురించి పిపిటి ద్వారా వివరించారు.
ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిన అధికారి బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తున్నారో వివరించారు.
దహంగర్‌ ప్రాజెక్ట్‌ అనే సంస్థ ప్రతినిధులు తమ సంస్థ కర్ణాటక, బీహార్‌లలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాము ఏ విధంగా పనిచేస్తున్నారన్నది అందరికీ వివరించారు. వారు ఎన్నికైన పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లతో కలిసి పనిచేయడమే కాక వారికి తమ పాత్రను, బాధ్యతలను పూర్తిగా నిర్వహించేలాగా వారిని బలోపేతం చేసేందుకు అనేక శిక్షణలు ఇచ్చారు.
2015 నుంచి యుక్తవయసు పిల్లలతో పనిచేయడం ప్రారంభించి, వారిని ఛైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీలుగా ఏర్పరచి వారికి వారి పాఠశాల, ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, రక్షణ తదితర విషయాలపై శిక్షణలు ఇవ్వడమే కాక గ్రామసభల్లో తమ సమస్యలను తామే చర్చించి తమ హక్కుల కోసం పోరాడేలాగా తీర్చిదిద్దారు. ఈ యుక్తవయస్కులైన పిల్లల గ్రూప్‌లో చురుగ్గా పాల్గొనే వారికి బాల సర్పంచ్‌ల హోదా ఇచ్చి గ్రామంలో సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తారో, అలాగే ఛైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీగా ఏర్పడిన వీరు ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు సభ్యులుగా ఎన్నుకోబడి పిల్లల హక్కుల కోసం గ్రామ పంచాయితీలో పనిచేస్తారు.
రెండు, మూడు సంవత్సరాలపాటు వారు ఈ కమిటీలో ఉండి అనుభవం సంపాదించాక వీరు 17, 18 సంవత్సరాల వయసులో ఉన్న యువతీ యువకులకు వారి హక్కుల గురించిన అవగాహన కార్యక్రమాలు చేస్తారు. వీరు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ పడేలాగా తయారు చేస్తారు. ఈ క్రమంలో తయారయిన ఐదుగురు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేశారు.
ఈ కమిటీ నెలకు రెండుసార్లు సమావేశమవుతుంది. ఆ సమావేశంలో వచ్చిన తీర్మానాలను వారు గ్రామ సభ దృష్టికి తీసుకువెళ్తారు. వాటిని ఫాలో అప్‌ చేయటం గ్రామ సర్పంచ్‌ బాధ్యత. సేతు అభియాన్‌ సంస్థ కూడా దాదాపు ఇలాగే పనిచేస్తోంది. కానీ వారు కేవలం బాలికలతో మాత్రమే పనిచేస్తున్నారు. ఈ కన్సల్టేషన్‌కి వచ్చిన ఎన్జీవోలందరూ చేస్తున్న కార్యక్రమాలు ` బాల్య వివాహాలను ఆపడం, గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, బాలబాలికలకు కావలసిన రవాణా, మంచినీరు, ఆటస్థలాలు లాంటి సౌకర్యాల గురించి, పిల్లలు పాఠశాలలకు వెళ్ళేలా చూడడం, గ్రామసభలో కలిసి సేఫ్టీ ఆడిట్స్‌ చేయటం, కిశోరీ అదాలత్‌లు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న బాధిత మహిళలకు ఈ కిశోర బాలబాలికలు మద్దతుగా ఉంటారు.
ఛైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీలో హెల్త్‌ కమిటీ అనే ఒక విభాగం ఉంటుంది. ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి పిల్లల బరువు చూడటం, రక్తహీనత చెక్‌ చేయటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యల గురించి శ్రద్ధ తీసుకుంటారు. కర్ణాటకలో పనిచేస్తోన్న టిహెచ్‌పి అనే సంస్థ పిల్లలతో ఆర్గానిక్‌ వ్యవసాయం కూడా చేయిస్తున్నారు.
యుక్త వయస్కులతో దేశవ్యాప్తంగా పనిచేస్తోన్న ఎన్జీవోలు ఈ కన్సల్టేషన్‌ మీటింగ్‌లో వారు సాధించిన విజయాలను అందరితో పంచుకున్నారు. అవి:
` గ్రామసభల ద్వారా రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా పిల్లలు పాఠశాలలకు సురక్షితంగా వెళ్ళి రావడం కోసం ఏర్పాటు చేశారు.
` పాఠశాల భవనంలో అదనపు గదుల నిర్మాణం
` చదువును ప్రోత్సహించడం కోసం మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినీ విద్యార్థులకు సన్మానాలు చేయటం
` ప్రతి ఇంటికి ఆ ఇంట్లోని ఆడపిల్లల పేరుమీద నేమ్‌ప్లేట్‌ పెట్టటం
` మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లల పేర్లను ఆ వీథి పేరుగా పెట్టటం
` ఆడపిల్ల పుడితే గర్ల్‌ చైల్డ్‌ సెలబ్రేషన్స్‌ చేయటం
` పిల్లల అవసరాల కోసం బడ్జెట్‌ ప్లానింగ్‌ చేసి బడ్జెట్‌ను ఖర్చు పెట్టే విషయంలో ఛైల్డ్‌ కమిటీలు చురుగ్గా పాల్గొనడం.
` టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో టీచర్లను నియమించుకోవటం
` పాఠశాలల్లో టాయిలెట్ల గురించి మాట్లాడి ఏర్పాటు చేసుకోవటం, వాటిని సక్రమంగా వాడుకొనే విధంగా పర్యవేక్షణ చేయటం
` ప్రతి గ్రామంలో ఛైల్డ్‌ ఫ్రెండ్లీ లైబ్రరీలు ఏర్పాటు చేసుకోవటం.
ఈ`గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌:
ఇది కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిరది. ప్రతి గ్రామంలోని సర్పంచ్‌ ఈ`యూజర్‌, ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా మాత్రమే దీంట్లోకి ఎంటర్‌ అవుతారు. గ్రామసభల్లో చేయవలసిన కార్యక్రమాలు, ప్లానింగ్‌, బడ్జెట్‌ గురించి ఈ పోర్టల్‌లో సమాచారం ఉంటుంది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవసరమైన బడ్జెట్‌ వారికి వివిధ స్కీంల ద్వారా అందుతుంది. ఈ పోర్టల్‌లో మొత్తం తొమ్మిది థీమ్స్‌ ఉంటాయి. వాటిలో రెండు మహిళలు, పిల్లల కోసం కేటాయించబడ్డాయి. ఈ గ్రామ పంచాయతీలన్నీ గుజరాత్‌లోని కచ్‌లో ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి. సేతు అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామిగా ఉన్న గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెండు థీమ్స్‌ మీద శ్రద్ధ వహించాలని అందరూ సంకల్పించుకొని వాటిమీద దృష్టి పెట్టి అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాలికా సర్పంచ్‌లు కొన్ని స్కీంలు చేస్తారు. ఈ స్కీంలను గ్రామ సభలో ప్రవేశపెట్టి వాటి ఆమోదంతో గ్రామాల్లో అమలయ్యేలాగా చేస్తారు. అందరూ కలిసి చేస్తోన్న కొన్ని యాక్టివిటీలను వారు అందరితో పంచుకున్నారు.
ప్రాబ్లం బ్యాగ్‌ యాక్టివిటీ : పిల్లలు తాము ఎదుర్కొంటోన్న సమస్యలను రాసి ఆ బ్యాగ్‌లో వేస్తారు
` పిల్లలు వారికి రక్షణ కరువైన స్థలాలను గుర్తించి వాటిని అందరి దృష్టికి తీసుకువెళ్తారు.
రిబ్బన్‌ కట్టడం: తమ రక్షణ గురించిన విషయాలకు సంబంధించి ఎరుపు, తెలుపు రిబ్బన్లను వాడతారు. ఏదైనా సమస్య ఎదురైతే ఒక ఎరుపు రిబ్బన్‌ను ఒక చెట్టుకు కడతారు. సమస్య పరిష్కారమయితే ఎరుపు రిబ్బన్‌ను తీసేసి తెలుపు రిబ్బన్‌ను కడతారు. వారి సమస్య ఏమిటి, దానికి వారు ఏమి చేయాలి అనే విషయాలను వారితో కొద్దిమంది సభ్యులు ప్రైవేటుగా చర్చిస్తారు.
` పిల్లలు, స్త్రీలలో ఉన్న భయాన్ని, బిడియాన్ని పోగొట్టడానికి, వారితో సాన్నిహిత్యం ఏర్పరచుకోవటానికి ఒక సాధనంగా తీసుకొని ఫలితాన్ని సాధించారు.
రాత్రి బస: పిల్లల్లోను, స్త్రీలలోను ఉన్న భయాలు, ఆందోళనలను పోగొట్టడానికి, వారితో సన్నిహితంగా మెలిగి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారిలో ఒకరిగా కలిసిపోవటానికి ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయి.
మా, బేటీ ప్రైడ్‌: ఒక బాలిక బాగా చదువుకొని మంచి మార్కులు సాధిస్తే, ఆమె తల్లిని పిలిచి అందరిలోనూ సన్మానించటం.
ఈ మూడు రోజుల కన్సల్టేషన్‌లో భూమిక ద్వారా నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన పిల్లలతో వచ్చిన సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. పిల్లలతో చేసే పనులు వారి గ్రామాభివృద్ధికి ఎంతో
ఉపయోగపడేలా ఉండడం పిల్లలు మహిళలతో పనిచేయడం చాలా గర్వకారణంగా అనిపించింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.