కమ్యూనిస్ట్‌ ప్రణాళిక – విశ్వేశ్వరరావు

ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడిన పుస్తకాల జాబితాలో మొదటి వరుసలో బైబిల్‌, ఆ తర్వాతి స్థానంలో ఖురాన్‌ ఆ తర్వాతి స్థానంలో కార్ల్‌ మార్క్స్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నిలిచాయి. మొదటి రెండూ మత విశ్వాస గ్రంథాలు, కమ్యూనిస్టు ప్రణాళిక ఒక శాస్త్రీయ సిద్ధాతం. అయినా ఇవాళ ప్రపంచం మూడిరట రెండు వంతులు మత విశ్వాసం వైపు మొగ్గి పరిభ్రమిస్తుంది.

అయితే ఈ వాలు అప్రతిహతంగా కొనసాగేది కాదు. ఏదో ఒకనాటికి మతవిశ్వాసాలపై శాస్త్రీయ ఆలోచన పైచెయ్యి సాధిస్తుంది. అపుడీ ప్రపంచం సజావుగా నడుస్తుంది. ఇది చిలక జోస్యామూ కాదు, బ్రహ్మంగారి కాలజ్ఞానమూ కాదు. ఇది ఆగామి భవిష్యత్‌ సూచిక. ఒకప్పుడు కవులు, గాయకులూ రాజా నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలుచుగాక, నీ పరిపాలన వెయ్యేళ్లు వర్ధిల్లుగాక, మీ వంశోద్ధారకులు యుగయుగాలు రాజ్యాలు ఏలుగాక అని వేనోళ్ల కీర్తించిన వారే, కానీ ఆ రాజులు ఏరీ? ఆ రాజ్యాలు ఏమై పోయాయి? ఆ ప్రభువుల కోటలు ఎక్కడున్నాయి? ఆ కిరీటాలు, భుజకీర్తులు, ఆచంద్రతారార్కమని నమ్మిన కీర్తులు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.
ఇప్పుడు కేవలం చరిత్ర పాఠాలుగా మిగిలాయి. అంతా కలిసి వెయ్యేళ్ల లోపే. మానవ జీవితంతో పోల్చితే వెయ్యేళ్లు సుదీర్ఘకాలం. మానవ సమాజ ప్రస్థానంతో పోలిస్తే ఇది ఒక లిప్తకాలం. రాజరికాల్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాం, అబ్‌ తో సబ్‌ ఠీక్‌ హై అంటూ కర్రని తాటిస్తూ పెద్ద గొంతుకతో బలంగా కొత్తగా వచ్చిన కాపలాదారులు నిత్య స్తోత్ర పారాయణం చేస్తూనే ఉన్నారు. జనం కూడా అదే నిజమని నమ్ముతూ వస్తున్నారు.
కానీ ఒక బవిరిగడ్డపు తత్వవేత్త మాత్రం నాయనలారా మీరు అసత్యములు పలుకుచున్నారు. మీరు ఆధునిక వేషధారణలో ఉన్న దోపిడీదారులే అని నిర్భయంగా చాటి చెప్పాడు. రూపాలు మారవచ్చేమో కానీ మీ సహజాత దోపిడి స్వభావం మారలేదు. రాజరికం ఎలా శాశ్వతం కాకుండా పోయిందో మీరు చెప్తున్న కుహనా ప్రజాస్వామ్యం కూడా నశించి పోవాల్సిందే. మార్పు నిరంతరాయమైనది (ఛేంజ్‌ ఈజ్‌ కాన్‌స్టెంట్‌) అని నొక్కి చెప్పాడు. మానవ సమాజ ప్రస్థానాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ప్రాణ మిత్రుడు ఎంగెల్స్‌తో కలిసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించి ప్రపంచానికి అప్పగించాడు.
కార్మిక వర్గ శ్రేయోరాజ్యం ఆవిర్భవించడం అనివార్యమగు పరిణామం అందుకు శోకించతగదు అంటూ ప్రజాస్వామిక పెట్టుబడిదారీ సమాజ పత్తేదార్‌లను వెటకరించాడు. అదిగో, అందుకే ఈ పత్తేదార్‌లకు కార్ల్‌మార్క్స్‌ అన్నా, కమ్యూనిజం అన్నా, కార్మిక శ్రేయోరాజ్యం అన్నా కమ్యూనిస్టు ప్రణాళిక అన్నా పరమ ద్వేషం. ఈ పత్తేదార్లు సమాచార ప్రచార సాధనాల మీద ఉన్న తమ గుత్తాధిపత్యం ఆసరాతో ఈ పరమద్వేషాన్ని ప్రజల ద్వేషంగా చలామణీ చెయ్యడానికి ట్వంటీ ఫోర్‌ బై సెవన్‌ ఇంటూ త్రీ సిక్ట్సీ ఫైవ్‌ డేస్‌ (24/ 7 I 365)’ ఆకాశంబు నుండి ఉపగ్రహాల శిరంబు నుండి జడివానలు కురిపిస్తానే ఉన్నారు.
కానీ ఇవాళ భూతల స్వర్గాలుగా ప్రాయోజితమవుతున్న అమెరికా తదితర అగ్రదేశాలే ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభ సుడిగుండాల పాలబడి మునగానాం, తేలానాంగా కొట్టుమిట్టాడుతూ సామాన్య ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్నాయి. అందుకే ఇవాళ మళ్ళీ ఆయా దేశాల్లో జనం ముఖ్యంగా యువతరం కార్ల్‌మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికను అధ్యయనం చేస్తున్నారు. మన దేశం కూడా ఇవాళ అలాంటి సంధి దశలో నడుస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగనాసిల్లుతుంటే ఓ గుప్పెడు మంది మాత్రం ఈ దేశంలోని 30 శాతం సంపదను తమ గుప్పెట పట్టేసారు. జాతి సంపద అయిన ప్రకృతి వనరులను తమ ప్రైవేటు ఎస్టేట్లుగా స్వంతం చేసుకుంటున్నారు. పాలకులు సబ్‌ చంగా సీ’ అంటూ ప్రజలను నమ్మించేందుకు వంచనా పూర్వక ప్రచారానికి తెరలేపారు.
అందుకే మరొకసారి ప్రజలకు ముఖ్యంగా యువతరానికి కమ్యూనిస్టు ప్రణాళికను చేరువ చెయ్యాలని సాహితీ మిత్రుల పక్షాన భావించాం. ఉమా నూతక్కి అనువాదంతో కమ్యూనిస్టు ప్రణాళికను 2023 డిసెంబరు 17 సాయంత్రం 6 గంటలకు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరిస్తున్నాం. సుదీర్ఘకాలం శాసనసభ్యులుగా ప్రజావాణిని వినిపించిన కామ్రేడ్‌ పాటూరు రామయ్య, కామ్రేడ్‌ గుమ్మడి నర్సయ్యలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఉషా.యస్‌.డానీ, గడియారం భార్గవ కమ్యూనిస్టు ప్రణాళికను పరామర్శిస్తూ ప్రసంగిస్తారు.తప్పక రండి. సాహితీ మిత్రుల పక్షాన ` విశ్వేశ్వరరావు

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.