దళిత షీరోల పోరాటాల చరిత్ర మిణుగురులు – కొండవీటి సత్యవతి

చాలా సంవత్సరాల క్రితం ‘ఉమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకం చదివినప్పుడు చరిత్ర చీకటి కోణాల్లో తెరవెనకే ఉండిపోయిన ఎంతోమంది స్త్రీల జీవితాల గురించి, వారి పోరాటాలు, వారి వ్యక్తిత్వాల గురించి మొదటిసారి చదివినప్పుడు చెప్పలేనంత ఉద్వేగం కలిగింది.

చరిత్ర పొడవునా విస్మరణకు… అది కూడా ఒక కుట్రలో భాగంగా మహిళల చరిత్రను బయటికి రానీయకుండా తొక్కి పెట్టిన పితృస్వామిక కుట్రలు బహిర్గతమయ్యాయి. ఆ పుస్తకంలో దేశవ్యాప్తంగా చీకటిలోనే ఉండిపోయిన అనేకమంది మహిళల జీవితాలు, పోరాటాలు పుస్తక రూపంలో బయటకు వచ్చాయి. ఆ పుస్తకం ద్వారానే తెలుగులో తొలి కథ రాసిన భండారు అచ్చమాంబ గురించి తెలిసింది. ఆమె తెలుగు సాహిత్యంలో, తెలుగు సమాజంలో చేసిన కృషి గురించి కూడా బహిర్గతమైంది. అలా ఎంతోమంది మహిళలు, చరిత్ర పొడవునా విస్మరణకు గురైన మహిళల చరిత్రలు ఆ పుస్తకం నిండా ఉన్నాయి. తర్వాత వచ్చిన ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటంలో అనన్య సామాన్యమైన పాత్రను నిర్వహించిన మహిళల పోరాట చరిత్రను రికార్డు చేశారు స్త్రీ సంఘటన్‌ వారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి, మహిళలు నిర్వహించిన గొప్ప గొప్ప పోరాటాల గురించి అంతకు ముందు వచ్చిన ఏ పుస్తకంలో కూడా ఇంత వివరంగా ఎక్కడా రానే లేదు. మొదటిసారి ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం స్త్రీల దృష్టి కోణంతో స్త్రీల చరిత్రను రికార్డు చేసింది.
అలాంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని మిణుగురులు పుస్తకం ద్వారా డా.చల్లపల్లి స్వరూపరాణి దళిత స్త్రీల పోరాట చరిత్రను వెలికి తీసి పుస్తక రూపంలో మన ముందుంచింది. పుస్తకంలో తను రికార్డు చేసిన 26 మంది దళిత మహిళల అద్భుతమైన పోరాట చరిత్ర చదువుతున్నప్పుడు స్త్రీల పరంగా, ముఖ్యంగా దళిత ఆదివాసీ, మైనారిటీ స్త్రీల పరంగా చరిత్ర ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో, ఎలా వారిని చరిత్రలో ఎక్కడా కనబడకుండా అణచి ఉంచిందో స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ 26 మంది స్త్రీలు ఒకరిని మించి ఒకరు తమ పోరాటాల ద్వారా గొప్ప దళిత పోరాటాల చరిత్రను నిర్మించారు. కొన్ని అబద్ధాలను చరిత్ర పొడుగునా చల్లుకుంటూ వెళ్ళిన వైనాల గురించి స్వరూపరాణి ఈ పుస్తకంలో స్పష్టంగా రాశారు. ముఖ్యంగా రaాన్సీ లక్ష్మీబాయి పేరుతో భారతదేశంలో గొప్ప పోరాట మహిళగా ప్రాచుర్యం పొందిన లక్ష్మీబాయి నిజానికి రaాన్సీ యుద్ధంలో లేదని జల్కారిబాయి అనే దళిత స్త్రీ ఆ యుద్ధంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిందని చదివినప్పుడు ఔరా! ఎంత మోసం అనిపించక మానదు. చరిత్ర పొడవునా ఇలాంటి అబద్ధాలు కుప్పలు తెప్పలుగా ఉన్న కథనాలు బయటకు వస్తున్నాయి. రావాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో భాగ్యమ్మ పాత్ర గురించి స్వరూపరాణి గారు రాసిన వాస్తవాలు, దూబగుంట రోసమ్మను సారా ఉద్యమం పోరాట నాయకురాలిగా ప్రచారం చేసిన తీరు గురించి చదువుతున్నప్పుడు చాలా బాధనిపించింది. ఇంతకాలం సారా
ఉద్యమ నాయకురాలిగా దూబగుంట రోశమ్మే అని నమ్మిన ఒక నమ్మకం పటాపంచలైంది. స్వరూపరాణి భాగ్యమ్మ గురించి రాసిన తర్వాత కూడా సారా వ్యతిరేక పోరాట నాయకురాలు దూబగుంట రోశమ్మ అని నమ్మలేం. నిజానికి చరిత్ర పొడవునా స్త్రీల నాయకత్వాన్ని, స్త్రీల చరిత్రను చీకట్లోనే ఉంచి పురుషుల పరంగానే చరిత్రను నిర్మించుకుంటూ పోయిన దుర్మార్గం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
అలాగే గొప్ప గొప్ప జీవితాలతో వెలిగిన దళిత స్త్రీల చరిత్రలను మరింత అట్టడుగుకు నొక్కేసిన దుర్మార్గాలను తప్పకుండా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. చరిత్ర చీకటిలో మిణుకు మిణుకుమంటున్న మహిళలు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ మహిళల అట్టడుగు అణగారిన వర్గాల చరిత్రను తప్పకుండా బయటకు తీయాలి. చల్లపల్లి స్వరూపరాణి తన మిణుగురులు పుస్తకం ద్వారా ఈ పనిని విజయవంతంగా ప్రారంభించారు. అంతకుముందు గోగు శ్యామల ‘నల్లపొద్దు’ పుస్తకం ద్వారా ఎంతోమంది దళిత స్త్రీల జీవితాలను, వారి పోరాటాలను బయటకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి పుస్తకాలు వందల్లో కాదు, వేలల్లో రావలసిన అవసరం ఉంది. చరిత్ర స్త్రీల పట్ల వ్యవహరించిన వివక్షను, అణచివేతను ఇలాంటి పుస్తకాలు మాత్రమే బహిర్గతం చేయగలుగుతాయి. నిజమైన చరిత్ర ప్రధాన స్రవంతిలోకి రావడానికి ఇలాంటి పుస్తకాలు మాత్రమే దోహదం చేస్తాయి. ఇంత మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన చల్లపల్లి స్వరూపరాణికి మనఃపూర్వక అభినందనలు.ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు భూమికలో ప్రచురితమయ్యాయి. అలాగే ఈ అద్భుతమైన పుస్తకాన్ని ప్రింట్‌ చేసిన పర్స్పెక్టివ్‌ రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఈ పుస్తకం చదవడం, నిజమైన చరిత్రను అర్థం చేసుకోవడం మనందరికీ తప్పనిసరి. లేకపోతే చరిత్రలో ఉన్న అబద్ధాలను నమ్ముతూ ఎంతోమంది నిజమైన షీరోల గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేము. వారు నిర్మించిన పోరాట చరిత్రను అర్థం చేసుకోలేము. సో… అందరూ మిణుగురులు పుస్తకం చదవాలని, ఒక మంచి చర్చకు నాంది పలకాలని నేను భావిస్తున్నాను.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.