నా దొరసాని ` సాయిపద్మ – పద్మ గోవిందుగారి

సాయి పద్మ గురించి చెప్పమని ఆనంద్‌ అడిగితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఇలా తన గురించి నేను తను
ఉన్నప్పుడు ఎప్పుడూ రాయలేదు. వెళ్ళాక రాయవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు.

నేను ఎంతో ముద్దుగా, ఆప్యాయంగా దొరసాని అని పిలుచుకునే సాయిపద్మతో నా స్నేహం ఫేస్‌బుక్‌ ద్వారా మొదలై 12 సంవత్సరాల పై మాటే. ఈ మా స్నేహ ప్రయాణంలో జీవితకాలంలో మర్చిపోలేని ఎన్నో మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉన్నాయి. మా ఇద్దరి పేర్లు ఒక్కటే. ఇద్దరం వీల్‌చైర్‌ వాడుతాము. రుచులు, అభిరుచులు కూడా ఇంచుమించు ఒక్కటే కావడం యాధృచ్ఛికమే.
తను ఒక పెద్ద ఎబశ్ర్‌ీఱ్‌aంసవతీ. తను అన్ని పనులు ఎలా చేస్తుందా, తనకి టైం ఎలా దొరుకుతుందా అన్నది నాకు ఎప్పుడూ ఒక వింతే. అందుకే దొరసాని అని పిలిచేదాన్ని.
ఫేస్‌బుక్‌ ద్వారా మొదలయిన స్నేహం ఎంత గాఢంగా మారిందంటే, పద్మ, ఆనంద్‌ హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా, హైదరాబాద్‌లో తమ బంధువులు ఎంతోమంది ఉన్నా, మా ఇంటికే వచ్చి, సొంత ఇంట్లో ఉన్నంత చనువుగా ఉండే అంత… మా అమ్మని, అమ్మా అని పిలిచే అంత… నేను ఆనంద్‌ని అన్నా అని పిలుచుకునే అంత… నా ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ పద్మ, ఆనంద్‌.
పద్మ కూడా నేను తెలంగాణ కోడలి పిల్లని అని ఎంతో గర్వంగా చెప్పుకునేది. మీ ఇంటికి వస్తే ఇక వేరే వెకేషన్‌కి వెళ్ళనవసరం లేదు పద్మా, ఎంతో హాయిగా ఉంటుంది, నేను రీఛార్జి అవుతాను అనేది వచ్చిన ప్రతిసారీ. పద్మ, ఆనంద్‌లు వస్తే ఇంట్లో పండగలా
ఉండేది నాకు. నేను, పద్మ చిన్నపిల్లలం అయిపోయేవాళ్ళం. మేము చేసే అల్లరి, పద్మ పాటలు, నవ్వులతో ఇల్లు నిండిపోయేది. నేను, పద్మ వీల్‌చైర్లలో చుక్‌ చుక్‌ బండి ఆడుకునేవాళ్ళం. తను మా ఇంటికి వచ్చినప్పుడల్లా అదో అలవాటులా అయిపోయింది మాకు. ఎంత వయసు వచ్చినా మనలోని పసితనాన్ని పోనీయొద్దు అని ఇద్దరం బాగా నమ్మేవాళ్ళం.
పద్మ, ఆనంద్‌తో స్నేహం నాకు పూర్వజన్మ సుకృతం, దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నేను. వారిద్దరి జంటను చూసి ఎంతో గర్వంగా ఫీలయ్యేదాన్ని, అవుతాను కూడా ఎప్పటికీ.
నువ్వు గ్లోబల్‌ ఎయిడ్‌ పని చూస్తూనే, కథలు, కవితలు రాయడం, స్విమ్మింగ్‌కి వెళ్ళడం, నడవడం ప్రాక్టీస్‌ చేయడం, బ్లాగ్స్‌ రాయడం, క్రమం తప్పకుండా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం… ఇన్ని పనులు ఎలా చేస్తావు? టైం ఎలా మేనేజ్‌ చేస్తావు? అని అడిగితే, అదేం లేదు, నీకులాగా నాకు ఇల్లు సర్దిపెట్టుకోవడం, వంట చెయ్యడం, గార్డెన్‌ మెయింటెయిన్‌ చెయ్యడం రాదు, నేర్చుకోవాలి అనేది. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి మనం అనేది.
పద్మని చూసి నేను చాలా నేర్చుకున్నాను. పద్మతో పరిచయమయ్యే వరకు నాకు నా కుటుంబం, పిల్లలు, ఇల్లు, బిజినెస్‌… అదే ప్రపంచం. నేను 50 ఏళ్ళ వయసులో వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌ నేర్చుకొని, నేషనల్‌ ప్లేయర్‌గా ఆడడంలో, తెలంగాణాలో వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ పెట్టడంలో, బాలుర టీం తయారుచేసి నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌కి పంపడం, ట్రోఫీలు గెలవడం, అంతర్జాతీయ టోర్నమెంట్లకి ఇండియన్‌ టీంలో తెలంగాణ ఆటగాళ్ళు సెలక్ట్‌ కావడం వెనుక పద్మ ప్రోత్సాహం ఎంత ఉందో చెప్పలేను.
నాకు నిజజీవితంలో కూడా పద్మ ఇచ్చిన ధైర్మం, ప్రోత్సాహం ఇంత అంత కాదు. నేను జీవితంలో అస్సలు చేయగలనా అని ఊహించని పనులు చాలా చేయగలిగాను. నువ్వు నా సోల్‌ సిస్టర్‌వి రా పద్మా అనేది. ఎప్పుడూ ఏం సలహా కావాలన్నా, ఎంత పనిలో
ఉన్నా కాల్‌/మెసేజ్‌కి వెంటనే రెస్పాండ్‌ అయ్యేది. హామ్లెట్స్‌లో పిల్లలకు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని తను ఎప్పుడూ తపన పడుతూనే ఉండేది. ఒకసారి తనకి నచ్చారు అంటే తను చూపించే ప్రేమ, ఆప్యాయత తన స్నేహితులందరికీ తెలుసు… తను ఎలా
ఉండేదో, ఇప్పుడు ఏమి మిస్‌ అవుతున్నామో.
తను పోవడం నాకు పెద్ద షాక్‌. ఈ జీవితకాలంలో ఎవ్వరూ నింపలేని వెలితి అనేది ఉంటుంది కానీ, తను భౌతికంగా దూరమైనా ఎప్పుడూ మాతో ఉంటుందని నా నమ్మకం. తను చెయ్యాలనుకున్న పనుల్లో ఆనంద్‌కి మన వంతు సహాయం చేస్తూ, తన జీవితాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి తప్ప బాధపడొద్దు అని నా అభిప్రాయం. `

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.