సాయిపద్మ అకవిత్వం ` 26

సున్నితస్తులు మీరు…!!
ఓయ్‌… సున్నితస్తులు ఏంటి చాదస్తులులా అంటారా… వాడేసా… భరించరూ…
భలే సున్నితస్తులు మీరు… మీరంటే భలే ఇష్టం అందరికీ,

అవసరముంటే ఎంత బాగా పలకరిస్తారో
నేర్చుకోవాలోయ్‌… భలే
ఆనాటి పిలుపు ఒక కల
ఏదన్నా మీతో అంగీకరించని విషయం
అడుగుదామంటే సడన్‌గా
మీకో మీ కుక్కపిల్లకో సుస్తీ చేస్తుంది
లేదా ప్రపంచంలో అందరూ వాడే పదం ‘‘బిజీ… ఇప్పుడే వస్తాను’’ అనే వాక్యం ఉండనే ఉంది.
పూలరెక్కలూ కొన్ని తేనె చుక్కలూ… అలా రంగరిస్తివో… ఇలా నీ పిలుపు చేస్తివో (ఎవరికి వారు చక్కగా పాడుకొనవలెను, ధైర్యము లేనిచో బాత్రూం కలదు…!!)
అబ్బా… ఎలాగోలా కొంచెం సున్నితత్వం నేర్పించవచ్చు కదా
ఇలా బండగా, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ… ఎవరూ ప్రేమించకుండా…
ఎందుకీ ఉత్తముండ బ్రతుకు… పాతకుండతో బోల్డు అనాయాస బెనిఫిట్స్‌ ఉండగా
శ్రీ శ్రీ గుర్తొస్తున్నాడబ్బా…
అదృష్టవంతులు మీరు,
వెలుగును ప్రేమిస్తారు,
ఇరులను ద్వేషిస్తారు
మంచికీ చెడ్డకీ నడుమ
కంచుగోడలున్నాయి మీకు.
అభాగ్యులం మేము,
సరిహద్దులు దొరకని
సంధ్యలలో మా సంచారం.
అన్నీ సమస్యలే సందేహాలే మాకు.
వెలుగులేని చీకట్లే,
ఇరులలోని మిణుగురులే చూస్తాం.
నూరు దోషాలలోని ఒక సుగుణం,
నూరు పుణ్యాలలోని ఒక ఘోరం!
వ్యత్యాసాలూ, వ్యాఘాతాఏ
అడుగడుగునా మాకు.
మా వంట మే మే వండుకోవాలి.
ఒక్కొక్కమారు విస్తరే దొరకదు,
…. అంతే పిచ్చి వెధవలం మేము… విస్తరి సమకూర్చుకొని, కనీసం రెండు భక్ష్యాల అక్షరాల ముద్దలు తిందామని నోట్లో
పెట్టుకునేలోగా… ‘‘నీకసలు సున్నితత్వమే లేదు, నా గురించి ఆలోచించకుండా తినేస్తున్నావా?’’ అని అడిగే పరాన్నకవి ‘ఒకడు
అదే చేత్తో నీ అక్షర సరస్వతి భిక్ష మాకు కూడా పెట్టొచ్చు కదా అని
రాయల్‌ బెగ్గింగ్‌ మరొకరు… ఎందుకు చదువుకున్నామా అని విచారించేలోగా… నా పుస్తకాల రిఫరెన్స్‌తో విచారించవచ్చు కదా … అని మరొక అపరిశుద్ధ రచయిత మరొకరు…
నిజమే… చద్దెన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరుగనట్లు… నా నెప్పి నీకు ఒక కవితానుభవం మాత్రమే…!!
కొన్ని సున్నితత్వాలు ఎంత అదృష్టాలో…”Sensitivity”, meanwhile, is a loaded word if there ever was one. It suggests thin skins and easily bruised emotions – a potentially dangerous combination if one perceives these readers as the gatekeepers to publication (which, it should be pointed out, they are generally not).
జీవితపు సన్నని సందులకే
ఆకర్షణ మాకు… మళ్ళీ శ్రీ శ్రీ
అనుకుంటూ ఉంటాం. కానీ కొంచెం పీత బ్రైన్స్‌ అవటం వల్ల… మీ సాహిత్యం మీకో చక్కటి టైం పాస్‌ అని, కూ ఛుక్‌ ఛుక్‌ మని నోస్టాల్జియా బండిలోకి మీరెక్కుతారని, కానీ మధ్య తరగతి అక్షర సాహిత్య జీవులని, ఇప్పుడే కళ్ళు విప్పార్చి మిమ్మల్నీ, మీ సాహిత్యాన్నీ… చిన్నపిల్లల అబ్బురంతో చూసే మగ జనుల పట్ల మీకు తీరిక లేదని, ఆడ జనుల పట్ల అందం, అణకువ కొంచెం పని చేయొచ్చనీ… కానీ మీ స్టాండర్డ్‌ కాని వారు ఎవరైనా, మీ నోస్టాల్జిక్‌ కీర్తి బండి ఎక్కటం మీకు పనమ్మాయికి డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనం పెట్టినంత కంపరంగా ఉంటుందని తెలుసుకోలేదు సుమండీ…
అందుకే… చిన్నీ
Hum Ne Dekhi Hai In Aankhon
Ki Mehakti Khushboo
Haath Se Chhuke Ise
Rishton Ka Ilzaam Na Do
Sirf Ehsaas Hai Ye Rooh Se Mehsus Karo
Pyar Ko Pyar Hi Rehne Do Koi Naam Na Do
ఇక్కడో విషయం చెప్పాలి… ప్రేమ లాంటి ఓవర్‌ రేటెడ్‌ విషయాల జోలికి కాక… నమ్మకం గౌరవం లాంటి, చర్యల ద్వారా ప్రకటితమయ్యే విషయాల మీద రాయాల్సిన అవసరం వచ్చిందేమో… ఆలోచించు…!!
చిన్నీ… తిలక్‌ అన్నట్లు వీరంతా ‘‘అవివేకం వాళ్ళ అవినాశులు’’ `
వదిలేయి…
నీ దారిలో ముళ్ళని తామే తప్పించి, కంపలు పరిచేవాళ్ళు
ప్రేమలు నటించి, నమ్మకాలు కోల్పోయేవాళ్ళు
విపరీతంగా మోహించి, కనీస గౌరవం ఇవ్వలేని వాళ్ళు
వజ్రాలని వదిలేసి, రంగురాళ్ళని లాకర్‌లో దాచుకొనేవాళ్ళు
ఎదిగే పిల్లలని మానసికంగా చంపేసి,
మహారాజుల్లా చలామణి అయ్యేవాళ్ళు
అవసరమా చిన్నీ…??
చిన్న కన్నీటి బిందువుని, ఒక్క ముద్దుతో తుడిచేసే ప్రకృతి, ప్రేమ
ఎన్ని ఆరోగ్యకరమైన వాదనలైనా
agaree to disagree అంటూ
హుందాగా మనల్ని వాళ్ళ జిరాక్స్‌ కాపీల్లా కాకుండా మనలా
ఇష్టపడే స్నేహితులు… మన దగ్గర ఉండగా…
అవుర్‌ క్యా చాహియే బోలో బోలో..
Love you చిన్నీ… ఏం చేసుకుంటావో తెలీనంత హుందాతనపు ప్రేమ
మన సొంతం అయినప్పుడు…
రూమీ అన్నట్లు… ‘‘గాయం ద్వారానే కదా వెలుగు లోపలికి ప్రసరించేది…!!’’

నీ స్నేహిత, సాయి పద్మ
(…తాను గాయమై, రసిjైు, విశ్వ స్నేహాన్ని, గాయపడ్డ హృదయాల్ని దగ్గరకు చేసిన అందరికీ అంకితం…!! 8`2`2019)

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.