నిత్య చైతన్యశీలి, స్నేహానికి ప్రతిరూపం, సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం, ద్విభాషా రచయిత్రి. సామాజిక సేవంటే ప్రాణం. పదిహేనేళ్ళకు పైగా పరిచయం. మొదటిసారి వారు అమెరికాలో మా ఊరు వచ్చినప్పుడు కలుసుకున్నాం.
క్రిందటి నెలలో విశాఖపట్నం పర్యటన పెట్టుకున్నప్పుడు, మేము ముందుగా ఫోన్ చేసిన ఇద్దరు, ముగ్గురిలో సాయిపద్మ గారు ఒకరు. వాళ్ళింటికి రమ్మని, స్నేహితుల్ని పిలుస్తానని అంటే మేము వాళ్ళింటికి వెళ్ళాం. వాళ్ళింట్లో సమావేశం… ఆనంద్ గారితో, పద్మ గారితో, మీనాక్షి గారితో సంభాషణలు… నిన్నా మొన్నటిలా అనిపిస్తోంది. వారు ఇంక లేరన్న వార్త నిజం కాకపోతే బావుండుననిపిస్తోంది.
`