జోహార్లు… సాయిపద్మ గారూ! మీ అకాల మరణం మాకు నమ్మశక్యం కాకుండా ఉంది. పదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి సండే సంచికలో మీ కథ చదివి కాల్ చేసినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.
నేను కూడా కథలు రాస్తూ ఉంటాను అండి అంటే, ‘‘అయ్యో తెలుసు సార్’’ అంటూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు మాట్లాడారు. ఆ తర్వాత ఫేస్బుక్లో మీ పోస్ట్లు చూసి మీరు గొప్ప ధైర్యవంతులు, స్ఫూర్తివంతమైన జీవితం గడుపుతున్నారు అని సంతోషించాను. అంతలోనే గుండెపోటు మిమ్మల్ని ఇలా తీసుకువెళ్తుందని అనుకోలేదు. కడసారి కన్నీటి నివాళి పద్మ గారు.