తన అడుగు జాడల్ని బలంగానే వేసి వెళ్ళిన సాయిపద్మ- ఉమా నూతక్కి

పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కాలేరు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం.

సాయిపద్మని మొదటిసారి చూసినప్పుడే ఆమె ఒక ఫాంటసీలా అనిపించింది. అంతంత పెద్ద కళ్ళు, కనీకనిపించనట్టు బుగ్గల్లో చిన్ని చిన్ని సొట్టలు… ఈ అమ్మాయి అచ్చంగా ఏదో దివ్యలోకం లోంచి దిగి వచ్చింది అనుకునేదాన్ని. జీవితం తనని ఎన్నిరకాలుగా ఆపాలని ప్రయత్నించినా, ఏదో ఒక ప్రత్యామ్నాయ రహదారిని ఎన్నుకుని వెవ్వెవ్వే… అంటూ వెటకరించే తెంపరిలా అనిపించేది సాయిపద్మ.
నేను విజయనగరం నుండి వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు మొదటిసారి నేనూ, మా అబ్బాయి కలిసి వెళ్ళాం తన దగ్గరికి. విజయనగరం జిల్లాలో ఒక హామ్లెట్‌ లో పిల్లలకి లంచ్‌ ప్లేట్లు కావాలని అడిగింది తను. ఆ తర్వాత తనని చాలాసార్లు కలిశాను. ఆ పిల్లలంటే ప్రాణం పెట్టేది. ఫండ్‌… ఫండ్‌… ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేది. తన పుట్టినరోజు, పెళ్ళిరోజు, కొత్త సంవత్సరం, ఇంకేదో పండగ… అది ఏదైనా కావచ్చు! మనం విష్‌ చేశామా, మరి మా పిల్లలకేంటి! అనేది. తనని విష్‌ చేయడం అంటే, తన హామ్లెట్‌ పిల్లలకి మనం ఏదో ఒకటి చేయడమే. నాకు బాగా గుర్తు. ఒకసారి మార్చి 11న తన పుట్టినరోజు నాడు పొద్దున్న ‘‘Happy Birth Day to ME’’ అంటూ తన పుట్టినరోజుని, తన పిల్లల కోసం జరుపుకుంటున్నా అంటూ వాళ్ళకి సహాయం చేయమని ఒక పోస్ట్‌ పెట్టింది. అది చూసి మా అబ్బాయి, తన సేవింగ్స్‌ అన్నీ డ్రా చేసుకుని పరిగెట్టాడు తన దగ్గరకి.
సాయిపద్మ చాలా తెలివైంది. ఎన్నో డిగ్రీలు చేసింది. న్యాయ విద్యలో మాస్టర్స్‌ చేసింది. ఐసిడబ్ల్యుఏ చేసింది. పుస్తకాలు విపరీతంగా చదివేది. చలం అంటే ప్రాణం. మేమిద్దరం కూర్చుని పుస్తకాల గురించి గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. సంగీతం అంటే తనకి ఎంతో ఇష్టం. వాళ్ళమ్మగారి వీణ ఉండేది తన దగ్గర. సగంలో ఆపేసిన వీణని ప్రాక్టీస్‌ చేయాలనేది. పాటలు భలేగా పాడేది. రైఫిల్‌ షూటింగ్‌లో తను నేషనల్‌ ప్లేయర్‌. ఇదీ అదీ అని కాదు, క్షణం క్షణం ఛాలెంజ్‌ విసిరే ఆ ఆరోగ్యంతో తనన్ని పనులు ఎలా చేస్తోందో అర్థమయేది కాదు. మా ఇద్దరినీ కలిపిన కామన్‌ పాయింట్‌ సాహిత్యం కాబట్టి దానిమీద తన అభిరుచిని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎన్నెన్ని పుస్తకాలు కొనేదో. అదీకాక ఇద్దరం కలిసి టొరెంట్స్‌ని తెగ మెయింటైన్‌ చేసేవాళ్ళం. బోలెడు పీడీఎఫ్‌లు, ఎన్నో పుస్తకాలు ఒకేసారి మొదలెట్టి, ఒకేసారి పూర్తిచేసి వాటి గురించి గంటలు గంటలు చర్చించుకునేవాళ్ళం. సాయిపద్మ కథలూ, కవిత్వం రెండూ రాసేది, వ్యాసాలు కూడా! తను రాసిన ‘అకవిత్వం’, ‘అమ్మ కథలు’, ‘సాయిపద్మ కోట్స్‌’ చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి తనకి.
తన జీవితం, తాను మానసికంగా, శారీరకంగా ఎదుర్కొన్న సవాళ్ళు తనకి ఎన్నో పాఠాలు నేర్పాయి. ముఖ్యంగా మనుషులని కాచి వడపోసే కౌశల్యం అబ్బింది. అన్నింటికీ మించి తనలో తాత్వికతను పెంచింది. చిన్నపిల్లలా పకపకా నవ్వుతూనే మనకి నేర్పాలనుకున్న ఎరుకనివ్వగల చాకచక్యం అబ్బింది.
గ్లోబల్‌ ఎయిడ్‌ సంస్థ తన మానస పుత్రిక.Planning-execution ఎప్పుడూ గ్లోబల్‌ ఎయిడ్‌కి సంబంధించి ఇదే ధ్యాసలో ఉండేది. ఎవరితో మాట్లాడుతుంది? ఎప్పుడు మాట్లాడుతుంది? తన ఆరోగ్యం, తన అభిరుచులు, ఇంట్లో బయటా తను ప్రేమించే మనుషుల కోసం సమయం… ఇవన్నీ ఎప్పటికీ తెగని ఆశ్చర్యం నాకు. సాయి గురించి ఎంత చెప్పుకుంటే తన సహచరుడు ఆనంద్‌ గురించి అంత చెప్పుకోవాలి. అలాంటి స్నేహితుడూ, అలాంటి సహచరుడూ దొరకడం ఒక రకంగా తన అదృష్టం.
సర్వీస్‌ చేయగల ఏ అవకాశాన్నీ సాయి వదులుకునేది కాదు. ఒక అంబులెన్స్‌ ఉండి, మూడు ఉత్తరాది జిల్లాల్లోని ట్రైబల్‌ ఏరియాల్లో ప్రజలకి మెడికల్‌ క్యాంపుల్లాంటివి పెట్టగలిగితే బావుండు అనేది ఎప్పుడూ. అలాగే LIC Golden Jubilee Foundation నుండి గ్లోబల్‌ ఎయిడ్‌ సంస్థకి అధునాతనమైన సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ శాంక్షన్‌ అయింది. ఉమా వాళ్ళ అంబులెన్స్‌ అని సంబరపడుతూ చెప్పేది అందరికీ. నిజానికి ఎల్‌ఐసి అలా ఇవ్వగలదు అని చెప్పడం తప్ప నేను చేసిందేమీ లేదు. మనం చేసిన చిన్న మాట సాయాన్ని అలా చెప్పుకోవడం సాయి తత్వం.
కనీసం ఒక మూడేళ్ళపాటు మేం కలవని రోజులు తక్కువ. మా కాఫీ సమయాలు మా All Time Favorites.
ఎంత చెప్పుకున్నా ఈ దుఃఖం తీరదు. ఇప్పుడు తను వెళ్ళిపోయింది. ‘పిల్లా! ఓ మాటు ఫోన్‌ సేస్తవేటి?’ అంటూ
ఉత్తరాది యాసలో ఫక్కుమనే వాయిస్‌ మెసేజులు నాకిక రావు. జీవితపు నలుపు తెలుపులను తెలుసుకుని, అయినా రంగు రంగుల స్వప్నాలను చివరిదాకా వదులుకోకుండా బతగ్గలిగిన సాయిపద్మ తన స్నేహితురాళ్ళకి ఆ లోటుని మిగిల్చి వెళ్ళిపోయింది.
బ్రతికున్నంత కాలం నాలుగడుగులు గట్టిగా వేయడానికి ప్రయాసపడిరది గానీ, తన అడుగుజాడల్ని మాత్రం బలంగానే వేసి వెళ్ళింది. తనని తలచుకుంటూ ఈ నాలుగు ముక్కలు రాస్తుంటే ఈ పక్కనే కూచుని మాటలాపి, పని చూడు పిల్లా అని కసురుతున్నట్టే ఉంది.
`

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.