మా అమ్మ సాయిపద్మ గారి గురించి ఒక పది వాక్యాలు రాద్దామని అనుకున్నాను, కానీ పదిహేను వేల వాక్యాలు రాసినా తక్కువే. అమ్మ అని ఎందుకన్నానంటే కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలని రోడ్డుమీద వదిలేస్తున్న ఈ రోజుల్లో ఆవిడకి సంబంధం లేని ఎంతోమంది పిల్లలను చేరదీసి విద్యను, వైద్యాన్ని అందించి, వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని విధాలా ఆదుకుని, ఒక స్థాయికి వచ్చేవరకూ సహాయం
అందించారు. అమ్మ అనే మాటకి ప్రతిరూపంగా నిలిచారు. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ ఎంతోమంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరిలోనూ ధైర్యం నింపారు. ఆవిడతో ప్రయాణించిన ప్రతి ఒక్కరూ గొప్ప స్థాయికి చేరుకోవాలని నిరంతరం ఆశించేవారు. అలాంటి వారిలో నేనూ ఒకడిని. ఏడవ తరగతి చదివిన నేను ఒక డ్రైవర్‌గా అమ్మ దగ్గర చేరాను. అమ్మ మరియు సార్ ప్రోత్సాహంతో పదవ తరగతి పానయ్యి ఇంటర్ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎంతోమంది నాకు ఏమీ రాదని అనేవారు. నన్ను నమ్మి మేడం, సార్ వారి అమ్మల పేరిట ఆరోగ్యాన్నిచ్చే ఒక కేప్`మిల్లీ బాక్స్ బాధ్యతను నాకు అప్పగించారు. ఒక గొప్ప మనసున్న అమ్మని మనం కోల్పోయాము. ఆవిడ ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
`