మా పద్మ తల్లి గురించి ఒక చిన్న పేరా రాయండి అని అన్నారు. అసలు అంత క్లుప్తంగా రాయగలమా తన గురించి. వామనుడి లాగా ఒక అడుగు ఆకాశంలో, ఒక అడుగు నేలమీద పెట్టి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నట్లు ఆకాశం నుండి పాతాళం వరకు తనకి తెలియని విషయం ఏమీ లేదు.
అంతటి విజ్ఞాన ఖని. తను మాకు కూతురు కాదు, మేమే తన పిల్లలం అన్నట్లు అన్నీ పద్మనే సలహా అడిగేవాళ్ళం. ఎన్నో పనులు, సేవలు చిటికెలో ఫోన్‌ల ద్వారా చేసేసేది. ఎంతమందికో కౌన్సిలింగ్ చేసి ధైర్యం నింపేది. కొన్ని వేల మందికి చదువులు చెప్పించిన అపర సరస్వతి. ఎంతమందికో అన్నం పెట్టిన అన్నపూర్ణ తల్లి. ఇంక గళం విప్పిందంటే తన గానమాధుర్యంలో మైమరిచి పోయేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే మా కుటుంబానికి పద్మ వెన్నెముక అంటే అతిశయోక్తి కాదు. తను చదువుతూ ఉండగా ఎప్పుడూ చూడలేదు కానీ ఎన్ని డిగ్రీలో సంపాదించింది. అంతటి ఏక సంధాగ్రాహి. ఎవరైనా ఒక్కసారి తనకి పరిచయమైతే చాలు,
వాళ్ళు అయస్కాంతంలాగా ఆకర్షితులైపోయేవారు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే.
` నీ దేవి పిన్ని
, సాయి పద్మ పెద్ద పిన్ని