మేరికుమారి మాదిగ
పల్లవి : సఫా ఓ సఫాయి – అణగారిణ సఫాయి
అన్యాయం బ్రతుకులాయేనా – సఫాయి
అవనిలోనా బాధలాయే – సఫాయి
కష్టాల కడలిలో – కానరాని దారిలో
‘కంపుతోటీ, కంపుతోటి – కడుపునిండే నా సఫాయి ||2 సార్లు||
కన్నీల్లే నీకు మిగిలేనా – సఫాయి ||సఫాయో||
1 చరణం : ఇడిసేసిన సెప్పుకింతా – ఇజ్జతన్నా ఉంది గాని
వదిలేసిన మలంకింతా – విలువన్నా ఉంది గాని
రోతంత సాపు జేస్తే – రోగాలే నీకు మిగిలే
వాల్ల కంపు అంతాసాపు జేస్తే – కన్నీల్లె నీకు మిగిలే
‘సోంపు, సోకు దొరకాయే నా – సఫాయి ||2 సార్లు||
కంపు అంతా నీకు మిగిలేనా – సఫాయి ||సఫాయో||
2 చరణం : రైలుస్టేషన్లో నా – బస్టాండు దొడ్లకాడ
జీతము నీకు లేకున్నా – జీవిగంజీ లేకున్నా
దొడ్డికోచ్చె దోరకేమొ – దండాలు బేడ్తావు
డబ్బాతోటి నీల్లీచ్చి – దర్వాజను మూసుతావు
‘రూపాయి ఇయ్యిదోర అంటేనా – సఫాయి ||2 సార్లు||
అర్ధరూపాయి ఇసిరేసేనా – సఫాయి ||సఫాయో||
3 చరణం : నీకంటే ముందు లేసి – నీ ఇంటి ఆడోల్లు
రేకు సీపురు తీసుకోని – మలాన్నంతా తట్టాకెత్తి
తట్ట నెత్తినెత్తుకోని – ఊర అవతల పడబోసీ
ఊపిరితిత్తుల జబ్బు వచ్చి – ఉన్నపానము వాయే
‘భార్యా లేనీ, భర్తవైతివా – సఫాయి ||2 సార్లు||
తల్లీ లేనీ పిల్లలైనరా – సఫాయి ||సఫాయో||
4 చరణం : రాసింది బాగా రాసి – కడిగిందే బాగా కడికి
జ్వరమొచ్చి రోగమొచ్చి – పనికి నువ్వు పోకపోతే
నోటికొచ్చినట్టు దిట్టి – డ్యూటిలోకి రాకండు
మిధెరియా వ్యాధి వచ్చి – మిడుసురానికోచ్చినాది
‘కంపూ, గ్యాస్ కడుపు నిండేనా – సఫాయి ||2 సార్లు||
సారా తాగి సచ్చిపోతివా – సఫాయి ||సఫాయో||
5 చరణం : సచ్చినోల్లు సావంగా – వోచ్చేతరం ఓక్కటైయ్యి
మీ సమస్యకు మీరే – నాయకులై కదలాలి
మనిషి, మలాన్ని మనిషి – చేతులతో ఎత్తకుండా
మిషిండ్లతో శుభ్రపరిచే – పరికరాలు తెద్దాము
సఫాయి కర్మచారి జి.వోను – తెద్దాము
ఇయ్యకుంటే గవర్నమెంటు – ఇజ్జతంత దీద్దాము
పునరావాసం కోసం – ఐ్పు ఫైనాన్స్ కోటలోనా
పథకాలన్నోే ఉన్నయి – ఆ పథకాలను సాధించా
పయనమై సాగుదాము – పయనమై సాగుదాము
పయనమై సాగుదాము……………
జైభీంమ్
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags