జూలూరు కృష్ణవేణి
నొసటి కుంకుమ కారే కన్నీటితో…
జత కట్టి రుధిర ధారలు కాగా…
ఏడుపుతో ఎర్రబడ్డ కండ్లు అగ్నిగోళాలై…
ఈ ప్రపంచాన్నెందుకు దహించలేదు…?
కడుపులో కదులుతున్న పసికూన ఆక్రందనలు…
కామాంధుల చెవులకు విన్పించనే లేదు…
కామంతో పొరలు కమ్మిన ఉన్మాదం కదా…
అమ్మ కాబోయే ఆడది సైతం…
అంగడిబొమ్మలాగానే కన్పిస్తుంది మరి…!!
అర్థరాత్రి దాటాక జనారణ్యంలో…
సంచరించే మృగాళ్ళ గాలాలకు…
దొరికేది అమాయిక ఎరలే!!
సామూహిక అత్యాచారాల చౌరాస్తాలో…
దిగజారిన నైతికత, మరొక్కమారు తలదించుకుంది…
యథాప్రకారం మౌనం పాటించింది…
కాటికి కాలుచాచిన ముసలవ్వ…
ముక్కుపచ్చలారని పసిబిడ్డ…
కలలపంటను మోస్తున్న కాబోయే అమ్మ దాకా…
మినహాయింపు మిగలని మహిళలను…
కరుడు గట్టిన కామం కాటు వేస్తూనే ఉంది క్రౌర్యంగా…
యుగాల నుండి… యుగాంతం దాకా…
ఇతిహాసాలనుండి… ఇప్పటిదాకా…
పునరావృతమవుతున్న కీచక ఘట్టాలు…
మంటలను రగిల్చే మారణహోమాలై…
నరనరాలనీ నలిపేస్తుంటే…
కామాసురుల కాలాన్ని అంతం చేసే…
సత్యభామల పునరుజ్జీవనం జరుగుతూనే ఉంటుంది…
సమరం సాగుతూనే ఉంటుంది…!!
(ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా ఉత్తనూర్ చౌరాస్తా వద్ద ఎనిమిది నెలల గర్భిణిపై జరిగిన జీపుడ్రైవర్ల సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ)
-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
