‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం
కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’
సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన
యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి
ఛార్జ్ పెట్టినట్లుగా మనం కూడా
అప్పుడప్పుడూ రీచార్జ్ అవుతుండాలి తప్పదు…
స్టవ్వు తుడిచి తుడిచీ అరిగిపోయిన చేతుల్నీ
వంటిళ్ళలో నడిచి నడిచీ పాచి పట్టిన కాళ్ళనీ…
రొటీన్ జీవితాన్ని మోసి మోసీ బరువెక్కిపోయిన
గుండెనీచురుకయిన ఆలోచనలనన్నింటినీ మరుగున
పడేసి ఇల్లలకడమే ధ్యేయంగా పెట్టుకున్న మెదడునీ…
అప్పుడప్పుడూ రీఛార్జ్ చేస్తుండాలి… గుండె మాళిగలో
అట్టడుగు దుమ్ము పొరల్లో కూరుకుపోయిన స్పందనలన్నింటికీ
కాసిని నీళ్ళు చిలకరించి వికసించనివ్వాలి… అందుకొకటే
మార్గం… స్నేహం…. స్నేహం కంటే గొప్ప మానవసంబంధం
ఈ ప్రపంచంలో మరేముంటుంది…?
నిత్య చైతన్య స్నేహ స్రవంతి సత్యవతి, అనాది పద్యం.
సతత హరిత కవితాఝరి కొండేపూడి, మధుర మంజుల గానాన్ని
శరీరమంతటా నింపుకున్న రాగమయి రోష్ని, స్నేహ తపస్వి
శివలక్ష్మి, స్త్రీల కవిత్వాన్ని విల్లులా వంచి నారి సారించిన
శిలాలోలితలతో కలిసి ఒకరోజంతా కలిసి గూడు వదిలిన గువ్వల్లా
సాహిత్యాకాశమంతటా విహరించినపుడు ఆ చైతన్యంతో
మరికొంతకాలం స్ఫూర్తివంతంగా బతికేయవచ్చునన్పించింది.
ఆనందం అన్నది నిరంతర ప్రయాణం
నాకు రెండుకళ్ళు స్నేహం, సాహిత్యం