బస్తీలలో ఎగిసిపడిన చైతన్యం – భూమిక టీం

మూడు దశాబ్దాలుగా భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ జెండర్‌ ఆధారిత హింసపై మన తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తుందని మన అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం హైద్రాబాదులో, అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డ 10 బస్తీలలో స్త్రీలు, పురుషులు, కిశోర బాలబాలికలు మరియు యువతతో ఆడ వారి పట్ల, ట్రాన్స్‌ మహిళల పట్ల హింసకి వ్యతిరేకంగా భూమిక పని చేస్తుంది.

కేవలం ఇవే కాకుండా మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన ఇతర అంశాలపైన కూడా పని చేస్తుంది. ఈ బస్తీలకు దగ్గరగా సపోర్ట్‌ సెంటర్లు వున్నాయి. ప్రతి సపోర్ట్‌ సెంటర్‌లో ఇద్దరు శిక్షణ పొందిన కౌన్సిలర్లు వుంటారు.
కమ్యూనిటీ మొబిలైజర్లు ప్రతి బస్తీ వాసులతో పరిచయం చేసుకొని భూమిక అందించే సేవల గురించి చెప్పి చాలా వ్యూహాత్మకంగా శిక్షణా మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పగలు స్త్రీలు అందుబాటులో వుంటారు, కానీ మనతో చర్చించటానికి సమయం కేటాయించటం కొంచెం కష్టం. పిల్లలు సాయంత్రాలు లేదా సెలవు రోజుల్లో దొరుకుతారు. ప్రయత్నం చెయ్యగా చెయ్యగా సాయంత్ర కాలంలో లేదా ఆదివారం రోజున యువత మరియు పురుషులు దొరుకుతారు. సముదాయాలని సమీకరించటం ఎంత సవాలుగా వున్నా, భూమిక బృందం మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ కౌన్సిలర్లు, కమ్యూనిటీ మొబిలైజర్లు చాలా కష్టపడి, సముదాయాలని చేరుకోవటం, వారితో జెండర్‌, మహిళల సమస్యలు, ఆరోగ్యం, మత్తు పదార్థాలు, పోర్నోగ్రఫీ, మధ్యపానం లైంగిక దాడి, గృహ హింస మొదలైన అంశాలు చర్చిస్తుంటారు. బస్తీల్లో, సపోర్ట్‌ సెంటర్లలో కూడా కౌన్సిలింగ్‌ ఇవ్వటం జరుగుతుంది. ఇలా క్షేత్ర స్థాయిలో వెళ్లి పని చేయటం వల్ల రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళటానికి ఇబ్బంది పడే చాలా మంది కమ్యూనిటీ సభ్యులు భూమిక సపోర్ట్‌ సెంటర్‌కి వచ్చి కౌన్సిలింగ్‌తో పాటు అవసరాన్ని బట్టి వేరే సేవలు కూడా అందుకుంటారు. కేసు తీవ్రతని బట్టి ఇతర సేవల కోసం, వివిధ రకాల సెంటర్లకు రిఫర్‌ చేయటం జరుగుతుంది. మొత్తానికి జెండర్‌ ఆధారిత హింసకి సంబంధించిన సమాచారమైతే సముదాయాలలో చేరుతుంది.
ఇటీవల కోల్కతాలో ఆర్‌ జి కర్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హింసాత్మకమైన సంఘటన నేపథ్యంలో బస్తీల్లో అందరు చర్చించటం మొదలైంది. భూమిక కమ్యూనిటీ మొబిలైజర్స్‌ రోజు లాగానే బస్తీని సందర్శించినప్పుడు ఈ సంఘటన ప్రస్తావనలోకి వచ్చింది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ దుర్ఘటనని ఖండిస్తూ, బస్తీలో అప్రమత్తంగా ఉండటానికి అవగాహన పెంచటానికి, నిరసన తెలుపుతూ ఒక ర్యాలీ చేస్తే బాగుండు అని నిర్ణయించుకున్నారు. ఇది ఒక సానుకూలమైన సంకేతం. బస్తీ మహిళలు ముందుకు వచ్చి ర్యాలీ చేస్తాం అనటం భూమిక చేస్తున్న కృషికి కూడా ఒక గుర్తింపుగా భావించొచ్చు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే కమ్యూనిటీ మొబిలైజర్లు కావలసిన వస్తువులు సేకరించి ర్యాలీకి సిద్ధమయ్యారు. బస్తీ నాయకులు స్వయంగా వెళ్లి పోలీస్‌ అనుమతి తీసుకున్నారు. ఇది తమ అభివృద్ధి వైపు యాజమాన్యం తీసుకున్నట్టే! ‘‘బస్తీ మహిళలు ర్యాలీ చేద్దాం అనగానే సంతోషంగా అనిపించింది. వారు వారి ఆడపిల్లల్ని కాపాడాలని, మగవారు బాధ్యతగా ఉండాలని ఇటువంటి సంఘటనలు నివారించాలని ర్యాలీ కోసం ముందుకు వచ్చారు. సరిగ్గా ప్రోగ్రాం మొదలయ్యే సమయానికి ఒక పది నిమిషాలు గట్టిగా వర్షం కురిసింది. అయ్యో అని నిరాశ చెందాను. కానీ వర్షం తగ్గిన వెంటనే ర్యాలీ మొదలైంది. నాకు సంతోషం కలిగింది’’ అని చెప్పింది మంజుల, కమ్యూనిటీ మొబిలైజర్‌.
ఆగస్టు నెలలో రెండు బస్తీలలో 2ర్యాలీలు నిర్వహించటం జరిగింది. ఒకో ర్యాలీలో దాదాపు 80 నుండి 90మంది పాల్గొన్నారు. ఆడ, మగ, చిన్న పిల్లలు, యువత అందరు ఈ ర్యాలీలో నినాదాలు పలుకుతూ కోల్కతాలో జరిగిన సంఘటనని ఖండిస్తూ నిరసన చేసారు. పోలీస్‌ వారు కూడా సహకరించారు.
పోస్టర్లు, ప్లకార్డులు, కొవ్వొత్తులు పట్టుకొని బస్తీ వాసులు ర్యాలీలో పాల్గొన్నారు. బస్తీ కమిటీలోని నాయకులూ సభ్యులు కూడా నిరసన తెలుపుతూ మాట్లాడారు. అసలు ఏ విషయం అయినా మాట్లాడటానికి ఇబ్బంది పడే మహిళలు ఈనాడు మహిళలపై హింసని అరికట్టాలని నినాదాలు తీస్తూ వీధుల్లో నిరసన చెయ్యటం ఒక గొప్ప మార్పుగా పరిగణించాలి. పారిశుధ్య కార్మికులుగా, గృహ కార్మికులు, కూలి పని చేసుకొనే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడ బిడ్డలు భద్రంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు నివారించాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మహిళలు అందరు ఒకటి అయి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశారు. ఒక సముదాయంలో మార్పు రావటానికి ఇది తొలి అడుగుగా భావించొచ్చు. అందరిలో హింస గురించి ఆలోచించటానికి ఒక స్ఫూర్తిని కలుగచేసింది. ఇది మార్పుకి దారితీస్తుంది. భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ బస్తీలలో పని చేసి ఎన్నో కేసులు పరిష్కరించినా, సముదాయాల ప్రవర్తనలో మార్పు రావటానికి కొంతలో కొంత అయినా కారణమైంది అని ఈ ర్యాలీలు ద్వారా తెలుస్తుంది. ఇది విజయంలో ఒక భాగమే! ‘‘ర్యాలీలో గృహిణీలు, పని చేసే మహిళలు, పురుషులూ, యువత, పిల్లలూ అందరూ పాల్గొన్నారు. ప్రతి సారి మేము మాట్లాడతాం. ఈ సారి బస్తీ నాయకులు ఆసక్తి చూపించి వారు బస్తీ వాసులతో లైంగిక వేధింపులు మానభంగాలు అరికట్టాలని సభని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇది పాజిటివ్‌ సైన్‌’’ అని చెప్పింది ధన లక్ష్మి, కమ్యూనిటీ మొబిలైజర్‌.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.