అత్యాచార హత్యాచార పర్వంలో.. – వి.శాంతి ప్రబోధ

‘ఏమైపోతుందో ఈ లోకం ఏమైపో తుందో’ వార్తలు చూస్తున్న అత్తగారి స్వగతం.
‘ఆడ ఏడనో డాక్టరమ్మను చెరబట్టి చంపే సిన్రట’ అంటూ పనిలో పడిరది యాదమ్మ.
‘పెద్దలు అందుకే అన్నారేమో.. ఆడ పిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని ‘‘గొణిగింది అత్తగారు.

జరిగింది మనిషన్న వాళ్ళనెవరినైనా కది లించే సంఘటనే. అందుకే దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దేశమంతా, ఏ మూల కెళ్ళినా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి 15 నిముషాలకు ఒక రేప్‌ యధేచ్చగా జరుగుతున్నదని క్రైమ్‌ రికార్డ్స్‌ చెబుతున్నాయి. ఇక రికార్డు కాని వాటి సంగతి?
ఈ దేశంలో కులం, మతం, ప్రాంతం, జాతి, వర్గ భేదం లేకుండా ఆరు నెలల పసిగుడ్డు నుంచి చావుకు కాళ్ళు చాచిన పండుటాకు వరకు అంతా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా బాధితులుగా మారి పోవచ్చు. కారణం వాళ్ళు ఆడ పుట్టుక పుట్టడమే.
అదే విధంగా ఈ దేశంలో కులం, మతం, ప్రాంతం, జాతి, వర్గ భేదం లేకుండా ఏ పురుషుడైనా రేప్‌కి పాల్పడవచ్చు. మహిళల మర్మ స్థానాన్ని వాళ్ళ జన్మ హక్కుగా ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటూ
ఉంటారు. అలా అనుకునే వాతావరణం మన సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉంది. అందుకే మానవ జన్మ స్థానాన్ని తనకు నచ్చినట్టు ఆడుకునే క్రీడా మైదానంగా, సామూహిక క్రీడా మైదానంగా మార్చే స్తున్నారు కొందరు. ప్రతిఘటించి అలసి పోయి రసివోడుతున్న హృదయాల్ని నిర్ధాక్షి ణ్యంగా హత్య చేస్తున్నారు.
నిర్భయ, దిశ, కేసుల తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్‌ డాక్టర్‌ సంఘటనలే కాదు. అంత కంటే దారుణ హింసకు గురి చేసి చంపేసిన సంఘటనలున్నాయి. అయితే ఒక నిర్భయకు, ఒక దిశకు, ఒక డాక్టర్‌ కేసు రేపిన సంచలనం అవి కలిగించలేదు. ప్రజల నుంచి అంతటి స్పందన రాలేదు. కారణం ఏంటి? ఆ సంఘటనలకు మీడియా ఇచ్చిన విలువ, ప్రచారం మిగతా సంఘటనల్లో లేకపోవడమే. మరి ఎందుకని ప్రచారం లభించలేదు? అంటే స్పష్టంగా అర్థమయ్యే విషయం మహిళలందరూ ఒకటి కాదనేగా. తప్పు చేసినవారు ఎవరైనా తప్పనిసరిగా శిక్షించాలి. ఏ పార్టీ వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గం వారైనా శిక్షించాలి. కానీ అలా జరగదు. వాస్తవాలు బొంద పెట్టేస్తారు. కొత్త అబద్ధాలు పుట్టించేస్తారు… నేరస్తుడిని కాకుండా మరెవరికో నేరస్తుడిగా శిక్షిస్తారు. అదంతా పాలకుల, ఏలికల అండదండలతోనే జరు గుతూ ఉంటుంది. రసివోడుతున్న రాచ పుండు లాంటి అత్యాచారాలు హత్యా ఘటన లకు పైపైన పూత పూసే మందుల్లాంటి చర్యలు తప్ప ఆ పుండు పుట్టడానికి కారణం వెతికి మూల చికిత్స చేయలేమా… మరో చోట మరో వ్రణం రాకుండా కాపాడు కోలేమా?
మనసు ఉంటే మార్గం ఉంటుంది. మన పాలకులకు అది లేనట్లే అనుకోవచ్చా… మాకు మనసుంది అన్నట్లు 2012లో నిర్బయ పై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ తర్వాత క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టంలో మార్పులు చేశారు. కానీ ఫలితం ఏమిటి? ప్రభావం ఏంటి ఫలితం అందుకున్నామా… 2019లో నేరం చేశారని ఆరోపిస్తూ తక్షణమే నలుగురిని కాల్చి పారేశారు. కానీ సమస్య పోయిందా? లేదు, సమస్య మూలాల్లోకి వెళ్లనంత వరకు వేరు పురుగు విస్తరిస్తూనే ఉంటుందన్న విషయం మర్చిపోతే ఎలా?
అమ్మాయిల కురచ దుస్తుల్ని దోషిగా మార్చి మన మగపిల్లల్ని రేపిస్టులుగా మారుస్తున్న సమాజంగా గుర్తింపు పొందుతున్నాం. ఆ గుర్తింపుతో సంబరప డదామా లేక మన ఆడపిల్లల్ని, మహిళల్నే కాదు మగపిల్లల్ని, పురుషుల్ని కాపాడు కోవడానికి నడుం కడదామా?! మరి, మన బుర్రలో దూరిన వేరుపురుగు ఏరివేసే బాధ్యత కుటుంబం, కుల-మత-వర్గ వ్యవస్థలతో కూడిన సమాజం, ప్రభుత్వం తీసుకుంటుందా?! రేపిస్టులకు, నేరస్థులకు కొమ్ము కాసే ప్రభుత్వంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ నేతి బీరకాయలో నెయ్యి చందంగానే ఉంటుంది. నిజ్జంగా పాలకు లకు శ్రద్ధ, పట్టింపు ఉంటే వేరుపురుగు లాంటి రేపిస్టులను, నేరస్తులను కఠినంగా శిక్షిస్తారు. వారిలో పరివర్తనకు కృషి చేస్తారు. మహిళను తోటి వ్యక్తిగా గౌరవించే విధంగా కుటుంబంలో, గ్రామంలో, సమాజంలో ఉగ్గుపాలతో నేర్పుతారు. విద్యలో దాన్ని భాగం చేస్తారు. అత్యాచారం, హత్య ఎంత అనాగరిక చర్యలో, ఎంత పెద్ద నేరమో తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కలుగజేస్తారు.
కోవిడ్‌ వస్తే మాస్కులు పెట్టుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలలో చైతన్యం తెచ్చినట్లే, నిరక్షరాస్యత అధికంగా ఉన్న మన సమాజానికి గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటియం వంటివి అలవాటు చేసినట్లే అత్యాచార నిరోధానికి కూడా చేయొచ్చు. అందుకు కావాల్సింది సంకల్ప బలం, చిత్తశుద్ధి. అది లేనంత వరకు అత్యాచార, హత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంటుంది.
భారతీయ మహిళ మాన ప్రాణాలు కోల్పోతూనే, భారతీయ పురుషుడు రేపిస్టు గా, భారతదేశం రేపిస్ట్‌ దేశంగా అభాసు పాలవుతూనే ఉంటారు.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.