లోకంలో విలువైనది స్త్రీ
స్త్రీ స్త్రీ
ఈ లోకమంతా తెలుసు నీ విలువ
చేశావు ఎన్నో పోరాటాలు
నిర్వహిస్తావు ఎన్నో బాధ్యతలు
కుటుంబం కోసం ఎన్నో పరుగులు
ఒక ఇంటికి నాయకురాలు
ఒక కుటుంబానికి స్నేహితురాలు అమ్మగా ప్రేమను పంచుతావు అక్కగా సహాయం చేస్తావు
కుటుంబానికి కూతురులా తోడుంటావు
చెల్లిగా ఆనందాన్ని పంచుకుంటావు.
గృహిణిలా ఇంటి పనులు చేస్తావు
స్నేహితురాలిలా అన్ని పంచుకుంటావు
నీకోసం వేచి ఉన్నాయి ఎన్నో పదవులు
అవి సాధించుటకు నీవు చేసే ప్రయత్నాలు
అందులో ఉన్నాయి ఎన్నో బాధ్యతలు
ధైర్యంగా ఎదుర్కొంటావు ఎదిరింపులు
– కార్తీక, 10వ తరగతి