తండ్రి
ఎవరి పట్ల స్వార్థం ఆశించని నిస్వార్ధ వ్యక్తి
కష్టాలనే కడలిలో ఎప్పుడూ పనిచేస్తునే ఉంటుంది
ఆయన యుక్తి సమస్యలతో మన కోసం పోరాడే ఒక శక్తి
ఎప్పుడూ ఉండాలి ఆయనపై భక్తి ఆయన పొగడడంలో
ఉండదు ఎటువంటి అతిశయోక్తి
ఎన్ని చేసినా ఆశించడు ఆయనకు ముక్తి
ఆయన అనుభవాల్లో ఉంటుంది ఎంతో రక్తి
ఆయనకి ఎన్నడూ లభించదు మనశ్శాంతి
ఎప్పుడూ ఆశించడు ఆయన విశ్రాంతి
ఎన్నడూ తరగదు ఆయన క్రాంతి మార్చుకోవాలి ఆయనపై మనకున్న తప్పుడు బ్రాంతి
ఆయన మాటలు పాటిస్తే కనిపిస్తుంది మన జీవితంలో పురోగతి
లేదంటే అవతాము ఇంకొకరి చేతిలో బంతి
ఆయన చూపే త్రోవే మేము పయనించే జీవన స్రవంతి.
– G. తేజ్ ప్రమోద్ 10 వ తరగతి