‘‘మహిళా రైతులు, కూలీలకు రైతులుగా గుర్తింపు, భూమి హక్కులు కావాలి’’ మహిళా రైతుల హక్కుల వేదిక(మకాం) రెండవ జాతీయ సదస్సు డిమాండ్‌ – ఆశాలత

మహిళా రైతుల హక్కుల వేదిక రెండవ జాతీయ సదస్సు పూనాలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో మే నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తేజకరమైన వాతావరణంలో జరిగింది.

ఈ సదస్సును పూణే విశ్వవిద్యాలయంలోని జెండర్‌ స్టడీస్‌ డిపార్ట్మెంట్‌తో కలిసి నిర్వహించటం జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌్‌, రaార్ఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, అస్సాం, నాగాలాండ్‌ మొదలైన 14 రాష్ట్రాల నుండి 500కు పైగా మహిళలు కొద్దిమంది మగవాళ్ళు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుండి 50 మంది, దాదాపు 10 సంస్థలు, సంఘాల నుండి హాజరయ్యారు. వారిలో మొదటిసారి మకాం మీటింగ్‌కి హాజరైన వాళ్ళు చాలా మంది వున్నారు. పూణే యూనివర్సిటీ ఆడిటోరియం ప్రాంగణం అంతా రంగు రంగుల బ్యానర్లు, పోస్టరు, ముగ్గులు, పెయింటింగ్‌లు, నినాదాలు, వివిధ జిల్లాల మహిళలు పాడిన పాటలు, నృత్యాలతో మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంది.
మహిళా రైతులు అంటున్నామంటే, సాగుదారులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, అడవులపై ఆధారపడేవారు, ఉప్పు కొటారులలో పనిచేసేవారు, పశువులను పెంచేవారు అందరూ అని అర్ధం. 2006లో ఎం ఎస్‌ స్వామినాధన్‌ ఛైర్మన్‌గా నేషనల్‌ ఫార్మర్స్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో రైతు అనే పదానికి ఇచ్చిన ఈ విస్తృత నిర్వచనాన్ని మహిళా రైతుల హక్కుల వేదిక స్వీకరించింది. మహిళలకు రైతులుగా గుర్తింపు కావాలి, వనరులపై హక్కులు కావాలి, కుటుంబ స్థాయి నుండి పార్లమెంటు వరకు నిర్ణయాధికారం వుండాలి, వ్యవసాయ పరిశోధనలో, పధకాలలో మహిళలకు సమాన భాగస్వామ్యం వుండాలి అనే 5 ప్రాధమిక డిమాండ్లతో 2015లో మకాం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండవ జాతీయ సదస్సును జరుపుకుంది.
గత 10 ఏళ్లుగా అనేక రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ, జాతీయ స్థాయి కన్సల్టేషన్లను నిర్వహించి, వివిధ ప్రభుత్వ శాఖల మంత్రులు, అధికారులు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మొదలైన వారిని కలుపుకుని విస్తృత చర్చలు జరిపి మహిళా రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకెళ్లింది. వివిధ రాష్ట్రాలలో అనేక సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ఐక్య రాజ్యసమితి అక్టోబర్‌ 15వ తేదీని గ్రామీణ మహిళా దినోత్సవంగా ప్రకటించటాన్ని పురస్కరించుకుని, 2017లో మకాం ప్రయత్నాల ద్వారా కేంద్ర వ్యవసాయ మంత్రి దానిని జాతీయ మహిళా రైతుల దినోత్సవంగా ప్రకటించేటట్లు చేయటంలో విజయం సాధించింది. 2019-20 సంవత్సరాలలో ఢల్లీి సరిహద్దులలో మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దీర్ఘకాలం సాగిన రైతు ఉద్యమంలో మకాం పాల్గొని మహిళా రైతుల సమస్యలను గొంతెత్తి చాటింది. వారికి సంబంధించిన సమస్యలను, డిమాండ్లను ప్రముఖంగా ముందుకు తెచ్చింది. కోవిడ్‌ సమయంలో మహిళా రైతులపై పడిన ప్రభావాన్ని అధ్యయనం చేసింది, ఇంకా మహిళా రైతులపై వ్యవస్థాగత హింస, కిసాన్‌ సమ్మాన నిధి అనే పధకం అందుబాటు గురించి గురించి అధ్యయనాలు చేసింది. ఈ మొత్తం క్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం సంపాదించింది. అనేక మంది ప్రముఖ పరిశోధకులు, పాత్రికేయులు, విద్యార్ధులు, కార్మిక యూనియన్ల నాయకులు మాకాంతో ఏకీభావంతో కలిసి వచ్చారు.
గుర్తింపు తట్టుకుని నిలిచే శక్తి మార్పు అనే ప్రధాన శీర్షికతో జరిగిన ఈ రెండవ జాతీయ సదస్సులో నాలుగు ప్లీనరీలు, 10 చిన్న గ్రూపులలో చర్చలకు వీలు కల్పించే సమాంతర చర్చా వేదికలు జరిగాయి. వాటిలో దాదాపు అన్ని రాష్ట్రాల మహిళా రైతులు, దళిత, ఆదివాసీ నాయకులు, వ్యవసాయ కూలీలు పాల్గొని మాట్లాడారు.
ప్లీనరీ అంశాలు: 1. మహిళా రైతుల హక్కుల సాధనకై సంఘటితం కావటం, 2. వ్యవసాయంలో మహిళలపై వ్యవస్థాగత హింస, 3. అటవీ హక్కులు-పరిపాలన-ఉమ్మడి వనరులు, 4. నైసర్గిక ప్రకృతి వ్యవసాయం-స్త్రీ వాద దృక్పధం-వ్యూహాలు
ప్లీనరీ సమావేశాలలో అరుణా రాయ్‌, గీతా రామకృష్ణన్‌ వంటి వారు వ్యవసాయ కూలీల సమస్యలపై, వారి హక్కులపై వివరంగా మాట్లాడారు. వారు సంఘటిత పడాల్సిన అవసరం గురించి బలంగా చెప్పారు. అటవీ హక్కుల విషయంలో అనేక రాష్ట్రాలలో అటవీ చట్టాల ఉల్లంఘన, దాని వల్ల ఆదివాసీ మహిళల హక్కులకు భంగం కలగటమే కాకుండా వారిని అడవుల నుండి వెళ్లగొట్టటం కారణంగా వారిపై వేధింపులు, హింస, దానికి వ్యతిరేకంగా మహిళల పోరాటాల గురించి వివిధ రాష్ట్రాల ఆదివాసీ మహిళలు మాట్లాడారు. మహిళా రైతులు, కూలీలపై వ్యవస్థాగత హింస గురించి రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలు, చిన్న కమతాలు సాగుచేస్తున్న రైతులు వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేయటంలో స్త్రీ వాద దృక్పధంతో భూమి, విత్తనాలు వంటి వనరులపై మహిళల హక్కుల గురించి, పర్యావరణానికి అనుకూలమైన ఆహార పంటలు పండిరచటం, వాటిని స్థానిక మార్కెట్లలో అమ్ముకోవటం, మార్కెట్‌ శక్తులను ఎదిరించటం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘలుగా ఏర్పడి స్వావలంబన సాధించటంలో సమస్యలను అధిగమించి సాధించిన అనేక విజయగాధలను మహిళలు వివరించారు. మహిళలకు భూమి హక్కుల ఇతర వనరులపై హక్కుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ‘‘జల్‌, జంగల్‌, జమీన్‌’’ అనే నినాదం మారుమోగింది.
సమాంతర చర్చా వేదికలు:
మొదటి రెండు రోజులు ఒకొక్క రోజుకు 5 సమాంతర చర్చా వేదికలు జరిగాయి. వాటిలో మహిళా రైతులు, కూలీలు, విద్యార్ధులు, పరిశోధకులు, ఉద్యమకారులు పాల్గొని ఆయా అంశాలపై వివరంగా చర్చించారు. వాటిలో పైన పేర్కొన్న నాలుగు ప్లీనరీ అంశాలతో పాటు రైతు ఆత్మహత్య కుటుంబాల సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు, భూమి హక్కులు, విత్తన సార్వభౌమత్వం, పశుపాలన-మహిళల జీవనోపాధులు, మత్స్య కార మహిళల సమస్యలు-హక్కులు, గ్రామీణ వ్యవసాయ కుటుంబాల యువతకు ఉన్నత విద్యావకాశాలు అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ సమాంతర వేదికలలో ఎక్కువ మంది పాల్గొని తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. తమ ప్రాంతాల సమస్యల గురించి కార్యక్రమాల గురించి వీడియోలను ప్రదర్శించారు. సమాంతర వేదికలలో చర్చించిన ఒక్కొక్క అంశం గురించి ఆ అంశం యొక్క నేపధ్యం, సమస్యలు, సవాళ్ళు, సలహాలు, సూచనలను క్రోడీకరించి వాటిని ప్లీనరీ సమావేశాలలో పంచుకోవటం జరిగింది.
మొత్తం మీద యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొని మకాం ఉద్దేశాలను ముందుకు తీసుకెళతారనే సందేశాన్ని ఇచ్చారు.
అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే చివరి రోజున జరిగిన రాష్ట్ర స్థాయి గ్రూపు మీటింగ్‌లలో ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్తులో పని చేయాల్సిన అంశాలను గుర్తించటంతో పాటు ప్రతి రాష్ట్రం నుండి ఒకరు లేదా ఇద్దరు మహిళా రైతు ప్రతినిధులను ఎన్నుకున్నారు. వాళ్లందరూ ఇక నుండి మకాంను ముందుకు నడపటానికి మహిళా రైతుల నాయకత్వాన్ని అందిస్తారు.
ఇప్పటివరకు మకాంను నడిపిస్తున్న నేషనల్‌ ఫెసిలిటేషన్‌ టీమ్‌ సభ్యులు వారి వెనుక ఉండి గైడ్‌ చేస్తారు. ఇది మకాం ఏర్పడిన 10 సంవత్సరాల సందర్భంగా నిర్మాణ పరంగా పడిన ఒక మంచి అడుగు.
ఎగ్జిబిషన్‌: వివిధ రాష్ట్రాల మహిళా రైతుల సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కనుమరుగైపోతున్న పంటల విత్తనాలు, అరుదుగా దొరికే కూరగాయలు, పండ్లు, తాము పండిరచిన పంటలతో తయారుచేసిన రకరకాల ఆహార పదార్ధాలు, పుస్తకాలు, మందు మొక్కలతో తయారుచేసిన మందులు, మొదలైనవి ఎన్నెన్నో ఈ ఎగ్జిబిషన్‌ స్టాళ్ళలో ప్రదర్శించి అమ్మకానికి పెట్టారు.
సావిత్రీబాయి ఫూలే జీవితంపై నాటకం.
మొదటి రోజు సాయంత్రం సమావేశాల ముగింపులో సావిత్రీ బాయి ఫూలే జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన నాటక ప్రదర్శన జరిగింది. ఇద్దరు యువతులు సావిత్రీ బాయి జీవితంలోని వివిధ అంకాలను అనేక ఇతర పాత్రలను కూడా తామే నటిస్తూ అద్భుతంగా ప్రదర్శించారు. గంటన్నర పాటు సాగిన ఈ నాటకం హిందీలో వున్నప్పటికీ భాష తెలియకపోయినా మహిళలందరూ శ్రద్ధతో చూసి ఉత్తేజం పొందారు. అందులో నటించిన ఇద్దరు అమ్మాయిలను అభినందించకుండా వుండలేకపోయారు. ఈ నాటకంలోని అంశాలను సమకాలీన పరిస్థితులకు జోడిరచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వటం ఈ నాటకంలో ప్రముఖంగా చెప్పుకోవాలి.
మహిళా రైతుల రెండవ జాతీయ సమావేశం ప్రకటన
మూడు రోజుల పాటు ప్లీనరీలు, సమాంతర చర్చావేదికలలో జరిగిన చర్చల నుండి వచ్చిన ముఖ్యమైన విషయాలను, డిమాండ్లను క్రోడీకరించి ముగింపులో మహిళా రైతులు చేసిన ప్రకటన యొక్క సంక్షిప్త సారాంశం ఇది:
1. వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు: – మహిళలు భారత వ్యవసాయానికి వెన్నెముకగా ఉన్నారు – సాగుదారులు, కూలీలు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, అటవీ ఉత్పత్తుల సేకరణ దారులుగా వున్నప్పటికీ విధానాలు మరియు డేటాబేస్‌లలో వారు కనిపించకుండా అదృశ్యంగా వుండిపోయారు. – రైతు నిర్వచనంలో భూ యజమానులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో పనిచేసే అన్ని రకాల మహిళలను చేర్చాలి.
2. వ్యవస్థాగత అడ్డంకులు, జెండర్‌ వివక్ష: – కులం, వర్గం, పితృస్వామ్యం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మహిళలు అనేక రకాలుగా వ్యవస్థాగత వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు. – మహిళలకు భూమి, ఋణ సదుపాయం, సాంకేతికత మరియు సామాజిక భద్రత కల్పించే లింగ-విభజిత డేటా మరియు అందుకు వీలు కల్పించే విధానం యొక్క తక్షణ అవసరం ఉంది.
3. భూమి, వనరులపై హక్కులు: – రైతుల రిజిస్ట్రీలో వ్యవసాయ మహిళలను (భూమి పట్టాలు ఉన్నా, లేకపోయినా) చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాము. – భూమి పట్టాలు, వారసత్వం మరియు పరిహార ప్రక్రియలలో మహిళలకు సమాన హక్కులు ఉండాలి. – అభివృద్ధి ముసుగులో ఆదివాసీలను అడవుల నుండి స్థానభ్రంశం చెందడాన్ని నిరోధించండి.
4. హింస మరియు చట్టపరమైన సాధికారత: – మహిళా రైతులపై జరిగే అన్ని రకాల హింసలను ఆపటానికి, పరిష్కరించటానికి ప్రయత్నాలు చేపట్టాలి. – మహిళలపై హింసకు సంబంధించిన భద్రతా చట్టాలను, లోకల్‌ కమిటీల వంటి ఫిర్యాదుల వ్యవస్థలను గ్రామ, మండల స్థాయిలో ఏర్పరచి వాటి అమలును బలోపేతం చేయండి (ఉదా. లైంగిక వేధింపుల చట్టం).
5. అటవీ హక్కులు మరియు ఉమ్మడి వనరులు : – ఆదివాసీ మరియు అటవీ ఆధారిత మహిళలను రక్షించడానికి పీసా, మరియు అటవీ హక్కుల చట్టాలను పూర్తిగా అమలు చేయండి. – ఏ అభివృద్ధి ప్రాజెక్టు అయినా ఆదివాసీ సమాజ సమ్మతిని, మహిళల హక్కులను ఉల్లంఘించకూడదు.
6. నైసర్గిక ప్రకృతి వ్యవసాయం మరియు ఆహార సార్వభౌమాధికారం: – కార్పొరేట్‌, రసాయన వ్యవసాయం నుండి మహిళల నేతృత్వంలోని వ్యవసాయ పర్యావరణ అనుకూల ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లండి. – మహిళల స్థానిక జ్ఞానం, సుస్థిరమైన పద్ధతులు మరియు పర్యావరణ వ్యవసాయాన్ని గుర్తించి మద్దతు ఇవ్వండి.
7. వ్యవసాయ కార్మికుల హక్కులు: – కనీస వేతనాలు మరియు స్త్రీ పురుషులకు సమాన వేతనాలను అమలు చేయండి.
– వలస కార్మికులకు భద్రత కాలపాయించి, ఉపాధి హామీ పనిలో 200 పనిదినాలు మరియు సకాలంలో వేతనాల చెల్లింపుతో NREGSని మెరుగుపరచండి. – ఉపాధి హామీ పద్ధకంలో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ పనులను చేర్చండి.
8. విత్తన సార్వభౌమాధికారం: – మహిళలు వ్యవసాయ-జీవవైవిధ్యానికి సంరక్షకులు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులకు మద్దతు ఇస్తారు మరియు GM/జీనోమ్‌-సవరించిన విత్తనాలను వ్యతిరేకిస్తారు. – విత్తనాలపై మేధో సంపత్తి హక్కులను (IPRలు) తిరస్కరించండి.
9. పశువులు, చేపలు పట్టడం మరియు అనుబంధ జీవనోపాధి: – వనరులు, మౌలిక సదుపాయాలు మరియు మార్కెట్‌ అవకాశాలను కల్పించటంతో పశువులు మరియు మత్స్య సంపదలో మహిళల పాత్రకు మద్దతు ఇవ్వండి. – పశువుల పెంపకందారులు అడవులలో మేపుకోవతాన్ని నేరరహితం చేయండి మరియు సాంప్రదాయ మేత మరియు చేపలు పట్టే హక్కులను నిర్ధారించండి.
10. విద్య మరియు యువత సాధికారత: – గ్రామీణ యువత, ముఖ్యంగా బాలికలు, స్కాలర్‌షిప్‌లు, సహాయ వ్యవస్థలు మరియు ప్రాతినిధ్యంతో ఉన్నత విద్యను పొందేలా చూసుకోండి.
11. రైతుల ఆత్మహత్యల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు మద్దతు: – అటువంటి గృహాల నుండి మహిళలకు సమగ్ర ఉపశమనం, పునరావాసం మరియు జీవనోపాధికి మద్దతు కల్పించాలి. – చట్టపరమైన హక్కులు, మానసిక ఆరోగ్య మద్దతు మరియు ఆత్మహత్య డేటాలో కౌలుదారు మరియు మహిళా రైతుల గుర్తింపు వుండాలి.
12. మేము ఈ కింది డిమాండ్లను సాధించటానికి పునరంకితమవుతున్నాము : – మహిళా రైతులు, కూలీలకు రైతులుగా హక్కుదారులగా గుర్తింపు – కుల, వర్గ, పితృస్వామ్య, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతులపై అమలవుతున్న వ్యవస్థీకృత హింసను పరిష్కరించటం – మహిళలకు భూమి హక్కులు, ఋణసదుపాయం, ఆరోగ్య సంరక్షణ, నాయమైన వేతనాలు, భద్రత కల్పించాలి – విధానాల రూపకల్పనలో, పరిశోధనలో మహిళల గొంతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. – వివిధ రంగాల మధ్య అంటే ప్రభుత్వము, పౌర సమాజము, క్షేత్రస్థాయి మహిళా సంఘాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పి జెండర్‌ పరంగా భవిష్యత్తులో న్యాయమైన వ్యవసాయాన్ని నెలకొల్పే విధంగా ప్రయత్నాలు జరగాలి.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.