తెలుగు కథ విస్తృతి, వైవిద్యం, పరిధి – అబ్బూరి ఛాయదేవి

1998 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు భూమిక అన్వేషి కలిసి ఒక కథ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం ప్రారంభ సభకి అబ్బూరి ఛాయాదేవి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ కాత్యాయని విద్మహే తెలుగు కథ విస్తృతి, వైవిధ్యం, పరిధిపై ప్రసంగించారు. ఇప్పుడు సాహిత్య విమర్శకురాలిగా పేరుపొందిన అధ్యాపకురాలు డాక్టర్‌ కాత్యాయని కూడా చిన్నతనంలో కథలు, కవితలు రాసిన వారే.

అందుచేత తమ స్వీయానుభవాన్ని కూడా తెలిపారు మొదట్లో. ఇటువంటి వర్క్‌షాప్‌లో రచయితలు, విమర్శకులు తమ అనుభవాన్ని అభిప్రాయాల్ని పంచుకోవడానికి ఉపయోగిస్తుంది అన్నారమె. జీవితం పట్ల విమర్శనాత్మక దృష్టి లేకపోతే ఎవరు సృజనాత్మకంగా రాయలేరు. అంచేత ‘సృజన సాహిత్యానికి కూడా పునాది విమర్శ’ అన్నారామే. కథా రచయితలు చూపించే జీవితాన్ని విమర్శకులు విశ్లేషిస్తారు. ఇంతవరకు వచ్చిన సాహిత్యాన్ని, సాహిత్య విమర్శని సమీక్షించుకోవడం అవసరమని చరిత్రని అధ్యయనం చేసి, వర్తమానస్థితిని అర్థం చేసుకొని అంచనా వేసుకోవాలి అన్నారామే. అదే ఈ వర్క్‌షాప్‌ లక్ష్యం అని సూచించారు. జీవితంలోని సంఘర్షణ నుంచే కథ పుడుతుందని ఒక వ్యక్తి తన సమస్యని మరో వ్యక్తితో పంచుకున్నట్లే, ఎక్కువ మందితో తనకు తెలిపిన సంఘర్షణలను పంచుకోవడానికి కథలు రాయడం జరుగుతుంది. కథకి సమాజంలో సంబంధం ఉంది. అందుచేత సమాజంలో వచ్చిన పరిణామాలను బట్టి కథా సాహిత్యంలో పరిణామం వచ్చిందా అని చూడాలి. చరిత్ర నుంచి కథని అధ్యయనం చేయాలి. అలాగే విమర్శ కూడా సమాజ పరిణామానికి సంబంధించినదై ఉండాలి అన్నారు డాక్టర్‌ కాత్యాయని. సంస్కరణోద్యమ కాలంలోనూ, జాతీయోద్యమ కాలంలోను ఎన్నో కథలు వచ్చాయి. కానీ, కథా సాహిత్యంలో వచ్చిన సామాజిక విమర్శని పట్టించుకోలేకపోవడమే ఈనాటికీ అప్పటి సమస్యలు కొన్ని ఇంకా కొనసాగడానికి కారణం అన్నారామే. ‘విస్తృతి’ అంటే జీవితంలోని అన్ని కోణాలని అన్ని వైపుల నుంచి చీకటి కోణాలని, మూలాల్ని చూడటం అన్నారామే. రచయితలు ఎవరి జీవితపరిధి నుంచి వారు రాస్తారు. అన్ని సమగ్రంగా, వారు చూపించిన వివిధ కోణాలను పరిశీలించవలసి ఉంటుంది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. దృష్టి కోణాలు వేరుగా ఉంటాయని గమనించాలి. ఆమె కుటుంబరావు, కరుణకుమారి, శ్రీశ్రీ, కార మొదలైన ప్రసిద్ధి రచయితలు కథలు కొన్నిటిని ఉదాహరణలుగా చెప్పారు.
సమాజాన్ని చూడటం అంటే, సమాజంలోని ఎదుగుదలని విమర్శనాత్మకంగా చూడటం, జీవితం పట్ల విమర్శనాత్మక దృక్పథంతో పాటు, నూతన సామాజిక నిర్మాణాల కోసం, వ్యవస్థల కోసం అన్వేషణ కథల్లో ఉంటుంది. ఉదాహరణకు ప్రాంతీయ రచనల్లో తెలంగాణ, రాయలసీమ మొదలైన ప్రాంతాల నుంచి వచ్చే రచనలు సమాజాన్ని మార్చుకోవాలని ఆకాంక్ష విప్లవోద్యమ నేపథ్యంలో కనిపిస్తుంది అన్నారు డాక్టర్‌ కాత్యాయని. ఆమె స్త్రీల జీవితం గురించి, దాన్ని కథల్లో చిత్రించడం గురించి చెబుతూ, గురజాడని ముందుగా ప్రస్తావించారు. అయితే గత దశాబ్దం నుంచి స్త్రీల జీవితాల్లోని వివిధ పర్వాలను విమర్శనాత్మకంగా చూడటం మొదలైంది. ఉద్యమాల వల్ల స్త్రీలకు ఏమి వరగటం లేదన్న స్పృహ కలిగిన తర్వాత స్త్రీలు స్వయంగా తమ సమస్యల గురించి ఆలోచించడం మొదలైందని గుర్తు చేశారు. స్త్రీల కథ, సాహిత్యం చాలా విస్తృతమైనది అన్నారు. అనుభవాలు విస్తరించినప్పుడు, జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడినప్పుడు విమర్శనాత్మకంగా చూడటం అలవాటవుతుంది. కథలో కూడా విస్తృతి, వైవిధ్యం ఏర్పడుతుంది. ఆ పరిణామం పి. సత్యవతి నేటి ప్రముఖ స్త్రీవాద రచయిత్రుల కథల్లో కనిపిస్తోంది అన్నారు డాక్టర్‌ కాత్యాయని. ఈ కొత్త స్త్రీవాద కథలు వచ్చాక, పురుషులు కూడా ఆ విధంగా రాయడం మొదలు పెట్టారని గుర్తు చేశారు. డాక్టర్‌ కాత్యాయని ఉపన్యాసం ముగిసిన తరువాత వర్క్‌షాప్‌ సభ్యుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆధునిక కథని గురజాడ కథతో ఎందుకు మొదలు పెడుతున్నారని సజయ అడిగారు. దానికి సమాధానంగా, అంతకు ముందున్న కథల్లో ఆధునిక లక్షణం లేదు సమకాలీన జీవితాన్ని గురించి వ్యవహారిక భాషలో రాయడం గురజాడతోనే మొదలైంది అన్నారు డాక్టర్‌ కాత్యాయని. స్త్రీలు రాజకీయాల గురించి ఎక్కువగా ఎందుకు రాయడం లేదన్న ప్రశ్నకు సమాధానంగా ‘నాయకత్వ స్థాయిలోనూ, అటువంటి వారితోనూ సంబంధం ఉన్న స్త్రీలు మాత్రమే విస్తృత అనుభవంతో రాయగలుగుతారు’ అని చెప్పారు. జాతీయ ఉద్యమ కాలంలో కూడా స్త్రీలు స్వాతంత్ర ఉద్యమం గురించి రాశారు. మగవాళ్లు జైళ్ళకు వెళితే ఆడవాళ్లు కొందరు కథలు రాశారు. అయితే వాళ్లు ప్రాతిపత్యాన్ని నిలుపుతూ, పురుషులు స్వాతంత్ర ఉద్యమాన్ని ‘సపోర్‌’్ట చేయడం మాత్రమే వారి కథల్లో ప్రతిఫలించింది అని ముగించారు డాక్టర్‌ కాత్యాయనీ.
27వ తేదీ ఉదయం రెండవ సభలో కాళీపట్నం రామారావు గారు ‘కథాశిల్పం’ గురించి ఉపన్యసించారు. తమ ఉపన్యాసం ‘కథాశిల్పం’ అంటే ఏమిటో తెలియని వాళ్ల కోసం మాత్రమే ఉద్దేశించబడిరది అన్నారు ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ.
‘కథ’, కథ కానిది ఈ రెండిరటి గురించి విపులంగా తెలియజేశారు. ఒక సంఘటన మనల్ని చలింప చేస్తే దాని గురించి కథ రాయాలనిపిస్తుంది. యధాతదంగా రాస్తే వృత్తాంతం అవుతుంది. ఆ సంఘటన మిమ్మల్ని ఎందుకు కదిలించిందో ఆలోచించి రాస్తే అది కథ అవుతుంది. అందులో కథ ఉంటుంది. వాదోపవదాన్ని యధాతదంగా చిత్రిస్తే కథ అవ్వదు. అందులోని ముఖ్యాంశాన్ని పట్టుకొని కథలో రాస్తే కథ అవుతుంది అని తెలియచెప్పారు ‘కారా’ గారు.
కథా నిర్మాణం ఎలా ఉండాలో, అందులోని కథా సామాగ్రిని ఏ విధంగా ఉపయోగించాలో వివరించారు, ఒక సంఘటనలో ఘర్షణ ఏర్పడటానికి తగిన సన్నివేశాల్ని, వాటికనుకూలమైన పాత్రల్ని సృష్టించుకోవాలి. పాఠకుడికి మనం చెప్పింది ఎలా అర్థమవుతుంది అని ఆలోచించుకుంటూ పదాల్ని, వాక్యాన్ని మార్చవలసి ఉంటుందని సూచించారు. గొప్ప కథకులు రాసిన కథల్ని అనుకరిస్తూ రాయడం తప్పు కాదన్నారు. ఉదాహరణకి, రావిశాస్త్రి గారి ‘జరీ అంచు తెల్లచీర’ లోని కధాంశాన్ని తీసుకొని మరోరకంగా ‘సంకల్పం’ కథని సరికొత్తగా తను ఎలా రాసినది వివరించారు. ఇదొక ప్రయోగంలో చేశామని చెప్పారు కారా గారు. ‘కథని పంచేంద్రియాల ద్వారా చెప్పాలి’ అని రావిశాస్త్రి గారు చెప్పిన దాన్ని వివరించారు. అది కత్తిమీద సాము లాంటిది అన్నారు. ఎటువంటి పాత్రల్ని తీసుకోవాలో, కథలకి నామకరణం ఎలా చేయాలో, సంభాషణలు ఎలా ఉండాలో, ముగింపు ఎలా ఉండాలో తెలియజేశారు.
తమ ఉపన్యాసంలో ఒకచోట ఫెమినిస్టులు ఫెమినిస్టుల కథలే చదువుతారు అన్న వాక్యాన్ని వివరించమని, అలా ఎందుకన్నారని కే సత్యవతి ప్రశ్నించారు ‘కారాగారిని’. ఆయన అది సాధారణంగా జరిగే సంగతి. మనకి సరిపడని ధోరణిలో రాసిన వాటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది. కథన పద్ధతి, కథా శిల్పం ఇతర రచయితల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అందుకే ఇతరులని చదవాలి అన్నారాయన.
ముగింపు రచయిత చెప్పాలా, పాఠకుడికి వదిలేయాల అని మాధవి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, రచయిత ఏది కన్వే చేయాలనుకుంటాడో అక్కడితో ముగిస్తే మంచిది, వాక్యానించడం, కావాలని కొసమెరుపు కోసం రాయడం మంచిది కాదు’ అన్నారు కారాగారు.
మారే పరిస్థితుల్ని ఎంతవరకు చిత్రించాలి? అని సజయ గారు ప్రశ్నించారు.
తక్కువ చెప్పి ఎక్కువ గ్రహించేటట్లు రాయడం మంచిది అన్నారు కాళీపట్నం రామారావు గారు.
27-2-98 మధ్యాహ్నం మొదట సభలో కే.లలిత ప్రసంగించారు. ఆమె ‘అన్వేషి’ అని స్త్రీల అధ్యయన కేంద్రాన్ని స్థాపించిన వారిలో ఒకరు. ఆమె తీసుకున్న విషయం ‘‘సంఘ సంస్కరణోద్యమ నేపథ్యం స్త్రీల కథలు’’ ఈ సభకి ఉమామహేశ్వరి అధ్యక్షత వహించారు. సంఘ సంస్కరణోద్యమానికి ముందు వచ్చిన రచనల గురించి అంతగా పరిశోధన జరగలేదు. అసలు ఆ కాలంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది అన్న విషయం మీద సరిjైున పరిశోధన జరగలేదు అన్నారు లలిత. ఈస్టిండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి సమాజంలో మార్పు సంభవించిందన్నారు. వ్యవసాయ రంగంలోను, విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంలోనూ, న్యాయ పరిపాలన విషయంలోనూ, ప్రభుత్వ విధానంలోనూ ముఖ్యమైన మార్పులు ప్రవేశపెట్టారు.
అప్పటి నుంచే సంస్కరణోద్యమం ప్రారంభమైందని చెప్పారు. ఈ మార్పు సాంఘిక పరంగాను. మతపరంగానూ తీసుకురావడానికి ప్రయత్నించారు. భారతదేశంలో ఉన్న అనేక సంస్కృతులలో ఏకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని వలసవాదులు ప్రయత్నించారు. ఈ మార్పులు పాశ్యాత్యీకరణ, పారిశ్రామికీకరణలో అంతర్భాగంగా వచ్చిన మార్పులే గాని, స్వాతంత్ర పోరాటానికి అనుబంధంగా వచ్చినవి కావు అన్నారు లలిత.
సమాజంలో మార్పు తేవాలంటే ముందు చరిత్రని అర్థం చేసుకోవాలి అన్నారామె. బ్రిటిష్‌ మిషనరీలు మన స్త్రీల గురించి ఆదర్శవంతమైన చిత్రన చేశారు. కుటుంబ వ్యవస్థలో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పారు. మన ప్రాచీన కావ్యాలలో మధ్యతరగతి స్త్రీల గురించి, సామాన్య గృహిణులు గురించి ఎక్కువ సమాచారం లేదు. దాన్ని వలస పాలకులే ప్రవేశపెట్టారని చెప్పారామే.
1910 లో వచ్చిన గురుజాడ కధ మొదటి ఆధునిక కథ అంటున్నారు విమర్శకులు. కానీ 1902లో బండారు అచ్చమాంబ రాసిన ‘ధన త్రయోదశి’ ఎందుకు మొదటి కథగా పరిగణించడం లేదు? అని ప్రశ్నించారు లలిత.
1920లలో దరసి అన్నపూర్ణమ్మ గారు మధ్యతరగతి స్త్రీల మూఢవిశ్వాసాల గురించి కథలు రాశారు.
సంఘ సంస్కరణ ఉద్యమం, జాతీయ ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ఎన్ని వచ్చిన స్త్రీల పట్ల సమాజంలో మౌలికమైన మార్పు అంతగా రాలేదు అన్నారమె. పులకుర్తి లక్ష్మీనరస మాంబ గారు పాశ్చాత్తా పద్ధతిని ఎందుకు అనుకరిస్తున్నాం అని ప్రశ్నిస్తూ ‘హిందూ సుందరి’, ‘అనసూయ’ వంటి పత్రికలలో వ్యాసాలు రాశారు. కథలలాంటి ‘శారద లేఖలు’ రాశారు కనుముర్తి పరిలక్ష్మమ్మ గారు. కానీ, ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్త్రీల ఆత్మ చరిత్రలు అంతగా లేవు విశాఖపట్నం నుంచి జానకమ్మ గారు అంటే ఒకరిద్దరు రాసినవి తప్ప. స్త్రీల ఆత్మ చరిత్రలు ఎందుకు లేవు అని ఆలోచించాలి అన్నారు లలిత. ‘ఆదర్శ స్త్రీ మూర్తిని బ్రిటిష్‌ మిషనరీలు వర్ణించిన దాన్ని ఆనాటి స్త్రీలు ఏ విధంగా తీసుకున్నారు?’’ అని డాక్టర్‌ కాత్యాయని వేసిన ప్రశ్నకి ‘స్త్రీల సంస్కరణ అంటే ఆనాటి స్త్రీల ఉద్దేశం ఏమిటి?’ అనీ మాధవి వేసిన ప్రశ్నకి సమాధానంగా, ఆనాటి స్త్రీలని సనాతనవాదులు, ఆధునికవాదులు అని వేరువేరుగా అనుకోవడం పొరపాటు. ఉదాహరణకు పులకుర్తి లక్ష్మి నరసమాంబ వీరేశలింగం గారిని వ్యతిరేకించారు. పునర్వివాహం గురించి ఎందుకు మాట్లాడతారు. వితంతువులకు విద్యావకాశాలు ఉండాలని ఎందుకనరు? అని ప్రశ్నించారు. వీరేశలింగం గారిని వ్యతిరేకించిన మాత్రాన ఆమె సనాతనవాది అనుకోకూడదు అన్నారు.
27వ తేదీ మధ్యాహ్నం రెండవ సభకి పి.సత్యవతి అధ్యక్షత వహించగా, శ్రీ అల్లం రాజయ్య ‘ఈ దశాబ్దంలో తెలుగు కథ’ గురించి ఉపన్యాసించారు. కథలు వస్తువులు ఎంతో భిన్నమైన లోతుల్లోకి వెళ్లాయి, సాహిత్యం అంటే ఎరుగని వాళ్లు కుగ్రామాల్లో కూలి జనం కూడా కథలు నవలలు రాసే స్థితికి ఎదిగారు. అది ఈ దశాబ్దంలో వచ్చిన ముఖ్య పరిణామం అంటూ ప్రారంభించారు. అల్లం రాజయ్య పత్రికలలో స్త్రీలకు సంబంధించిన కథలు చదువుతున్నందువల్ల వాటి గురించి చర్చించడం ఉపయోగకరం అని అభిప్రాయపడ్డారాయన.
కేవలం సాహిత్యం గురించి మాట్లాడుకుంటే లాభం లేదు. సాంఘిక స్థితిగతులను అర్థం చేసుకోకుండా ఈనాటి కదలి చదివితే అర్థం కావు అన్నారు. ఈ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు రచయితల్ని ప్రభావితం చేసిన విషయాలు రష్యాలో పరిణామాలు, చైనాలో పరిణామాలు ఇరాక్‌పై దాడి ప్రపంచంలో బలబలాలు నిరూపణ మొదలైనవి అన్ని చెప్పారు. పూర్వం కార్మికులు సమ్మెలు చేసేవారు. కానీ గత దశాబ్దంలో సంఘటిత శక్తుల గొంతులు వినిపించడం లేదు. శ్రామికుల్ని ఉద్యోగాల నుంచి తొలగించడం ఎక్కువైనది. వస్తువుల నాణ్యత గురించి అమెరికా నిర్దేశించిన ప్రమాణాలను మాత్రమే పాటిస్తున్నాం. వ్యవసాయ రంగంలో కూడా విపరీతమైన పరిణామాలు వచ్చాయి. వరంగల్‌లో రైతుల్ని చంపడం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఆదివాసి ప్రాంతాల్లో ప్రపంచ శక్తులు చొచ్చుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. అల్లం రాజయ్య కథల్లో భాష నిర్మాణం దృశ్య మూడు ప్రాంతాల నుంచి కథలు వస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమ కోస్తా ప్రాంతాల నుంచి అన్నారాయన. తెలంగాణ నుంచి వచ్చే కథల్లో పరాయికరణ అనుబంధాల్లో మార్పులు- మానవ సంబంధాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి వచ్చే కథల్లో ఆర్థిక రాజకీయ పరిస్థితులు చిత్రింపబడుతున్నాయి. కోస్తా ప్రాంతాల నుంచి వచ్చే కథల్లో ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చే కథల్లో పట్టణాల్లో వచ్చిన పరిణామాలు చిత్రింపబడుతున్నాయి అన్నారు. మొత్తం మీద మహిళలు దళితులు పిల్లల గురించి కథలు వస్తున్నాయని అన్నారు. స్త్రీల విషయంలో అల్లం రాజయ్య తమవైన కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.
ప్రబంధాల్ని పురుషులే రాసారంటే ఆ స్త్రీలు ఎంతగా వారిని ప్రభావితం చేశారు ఊహించవచ్చు. కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత స్త్రీలపైనే ఆధారపడుతూ వస్తోంది. దాన్ని స్త్రీలు తోసి పుచ్చడం వల్ల ఘర్షణ ఏర్పడుతోంది. కళలలో స్త్రీలకే ప్రాధాన్యత ఉంది. స్వయం వ్యక్తీకరణ స్త్రీలకు లేకపోలేదు. లేకపోతే ఎలా బ్రతికారు? ఆచార వ్యవహారాల్లోనూ అన్నిటిలోనూ స్త్రీల ప్రమేయం ఉంది. ఆ ప్రమేయం ఎంతవరకు ఉంది అన్నది ఆలోచించాలి. రైతుల ఆత్మహత్యల విషయంలో కుటుంబాల్లోని ఆడవాళ్ళ బాధ్యత ఎక్కువ అన్నారాయన. ఈ అంశాలన్నీ మన కథా సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. మార్పులు కోరే విప్లవవాదులు కూడా స్త్రీల విషయంలో యధాస్థితి కొనసాగాలని కోరుకుంటున్నాను. పూర్వపు భూస్వామి పోలీసు, ఈనాడు పూర్వంలా లేరు. ఈనాడు ఎక్కువ భాగం మధ్యతరగతి వాళ్లు భయపడుతున్నారు. మధ్యతరగతి వాళ్లు జీవన స్మ్రుతులు వాళ్ల పరిస్థితులకు లొంగి పోతున్నారు. విధ్వంసం సమాజంలో ఎవరి వల్ల జరుగుతుంది. భార్య వల్లా, బిడ్డల వల్లా, బాస్‌ వల్లా? తన లోపలి భావాల వల్లా అని ఆలోచించుకోవాలి. నిజానికి తన్నుతాను నిలబెట్టుకోవడానికి తన మీద ఉన్న ప్రభావాలను త్రోసిపుచ్చాలి. కానీ అలా చేయకుండా స్వార్థానికి లొంగి పోతున్నారు అన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యల గురించి రచయితలు ఏ విధమైన దృక్పథాన్ని ప్రదర్శించాలి? రైతుల పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని అన్నారాయన.
‘పనిపిల్ల’ కథ గురించి మాట్లాడుతూ, పైశక్తుల కన్నా లోపలి శక్తులే విభేదించాయని అన్నారు. ఏ శ్రమను అయితే గౌరవించాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయో, అభివృద్ధి చెందాక ఆ ప్రయోజనానికి ఏ విరుద్ధంగా యజమానులను అనుకరించడం ప్రారంభిస్తున్నారని విమర్శించారు. స్త్రీవాద కథల్లో కూడా కొంత సభ్యత వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. మానవ సంబంధాల్లో రకరకాల అంశాల్లో వచ్చిన అంతరానికి కారా గారి ‘సంకల్పం’ కధ ఒక ప్రతీక అన్నారు. మహిళలు రాసిన కథల్లో ‘తోడు’ ‘ముక’్త ‘పెళ్లి ప్రమాణం’ ‘రాజేశ్వరి’ కథలను ప్రస్తావించారు. ఉద్యమాలతో సంబంధం ఉన్న స్త్రీలు తమ స్థానం ఏమిటని ప్రశ్నిస్తున్నారని అన్నారు. మమ్మల్ని స్త్రీవాద రచయితుల దళిత రచయితలు అనుకోరేమోనన్న భయంతో అటువంటి కథలు రాస్తున్నాం అన్నారాయన. సృజనాత్మక శక్తి ఎక్కడున్నా దాన్ని నాశనం చేయాలని కుట్ర ఈ దశాబ్దంలో జరుగుతోంది. రష్యాలోనైనా, ఎక్కడైనా అన్నారాయన.
1980లలో లబ్ద ప్రతిష్టలైన రచయితల్ని, వారి కథా వస్తువుల్ని అనుకరిస్తూ ఎంతోమంది రచయితలు ఉద్బవించారు. పెద్ద రచయితలు ఈ పరిస్థితిని అధిగమించడానికి తమ్ము తాము మోడల్‌గా తీసుకొని ఎక్కువగా రాయడం జరుగుతుంది. 1990 తర్వాత మళ్లీ మంచి సాహిత్యం వైవిధ్యంతో రావడం మొదలైంది. ఈ కాలంలో 200 మందికి పైగా రచయితలు రాస్తున్నారు. మొత్తం మీద ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది అన్నారు. పత్రికలకు అనుగుణంగా తమ ఎంచుకున్న ప్రజల కోసం కథలు రాస్తున్నానన్నారు అల్లం రాజయ్య. తెలంగాణ నుంచి, ఆంధ్రాలో కూడా ఉద్యమం ప్రారంభమయ్యాక, రెండు ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యే భాషలో రాయడం ప్రారంభించారు. ఇప్పుడు తను రాస్తున్న కథ ఎందరినీ వ్యతిరేకిస్తుంది అని చూడాలన్న ఉద్దేశంతో రాస్తున్నానని చెప్పారు. ఉదాహరణకి ‘మహాదేవుడి కల’ అన్నారు. ఏకాకి అయ్యి రాస్తున్నట్లు తెలిసిన, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తను వ్యాపార రచయిత కాదు అన్నారు. ఆయన ఎంచుకున్న కథ వస్తువుని బట్టి ఆయన దృక్పథం ఎవరికైనా తెలుస్తుంది అన్నారు.
‘యఙ్ఞం’ కథ చదవడం మా నిరంతర యజ్ఞం అన్నారాయన. స్థల కాలాలను నిర్దిష్టంగా తీసుకొని కథలు రాయాలని చెప్పారు అల్లం రాజయ్య.
28వ తేదీ ఉదయం మొదటి సభలో శ్రీ వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఆధునిక సాహిత్య విమర్శ గురించి ప్రసంగించారు. ఈ సభకి సజయ అధ్యక్షత వహించారు. నేటి స్త్రీవాద సాహిత్య విమర్శ గురించి మాట్లాడుతూ, అపోహాల్ని పోగొట్టే అవగాహన పెంపొందించే విమర్శ రావాలని స్త్రీవాద సాహిత్యానికి విస్తృతిని కలిగించే విమర్శ అవసరమని సజయ సూచించారు. కధన పద్ధతి, కంఠస్వరం కూడా కథాశిల్పం గురించి విషయాలే అంటూ కథా శిల్పం గురించి కారాగారు మాట్లాడారు. కాబట్టి, తాము సాహిత్య విమర్శ సిద్ధాంతం గురించి మాట్లాడతామన్నారు వల్లంపాటి.
రచయిత, విమర్శకుడు చేసే పని ఒకటే, వేర్వేరు వ్యక్తులు కాదు అన్నారాయన. ఒక రచయితకి సృజనాత్మకత దృష,ి్ట విమర్శ దృష్టి ఉండటం ఎంత అవసరమో, విమర్శకుడికి సృజనాత్మకత గురించి తెలిసి ఉండాలి అన్నారు. సాహిత్యానికి మాత్రమే పరిమితమైన విలువలంటూ ఉండవు. సాహిత్యాన్ని గురించి మాట్లాడటం అంటే జీవితాన్ని గురించి మాట్లాడటమే, కనుక సాహిత్యాన్ని విమర్శించడం జీవితాన్ని పరామర్శించడం అవుతుంది అన్నారు వల్లంపాటి. కళలకు, సాహిత్యానికి సంబంధించిన వారిని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. అరసికులు, రసికులు, విమర్శకులు. స్పందించలేని వాళ్లు అరసికులు, ప్రతిస్పందన మాత్రమే ఉన్నవాళ్లు రసికులు, ఎందుకు నచ్చిందో, నచ్చలేదు చెప్పగలిగే వాళ్ళు విమర్శకులు. రచయితలు అందరూ ఇంతో అంతో విమర్శకులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రచయితలు విమర్శకులను చిన్నచూపు చూడటం (తామే సృజనాత్మకత ఉన్నవాళ్లు అన్నట్లు), విమర్శకులు రచయితులను చిన్నచూపు చూడటం (తామే మేధావులు అన్నట్లు) సాధారణంగా జరుగుతోంది. రచయితలు విమర్శకులు పరస్పరం అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది, వైరుధ్యం ఉండాల్సిన అవసరం లేదు అన్నారు వల్లంపాటి.
సంస్కృత అలంకార శాస్త్రంలో ఒక లోతైన సిద్ధాంతం ఉంది. రచయితలో బావయిత్రి ప్రతిభ ఉంటుందని, విమర్శకుడిలో కారయిత్రి ప్రతిభ ఉంటుందని రాజశేఖరుడు చెప్పాడు. ఆ రెండు సమానమే. మళ్ళీ నాద సూరి కవిత్వం రాయకపోయినా, కాళిదాసు రాసిన మేఘ దూతం మొదలైన కావ్యాలను గొప్ప విమర్శ గ్రంధాలు రాశాడు అని ఉదహరిస్తూ, విమర్శకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఎటువంటి ప్రతికూల భావాలు లేని పాఠకుడిగా ఉండటం అన్నారు వల్లంపాటి. కళల్ని ఆస్వాదించే శక్తి అందరికీ ఉండదు. ఉంటే వాళ్లలో కొంతమంది సహ్రుదయులు ఉంటారు. వాళ్లే ఉత్తమ పాఠకులు అని చెప్పారు. అభినవ గుప్తుడు చెప్పినది అదేనన్నారు మనసు అని అద్దం, తన్మయత్వం చెందే యోగ్యత, తను చదివే సాహిత్యంతో గాని, వినే సంగీతంతో గాని హృదయ సంవాదం కలిగి ఆస్వాదించే సహృదయత ఉండాలి, ఎటువంటి వక్ర దిష్టి లేకుండా చదవగలగాలి అన్నారు. విమర్శలు రెండు స్థాయిలు ఉంటాయి అవగాహన, అంచనా. సహృదయత కావ్యాన్ని అర్థం చేసుకునే వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తరువాత అంచనా వేయాలి. విమర్శకుడు తన జీవితం ఆధారంగా, తను నమ్మిన సిద్ధాంతాల ఆధారంగా విమర్శించడం జరగాలి. ఉదాహరణకు, విశ్వనాథ వెయ్యి పడగలు నవలలో సంభాషణలు, వర్ణనలు, పాత్ర చిత్రన.. వీటిలో అత్యాశ్చార్యకరమైన ప్రతిభను ప్రదర్శించారు. కానీ, ఆ పుస్తకంలోని భావాన్ని బట్టి ఆ రచనని విమర్శించవలసి ఉంటుంది. సాహిత్య విమర్శ ప్రయోజనం ఏమిటన్న విషయమే అనేక అభిప్రాయాలున్నాయన్నారు.
క్రుతులన్నింటిని వ్యాఖ్యానించడం, ప్రజల అభిరుచిని సరిదిద్దడం అని టీఎస్‌ ఇలియట్‌ అన్నారని చెప్పారు.
విమర్శలో రెండు లక్షణాలు ఉన్నాయన్నారు.
1. రచనని కేంద్రంగా తీసుకొని చేసే విమర్శ, రచయితని కేంద్రంగా తీసుకుని చేసే విమర్శ.
2. పాఠకున్ని కేంద్రంగా తీసుకొని చేసే విమర్శ, సమాజాన్ని కేంద్రంగా తీసుకుని చేసే విమర్శ.
రచయితని కేంద్రంగా తీసుకోవడం అంటే, రచయిత గురించి తెలుసుకుని అతని జీవితం అతని రచనలు ఎలా ప్రతిబింబించిందో తెలుసుకోవడం. మన వైజ్ఞానిక సిద్ధాంతాలను రచయితలకు పాత్రలకు వర్తింపజేసి విమర్శించవచ్చు. మార్కిస్ట్‌ విమర్శ రావడానికి ముందు రచయిత నేపథ్యం తెలుసుకుని చారిత్వక నేపథ్యం నుంచి చెప్పడం అని ఒక విమర్శ పద్ధతి ఉండేది. మార్కిస్ట్‌ విమర్శపై బాగా చర్చ జరిగింది. ఆర్థిక శక్తులు మాత్రమే అన్ని పరిణామాలను నిర్ణయిస్తాయి అనే సిద్ధాంతం ఆధారంగా విమర్శించడం అర్థంలేని పద్ధతి అన్నారు వల్లంపాటి. కొన్ని కళాకృతులు ఫలానా కారణాలవల్లనే పుట్టాయని నిర్ణయించవలసి వస్తుంది. కానీ కొన్ని అతీతమైన అంశాలు కూడా ఉంటాయి. కళాసాంస్కృతిక విషయాల్లో ఆర్థిక సూత్రం ఒక్కటే వర్తిస్తుంది అనడానికి వీల్లేదు. సమగ్ర అవగాహనతో విమర్శించాలి అన్నారు. రచన కేంద్రంగా మన దేశంలో విమర్శ ఇంత వరకు సరిగ్గా జరగలేదు. అది పాశ్చాత్య దేశాల్లో మాత్రమే జరిగింది. పాశ్చాత్య దేశాల్లో వచ్చిన కొత్త విమర్శ సిద్ధాంతాల ఆధారంగాStructuralism, feminist tools, deconstruction, reader response theories etc విమర్శ జరుగుతోందని చెప్పారు. Post modernism గురించి, post structuralism గురించి మన పత్రికలో చర్చ ఎక్కువగా జరగడం లేదన్నారు. ఆధునిక భాషా శాస్త్రం పైన ఆధారపడిన విమర్శకులు కూడా వస్తున్నాయన్నారు. ఇవి భాషకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాయి. నిత్య వ్యవహారిక భాష వేరు, సాహిత్యంలో ఉపయోగించే భాష వేరు. ఒకేలాగా ఉన్నట్లు కనిపించిన ఎన్నో భేదాలు ఉంటాయి. ఒక కథను నవలను తీసుకుంటే కథా వస్తువును బట్టి చూడకూడదు. కథగా, నవలగా మాత్రమే చూడాలంటారని చెప్పారు.
కానీ మనం, వస్తువు గొప్పదైతే గొప్ప కథ అనుకుంటాం. వస్తువుకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ విమర్శ చేస్తూ వచ్చాం. ఆంధ్రదేశంలో 1920ల నుంచి అలాగే వస్తు ప్రాధాన్య విమర్శ జరుగుతూ వచ్చింది అని చెప్పారు. రచయిత నేపథ్యాన్ని తీసుకుని పరిశీలిస్తే ఆ విమర్శ వక్రీకరణ చెందుతుంది, రచనని రచన గానే తీసుకోవాలి అన్నారాయన. రచన ప్రక్రియకి సంబంధించిన రూపాన్ని పరిశీలించాలన్న ప్రశ్నకు సమాధానంగా, భాష మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాలని.. అక్షరం అక్షరాన్ని పరిశీలించి లోతుగా అధ్యయనం చేయాలని కొందరి సిద్ధాంతం అని చెప్పారు. కథా వస్తువుకిచ్చిన ప్రాధాన్యం దృష్ట్యా సాహిత్య లక్షణం లేని కథలకు, లేదా చాలా తక్కువగా ఉన్న కథలకు, రచనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వచ్చామని అన్నారు. మరొక సిద్ధాంతం కూడా ఉందన్నారు. అది రచయిత ఎలా చూశాడు అన్నది కాదు, పాఠకుడికి ఎలా అర్థమైంది అనేది ముఖ్యం అని, అయితే ఒకే రచన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతున్నది గుర్తించాలి. కల్పానిక సాహిత్యంలో అనేక రకాల కంఠధ్వనులు ఉంటాయి.. ఎన్ని ఎక్కువ ఉంటే అంత గొప్ప అంటారు కానీ, ఆ కంఠ ధ్వనుల మధ్య ఉన్న తేడాని గుర్తించడం నేర్చుకోవాలి అన్నారయన. రచయిత నేర్పరీతనాన్ని తెలుసుకోవాలన్నారు.
మనకు ఇష్టం లేని రచయితల రచనల్ని కూడా శ్రద్ధగా చదవాలని సూచించారు. పాత్ర పోషణ, సంభాషణలు, కంఠధ్వనిని ప్రదర్శించిన తీరుని, తర్కాన్ని అర్థం చేసుకోవడానికి శ్రద్దగా చదవాలన్నారు. ఈనాటి రచయితలు ఏ రకమైన భాషో తెలియనటువంటి సంకరభాష వాడుతున్నారని వ్యాఖ్యానించారు వల్లంపాటి. రంగుల్ని సరిగ్గా ఉపయోగించలేని వాడు గొప్ప చిత్రకారుడు కానట్లే భాషని ఉపయోగించడం తెలియనివాడు మంచి రచయిత కాలేడు అన్నారు. భాషా ప్రయోగం ఈనాడు చాలా దిగజారిపోయింది అంటూ, రచయితలు చదువుకోవడం వినడం, చాలా అవసరం అని సూచించారు. మన కథల్లో వస్తు వైవిధ్యం చాలా గొప్పగా ఉంటున్న, శిల్పంలో ముఖ్యంగా భాష గురించి చాలా శ్రద్ధ తీసుకోవలసి ఉంది అన్నారు వల్లంపాటి. మంచి వస్తువుకి రూపం ఎంత బాగుంటే ఆ రచన ప్రక్రియ అంత బాగుంటుంది ‘టతీశీఎ ఱం ్‌ష్ట్రవ టతీశీఎ ్‌ష్ట్రవ షశీఅ్‌వఅ్‌’ అన్నారు. కథా రూపంలో రాస్తున్నప్పుడు కథా శిల్పం విలువలు పాటించాలి అన్నారు. సాహిత్య సిద్ధాంతం మీద సమగ్రమైన పుస్తకం తెలుగులో ఇంతవరకు రాలేదన్నారు. రచయితకి జీవితం చాలు, విమర్శకుడికి ఇంకా చాలా కావాలి అన్నారు ముక్తాయింపుగా ‘రచయితకి భాషా జ్ఞానం బాగా ఉండాలా’ అని శ్రీమతి మాధవి అడిగిన ప్రశ్నకి వస్తువుని కన్వే చేయడం ముఖ్యం కాదా అని ప్రశ్నించారాయన. ఉపన్యాసం ముగిసిన తర్వాత సదస్సులో ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, స్త్రీవాద రచనల్లో మూడు స్థాయిలున్నాయని.. అవి ‘స్త్రీలు పురుషుల్లాగా రాయడం, స్త్రీలు స్త్రీల లాగా రాయడం, స్త్రీవాద దృష్టితో రాయటం’ అని చెప్పారు వల్లంపాటి.
28వ తేదీ ఉదయం రెండవ సభలో డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి తెలుగు భాష అనే అంశంపై ప్రసంగించారు. ఈ సభకి ఎస్‌ జయ అధ్యక్షత వహించారు. కథలు, నవలలు కవిత్వం రాసే వాళ్ళు భాషలో పండితులై ఉండాలా అన్న ప్రశ్నకి సమాధానం వైద్యుడికి వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం ఉండాలా అని అడిగితే వచ్చే సమాధానమే అన్నారు డాక్టర్‌ కేతి విశ్వనాథరెడ్డి తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ. అయితే తెలుగు భాషని బాగా అధ్యయం చేసిన వారు మాత్రమే సాహిత్యాన్ని సృజించలేరు. బావుకుడైన స్పందించగలిగిన ప్రతి వ్యక్తి సాహిత్య సృజన చేయగల అవకాశం ఉంది. ఇక్కడ డిగ్రీతో పనిలేదు. కానీ రచయితకి మాధ్యమం భాష అన్నారాయన. మీ రచనలోనైనా సామాజిక అంశాలు (వస్తువు మానవ సంబంధాలు, అనుభూతులు, సంఘర్షణలు, రాజీలు, వగైరాలు) వ్యక్తం చేసేది భాష. భాష నేర్చుకోవడం అనేది రెండు రకాలు.. ప్రయత్న పూర్వకంగా నేర్చుకునేది (అధ్యయనం), అంతకుముందు నేర్చుకునేది జీవితం నుంచి, చుట్టూ ఉన్న మనుషుల నుంచి భాషని బాగా వ్యక్తం చేయగలిగిన వారి నుంచే నేర్చుకునేది. (దీనికి డిగ్రీలతో నిమిత్తం లేదు) అని చెప్పారు. కల్పనా సాహిత్యంలో ఒకే రకమైన భాషని ఉపయోగించడం లేదు. వ్యాసాలలోను, కథల్లోనూ వాడే భాషకి తేడా ఉంది. జీవితంలో ఎంత వైవిధ్యం ఉందో భాషలో అంత వైవిధ్యం ఉంది. సామాజికంగా, ప్రాంతీయంగా, వ్యక్తిగతంగా వాడే భాషలో తేడాలుంటాయి. వ్యక్తిక,ి వ్యక్తికి మధ్య కంఠధ్వనిని బట్టి భాష వాడటం ఉంటుంది. భాషలో వైవిద్యము ఉంది, ఏకరూపతా ఉంది. వీటిని గమనించినప్పుడు సైలీలో నేర్పు అలబడుతుంది అని చెప్పారు.
గత రెండు మూడు దశాబ్దాలుగా భాష మీద పరిశోధన జరుగుతుందని, రచయితలు ఉపయోగించే భాష పట్ల భద్రిరాజు, వల్లంపాటి, వెంకటసుబ్బయ్య వంటి ఒకరిద్దరూ భాషా శాస్త్రజ్ఞులు మాత్రమే ప్రత్యేకమైన పరిశోధన చేసి పరిశీలనాత్మక వ్యాసాలు రాశారని అన్నారు. కథనంలో శైలి వేరు, పాత్రలు స్థాయిని బట్టి సంభాషణలు శైలి వేరుగాను ఉంటుంది. ఉదాహరణకు స్త్రీవాద రచయిత్రులు పురుషాధిక్యత సూచించే భాషని (male chauvinistic)) భాషని ఉపయోగించడాన్ని విమర్శిస్తున్నారు. స్త్రీవాద దృక్పథంతో భాషలో మార్పు తేవాలంటున్నారు. కనుక భాషా శైలిలో భేదాలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి తాము ‘భూమిక’లోని ఇంతవరకు ప్రచురించబడిన 16 సంచికల్లో వచ్చిన కథల్లో ఆవిష్కరించిన భాషని పరిశీలించినట్లుగా చెప్పారు. ఆ భాష గురించి వ్యాఖ్యానించేందుకు ముందు చిన్నయ్య సూరి వ్యాకరణం వచ్చినప్పటి నుంచి 1858 నుంచి ఏర్పడిన దౌర్భాగ్యస్థితి గురించి ప్రస్తావించారు. అంతకుముందు శాసనాల్లో కూడా ప్రజల భాషకి దగ్గరగా ఉండే భాష వాడటం జరిగింది. కవిత్వభాష వేరుగా ఉండేది. ప్రజా సంప్రదాయాన్ని ఈనాటి రచయితలు కవులు అనుసరిస్తున్నారు. భాష రాసే వాళ్ళు ఎక్కువమంది లేకపోయినా మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉండేవారు అని చెప్పారాయన.
సృజనాత్మక భాష అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భాషకి సంబంధించిన ఒక సమగ్రమైన అవగాహన ఉండాలన్నారు. అటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని మాండలికాల్ని విమర్శిస్తారు, పట్టించుకోరు. ఈ తరం రచయితలు వచ్చే వరకు ప్రాంతీయపరమైన విమర్శలు ఉండటం, ఒకటి రెండిటికీ ప్రాధాన్యం ఉండటం జరిగేది. ప్రమాణిక భాష చారిత్రక కారణాల వల్ల రూపొందుతుంది. నలుగురికి అర్థమయ్యే ఆధ్వర్యంలో ఉపయోగపడుతుంది అన్నారాయన.
ప్రాంతీయ మండలికాల్ల్లో కూడా వృత్తికి, వర్గానికి, వ్యక్తికి సంబంధించిన రూపాలు ఉన్నాయన్నారు. కథా వస్తువులో జీవితం ఉండాలన్నట్లుగానే, కథలో, జీవితంలో వాడే భాష ఉండాలన్నారు. విమర్శకుడు ఎప్పుడు భాషని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతారు. 1910 నుంచి ఈ 87 ఏళ్ల కాలంలో రచయితలు ఏ భాష ఉపయోగిస్తున్నారో పరిశీలించమన్నారు. కథానిక వర్తమాన సమాజాన్ని చిత్రిస్తుంది. వర్తమాన కాలంలో వ్యవహారిక భాషని ఉపయోగించాలి అన్నారు. ఒక కళారూపంలో పాఠకుని మనస్థితిని సృష్టించేది భాష. కళ అనేది అంత:చేతనలో జరిగే కృషి మాత్రమే కాదు, ప్రయత్నం పూర్వకంగా చైతన్యంతో చేసే కృషి. ప్రతిపాత్ర వాడే భాషను శ్రద్ధగా పరిశీలించాలి అన్నారు. ఉదాహరణగా ‘కన్యాశుల్కం’లో 34 మండలికాలు ఉన్నాయని డాక్టర్‌ బోదరాజు రాధాకృష్ణ అంచనా వేసి తెలిపినట్లు చెప్పారు. భాషని ముందు సమాజం నుంచి తెచ్చుకుంటాం. సమాజంలోని వ్యక్తుల్ని పరిశీలించి వాళ్లు వాడే భాషని కథల్లో వాడాలి, వాస్తవాన్ని రచయిత పరిశీలించాలి అని సూచించారు.
1945 నుంచి 1960 వరకు భాషా ప్రయోగంలో గందరగోళం ఏర్పడిరదని చెప్పారు. విద్య అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు తాకలేదు. అందుచేత కొంతమంది విద్యావంతులు మాత్రమే రచయితలు కావడం వల్ల వారి భాష ఒకే రకంగా ఉండేది. స్త్రీలు నవల రంగంలో ఎక్కువగా, కథారంగంలో కొద్దిగా ప్రవేశించినప్పటికీ, రచయిత్రులు కొంతమంది ఇంకా పూర్తిగా ప్రామాణిక వ్యవహారిక భాష రాయలేకపోతున్నారు. వారిలో చాలామంది వెనుకబడిన స్థితిలోనో, వెనుకబడిన ప్రాంతంలోనో, ఉండటం వల్ల అన్నారు. స్త్రీలు కొందరు తమకు గ్రాంథిక భాష వచ్చునని నిరూపించుకోవడానికి పాత శైలిలో రాస్తూ ఉండేవారు. పూర్వం ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల తమకు భాష వచ్చిందని చెప్పుకోవడానికి 1940 నుంచి 1960 వరకు వామపక్ష ఉద్యమాలు గానీ, ఇతర ఉద్యమాలు గానీ స్త్రీలను ఎక్కువగా తాకలేదు అన్నారు. ఆనాటి స్త్రీల రచనలలో భాషకి సంబంధించిన వివిధ శైలుల వాడకం అంతగా కనిపించదు అన్నారాయన. రచయితలు గాని, రచయిత్రులు గాని ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వారో గమనిస్తే వారి అభివృద్ధి స్థాయి, వారికి లభించిన అవకాశాలు తెలుస్తాయి అన్నారు. విద్యా అవకాశాలు పెరగడం వల్ల సామాజిక చలనాల వల్ల ఇప్పుడు పెరుగుతున్న మాధ్యమాల వల్ల రచయిత్రులు ఎక్కువగా పుట్టుకొచ్చారు అన్నారు. రచయితలు ముందు తమ సమీప జీవితం నుంచి సమీప అనుభవాల నుంచి ప్రభావం పొందుతారు. వైవిధ్య సంపన్నమైన తెలుగు భాష గత రెండు మూడు దశాబ్దాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందింది. పాత్రల మానసిక చర్యల్ని భౌతిక చర్యల్ని దృష్టిలో పెట్టుకొని భాషలు వైవిధ్యం చూపించవలసి వస్తుంది అని చెబుతూ దళితుల రచనల్లో ఉన్నంత భాషా వైవిధ్యం స్త్రీవాదుల రచనల్లో ఉండటం లేదన్నారు. స్ల్రీవాద రచయిత్రుల రచనల్లో దళిత స్త్రీలు ఉపయోగించే భాష రాలేదు ఇంకా అన్నారు.
ఓల్గా, సత్యవతి మొదలైన రచయిత్రులు వాడేది ప్రమాణిక భాష అన్నారు. అబ్బూరి ఛాయాదేవి, పి. సత్యవతి, కుటుంబరావు గారిలా సూటిదనంతో స్పష్టతతో అలంకారాలు లేని శైలిలో రాస్తారని అన్నారు. ఓల్గాది, పద్మది ఒక రకమైన ఉద్వేగవంతమైన శైలి అన్నారు. వీరిలో వర్గం, ప్రాంతం, నేపథ్యం ఏమిటి అని పరిశీలించాలన్నారు. భూమిక పత్రికలు రాసే రచయిత్రుల్లో ప్రామాణిక భాష రాసేవారు తక్కువమంది ఉన్నారు. యూనిఫార్మటీ లేదు. పాత్రోచితమైన భాషని వాడటంలో కొందరు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి అని సూచించారు. కథా రచయిత భాషని వాడటం, తన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి కాదు. కథనంలోనూ పాత్రల సంభాషణలలోను వాడే భాషల వాడుకని పరిశీలించాలి అని చెప్పారు. వ్యక్తుల మనస్తత్వాలకు సంబంధించిన భాషని వ్యక్తం చేయాలన్నారు. భాషని ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్లక్ష్యం చేయడం జరిగితే అనుకున్న ప్రయోజనం విధించడం జరగదు, ప్రజల్లోకి వెళ్ళలేం అన్నారు.
పూర్వం రచయిత్రుల భాష గురించి లలిత అడిగిన ప్రశ్నకి సమాధానంగా డాక్టర్‌ విశ్వనాధ రెడ్డి ఆనాటి రచయిత్రుల భాషని బట్టి చూస్తే వాళ్లు వాడే మాధ్యమం మీద వారికి అధికారం ఉందని అనుకోలేం. గ్రాంథికం, వ్యవహారికం విశ్రమం చేసి రాసేవారు పురుషులు మెప్పుని పొందాలని రాసినట్లుగా ఉండేదని అన్నారు. అన్ని వర్గాల నుంచి, వర్ణాల నుంచి ప్రాతినిథ్యం వహించే స్థితిగతులు లేకపోవడం వల్ల ఆ వర్గాల నుంచి, ఆ వర్ణాల నుంచి రచయితలు ఆ రోజుల్లో లేరు అని చెప్పారు.
28వ తేదీ మధ్యాహ్నం సభలో పి. సత్యవతి ‘‘స్త్రీవాద కథ ధోరణులు’’ అనే విషయంపై ప్రసంగించారు. ఈ సభకి కె.సత్యవతి అధ్యక్షత వహించారు. రచయిత్రిగా తమ నేపథ్యాన్ని వివరిస్తూ పి. సత్యవతి స్త్రీవాద ధోరణిలో రాస్తున్నట్లు మొదట్లో నాకు తెలియదు. ప్రతి విషయంలో ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి తండ్రి అంటే భయం ఉండేది. తల్లికి, తండ్రికి అనుబంధం కనిపించేది కాదు. వారికి పిల్లలు మధ్య వర్తులుగా ఉండేవారు. పిల్లలకి తండ్రి అంటే భయం, తండ్రి ఇంట్లో లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించేది. వ్యతిరేకమైన వాటిని నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్లకి పెళ్లిచూపులు జరుగుతుంటే అదంటే ఇష్టం లేకే కథలు రాయడం మొదలుపెట్టాను. ఎప్పుడు స్త్రీలని గురించి ఆలోచించడం మొదలైంది. రాజకీయాలైనా, ఏమైనా స్త్రీల దృక్పథం నుంచి ఆలోచించాననిపిస్తుంది అన్నారు. ఇప్పుడు వస్తున్న ప్రకటనలు చూస్తే స్త్రీల పట్ల సమాజంలో ఉండే భావాన్ని తిరోగమన భావాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది అన్నారామె. స్త్రీల పురోగతిలో మూడు స్థాయిలు కనిపిస్తాయి అంటూ అవి ‘‘విసిన కర్ర స్టేజి, చాకలి పద్దు స్టేజి, వేడినీళ్లకు చన్నీళ్ల స్టేజి’’ అని చమత్కరించారు. జాతీయ ఉద్యమంతోనే మన దేశంలో స్త్రీలకు విద్య అవసరమని గుర్తించడం జరిగింది. ప్రాశ్చాత్య దేశాలలో పారిశ్రామికరణ తరువాత స్త్రీలు ఉద్యోగాలు చేయడం అవసరం అయ్యింది. ఉంపుడుగత్తెలను పోషించడం తగ్గిపోవడంతో కుటుంబ స్త్రీలే అందాన్ని పెంచుకొని ముస్తాబు చేసుకొని పురుషులను ఆకర్షించవలసిన అగత్యం ఏర్పడిరది. బయట ఉద్యోగాల బాధ్యత మూడు రకాల బాధ్యతలు పట్టుకున్నాయి అని వివరించారు. మన దేశంలో ఇప్పుడు స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వతంత్ర పొందుతున్నారని ఇంకా వాళ్లకేం కావాలని అంటూ ఉంటారు. ఆడవాళ్లు ఆకాశం కూడా అందుకోవచ్చు. ఎంతో అభ్యుదయం సాధించారు. ఇంకా ఏ లోపం లేదనుకుంటూ ఉన్నారు అన్నారామే. సాంస్కతిక పితృస్వామ్య భావజాలం నుంచి బయట పడలేకపోయినప్పటి నుంచి స్త్రీవాదం ప్రారంభమైంది. మొదటి నుంచి ఇళ్ళిందల సరస్వతీదేవి, అబ్బూరి ఛాయాదేవి, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన వాళ్లు స్త్రీవాదం పేరు లేకుండా రాస్తున్నప్పటికీ రంగనాయకమ్మ గారితో ‘‘స్త్రీ మానసిక విముక్తి’’ గురించి రాసినప్పటి నుంచి స్త్రీవాదం ప్రారంభమైంది. (రససుందరి దేవి వంటింట్లో బొగ్గుతో రాయడం ప్రారంభించి నేర్చుకుని ఆత్మకథ అని రాసింది) అని చెప్పారు.
మన రచనలు మనం ప్రయత్నించే వరకు మెయిన్‌స్ట్రీమ్‌ లోకి రాలేదు అన్నారు. స్త్రీల రచనల్ని మూడు స్థాయిల్లో విభజించారు సత్యవతి 1 లిమిటేషన్‌ 2 ప్రొటెస్ట్‌ 3 ఫెల్ట్‌ డిస్కవరి అంటే 1. మగవాళ్ళ దృష్టి కోణం నుంచి రాయడం సంకోచాలతో రాయడం, 2. విభేధించి అసమ్మతిని తెలియజేయడం రంగనాయకమ్మ గారితో మొదలు కావడం, 3. మన ఉద్దేశాలను మనం నిర్భయంగా చెప్పుకోవడం, మన గమ్యాలను మనం నిర్ణయించుకోగలగడం. ఇప్పుడు సౌందర్యానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. యువతులు ప్రచారాల వల్ల ప్రభావితమై అందాన్ని మెరుగుపరచుకోవడం పురుషులను ఆకర్షించడం కోసం ఎక్కువైంది. మరోవైపు కుటుంబ హింస ఎక్కువవుతుంది. వివాహ వ్యవస్థ గురించి విమర్శనాత్మకంగా స్త్రీలు రాస్తున్నారిప్పుడు. హింస నుంచి విముక్తి పొందాలనుకోవడం స్పష్టమవుతుంది. వివాహం మన కుటుంబ వ్యవస్థకి రక్షణ కవచం లాంటిది అంటారు పురుషులు కొందరు. కానీ ఆ రక్షణ కవచం ఎవరికి? పురుషులకే, స్త్రీలకు కాదు అని స్పష్టం చేశారామే. వివాహ ప్రకటనలు చదివితే మన సమాజంలో వస్తున్న మార్పులు తెలుస్తాయి. సాంఘిక, కుటుంబ ధోరణులు అర్థమవుతాయి అన్నారామే. ఈతరం దాటాక ఇంకా పెళ్లి చూపులు ఉండవని ఎక్కువ ఖర్చులు లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయని అనుకోవడం పొరపాటే అని హెచ్చరించారామే. ఏమి మారడం లేదు. అమెరికా నుంచి వచ్చే పెళ్లి కొడుకుల వివాహ ప్రకటనలు చూస్తే వారి కోరికలు ఎలా ఉన్నాయో వారి పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది. వ్యవస్థ కుళ్ళిపోతుంది అన్నారామే. అమెరికాలో కూడా మన స్త్రీలు అవస్థలు పడుతూనే ఉన్నారు. మగవాళ్లు అంట్లు తోమడంలో సాయం చేయడం తప్పించి వారి ధోరణులలో మార్పు రాలేదు. అక్కడ స్త్రీల ఉద్యోగాల కన్నా పురుషుల ఉద్యోగాలకే ప్రాధాన్యం అని తెలియజేశారు.
స్త్రీవాదం ఎక్కడ నుంచో అరువు తెచ్చుకున్నాం అని, స్త్రీవాదులు ‘ఒళ్ళు బలిసిన వాళ్ళు’ అని అంటూ ఉంటారు. విడాకులు తీసుకుంటే పిల్లల మనస్తత్వాలు పాడైపోతున్నాయి అంటారు. ప్రభుత్వం విడాకులు తీసుకోవడానికి అనుమతించిన తర్వాత ఇంకా అదే ప్రమాదకరం అవడం ఏమిటి అన్నారు ఆమె. పరిణితి లేని అనాగరిక మనస్తత్వంతో స్త్రీవాదంపై విమర్శ చెల్లరేగుతుందన్నారామే. కుటుంబ హింస తల్లిదండ్రుల వల్ల, అన్నదమ్ముల వల్ల, భర్తల వల్ల జరుగుతోందని కథలు వస్తున్నాయి. లేదా ఉద్యోగాలు చేసే చోట అనుభవించే హింస గురించి కథలు వస్తున్నాయి. కానీ దేశ రాజకీయాల గురించి ఇంకా ఎక్కువగా రావడం లేదు అన్నారు సత్యవతి. స్త్రీవాదుల కథలు ఉపన్యాసాల ఉంటాయని విమర్శిస్తూ ఉంటారు. వస్తువు ముఖ్యం కాబట్టి శిల్పం గొప్పగా లేనంత మాత్రాన వస్తువు దృష్ట్యా గొప్ప కథలను కొట్టి పారేయకూడదు అని అభిప్రాయపడ్డారు సత్యవతి. ఉపన్యాసం ముగిసిన తర్వాత చర్చ ప్రారంభిస్తూ తెలుగులో వస్తున్న స్త్రీవాద కథలకి ఇతర భాషల్లో వస్తున్న కథలోకి ఏమైనా తేడా ఉందా అని అడిగారు సజయ.
ఇతర భాషల్లో వస్తున్న రచనలకు రచయిత్రులకు ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉంది. విస్తృత అనుభవం పుస్తకాలలోనూ జీవితంలోనూ ఉండటం వల్ల వారి వస్తువుల్లో వైవిధ్యం ఉంది అని సమాధానం ఇచ్చారు సత్యవతి. కథ వస్తువు పరిధిని ఎలా పెంచుకోవాలి? అని కే. సత్యవతి అడిగిన ప్రశ్నకు సోదాహరణంగా సమాధానం చెప్పారు పి సత్యవతి. ఎలక్షన్లో నిలబడాలంటే స్త్రీలకు సీట్లు రావడం లేదన్న విషయం గురించి ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛావి పని విధానం గురించి రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదివి తీరాలనే పరిస్థితిని కల్పించిన ప్రభుత్వ విధానం గురించి విద్య వైద్యం వ్యాపారం అవడం గురించి ఇటువంటి విషయాల గురించి రచయిత్రులు ఎక్కువగా రాయడం లేదు. కుటుంబం గురించే కాకుండా సమాజంలో వస్తున్న మార్పులు అన్నింటి గురించి పట్టించుకోని కథలు రాయాలన్నరామే. ప్రచార మాధ్యమాల ద్వారా సాంప్రదాయాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. కథలు 25% ప్రభావితం చేస్తాయేమో? సినిమాలకి వెళ్లొద్దని ఎవరికి చెప్పలేము. అందుచేత మహిళలు మరింత ఉద్యమించాలన్నారు ఆమె.
స్త్రీవాద రచనలపై వస్తున్న విమర్శల్ని గురించి ప్రస్తావిస్తూ పురుషులు తమ విమర్శల్ని స్త్రీవాద రచయిత్రుల వ్యక్తిగత జీవితాల పైన దృష్టి కేంద్రీకరిస్తూ చేస్తున్నారు. పురుషులు పరిశుద్ధంగా ఉంటున్నారా? కేవలం కళ్ళు మంటతో చేసిన విమర్శలే కానీ అవి హేతుబద్ధంగా చేసినవి కావు అన్నారామే.
తర్వాత సెషన్‌లో ప్రపంచ సాహిత్యం స్త్రీల కథలు అనే అంశం మీద మాట్లాడవలసిన ప్రొఫెసర్‌ సూసితారు అనివార్య కారణాలవల్ల సభకి రాలేకపోయారు. ఆ సమయంలో ప్రతినిధులందరూ కలిసి తమకు నచ్చిన కథలు, రచయితలు, జీవితంలో అమ్మకు ఎదురవుతున్న విభిన్న అంశాల గురించి, దాదాపు రెండు గంటల పాటు చర్చించుకున్నారు. ఇలా చర్చించుకోవడం చాలా బాగుందని, రెగ్యులర్‌గా ఇలా కలిసి చర్చించుకోగలిగితే బాగుంటుందని అందరూ అనుకున్నారు.
మార్చి 1వ తేదీ ఉదయం సభకు సీతాకుమారి అధ్యక్షత వహించారు.’తెలుగు కథ-సిద్ధాంతం’ అనే విషయంపై ఓల్గా ప్రసంగించారు. వోల్గా సభకు పరిచయం చేస్తూ ఓల్గా రచనలు సహజ, స్వేచ్ఛ, రాజకీయ కథలు తనని ఎలా ప్రభావితం చేశాయో చెప్పారు సీత కుమారి. చదివాకనే కుటుంబంలో స్త్రీల పట్ల జరిగే కుట్ర అర్థమైంది అన్నారు. ఓల్గా ప్రారంభిస్తూ ముందుగా కథ రాయడానికి సంబంధించిన మూడు ముఖ్యంశాలను ప్రస్తావించారు. ఏదో ఒకటి రాయాలని ఉత్సాహం పూనిక ఎందుకు రాయాలనుకున్నది ఏం చెప్పాలనుకున్నది, సిద్ధాంతం గానీ, సందేశం కానీ ఎలా చెప్పాలన్నది శిల్పం. ఈనాటి చర్చనీ అంశం రెండవది అన్నారామే.
సిద్ధాంతం అనగానే బరువు, మొరటుతనం కనిపిస్తుంది. వ్యతిరేకత రేకెత్తిస్తుంది కొందరిలో. కథలో సిద్ధాంతం ఉండాలనే వాళ్ళు కొందరు ఉంటారు. సిద్ధాంతం అనేదాన్ని విస్తృత అర్థంలో చూస్తే ప్రతి రచయితకి ఒక దృక్పథం ఉండటం సహజమని తెలుస్తుంది. జీవితాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామని చూడాలి అన్నారామే.
కొందరు ప్రపంచాన్ని కొన్ని అదృశ్యశక్తులు విధి పూర్వజన్మం ప్రభావం నడిపిస్తోందని నమ్ముతారు. ఆ విధమైన ప్రాపంచిక దృక్పథం ఉంటుంది కొందరికి. మరికొందరికి ప్రాపంచిక దృక్పథం వేరుగా ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతిదీ ఆక్సిడెంట్‌గా జరగదు. ఏవో సామాజిక సూత్రాలు, శక్తులు నడిపిస్తూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని అన్వయించుకుని కథకి వర్తింప చేస్తే కథ బాగా వస్తుంది అన్నారు. జీవితాన్ని సాహిత్యం విశ్లేషించి చూపించాలి. జీవితంలోని అయోమయాన్ని సాహిత్యం విశ్లేషించి స్పష్టం చేయకపోతే ఆ సాహిత్యానికి ఆ కథకి ప్రయోజనం ఉండదని అన్నారు. జీవితం కథకి ముడి సరుకు. భాష శిల్పం పరికరాలు. వీటిని సమన్వియించుకొని కథను ఎలా రూపొందిస్తున్నామన్నది మన ప్రాపంచిక దృక్పథాన్ని బట్టి కథ అంత బాగా రూపొందుతుంది. ప్రయోజనాత్మకంగా రూపొందుతుంది అన్నారు. మనం చూసే జీవిత సత్యాన్ని కథగా రాసి అందరితో పంచుకోవడం జరుగుతుంది. పాఠకులలో అవగాహన కలిగించకపోతే అది చిరస్థాయిగా మిగులుతుంది అని చెప్పారు. అసహజంగా ఉండే కథలు రాస్తూ ఉంటారు కొందరు. రాయడంలో తప్పులేదు. అయితే సిద్ధాంతం చెప్పిన నీతి చెప్పిన సూటిగా కథలో చెబితే ఎవరూ మెచ్చరు. వాళ్లు అనుకున్న నీతికి విరుద్ధంగా ఎవరైనా రాస్తే ఆ కథని విమర్శికులు వ్యతిరేకిస్తారు. నీతిని బోధించాలని రచయితలు అనుకోకూడదు. బోధించడానికి విమర్శకులు వ్యతిరేకించకూడదన్నారు అన్నారామే. ఒక సంస్కృతిని, సంస్కారాన్ని పెంచడానికి సిద్ధాంతం తోడ్పడుతుంది. అది సూచనప్రాయంగా ఉండాలి కథలో. మొదటి (ఆధునిక) కథ రాసిన గురజాడకి భౌతిక దృక్పథం ఉండడం వల్ల తమ కథల్లో మెటిల్డా సంస్కర్త దేవుళ్ళారా వంటి కథల్లో సామాజిక సంఘటనల వెనుక ఉన్న సూత్రం ఏమిటని ఆలోచించి విశ్లేషించి రాశారు. విశ్వనాథ అడవి బాపిరాజు మొదలైన సనాతన వాదులు శిథిల సాంఘిక వ్యవస్థను పునరుద్ధరించాలన్న తపనతో రాశారు వాళ్లదొక రకమైన సిద్ధాంతం. అభ్యుదయ సాహిత్యం వచ్చాక మార్కిస్ట్‌ ప్రభావంతో చలం ఈనాటి శ్రీవాదానికి దగ్గర ఉన్న భావాలతో కథలు రాశారని చెప్పారు.
సిద్ధాంతాన్ని కధల్లో పెట్టి రాయడం చాలా కష్టం. సిద్ధాంతం కదా రెండు విడివిడిగా చూపిస్తే పాఠకులు మెచ్చర్‌ రెండు కలగసి ఉంటేనే రచయిత ఉద్దేశం ఫలిస్తుందని చెప్తూ వోల్గా బకాసుర కాదని కుటుంబరావు మళ్లీ ఆధునిక కాలానికి వర్తింపచేస్తారు తెలియజేశారు. స్టేట్‌ అండ్‌ రెవల్యూషన్‌ అనే విషయాన్ని ప్రవేశ పెడుతూ స్టేట్లో వివిధ శక్తులు ప్రజల్ని ఎలా దోచుకుంటారు ఎలా అణిచివేస్తారో ఆ పరిస్థితుల్లో రెవల్యూషన్‌ ఎలా తీసుకోవచ్చు దాన్ని అణిచివేయడానికి ఎలా ప్రయత్నిస్తారో రాశారని వివరంగా చెప్పారు.‘నువ్వులు తెలగపిండి’ అనే కథల్లో కూడా ఇలాగే చేశారని చెప్పారు. పాఠకులకు కూడా సిద్ధాంతం గురించి కొంచెం తెలిసి ఉండాలి లేదా సిద్ధాంతాన్ని తెలుసుకునే కుతూహలం ఉండాలి అన్నారు. జీవితాన్నుంచి సిద్ధాంతాన్ని, సిద్ధాంతం నుంచి జీవితాన్ని తెలుసుకోగలగాలి. సిద్ధాంతం నుంచి కథ, కథ నుంచి సిద్ధాంతం రావాలి అన్నారు.
అలాగే ‘కారా’గారి యజ్ఞం కదా చాలా క్లిష్టమైన రచన అన్నారు. ఆయన రాసిన ‘ఆర్తి’ కథ ఆడవాళ్ళ శ్రమ చుట్టూ అనుకున్న కుటుంబ విషయాలు ఆర్థిక సూత్రాలు పడుగు పేపర్ల అన్ని చూపించారని చెప్పారు. రావిశాస్త్రి గారి ‘పిపీలకం’ వ్యంగ్యంగా రాసిన కథ విడుతుల పక్షాన్ని వహించి రాశారు. భౌతికవాద దృక్పథంతో రాసిన గోపీచంద్‌ రాయుడు సిద్ధాంతం మీద ఆధారపడిన కథలు కొన్ని రాశారు. లోపలి ఆలోచనలని పైకి చెప్పుకోలేకపోవడం, అవి మంచివా కావానే తేల్చుకోలేకపోవడం, లైంగికత అణిచివేత, అంచుకున్న భావాలు మనిషిని ఎలా వేధించడం బుచ్చిబాబు రచనల్లో కనిపిస్తుందని చెప్పారు. ఇక స్త్రీవాద కథల గురించి చూడాలంటే బాగా రాసిన వారు ఎలా ఏ విధంగా రాశారో వారు కథ నిర్వహణలో చూపించిన మెలకువలు ఏమిటో తెలుసుకోవాలి అన్నారు.
ఉదాహరణకు తుమ్మేటి రగోతమ రెడ్డి’పసిపిల్ల’కథ వర్గ పోరాటాన్ని, స్త్రీవాదాన్ని రెండు బలమైన సిద్ధాంతాల మధ్య పైకి కనిపించకుండా చర్చ ప్రవేశపెట్టి చక్కగా జీవితంలోని సంఘటన ద్వారా చూపించారు. స్త్రీవాదం ద్వారా కన్నా వర్గ పోరాటం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చునని చూపించాడు. వివినామూర్తి ‘పయనం పలాయనం’ కథలు సనాతన వాదానికి హేతువాదానికి మధ్య సంరక్షణ ఉండి భార్యకి విశ్వాసం ఉంది. అతను హేతువాది ఆదర్శవంతంగా ఆమె వితంతువునీ వివాహం చేసుకుంటాడు. ఆమె అతనికి ఒక రాత్రి గత అనుభవాన్ని చెబుతుంది. అతను ఘర్షణ పడతాడు. చివరికి ఒక తాత్వికమైన దృష్టితో సమాధానానికి వస్తాడు. ఆ విశ్వాసం వల్ల సంఘర్షణ విశ్వాసం వల్ల అర్థం చేసుకోగలుగుతూ కొడుకు, కోడళ్ళ జీవితాన్ని చూసి తండ్రి విశ్లేషించుకుంటాడు. సనాతన భావాలకు భౌతిక వాదానికి మధ్య సంఘర్షణ ఇప్పుడున్న ఏ విలువలు లేని ప్రభావం. ఇటువంటి కథలు పెడితే పాటకుల్ని అన్నారు. అలాగే వివిధ వాదాల గురించే చర్చించే కథలు ఉన్నాయి. సమాజాన్ని రకరకాల కోణాల నుంచి చూడటం అవసరం అన్నారు. స్త్రీవాదం కొన్ని రకాల సమస్యల్ని ఫలానా రకంగా ఈ సూత్రాల ప్రకారం చూడవచ్చు. పరిష్కారాల్ని వెతకొచ్చు అని తెలియ చెబుతోంది. నేనొక్కడినే ఇలా ఉన్నానా అని ఒక స్త్రీ సంఘర్షణ పడుతున్నప్పుడు లేదు సమాజంలో ఈ సూత్రాలు పనిచేస్తున్నాయని తెలియచెప్పే ధైర్యం కలిగించవచ్చు అన్నారు. స్త్రీవాదం సమాజంలోని సాంస్కృతిక వాతావరణాన్ని అంతటికి వర్తిస్తుంది. వాస్తవ జీవితానికి ఎవ్‌ష్ట్రంకి ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం జెండర్‌ సిస్టంని అర్థం చేసుకోవడం అవసరమన్నారు ఓల్గా. కొన్ని స్త్రీవాద కథల్ని ఉదహరిస్తూ పి.సత్యవతి రాసిన ‘ఇల్లలకగానే’ ‘గాంధారి రాగం’ గురించి అబ్బోరి ఛాయదేవి ‘బోన్సాయ్‌ బ్రతుకు’ గురించి ఇంద్రగంటి జానకి వాళ్ళ ఉద్యోగం జీవన రాజకీయం గురించి ప్రస్తావించారు. స్త్రీ జీవితంలోని ప్రతి అణిచివేత వ్యక్తిగత సమస్య కాదని, ఇది స్త్రీలందరికీ సంబంధించిన సమస్యను అర్థం చేసుకోవాలంటారు ఆమె.
సిద్ధాంతం అనేదాన్ని కొందరు అంటకూడదని, కొందరు దాన్ని ప్రధానంగా వాడాలని అనుకోవడం ఈ రెండు అతిగా
ఉండకూడదు అన్నారు. ఏ దృష్టి లేకుండా కథ రాస్తే ప్రయోజనం లేదు అన్నారు. ఈనాటి రచయితలు కొందరు పెట్టుబడిదారీ వ్యవస్థకి అనుగుణంగా రాస్తున్నారని, మంచి స్త్రీవాద కథలు లాంటివి రాసిన రచయిత్రులు కూడా మేము స్త్రీవాదులం కాదు అని చెప్పుకుంటూ ఉంటారని అన్నారు వాళ్లు ఏమనుకున్నా వాళ్ళ కథలు కొన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చూడాలి అన్నారు. సిద్ధాంతాలు ద్వారాలు తెలుస్తాయి వాటికి ఎలా అర్థం చేసుకుంటాం ఎలా ఉపయోగించుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. వోల్గా ప్రసంగం విన్న మీదట చర్చ ప్రారంభమైంది. ప్రాపంచిక దృక్పథం గాని ఏదో ఒక దృక్పథం కానీ ఉండాలి అంటే పడి లేచిన కడలి తరంగం కదా శీర్షికలు దృక్పథం చూపించలేదు చూపించాలి కదా? అని ప్రశ్నించారు హైమా. మన కథల్లో మనం చిక్కుకు పోకూడదు శరీరాన్ని తనే అసహ్యించుకుంటుంది అది తప్పు అన్నారు. ఒక క్రూరమైన పరిస్థితిలో నెట్టబడిన అమ్మాయి తన అవయవాన్ని తన వద్దనుకునే స్థితికి సమాజం నేడుతోందని మనం అర్థం చేసుకోవాలి అన్నారు ఓల్గా.
లైంగికత్వాన్ని ఎక్కువగా ప్రాజెక్టు చేయడం స్త్రీవాదం పట్ల విముఖత ఏర్పడడానికి కారణం అవుతుందని శిలా సుభద్ర దేవి శ్రీవాదాన్ని మిశ్రం కలతకి పర్యాయపదంగా తీసుకుంటారని భారతి అన్నారు. ఆనాటి రచయిత్రులు కొందరు వాసిరెడ్డి సీతాదేవి రంగనాయకమ్మ వంటి శక్తివంతమైన రచయిత్రులన్నీ అణిచివేయాలని ప్రయత్నించారు విమర్శించారు. ఇప్పుడు చాలామంది స్త్రీవాద రచయిత్రులు ఉన్నారు కాబట్టి మొత్తం వాదం మీద విమర్శ ఎక్కువ అయిపోతుంది. అది వాళ్ళకున్న అభద్రత భావం వల్లనే. ఒక ముద్ర వేసి చంపడం సులభమని సమాధానం చెప్పారు ఓల్గా. స్త్రీవాదం అంటే విశ్రుంకళ లైంగికత్వం అనే విమర్శ, చలం ‘‘ఫ్రీ లవ్‌ సొసైటీ’’ మొదలు పెట్టాడు అన్న విమర్శ వీటి గురించి అడిగారు ఒకరు. దానికి సమానంగా ఓల్గా ఆ రెండు అబద్ధాలే అన్నారు. అలా ముద్ర వేసి వాళ్ళని అణిచివేయవచ్చునని కుట్ర స్త్రీ ఎదగటానికి సహించలేని వారు స్త్రీ పట్ల గౌరవం లేని వారు ఇలా విమర్శిస్తున్నారు అన్నారు ఆమె.
‘‘స్త్రీవాదులు చలాన్ని పట్టుకొని ఎందుకు సాగుతున్నారు’’? అని వాసిరెడ్డి సీతాదేవి గారు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా శతజయంతి సమయంలో చలం గురించి స్త్రీవాదులు ఎక్కువ మాట్లాడారు, రాశారు. అంతేకానీ చలం మీద ఆధారపడలేదు. చలం కన్నా ముందుకు సాగి రాస్తున్నారు స్త్రీవాదులు అన్నారు ఓల్గా. ‘‘స్త్రీవాదులు చలం కన్నా షాకింగ్‌గా రాయాలి’’ అన్నారు ఉమా. తర్వాతి సెషన్లో ‘దళిత’ కథ సాహిత్య తత్వం గురించి మాట్లాడవలసిన శిఖామణి గారు కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు.
ఒకటేవ తేదీ మధ్యాహ్నం సభకి వాసిరెడ్డి సీతాదేవి అధ్యక్షత వహించారు. సదస్సులు కొందరు తమ తమ రచన నేపథ్యం గురించి మాట్లాడారు. కొందరు తమ కొత్తగా రాసిన కదలని వినిపించారు. ముందుగా తుర్లపాటి లక్ష్మీ మాట్లాడుతూ, తమ సాంప్రదాయ కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. కానీ తన తండ్రిని ప్రజాస్వామిక ధోరణి అని చెప్పారు. తనది మొదటి నుంచి ప్రశ్నించే స్వభావం ఎదురించే స్వభావం అన్నారు. తల్లి వల్ల పుస్తక పఠనం అలవాటైందని, ఆంధ్రప్రభ చదవడం, శరత్‌ నవలలు త్వర త్వరగా చదవడం చేసేవారని, ఇంట్లో అందరూ చర్చించుకునే వారని, తమపై రంగనాయకమ్మ ప్రభావం ఉందని, తమ ఇంటి వాతావరణం తన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసిందని, తను కావాలనుకున్నట్లే ప్రేమ వివాహం కులాంతర వివాహం జరిగిందని, ఇంట్లోంచి వెళ్లిపోయి వేదికపై వివాహం (దండల మార్పుతో) చేస్తున్నామని చెప్పారు. రంగనాయకమ్మ రాసిన చదువు ప్రభావంతో టీచర్‌ అనుభవంతో కథలు రాయడం మొదలు పెట్టినట్లు చెప్పారు. పిల్లల గురించి రిటైర్‌ అయిన తల్లిదండ్రుల గురించి ఆడవాళ్ళపై రాజ్య హింస గురించి కథలు రాశానని చెప్పారు.
వాసిరెడ్డి సీతాదేవి ‘మరిచిక’ ఓల్గా రచనలు తనని ప్రభావితం చేసినట్లు చెప్పారు. భూమిక ఏర్పాటు చేసిన వర్క్‌ షాప్‌కి హాజరు అవ్వడానికి జరిగిన ప్రయత్నం అందులోనే శారీరక మానసిక గురించి కథ మొదలుపెట్టినట్లు ఎలా ముగించాలో నిర్ణయించలేదన్నట్లు చెప్పారు. తర్వాత ప్రతిమ మాట్లాడారు. ఆమె నెల్లూరు వద్ద నాయుడుపేటకు చెందిన వారిని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికి సాహిత్య స్పృహ లేదని చెప్పారు. మారుమూల గ్రామం. వాతావరణం లేదు. గుర్తింపలేదు. చదవటం అలవాటయింది అన్నారు. స్కూల్‌ చదువు కొంత సాగింది. పెళ్లయ్యాక వేరే ప్రపంచంలో ప్రవేశించినట్లు అయ్యింది అని అన్నారు. పిల్లలు పెరిగి స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టాక ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల ఆస్పృహతో కథలు రాయడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ‘యముడికి హాలిడే’ ‘‘ఇల్లాలి సుఖం’’ వంటి కథలు రాశారు. స్త్రీలు ప్రశ్నించవచ్చని తనకి చాలాకాలం తెలియదన్నారు. ఫ్రీగా తను ఎన్ని భూమికలు నిర్వహిస్తున్న ఎలాగో వీలు చూసుకుని భూమిక వర్క్‌షాప్‌కి హాజరు కావాలనుకొని వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇంద్రగంటి జానకి బాల మాట్లాడారు. ఆమె స్వగ్రామం తనుకు. సంగీత వాతావరణమున్న కుటుంబంలో పెరిగారు. తనని చూసి తిలక్‌ రచయిత్రి అవుతావని చెప్పినట్లు చెప్పారు. శ్రీకాంత్‌ శర్మ గారితో పరిచయమ యొక్క సాహిత్యంలో తన కృషి బాగా ప్రారంభమైంది అన్నారు. 1970లో రచన వ్యాసంగం ప్రారంభించినట్లు మొదటి కథ’’మనసుకి మరో మలుపు’’ఆంధ్ర పత్రికలో వచ్చినట్లు చెప్పారు. భర్త పేరు తనకి ఒక విధంగా ఆటంకంగా ఉందని తను రాసినవి భర్త రాసినట్లు కొందరు అపోహ పడుతూ ఉంటారని అన్నారు. ప్రేమ కథలు కాకుండా వేరే విషయాలు మీద రాయడం ఇష్టం అన్నారమే. తమ ప్రేమ వివాహం చేసుకున్నాక ప్రేమ వివాహాల గురించి బ్రహ్మ లింక తొలగిపోయాయని చమత్కారంగా అన్నారు. తమ తాను అభ్యుదయ భావాలతో రచనలు చేసినట్లు గత దశాబ్దంలో తన భావాలలో మార్పులు వచ్చాయని ప్రతిదీ మరింత ఆలోచించి రాయడం చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత ప్రేమ కుమారి తన నేపథ్యాన్ని తెలియజేశారు. చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పటి నుంచి ఇంగ్లీషులో రాస్తున్నానని తెలుగులో రాసినది భూమికలోనేనని చెప్పారు. తెలుగు పత్రికల్లో ఇప్పటికీ తనకి చందమామ కథలు అంటే ఇష్టం అన్నారు. తనకి కథ రాయడానికి ఒక్కొక్కప్పుడు ఆ రోజులు కూడా పడుతుందన్నారు. కానీ’’మామిడి చెట్టు’’అని అద్భుతమైన కథానికని అప్పటికప్పుడు సంభాషణలతో సహా వినిపించి అందరి ప్రశంసలని అందుకున్నారు.
తర్వాత శీలాసుభద్ర దేవి గారు తన రచన నేపథ్యాన్ని వివరించారు. తన అక్క తెలుగు స్వతంత్రతలో పనిచేసేదని ఆమె కోసం కథల పుస్తకాలు తెచ్చిపెట్టేవారని చెప్పారు. ఆమె కోసం లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి పెడుతూ తను కూడా చదవడం నేర్చుకున్నాను అని చెప్పారు. తండ్రి పోయాక తల్లి పిల్లలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. తల్లి పడే బాధలు తెలుసుకున్నారామే. తల్లి పురుషాధిక్య సమాజంలో ఎంత బాధలను అనుభవించినట్లు చెప్పారు. తన తల్లిని చూశాకే తనలో స్త్రీవాద భావాలు పెరిగాయని చెప్పారు. అక్క దగ్గర ఉన్నారు కొన్నాళ్లు. ఆ సంవత్సరంలోనే రచన రంగంలో ప్రవేశించడానికి స్ఫూర్తి కలిగిందని చెప్పారు. ప్రేమ కథలు రాయడం తనకి ఇష్టం లేదన్నారు. శీల వీర్రాజు గారు ప్రేమకథలు రాస్తుంటే తనకు నచ్చేది కాదన్నారు. కానీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. వారు వివాహానికి ముందు బంధువులే. కానీ వారి కుటుంబాల మధ్య వైరుధ్యం ఉండేది. 15 ఏళ్లుగా విడిపోయిన కుటుంబాలు తమ వివాహంతో కలిసాయని చెప్పారామే. 1977లో పొలికేక అనే పత్రికలో తన మొదటి కథ పరాజిత తన మొదటి కథ అచ్చైందని చెప్పారు.
ఆ తర్వాత బండారు విజయం మాట్లాడారు. తాను సంఘర్షణలో పుట్టి, సంఘర్షణలో పెరిగినట్టు చెప్పారు. మాది అగ్రహారకుల కుటుంబం. గుంటూరు నుంచి వరంగల్‌ వలస వెళ్లింది వారి కుటుంబం. పదవ క్లాసు చదివినప్పటి నుంచి తన కుటుంబ భారం తమ్ముళ్ళని తల్లిని పోషించే బాధ్యత వహించవలసి వచ్చింది. ఆ సంఘర్షణలో నుంచి కవిత్వం పుట్టుకొచ్చింది అన్నారామే. వయోజన విద్య నేర్పించారని చెప్పారు. పిల్లలంటే ఎలర్జీ పుట్టిందట. ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆడపిల్లను పెంచుకున్నట్లు చెప్పారు. ఆ పిల్లకి కథలు చెబుతుంటే తనకి కథలు రాయాలని కోరిక పుట్టిందని చెప్పారు.
ఆ తర్వాత మాట్లాడిన వారు మొక్కపాటి సుమతి. తనకు కథలు పాటలు వ్యాసాలు రాయడం అలవాటని చెప్పారు. వ్యక్తిగతమైనది రాజకీయమే. వ్యక్తిగత సంఘర్షణల నుంచి సృజనాత్మకత రచనలు పుట్టుకొస్తాయి. దాని కొనసాగింపేసాంఘికాంశం. కుటుంబం మారకుండా సమాజం మారదు. మన పరిధి గురించి మనం ఆలోచిస్తూనే సమాజం అనే విస్తృత పరిధి గురించి ఆలోచించవచ్చు అని చెప్పారు.
శిలాలోలిత అనే కలం పేరుతో కవిత్వం రాసే లక్ష్మి తమ రచన నేపథ్యం గురించి మాట్లాడారు. చిన్నప్పుడు చందమామలోని కథలు చదవడంతో చందమామకి ఒక కథ రాశారు మొదట్లో. ఎంఏలోకి వచ్చాక ఒక కథ రాశారు. తర్వాత ‘ఇల్లు ఖాళీ చేశాను’ అనే కథ రాశారు. తనకు కవిత్వం అంటే నీకు ఇష్టమని చెప్పారు. ఈ సభలో చదవడం కోసం ఆ క్రితం రాత్రి కూర్చొని ‘ముగ్గులు చుక్కలు’ అనే కథ రాసినట్లు చెప్పి ఆ కథను సంక్షిప్తంగా తెలియజేశారు. ఆ కథ పేరు ముగ్గులు చుక్కలు కుటుంబంలోని స్త్రీలు చుక్కలు అని వాటి ఆధారంగా గీసే గీతలే కనిపిస్తాయి. కానీ వాటిని రూపుదిద్దున చుక్కలు కనిపించని చెప్పడం నాకు కథ ఉద్దేశమని చెప్పారు. ఇందులో మూడు తరాల స్త్రీలను చూపించినట్లు చెప్పారు.
తర్వాత ఎస్‌. జయ మాట్లాడారు. బాల్యంలో తమ్ముడు బాధ్యత నిర్వహిస్తూ చదువు సాగించినట్లు చెప్పారు. ఏడవ తరగతి తర్వాత పక్క ఊరికి వెళ్లి తాను కష్టం మీద చదువుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను సన్న కారు కూతురు. తన చదువు కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తే మళ్లీ తనకి పెళ్లి చేయడం ఆ ఖర్చులు భరించడం తండ్రికి ఎంత కష్టమవుతుందో ఆలోచించమని, ఈ పరిస్థితుల్లో తను ఎందుకు చదవాలి ఆలోచించమని హెడ్‌ మిస్‌ చెప్పారు. అయినా పట్టుదలగా చదివినట్లు చెప్పారు. తను బిఏ వరకు కథలు చదవలేదు అన్నారు. కాలేజీకి పోయే బండిలో కూర్చొని బండి వాడు చెప్పే కథలు ఐదేళ్లపాటు విన్న తర్వాత కథలు చెప్పే టెక్నిక్‌ తనకి అలవడిరదని చెప్పారు. ఆ తర్వాత ఉమా తమ చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల గురించి, తను పెరిగిన పద్ధతి గురించి చెప్పి, తన చెల్లెలి పెళ్లి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జరిగిందో అందులో తను ఎటువంటి పాత్ర వహించిందో ఎంతో ఆసక్తికరంగా అందరినీ ఆకట్టుకునేట్లు కథలా చెప్పారు.
మూడు రోజులపాటు ఎంతో ఉత్సాహంగా ఆసక్తికరంగా సాగిన ఈ వర్క్‌షాప్‌ ద్వారా ఎన్నో విషయాలు కలబోసుకొని చర్చించుకున్నామనే సంతృప్తిని ప్రతినిధులంతా వ్యక్తం చేశారు.

Share
This entry was posted in వర్క్ షాప్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.