రావు బాల సరస్వతీ దేవి గారికి స్మృత్యంజలి – అమృతలత

2006 సంవత్సరంలో ఓ రోజు…
ఆంధ్రజ్యోతిలో 1976-77 లో సీరియల్‌ గా వెలువడిన నా ‘సృష్టిలో తీయనిది’ నవలని పుస్తక రూపంలో వెలువరించాలనుకుంటున్న తరుణంలో ఒక చిత్రం గీయడం కోసం అప్పట్లో నా నవలకు ప్రతివారం చక్కటి బొమ్మలు గీసిన ప్రముఖ చిత్రకారుడు బాలి గారు గుర్తొచ్చి ఆయనకి ఫోన్‌ చేసినప్పుడు మాటల సందర్భంగా అంతకు పదేళ్ల క్రితం నేను పక్షపత్రిక నడిపానన్న సంగతి వారికి తెలిసి-

‘‘దాన్ని మళ్లీ కంటిన్యూ చేయొచ్చు కదా!’’ అన్నారాయన.
‘‘ ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 40ల్లోనే నడపలేక పోయిందాన్ని. ఈ వయసులో ఇంకేం చేయగలను?’’ అన్నాను నవ్వుతూ.
‘‘55 ఏళ్లకే ఏదో వయస్సు అంత మీద పడ్డట్టు అలా మాట్లాడుతున్నారేమిటండీ? మా అక్కయ్యకి ఇప్పుడు 75 ఏళ్లు. మీ కన్నా 20 ఏళ్లు పెద్దవాళ్లు. కానీ, ఆమె తన వయస్సు ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోరు. ఎంతో హుషారుగా ఉంటారు. ఇప్పటికీ ఎన్నో ప్రోగ్రామ్స్‌కి కూడా అటెండ్‌ అవుతుంటారు.’’ అన్నారాయన.
పత్రిక మళ్లీ రివైవ్‌ చేయాలన్న ఆలోచన నాలో ఏ కోశానా లేకపోవడంతో ఆయన మాటలు కాస్త అనాసక్తిగా వినడం మొదలెట్టాను.
‘‘మా అక్కయ్య మంచి గాయని. ఎంతమంది అభిమానులు వున్నారో!’’ చెప్తున్నారు ఆయన.
పాటలంటే చెవి కోసుకునే నేను ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యాను.
‘‘మీ అక్కయ్య పేరు?’’ అడిగాను ఉత్సాహంగా.
‘‘రావు బాల సరస్వతి దేవి గారు’’ చెప్పారు కూల్‌గా.
ఒక్కసారిగా నాకు సంతోషం కట్టలు తెంచుకుంది.
‘‘ఏమిటీ ? బాల సరస్వతి దేవి గారు మీ అక్కయ్యా?’’అడిగాను సంభ్రమంగా.
‘‘అలా పిలుచుకుంటాను’’ అన్నారాయన.
‘‘వారిని చూడాలని ఎన్నేళ్లుగానో అనుకుంటున్నాను సార్‌! వారి అడ్రస్‌ ఇస్తారా ప్లీజ్‌! వారిని నేను అర్జెంటుగా కలవాలి’’ రిక్వెస్ట్‌ చేశాను.
‘‘తప్పకుండా!’’ అంటూ ఆయన వారి ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారు.
… … …
ఆ తరువాత ఓ రోజు… ‘‘మీరు బాలసరస్వతి దేవి గారిని చూస్తానన్నారు కదా! వారిని మీ ఇంటికి తీసుకొస్తున్నాను’’ అని బాలి గారు ఫోన్‌ చేశారు. ఆరోజు నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రతిరోజూ పడుకునే ముందు ఆమె పాటలు వింటూ నిద్దట్లోకి జారుకునే నేను… ఇక వారిని చూడబోతున్నానంటే అదో ఉద్వేగం!
ఆరోజు రానే వచ్చింది.
బాలి గారి ద్వారా పరిచయమైన ఆ అమ్మ ఏకంగా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో సహా మా అభ్యర్థన మేరకు మా ఆర్మూరు ఇంట్లో అడుగు పెట్టారు. ఓ గంట గడిచాక – ఆమె పైకి ఎంత హుందాగా కనిపిస్తారో కొంటె మాటలతో అంత కడుపుబ్బ నవ్విస్తారని తెలిసింది. ఎన్నో పాటలు, హిందీ పాటలు కూడా ఎన్నో పాడారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లోని తేడాలను మిమిక్రీ చేయడమే కాదు, బాల్యంలో తను సంగీతం నేర్చుకోవడానికి ఎవరిని ఎన్నెన్ని తిప్పలు పెట్టిందీ కడు రమ్యంగా చెప్పారు.
ఆమె పాటలు ఎంతో సూదింగ్‌గా ఉంటాయి కాబట్టి, రోజూ బాల సరస్వతమ్మ పాటలు వింటూ నిద్రపోవడం నాకు అలవాటు. ఆ పాటలు వినే అవకాశం లేనప్పుడు కలత నిద్రపోయేదాన్ని. మంద్రస్థాయిలో పాటలు పాడగలగడం మహాకష్టం. అన్ని స్థాయిల్లోనూ పాటలు పాడగలిగే మహా గాయకులు ఎందరో ఉన్నారు, కానీ మంద్రస్థాయిలోనే పాటలు పాడి మెప్పించగల శక్తి కేవలం బాలసరస్వతి దేవి గారికే ఉందని నా అభిప్రాయం. ఎంత పట్టుకోవాలని చూసినా అందకుండా జారిపోయే పాదరసం లాంటి ఆమె గొంతు నాకు చాలా ఇష్టం. ఆరోజు వారి ముందు మా ఆయా భూదేవితో ‘కోటలోని మొనగాడా’ పాట పాడిరచాను. బాల సరస్వతి దేవి గారు నన్ను చూసి కన్నుగీటి ‘‘భలే పాడుతోంది’’ అని నవ్వారు.
ఆ తరువాత ఎన్నో సార్లు వారు హైదరాబాదులో మా అవార్డ్స్‌ ఫంక్షన్స్‌కీ, నిజామాబాదులో మా స్కూల్‌ పిల్లల టాలెంట్‌ షోస్‌కీ ముఖ్య అతిథిగా రావడం, క్రమేణా మా మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడటం, ప్రతి సంవత్సరం వారి బర్త్‌డేకి నన్ను పిలవడం జరుగుతూ వచ్చింది.
రెండేళ్ల క్రితం ఓ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నేనూ, నెల్లుట్ల రమాదేవి, కిరణ్‌ బాల, సుశీలా నాగరాజ, మా చెల్లెలు విజయా కిషన్‌ రెడ్డి కలిసి వారి ఇంటికి వెళ్ళాం. తలుపులు తీయగానే ఎదురుగా నవ్వుతూ నించున్న అమ్మ కన్పించారు.
‘నన్ను గుర్తు పట్టారా? నేనెవరో చెప్పండి!’ అడిగాను సరదాగా.
‘దొంగవి! నాకెందుకు తెలీదు!’ అన్నారు.
‘ఏంటీ, ఇంత మంది ఒక్కసారిగా దొంగల ముఠాలా వచ్చి పడ్డారు?’ అడిగారు.
‘అవును మీ నవ్వులనూ, పాటలనూ దోచుకువెళదామనీ ..’ చెప్పాను నవ్వుతూ.
అవీ ఇవీ మాట్లాడుకున్నాక, మాటల మధ్యలో .. విశ్వనాథ్‌ గారూ, రావు బాలసరస్వతీ దేవి గారు అపురూప అవార్డ్స్‌కి గెస్ట్స్‌గా వచ్చింది గుర్తొచ్చి…
‘విశ్వనాథ్‌ గారు పోయారు అమ్మా !’ అన్నాను.
‘ఏ విశ్వనాథ్‌ గారు’ అడిగారు అయోమయంగా.
‘కె. విశ్వనాథ్‌ గారూ, గ్రేట్‌ డైరెక్టర్‌! అప్పుడే మరిచిపోయారా? మీరు పాటలు పాడే రోజుల్లో .. వారు సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేసేవారనీ, మీకు మైక్‌ అడ్జస్ట్‌ చేసేవారనీ చెప్పేవారు గుర్తుందా?’ అన్నాను.
గుర్తొచ్చినట్టు నవ్వారు.
‘జమున గారు కూడా పోయారు?’ చెప్పింది రమ.
‘ఏ జమున?’ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగారు.
‘మీరజాల గలడా నా యానతి .. సత్యభామ!’ చెప్పాను.
‘వాణీ జయరాం గారు కూడా ..’ అందించారు కిరణ్‌ బాల
‘అంటే … అందర్నీ పంపించి మీరు ఇటు వచ్చారన్న మాట?!’ అని నవ్వేసారు.
అమ్మ పాడిన మాకు ఇష్టమైన పాటలన్నీ వారిని పాడమంటూ సందడి చేసాం
లో గొంతుతో మ్మ పాడుతున్నారని, వారి దగ్గరిగా జరిగి రమ రికార్డ్‌ చేస్తోంటే …
‘ఇదేంటీ, ఈ పిల్ల నా మీది మీదికి వస్తోంది? వరంగల్‌ తీసుకెళ్తానంది! ఇప్పుడా వచ్చేది?’ అన్నారు రమని చూసి నవ్వుతూ.
అమ్మకి ఐస్‌ క్రీమ్‌ బాగా ఇష్టమని చెల్లి విజయ నాచురల్‌ ఐస్‌ క్రీమ్‌ని అందిస్తూంటే ఒక్క టీ స్పూనంత వున్న ఐస్‌ క్రీమ్‌ నోట్లో వేయించుకుని ఇక చాలన్నారు.
‘నేను మైసూర్‌ నుండి వచ్చాను’ అని సుశీల నాగరాజ చెప్తే –
‘అక్కడేముందీ? ఎందుకూ అక్కడ ఉండటం? నేను అక్కడ ఇరవై ఏళ్ళుండి వచ్చేసాను.. తెలుసా!? ‘అన్నారు.
పాటలని చాలా వరకు మరచిపోలేదు. మరిచిపోయిన చోట హమ్‌ చేస్తూ, మధ్య మధ్య మమ్మల్ని వెక్కిరిస్తూ పూర్తి చేసారు.
‘అవునూ మీరంతా ఎక్కడి నుండి ఊడి పడ్డారు’ అని జోక్‌ చేసారు.
రోజూ రావు బాల సరస్వతీదేవి అమ్మ పాటలు పెట్టుకున్నాకే – అవి వింటూ నిద్రలోకి జారుకునే నేను … కొన్ని విషయాలను మరిచిపోతూ, మరికొన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్న అమ్మని చూసి .. ఒకింత ఉద్వేగానికి గురైనా .. అమ్మతో మాట్లాడిన మాటలను నెమరు వేసుకుంటూ, వారిని చూసిన ఆనందాన్ని ఒకరితో మరొకరం పంచుకుంటూ వారిని వదల్లేక వదిలి ఇంటి దారి పట్టాం.
ఏడాది కిందట ఓ రోజు… రావు బాల సరస్వతీ దేవి అమ్మని చూడక చాలా రోజులైందని .. ‘అమ్మ ఎలా వున్నారు?’ అని వారి పెద్దకొడుకు సూర్యారావు గారికి మెసేజ్‌ పెట్టాను.
‘ూష్ట్రవ ఱం శీసaవ పబ్‌ ఎవఎశీతీవ ఱం ఙవతీవ పaస. వీaవ తీవషశీస్త్రఅఱంవ ంశీఎవ జూవశీజూశ్రీవ. ూశ్రీవaంవ ఙఱంఱ్‌ aం ంశీశీఅ aం జూశీంంఱపశ్రీవ’ అని సూర్యారావు గారు మెసేజ్‌ పెట్టారు.
అది చూసిన వారం రోజులకే…
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెల నాలుగో తారీకున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నేనూ, నెల్లుట్ల రమాదేవి, నాగ చంద్రిక కలిసి వారి ఇంటికి వెళ్ళాం. ఈసారి అమ్మ మంచానికే అతుక్కుపోయి వున్నారు. ఎవర్నీ గుర్తు పట్టే స్థితిలో లేరు. అయినా కొడుకూ, కోడలూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం చూసి తృప్తిగా ఫీలయ్యాను.
ఈ నెల అక్టోబర్‌ లో వరుసగా మూడు రోజుల పాటు మా స్కూల్‌ టాలెంట్‌ షోస్‌ జరుగుతున్న రోజుల్లో అమ్మ కనుమూసారని తెలిసి – ఇంట్లో ఎంతో మంది గెస్ట్స్‌ వుండటం, నేను రాలేక పోవడం నా మనసుకి ఎంతో కష్టం కలిగింది.
అమ్మని నాకు పరిచయం చేసిన బాలి గారు అమ్మ కన్నా ముందే పోయారు. ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటున్నాను.
అమ్మ మనమధ్య లేకపోయినా, వారి పాటలు మనతోనే వున్నాయి, ఎల్లకాలం వుంటాయి కూడా. అలా అమ్మ ఎప్పటికీ చిరంజీవి!
(అమ్మకి శ్రద్ధాంజలి ఘటించడానికి వారి కొడుకులూ, కోడళ్ళూ ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి ప్రముఖ సినీ నటీమణి జయసుధ గారు, అమ్మ బంధువులు, నేనూ, నెల్లుట్ల రమాదేవి, పట్టెం శివలక్ష్మి, ఘంటశాల నిర్మల, ప్రయాగ రామకృష్ణ, కొండవీటి సత్యవతి, గాయనీ మణులు సురేఖా మూర్తి, కౌసల్య తదితరులెందరో హాజరయ్యారు)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.